parvathi kalyanam

శివ పార్వతులు ఈ జగానికి ఆది దంపతులు . అర్దనరీశ్వరులు . అర్దనరీశ్వరులు అనగా సగ బాగం స్త్రీగా సగబాగం పురుషుడిగా వుండడం . అది వారు జగతికి చెప్పే గొప్ప సందేశం . అనగా శరీరాలు వేరయినా మనసు మాట ఒకటిగా వుండాలి . ప్రస్తుత యువత నేర్చుకోవలసిన ముఖ్యమయిన అంశం ఇది .
                        ఇక పార్వతి కళ్యాణం కధ లోకి వెళ్తే
    పుట్టింటి మమకారం తో సతీ దేవి పిలువని యజ్ఞానికి వెళ్తాననగా శివుడికి  ఇష్టం లేకపోయినా కాదనలేక ఒప్పుకుంటాడు. అక్కడ జరిగిన అవమానం తో తిరిగి బర్తకు మొహం చూపించలేక ఆత్మాహుతి చేసుకుంటుంది సతీదేవి . విషయం తెలిసిన శివుడు వీరభాద్రుడిని పంపుతాడు వీరభద్రుడు దక్ష యజ్ఞాన్ని ద్వంసం చేస్తాడు . పరమేశ్వరుడు కాలిపోతున్న సతీదేవి దేహాన్ని భుజాన ధరించి వైరాగ్యం తో తిరుగుతుంటాడు . ఎన్నాళ్లయినా అలానే తిరుగుతుంటాడు ఆ స్థితి నుండి ఆయనను బయటకు తీసుకురావడానికి మహావిష్ణువు తన సుదర్శన చక్రం తో చేదిస్తాడు . ఆ సమయం లో భూమి మీద పడిన సతీ దేవి దేహ భాగాలే అష్టాదశ  శక్తీ పీఠాలు . శివుడు ధ్యానం లో మునిగిపోతాడు . మరణించిన సతీ దేవి హిమవత్పర్వత రాజుకు కుమార్తె గ జన్మించింది .
 ధ్యానం లో మునిగిన శివుడు తన దర్శనానికి వచ్చిన దేవతలు, ఋషులు ,మునుల వాళ్ళ తన ధ్యానానికి ఆటంకం కలుగుతోందని భావించి హిమవత్పర్వతం మీద తపస్సు చేసుకునేందుకు వెళ్తాడు . హిమవత్పర్వత రాజు శివుడిని దర్శించి సవినయంగా పార్వతీ దేవిని అయన సేవకు నియమిస్తాడు . పార్వతీ దేవి ఎంతో భాక్తిశ్రధలతో సపర్యయలు చేస్తున్నది . పూర్వ జన్మ వాసనల చేత పార్వతి దేవి శివుడిని ఆరాదిస్తూ వుంటుంది . ఇదే సరయిన సమయమని భావించిన దేవతలు మన్మధుడిని పంపించారు . మన్మధ భాణం తగలడం వల్ల శివుడి తపస్సు బంగమై అయన చూపు పార్వతి మీద పడింది . అంతలోనే తేరుకుని కారణం తెలుసుకుని మన్మధుడిని మూడో నేత్రంతో భస్మం చేసాడు శివుడు . వెంటనే అక్కడ నుండి ఎక్కడికో వెళ్ళిపోయాడు శివుడు . కళ్ళ ముందు జరిగిన హటాత్ పరిణామానికి నిస్చేస్తురాలు అయింది పార్వతి దేవి . తపస్సును తపస్సు తోనే గెలవాలని నిర్ణయించుకుని తండ్రి అనుమతి తీసుకుని తపస్సుకి తన చేలికతేలతోపాటు అరణ్యానికి బయలుదేరింది .
 చక్కటి యగ్నవాటిక ను ఏర్పాటు చేసుకుని చుట్టు పక్కల మొక్కలు నాటి వాటికీ స్వయంగా తనే నీళ్ళు పోసి పెంచుతూ తన తపస్సును కొనసాగిస్తోంది . ఆ మొక్కలన్నీ పెరిగి పెద్దవై ఫలాలను ఇస్తున్నాయి . కాని పార్వతి తపస్సు ఇంకా ఫలించలేదు . ధర్మ వ్రుద్దేషు నవయః సమీక్షతే (ధర్మ పరంగా పెద్దలు అయిన వారి విషయం లో వయస్సు లేక్కిన్చకూడదు . అనగా అటువంటి వారు మనకన్నా చిన్నవరయిన చేతులు ఎత్తి నమస్కారం చేయవచు )అను విధం గా దేశ దేశాలనుండి మునులు ఋషులు వచ్చి పార్వతి దేవి ని దర్శించుకుని నమస్కారం చేసుకుని వెళ్తున్నారు . తపస్సులో ఉత్కృష్ట దశ(చివరి దశ కస్తామయినది )రాలిన ఆకులను మాత్రమే బుజిస్తూ తపస్సు చేయడం . ఆ దశను కూడా దాటి పార్వతి ఆకులను సయితం బుజించటం మనివేసింది . అది చుసిన మునులు ఋషులు వదన్తి చ అపర్నామ్ ఇతి (పరణాలు అనగా ఆకులు వాటిని కూడా బుజించడం మనివేసింది కావున ఆమెను అపర్ణ అని పిలిచారు).
ఇంకా తపస్సును ఉదృతం చెయ్యాలని భావించిన పార్వతీదేవి మందు వేసవికాలం లో మిట్ట మధ్యాహ్నం వేళ చుట్టూ అగ్నిని పెట్టుకుని ఒంటికలితో నిలబడి తదేక దృష్టితో సూర్యుణ్ణి చూస్తూ తపస్సు చేసింది . మహా రాజు గారి కుమార్తె అయినప్పటికీ అల్లారుముద్దుగా పెరిగినప్పటికీ ఎంతో కఠోర దీక్షతో తపస్సు చేస్తోంది . హంస తూలికా తల్పం మీద నిద్రించే సందర్భాలలో తలలోని పువ్వులు రాలి శయ్య మీద పడితే కందిపోయే సుకుమారి బండ రాళ్ళ మీద తన చేతినే దిండుగా చేసుకుని నిద్రిస్తోంది . చెలికత్తెలతో పూల బంతి తో ఆడినంత మాత్రానే అలసిపోఏ తల్లి అనితరులకు సాధ్యం కానీ కటినాతి కతినమయిన దీక్షతో తపస్సు చేస్తోంది . వర్షాకాలంలో బయంకరమయిన వానలో కదలకుండా వృక్షాలు ఏవిధంగా అయితే కదలకుండా ఉంటాయో అలా రాత్రి పగలు తేడా లేకుండా ఆరుబయటే నిలబడి ఉరుములు మెరుపులే సాక్షాలు అన్నట్లుగా తపస్సు చేసింది . శీతాకాలంలో తెల్లవారుజామున పీకల వరకు సరస్సులో నిలబడి చేకోర పక్షులను చూస్తూ తపస్సు చేసింది . ధృవం వపు కాంచన పద్మ నిర్మితం (అనగా ఆమె శరీరం భ్రహ్మ దేవుడు బంగారు పద్మంతో నిర్మించి ఉంటాడు కావునే పద్మ ధర్మం చేత సుకుమారం గాను బంగారు దర్మం చేత దృడం గాను ఉండ  గలుగుతోంది .
   పరమేశ్వరుడు మెచ్చి పార్వతీ దేవిని పరీక్షించడానికి బ్రహ్మచారి రూపంలో వచ్చి పార్వతి తపస్సుకు కారణం అడిగి వివాహం కోసమే తపస్సు అయితే తనను వివాహం చేసుకోమని శివుడి దగ్గర ఎఅమీ లేదని శివుడిని తిట్టనరంభిస్తాడు పార్వతీ దేవి పెద్దల గురించి తప్పుగా మాట్లాడిన అలాంటి మాటలు విన్నా పాపం చుట్టుకుంటుంది కావున ఇతడిని బయటకు గెంటేయండి అని తన చెలికత్తెలను ఆజ్ఞాపిస్తుంది అప్పుడు పరమేశ్వరుడు నిజ రూపంలో ప్రత్యక్షమయి వివాహం చేసుకోమని అడుగుతాడు . పార్వతీ దేవి సిగ్గుతో అడుగు వెనక్కు వేసి తండ్రిని అడిగి వివాహం చేసుకోమని చేభుతుంది .

శివుడు కైలాసానికి వెళ్లి సప్త ఋషులను అరుందతీ దేవిని తలుచుకుంటాడు . వారు నిముష మాత్రం లోనే శివుడి ముందు ప్రత్యక్షం అవుతారు . వారికీ విషయం చెప్పి హిమవత్పర్వత రాజు వద్దకు వెళ్లి వివాహం కుదర్చమంటాడు . వారు వేణు వెంటనే తరలి వెళ్లి వివాహం కుదురుస్తారు . బ్రహ్మాది దేవతలు పెద్దరికం వహించగా దేవతలు, ఋషులు ,మునులు,చక్రవర్తులు అస్సేనులు కాగా వివాహాన్ని చూడడానికి వచ్చిన జనం తో కిక్కిరిసి పొగ అంగరంగ వైభవం గ వివాహం జరిగింది .



ఇతి సమాప్తం .

                                      ధన్యవాదాలు .
                                                                                                                            శశి






9

1 comment: