Sunday 17 January 2021

రామాయణము------ఉత్తరకాండ ------నలుబదియేడవసర్గ

                               రామాయణము 

                            ఉత్తరకాండ ------నలుబదియేడవసర్గ 

గంగా నదీ తీరం దాటిన తరువాత అశ్రు నయనాలతో లక్ష్మణుడు " అమ్మా!శ్రీ రామచంద్ర ప్రభువు అప్పగించిన ఈ పనిని నిర్వహించ వలసి వచ్చినందుకు నేను లోక నిందకు గురికానున్నాను . నా హృదయము ఎంతో వేదించుచున్నది  . దీని కంటే మృత్యువే నాకు సంతోషముగా అనిపిస్తుంది  . తల్లీ ! ఈ విషయములో నన్ను దోషిగా భావించకు . నన్ను అనుగ్రహించు . అని పలికి ఎక్కి ఎక్కి ఏడుస్తూ అంజలి గటించి నేలపై పడిపోయెను . అది చూసిన సీతా దేవి ఆందోలనుకు గురై" నాయనా! నీవిలా ఉండటానికి కారణము ఏమిటి  నాకేమి బోధ పడుట  లేదు . యదార్ధ విషయమును నాకు తెలుపుము . ఇది నా ఆజ్ఞ . అని పలుకగా లక్ష్మణుడు "తల్లీ పౌరులు జానపదులు నిన్ను గూర్చి పలికిన దారుణ అపవాద వచనములను నిండు సభలో విని శ్రీ రాముడు మిగుల హృదయ పరితాపమునకు గురిఅయ్యేను .  అపవాదమునకు వెరచి ప్రభువు నిన్ను పరిత్యజించెను . రాజాజ్ఞను తలదాల్చి నేను నిన్ను ఈ ఆశ్రమ ప్రదేశములు యందు విడిచి పెట్టవలిసి ఉన్నది . బ్రాహ్మణోత్తముడైన వాల్మీకి మహర్షి ఇక్కడే ఆశ్రమములో నివసించుచున్నారు . అమ్మా జానకి ! ఆ మహాత్ముడి  పాదములను ఆశ్రయించి మనశ్శాoతితో   ఉండుము . 

రామాయణము ఉత్తరకాండ నలుబదియేడవసర్గ సమాప్తము . 

                     శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు. 












రామాయణము------- ఉత్తరకాండ -------నలుబదిఆరవసర్గ

                             రామాయణము 

                            ఉత్తరకాండ -------నలుబదిఆరవసర్గ 

శ్రీ రాముడి ఆదేశమునకు  లక్ష్మణుడు కిన్నుడై ఏట్లో ఆ రాత్రి గడిపెను . మరునాడు ఉదయమే వాడి పోయిన ముఖంతో సుమంత్రుడిని రధము సిద్దము చేయమని ఆజ్ఞ్యాపించెను . పిమ్మట రాజ భవనమునకు వెళ్లి సీతా దేవి తో "అమ్మ! మా అన్నగారిని నీవు ఒక వరము కోరియుంటివటా అందులకు ఆ స్వామి నన్ను నీ ఆశ్రమ ప్రయాణమునకై ఆజ్ఞ్యాపించినాడు అని పలుకగా " ఆమాటలు విన్న సీతా దేవి చాలా సంతోషించెను . వెంటనే ఆ దేవి అమూల్యము  లైన వస్త్రములను వివిధ రత్నాభరణములను సిద్ద పరుచుకొని లక్ష్మణునితో నేను ఈ వస్త్రా భరణములను ముని పత్నులకు సమర్పించెదను . " అని పలికి సంతోషముతో రధమును ఎక్కెను . అప్పుడు ఆమెకు అనేక అపశకునములు కనిపించునవి దాంతో  ఆ దేవి ఆందోళనకు గురై లక్ష్మణుని తో, నాయనా ! నాకు అనేక అపశకునములు కనిపించుచుఁన్నవి.  నా హృదయము ఆందోళనకు గురి అగుచున్నది . మీ అన్నగారికి క్షేమమగుగాక నా అత్తలందరు సుఖముగా ఉండుగాక . అయోధ్యా నగరము నందు జానపదములందు కల ప్రజలందరికి క్షేమమగుగాక " అని పలుకుతూ వారందరి క్షేమము కొరకై ఆమె దేవతలను  ప్రార్ధించెను . 

ఆ మాటలు విన్న లక్ష్మణుడు ఆ దేవికి నమస్కారము చేసెను . అతని హృదయము మిక్కిలి బాధకి లోనై ఉన్నను . పైకి మాత్రం ప్రసన్నుడిలా కనపడుచూ "అమ్మా!అందరికి శుభమే అగును " అని పలికెను . పిమ్మట ఆ రధము మధ్యాహ్న సమయమునకు గంగా నాదీ సమీపమునకు చేరెను . గంగా జలమును చూసినంతనే లక్ష్మణుడు దీనుడై బిగ్గరగా     ఏడవ సాగెను . అది చూసిన సీతా దేవి" నాయనా ఏమి జరిగినది ఎందుకు ఏడ్చుచున్నావు " . అని పలుకగా లక్ష్మణుడు కళ్ళు తుడుచు కొని నావికులను పిలిచి పడవ సిద్ధంచేయమని ఆజ్ఞ్యాపించెను . పిమ్మట లక్ష్మణుడు, సీతా దేవి నావికులు సిద్ద పరిచిన పడవపై ఎక్కి గంగ అవతలి తీరమునకు చేరెను . 


రామాయణము -----ఉత్తరకాండ-----నలుబది ఆరవసర్గ -------సమాప్తం . 

శశి,

ఎం.ఏ,ఎం.ఏ(తెలుగు),తెలుగు పండిట్ . 













రామాయణము------- ఉత్తరకాండ-------నలుబదిఐదవసర్గ

                              రామాయణము 

                             ఉత్తరకాండ-------నలుబదిఐదవసర్గ 

శ్రీ రాముడు తన తముళ్లతో " జానపదులు సీతా దేవిపై తీవ్ర మైన అపవాదము మోపుచు మాట్లాడు కొనుచున్నారు . అంతే కాదు నన్ను ఏవగించుకుంటున్నారు . నేను మహాత్ములైన ఇక్ష్వాకు వంశమున జన్మించాను . ఆ నాడు లంకలో దేవతలు మానవులు,వానరులు అందరి సమక్షంలో అగ్నిదేవుడు సీత దేవి పతివ్రత  అని పలికినాడు . అందువల్లనే నేను వైదేహిని అయోధ్యకు తీసుకు వచ్చినాను . లోకోప వాదమునకు భయపడి నేను నా ప్రాణాలు సైతం వదిలి వేస్తాను . అంతే కాదు , మిమ్మల్ని వదిలివేయటానికి కూడా వెనుకాడను . ఇక సీత విషయము చెప్పేది ఏముంది . " అని పలికి ,
లక్ష్మణునితో " సౌమిత్రీ ! నీవు రేపు ప్రాతఃకాలమునే , రథంపై సీతా దేవిని తీసుకుని కోసల దెస పొలిమేరల్లో విడిచిరా . గంగా నాదీ తీరానికి సమీపములో తమసా నది కలదు . ఆ నాదీ తీరమున మహాత్ముడైన వాల్మీకి మహర్షి ఆశ్రము కలదు . ఆ ఆశ్రమానికి సమీపములో కల నిర్జన వాన ప్రదేశములో సీతాదేవిని వదిలి రమ్ము . సీతాదేవి విషయములో నాకు ఇంకేమియు మారు చెప్పవద్దు . నా మాటలపై గౌరవముంచి నా శాసనమును పాటించుము . " ఆ మాటలు పలుకుతుండగానే శ్రీ రాముడి మొహము కనీటితో  నిండి పోయెను . 



రామాయణము -----ఉత్తరకాండ -------నలుబదిఐదవసర్గ ----------సమాప్తం . 

శశి,

ఎం.ఏ,ఎం.ఏ(తెలుగు),తెలుగు పండిట్ . 
















 

రామాయణము ------ ఉత్తర కాండ ----నలుబదినాలుగవ సర్గ

                           రామాయణము 




                      ఉత్తర కాండ ----నలుబదినాలుగవ సర్గ 

భద్రుడి మాటలు విన్న రాముడు, భద్రుడు మొదలైన వారిని పంపివేసి తన కర్తవ్యమును నిశ్చయించుకున్నాడు . భరతుడిని ,లక్ష్మణుడిని , శత్రుఘ్నుడిని  తీసుకు రమ్మని ద్వార పాలకుడిని పంపెను . ద్వార  పాలకుడి  మాటలు విని ఆ ముగ్గురు వెను  వెంటనే తమ అన్న శ్రీ రాముడి మందిరంలోకి ప్రవేశించి   అంజలి ఘటించిరి . ఆ సమయములో శ్రీ రామ చంద్రుడి మొహము మిక్కిలి విచారంగా ఉండెను . వారు ముగ్గురు శ్రీ రాముడి పాదములకు సిరసా ప్రణమిల్లి అట్లే ఉండిపోయిరి వారిని చూసిన వెంటనే శ్రీ రాముడి కళ్ళ నుండి కన్నీరు జల జల కారినవి. శ్రీ రాముడు వారిని పైకి లేపి గుండెలకు హత్తుకొనెను . 
పిమ్మట వారిని కూర్చో పెట్టి వారితో " సోదరులారా ! మీరే నాకు పంచ ప్రాణములు . మీరందరు శాస్త్ర విధులను పాటించు వారు . తెలివి తేటలు కలవారు . మీరు ముగ్గురు ఒక్కటై నేను చెప్పా బోయే కార్యమును చేయవలెను . " అని పలికెను . 



రామాయణము ------ఉత్తరకాండ-------నలుబదినాలుగవసర్గ ---------సమాప్తం . 

శశి,
ఎం.ఏ,ఎం.ఏ (తెలుగు),తెలుగు పండిట్ . 










Saturday 16 January 2021

రామాయణము-------ఉత్తర కాండ -నలుబదిమూడవసర్గ

                                            రామాయణము 

                                             ఉత్తర కాండ -నలుబదిమూడవసర్గ 

శ్రీ రామచంద్రుడు ఒక సారి భద్ర అను వాడి తోటి "భద్రా! అయోధ్యా నగరములో కోసల రాజ్యంలో విశేషాలేంటి ? ప్రజలు జానపదులు మా గురించి ఏమని మాట్లాడు కొనుచున్నారు ?" అని పలుకగా 
భద్రుడు శ్రీ రాముడికి అంజలి ఘటించి " ప్రభు మీరు రావణుడిని వధించిన వీరోచిత విజయ గాధల గురించి ప్రజలు మరీ మరీ చర్చించు కొనుచున్నారు " అని పలుకగా శ్రీ రాముడు " భద్రా ! యదార్ధ విషయములన్నింటిని నాకు పూర్తిగా తెలుపుము . నీవు నాకు విస్వాస పాత్రుడవు . ప్రజలు మాట్లాడుకొనుచున్న నా దోషములను గూర్చి నిర్భయముగా నిస్సంకోచముగా యధాతదంగా తెలుపుము . " అని పలుకగా భద్రుడు " మహా రాజా ! దయతో ఆలకించండి కూడళ్ల యందు అంగళ్లయందు రాజమార్గముల యందు వనముల యందు  మీ గుణ  దోషముల గురించి ప్రజలు ఇలా మాట్లాడు కొనుచున్నారు ' శ్రీ రాముడు మహా సముద్రం పై అద్భుతమైన సేతువుని కట్టించాడు . ఇలా సేతువుని ఇంతకు ముందు ఎవ్వరు చివరికి దేవా దానవులు కూడా నిర్మించి నాట్లు మనము వినలేదు దుర్జయుడైన రావణుడిని సేనా పరివారంతో సహా సంహరించాడు . కానీ రోషాన్ని విడిచి పెట్టి సీతా దేవిని స్వీకరించి ఆమెను మరల తన  భవనమునకు తీసుకువచ్చెను . ఎంతోకాలం పరుల పంచనమున తన భార్యను రాముడు ఎందుకు యావగించుకొనుట లేదు . అని ప్రజలు అనేక విధాలుగా నోటికి వచ్చినట్లు మాట్లాడు తున్నారు . " అని పలుకగా శ్రీ రాముడు మిక్కిలి కిన్నుడై భద్రుడు తెలిపిన విషయములు అపకీర్తికరములుగా ఉన్నవి ." ఈ విషయములో మీ అభిప్రాయము ఏమిటి "అని విజయుడు మున్నగు వారితో పలుకగా వారందరు శ్రీ రాముడికి శిరసా ప్రణమిల్లి " భద్రుడు పలికిన పలుకులన్నీ వాస్తవమే " అని పలికిరి . అప్పుడు శ్రీ రాముడు వారి మాటలు విని అప్పటికి వారిని పంపించి వేసెను . 

రామాయణము ---ఉత్తరకాండ ---నలుబదిమూడవ సర్గ ------సమాప్తం .. 

శశి ,
ఎం.ఏ ,ఎం.ఏ (తెలుగు),తెలుగు పండిట్ .