Sunday 17 January 2021

రామాయణము------- ఉత్తరకాండ-------నలుబదిఐదవసర్గ

                              రామాయణము 

                             ఉత్తరకాండ-------నలుబదిఐదవసర్గ 

శ్రీ రాముడు తన తముళ్లతో " జానపదులు సీతా దేవిపై తీవ్ర మైన అపవాదము మోపుచు మాట్లాడు కొనుచున్నారు . అంతే కాదు నన్ను ఏవగించుకుంటున్నారు . నేను మహాత్ములైన ఇక్ష్వాకు వంశమున జన్మించాను . ఆ నాడు లంకలో దేవతలు మానవులు,వానరులు అందరి సమక్షంలో అగ్నిదేవుడు సీత దేవి పతివ్రత  అని పలికినాడు . అందువల్లనే నేను వైదేహిని అయోధ్యకు తీసుకు వచ్చినాను . లోకోప వాదమునకు భయపడి నేను నా ప్రాణాలు సైతం వదిలి వేస్తాను . అంతే కాదు , మిమ్మల్ని వదిలివేయటానికి కూడా వెనుకాడను . ఇక సీత విషయము చెప్పేది ఏముంది . " అని పలికి ,
లక్ష్మణునితో " సౌమిత్రీ ! నీవు రేపు ప్రాతఃకాలమునే , రథంపై సీతా దేవిని తీసుకుని కోసల దెస పొలిమేరల్లో విడిచిరా . గంగా నాదీ తీరానికి సమీపములో తమసా నది కలదు . ఆ నాదీ తీరమున మహాత్ముడైన వాల్మీకి మహర్షి ఆశ్రము కలదు . ఆ ఆశ్రమానికి సమీపములో కల నిర్జన వాన ప్రదేశములో సీతాదేవిని వదిలి రమ్ము . సీతాదేవి విషయములో నాకు ఇంకేమియు మారు చెప్పవద్దు . నా మాటలపై గౌరవముంచి నా శాసనమును పాటించుము . " ఆ మాటలు పలుకుతుండగానే శ్రీ రాముడి మొహము కనీటితో  నిండి పోయెను . 



రామాయణము -----ఉత్తరకాండ -------నలుబదిఐదవసర్గ ----------సమాప్తం . 

శశి,

ఎం.ఏ,ఎం.ఏ(తెలుగు),తెలుగు పండిట్ . 
















 

No comments:

Post a Comment