Saturday 16 January 2021

రామాయణము-------ఉత్తర కాండ -నలుబదిమూడవసర్గ

                                            రామాయణము 

                                             ఉత్తర కాండ -నలుబదిమూడవసర్గ 

శ్రీ రామచంద్రుడు ఒక సారి భద్ర అను వాడి తోటి "భద్రా! అయోధ్యా నగరములో కోసల రాజ్యంలో విశేషాలేంటి ? ప్రజలు జానపదులు మా గురించి ఏమని మాట్లాడు కొనుచున్నారు ?" అని పలుకగా 
భద్రుడు శ్రీ రాముడికి అంజలి ఘటించి " ప్రభు మీరు రావణుడిని వధించిన వీరోచిత విజయ గాధల గురించి ప్రజలు మరీ మరీ చర్చించు కొనుచున్నారు " అని పలుకగా శ్రీ రాముడు " భద్రా ! యదార్ధ విషయములన్నింటిని నాకు పూర్తిగా తెలుపుము . నీవు నాకు విస్వాస పాత్రుడవు . ప్రజలు మాట్లాడుకొనుచున్న నా దోషములను గూర్చి నిర్భయముగా నిస్సంకోచముగా యధాతదంగా తెలుపుము . " అని పలుకగా భద్రుడు " మహా రాజా ! దయతో ఆలకించండి కూడళ్ల యందు అంగళ్లయందు రాజమార్గముల యందు వనముల యందు  మీ గుణ  దోషముల గురించి ప్రజలు ఇలా మాట్లాడు కొనుచున్నారు ' శ్రీ రాముడు మహా సముద్రం పై అద్భుతమైన సేతువుని కట్టించాడు . ఇలా సేతువుని ఇంతకు ముందు ఎవ్వరు చివరికి దేవా దానవులు కూడా నిర్మించి నాట్లు మనము వినలేదు దుర్జయుడైన రావణుడిని సేనా పరివారంతో సహా సంహరించాడు . కానీ రోషాన్ని విడిచి పెట్టి సీతా దేవిని స్వీకరించి ఆమెను మరల తన  భవనమునకు తీసుకువచ్చెను . ఎంతోకాలం పరుల పంచనమున తన భార్యను రాముడు ఎందుకు యావగించుకొనుట లేదు . అని ప్రజలు అనేక విధాలుగా నోటికి వచ్చినట్లు మాట్లాడు తున్నారు . " అని పలుకగా శ్రీ రాముడు మిక్కిలి కిన్నుడై భద్రుడు తెలిపిన విషయములు అపకీర్తికరములుగా ఉన్నవి ." ఈ విషయములో మీ అభిప్రాయము ఏమిటి "అని విజయుడు మున్నగు వారితో పలుకగా వారందరు శ్రీ రాముడికి శిరసా ప్రణమిల్లి " భద్రుడు పలికిన పలుకులన్నీ వాస్తవమే " అని పలికిరి . అప్పుడు శ్రీ రాముడు వారి మాటలు విని అప్పటికి వారిని పంపించి వేసెను . 

రామాయణము ---ఉత్తరకాండ ---నలుబదిమూడవ సర్గ ------సమాప్తం .. 

శశి ,
ఎం.ఏ ,ఎం.ఏ (తెలుగు),తెలుగు పండిట్ . 





















No comments:

Post a Comment