Sunday 17 January 2021

రామాయణము------ఉత్తరకాండ ------నలుబదియేడవసర్గ

                               రామాయణము 

                            ఉత్తరకాండ ------నలుబదియేడవసర్గ 

గంగా నదీ తీరం దాటిన తరువాత అశ్రు నయనాలతో లక్ష్మణుడు " అమ్మా!శ్రీ రామచంద్ర ప్రభువు అప్పగించిన ఈ పనిని నిర్వహించ వలసి వచ్చినందుకు నేను లోక నిందకు గురికానున్నాను . నా హృదయము ఎంతో వేదించుచున్నది  . దీని కంటే మృత్యువే నాకు సంతోషముగా అనిపిస్తుంది  . తల్లీ ! ఈ విషయములో నన్ను దోషిగా భావించకు . నన్ను అనుగ్రహించు . అని పలికి ఎక్కి ఎక్కి ఏడుస్తూ అంజలి గటించి నేలపై పడిపోయెను . అది చూసిన సీతా దేవి ఆందోలనుకు గురై" నాయనా! నీవిలా ఉండటానికి కారణము ఏమిటి  నాకేమి బోధ పడుట  లేదు . యదార్ధ విషయమును నాకు తెలుపుము . ఇది నా ఆజ్ఞ . అని పలుకగా లక్ష్మణుడు "తల్లీ పౌరులు జానపదులు నిన్ను గూర్చి పలికిన దారుణ అపవాద వచనములను నిండు సభలో విని శ్రీ రాముడు మిగుల హృదయ పరితాపమునకు గురిఅయ్యేను .  అపవాదమునకు వెరచి ప్రభువు నిన్ను పరిత్యజించెను . రాజాజ్ఞను తలదాల్చి నేను నిన్ను ఈ ఆశ్రమ ప్రదేశములు యందు విడిచి పెట్టవలిసి ఉన్నది . బ్రాహ్మణోత్తముడైన వాల్మీకి మహర్షి ఇక్కడే ఆశ్రమములో నివసించుచున్నారు . అమ్మా జానకి ! ఆ మహాత్ముడి  పాదములను ఆశ్రయించి మనశ్శాoతితో   ఉండుము . 

రామాయణము ఉత్తరకాండ నలుబదియేడవసర్గ సమాప్తము . 

                     శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు. 












No comments:

Post a Comment