Sunday 17 January 2021

రామాయణము------- ఉత్తరకాండ -------నలుబదిఆరవసర్గ

                             రామాయణము 

                            ఉత్తరకాండ -------నలుబదిఆరవసర్గ 

శ్రీ రాముడి ఆదేశమునకు  లక్ష్మణుడు కిన్నుడై ఏట్లో ఆ రాత్రి గడిపెను . మరునాడు ఉదయమే వాడి పోయిన ముఖంతో సుమంత్రుడిని రధము సిద్దము చేయమని ఆజ్ఞ్యాపించెను . పిమ్మట రాజ భవనమునకు వెళ్లి సీతా దేవి తో "అమ్మ! మా అన్నగారిని నీవు ఒక వరము కోరియుంటివటా అందులకు ఆ స్వామి నన్ను నీ ఆశ్రమ ప్రయాణమునకై ఆజ్ఞ్యాపించినాడు అని పలుకగా " ఆమాటలు విన్న సీతా దేవి చాలా సంతోషించెను . వెంటనే ఆ దేవి అమూల్యము  లైన వస్త్రములను వివిధ రత్నాభరణములను సిద్ద పరుచుకొని లక్ష్మణునితో నేను ఈ వస్త్రా భరణములను ముని పత్నులకు సమర్పించెదను . " అని పలికి సంతోషముతో రధమును ఎక్కెను . అప్పుడు ఆమెకు అనేక అపశకునములు కనిపించునవి దాంతో  ఆ దేవి ఆందోళనకు గురై లక్ష్మణుని తో, నాయనా ! నాకు అనేక అపశకునములు కనిపించుచుఁన్నవి.  నా హృదయము ఆందోళనకు గురి అగుచున్నది . మీ అన్నగారికి క్షేమమగుగాక నా అత్తలందరు సుఖముగా ఉండుగాక . అయోధ్యా నగరము నందు జానపదములందు కల ప్రజలందరికి క్షేమమగుగాక " అని పలుకుతూ వారందరి క్షేమము కొరకై ఆమె దేవతలను  ప్రార్ధించెను . 

ఆ మాటలు విన్న లక్ష్మణుడు ఆ దేవికి నమస్కారము చేసెను . అతని హృదయము మిక్కిలి బాధకి లోనై ఉన్నను . పైకి మాత్రం ప్రసన్నుడిలా కనపడుచూ "అమ్మా!అందరికి శుభమే అగును " అని పలికెను . పిమ్మట ఆ రధము మధ్యాహ్న సమయమునకు గంగా నాదీ సమీపమునకు చేరెను . గంగా జలమును చూసినంతనే లక్ష్మణుడు దీనుడై బిగ్గరగా     ఏడవ సాగెను . అది చూసిన సీతా దేవి" నాయనా ఏమి జరిగినది ఎందుకు ఏడ్చుచున్నావు " . అని పలుకగా లక్ష్మణుడు కళ్ళు తుడుచు కొని నావికులను పిలిచి పడవ సిద్ధంచేయమని ఆజ్ఞ్యాపించెను . పిమ్మట లక్ష్మణుడు, సీతా దేవి నావికులు సిద్ద పరిచిన పడవపై ఎక్కి గంగ అవతలి తీరమునకు చేరెను . 


రామాయణము -----ఉత్తరకాండ-----నలుబది ఆరవసర్గ -------సమాప్తం . 

శశి,

ఎం.ఏ,ఎం.ఏ(తెలుగు),తెలుగు పండిట్ . 













No comments:

Post a Comment