Sunday, 3 March 2019

                                      రామాయణము 

                                    కిష్కిందకాండ - ఏబదియవసర్గము 

వానరప్రముఖుడైన హనుమంతుడు  తారునితో,అంగదునితో గూడి, వింధ్యపర్వతములందలి గుహలను దట్టమైన అడవులను, గాలించెను. ఇంకను ఆ మహాత్ముడు సింహములు , పెద్ద పులులు సంచరించేతి గుట్టలను , గుబురులను నాదీ తీరములును ఆ వింధ్యకు సంబంధించిన ఎగుడు దిగుడు నేలలు పెద్దపెద్ద సెలయేళ్ళు గల ప్రదేశములను అన్వేషించెను. ఆ ప్రదేశమున వారు సమైక్య భావముతో ఒకరిపైఒకరు తూడుగా ప్రక్కప్రక్కనే నడుచుచుండగా మారుతి ఆ పర్వతమును పూర్తిగా గాలించెను . 
గజుడు , గవాక్షుడు, గవయుడు, శరభుడు , గంధమాదనుడు , మైందుడు మొదలగువారు మున్నగు వానరుల యాదక్షిణ దిశయందు కొండలతోనిండిన ఆయా ప్రదేశములను వెదుకుచూ ఉండగా అక్కడ వారికి తెరువబడియున్న ఒక బిలాము కనబడెను. ఆ దుర్గము పేరు" బుక్షబిలము "అది ఒక దానవుని ఆధీనములో గలదు అక్కడకు చేరిన హనుమదాదులు మిక్కిలి అలసిపోయిరి. ఆకలిదిప్పలకు లోనై యుండిరి. కనీసము దాహముతీర్పుకొనుటకై  మంచినీరైనను దొరికిన బాగుండునని తపనపడుచుండిరి. బాగుగా పరికించి చూచినా పిమ్మట  "ఆ మహా బిలము లతావృక్షములతో కప్పబడియున్నట్లు వారు గమనించిరి. ఆ గుహ లోపలినుండి క్రౌంచపక్షులు , హంసలు , బెగ్గురపక్షులు, చక్రవాకములు బయటకివచ్చుచుండెను ఆ పక్షులు నీటితో తడిసియుండెను పద్మముల రేణువులు అంటుకొని యుండుటచే అవి ఎర్రగా కనబడుచుండెను. 
పిమ్మట ఆ వానరోత్తములు బిలము  కడకు చేరిరి. ఆ బిలమునుండి సువాసనలు వచ్చుచుండెను వారికి అందు ప్రవేశించుట అసాధ్యముగా తోచిరి. ఆస్తితిని జూచి వారు ఆశ్చర్యచకితులైరి . ఆ వానర ప్రముఖులు అచటకు చేరిన పిమ్మట దానిని బాగుగా పరికించిచూచిరి . అప్పుడు వారికి ఇది పాతాళ గుహాయ?, లేక రావణుని మాయా మందిరమా ?, అను శంకలు కలిగెను పక్షులు తడసియుండుట బట్టి వాటి రాకపోకలను అనుసరించి అందు జలములుండెనని  ఊహించిరి అచటి ప్రతికూల పరిస్థితికి వారు వారు యెంతయు నీరసపడిరి 
ఎట్టి దుర్గమారణ్యములయందైనను  సంచరించుటలో నిపుణుడు , ఐన మారుతి ఆ వనరులందరితో ఇట్లు అనెను . "ఈ బిలము నుండి హంసలు బయటకు వచ్చినవి  పైగా ఈ బిలద్వారమునొద్దగల వృక్షములుఅన్నియు  పచ్చని ఆకులతో కలకాలాడుచున్నవి కావున ఇచట చక్కని జలమూలేహి నిండిన భావి గాని మడుగు గాని తప్పుగా ఉండితీరును " ఆ వానరోత్తములు వేగముతో పూర్తిగా ఆగుహ లోపలి చేరిరి ఆ ప్రదేశమంతయు వెలుతురుతో నిండియుండెను. అది మిగుల మనోహరముగా ఉండెను. 
దప్పిగొని యుండుట వలన వారిలో చురుకు దానము తగ్గియుండెను అయినాను దాహము తీర్చుకొనుటకై తహతహలాడుచు అలసత్వమునకు తావీయక కొంత తడువు వేగముగా ముందుకు సాగిరి ఆ వానర వీరులు మిక్కిలి అలసిపోయి ఆకలి దప్పులచే కృశించియుండిరి. వారు తమ జీవితములపై ఆశ వదులుకుని దీనవధానులై యుండిరి అట్టి స్థితిలో వారికి ఒక వెలుగు కనబడెను. వారు ఆ ప్రదేశమునకు రాగానే వారికి ప్రత్యేకమైన ఒక వనము కనపడెను. అది వెలుతురుతో నిండి యుండెను అందలి వృక్షములు అగ్నిజ్వాలలవలె వెలుగొందుచు బంగారు కాంతులీనుచుండెను అచటయెర్రని చిగురుటాకులు అల్లుకొని ఉన్న లతలు అచటి చెట్లకు ఆభరణములుగా విలసిల్లుచుండెను అవి ఉదయ సూర్య కాంతులతో మెరయచుండెను. వాటి వేదికలపై వైడూర్యములను పొడగబడిన భవనములు  యుండెను. 

ఆవృక్షముల కాండములు రాజతకాంతులతో తళతళ లాడుచుండెను. అక్కడి సరస్సులు నీల వైడూర్యములతో విలసిల్లుచు పలువిధములుగా పక్షులు నిలయములై యుండెను బాలభానుని కాంతులతో చక్కని కేసరళములతో ఒప్పుచున్న  అచటి పద్మములు మనో జ్ఞముగా యుండెను  ఆ సరస్సులయందలి నిర్మల జలములతో అట్టి అందమైన సరస్సులు ఆవాసరా ప్రముఖులు బాగుగా తిలకించిరి. 
మిగుల బలశాలులైన ఆవానరులు ఆ గుహ యందు పలుప్రదేశములు వెదకినా పిమ్మట సమీపమున యున్న ఒక స్త్రీని చూచిరి ఆమె కృష్ణ జనమును వస్త్రముగా ధరించి యుండెను ఆహార నియమములను పాటించుచుండుటయే ఆ సాత్వి తేజోరాశిగా విలసిల్లుచుండెను ఆ దివ్య స్త్రీని చూచి ఆ వానరులు  సంబ్రమాశ్చర్యములకు లోనై దూరముననే యుండిపోతిరి అప్పుడు హనుమంతుడు అమ్మా నీవు ఎవరావు ఈ గుహ ఎవరిదీ అని ఆమెను అడిగెను . 
పర్వతాకారుడైన హనుమంతుడు అంజలి ఘటించి వృద్ధురాలైన ఆ తాప్సికి ప్రణమిల్లి ఇట్లు అర్ధించెను "మాట, ఎవరమ్మా నీవు,?ఈ భవనము , గుహలు,బంగారురత్నరాసులు,ఎవరివి? దయతో తెల్పుము . 

రామాయణము-కిష్కింద కాండ-ఏబదియెవసర్గము సమాప్తం . 

                      శశి 

             ఎం.ఏ , ఎం.ఏ (తెలుగు),తెలుగు పండితులు . 

Saturday, 2 March 2019

రామాయణము కిష్కింద కాండ -నలుబదితొమ్మిదవసర్గ

                                     రామాయణము 

                                  కిష్కింద కాండ -నలుబదితొమ్మిదవసర్గ 

ఆ విధముగా దీనులై కూర్చున్న వానరులతో అంగదుడు దీనత్వము తగదని ఉత్సాహము కార్యసాధకుల లక్షణమని పలు రకముల ప్రత్సాహపూరితములైన మాటలు చెప్పి ఉత్సాహపరిచేను . ఉత్సాహము తెచ్చుకున్న వానరులు తిరిగి ఆ ప్రదేశమంతా అణువణువూ గాలించిరి . అక్క్కడ వున్న గుహలను గాలించి ముందుకు సాగిరి . 

రామాయణము కిష్కిందకాండ నలుబది తొమ్మిదవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము కిష్కింద కాండ -నలుబదియేడవసర్గ

                               రామాయణము

                               కిష్కింద కాండ -నలుబదియెనిమిదవసర్గ 

తారుడు ,అంగదుడు  మొదలగు వానర వీరులతో కలిసి దక్షిణ దిక్కుకు వెళ్లిన హనుమంతుడు సుగ్రీవుడు చెప్పిన ప్రాంతములన్ని వెతుకుతూ వింధ్యకు చేరెను అక్కడ సీతామాత జాడ కోరకై వెతికేను . వింధ్య పరిసర ప్రాంతములో కల ఒక ప్రదేశములో చొరరాణి గుహాలతో కీకారణ్యములతో నిండి ఉండును . అక్కడ ప్రాణులేవి వుండవు . అక్కడ నీరు కూడా ;లభించదు . అలంటి భయంకర ప్రదేశములలో వారు పెక్కు శ్రమనోర్చి అన్వేషించిరి . పిమ్మట వారు మరొక దుర్గమ ప్రదేశములో ప్రవేశించిరి . అక్కడ అంటా సూన్యము కనీసము చెట్లు కూడా వుండవు . అక్కడ ఏ ప్రాణి ఉండదు ,నీరు దొరకదు . ఒకానొకప్పుడు 'కండుడు 'అనే మహా ముని అక్కడ వుండేవాడు . అతడి 16 సంవత్సరాల కుమారుడు అక్కడ చనిపోయినాడు . దాంతో ఆముని ఆ వనముని ప్రాణి రహితము కమ్మని శపించాడు . ఆ విధముగా ఆప్రాంతము అలా తయారయ్యినది . వానరులంతా మిక్కిలి కష్టముతో ఆప్రాంతమునంతా వెతికి పిమ్మట ఒక దుర్గమారణ్యమునకు చేరిరి . అక్కడ ఒక రాక్షసుడిని చూసిరి . ఆరాక్షసుడిని సీతామాతను అపహరించిన రావణునిగా భావించిన అంగదుడు ఒక్క దెబ్బతో అతడిని కూలవేసెను . 
అప్పుడు వానరులంతా విజయోత్సాయముతో ఆ ప్రాంతమంతా వెతికి మరి ఒక గుహను చేరిరి . వారు ఆ గుహలను కూడా వెతికి సీతాదేవి జాడ తెలియకపోవుటచే దీనవధానులై ఒక చెట్టు కింద కూర్చుండిరి . 

రామాయణము కిష్కిందకాండ నలుబదియెనిమిదవసర్గ సమాప్తము . 

               శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




రామాయణము కిష్కింద కాండ -నలుబదియేడవసర్గ

                                      రామాయణము 

                                  కిష్కింద కాండ -నలుబదియేడవసర్గ 

సుగ్రీవుని ఆజ్ఞ ప్రకారం  ఆయా దిక్కులకు వెళ్లిన వానర వీరులందరు సీతాదేవి జాడకొరకు జనావాసములను కొండలను కోణాలను సరస్సులను నాదీ తీరములను , క్షుణ్ణముగా వెదికిరి . సుగ్రీవుడుచెప్పిన ప్రదేశములలో ఈ ఒక్క ప్రదేశమును విడిచిపెట్టక బాగుగా వెదికిరి గడువు (నెలరోజులు ) తక్కువుగా ఉండటంతో  వారంతా పగలంతా ఆకలి అన్న ఆలోచన లేకుండా ఆయా ప్రదేశములన్ని క్షుణ్ణముగా గాలించ సాగిరి రాత్రి పూత మాత్రము ఆయా ప్రాంతములలో దొరికే పళ్లను ఆరగించి విశ్రాంతి తీసుకొనేది వారు . ఆవిధముగా వెదికి వెదికి నిరాశతో  తూర్పు దిక్కుకు వెళ్లిన వినాథుడు తిరిగి వచ్చెను. ఉత్తరదిక్కుకు వెళ్లిన సత్వాలికూడా రిక్త హస్తములతో తిరిగివచ్చెను పశ్చిమదిక్కుకు వెళ్లిన సుషేణుడు కూడా దీన వదనంతో తిరిగి వచ్చెను. (హనుమంతుడు అతనితో దక్షిణ దిక్కుకు వెళ్లిన వానరవీరులు మాత్రం తిరిగిరాలేదు ) వారందరు ప్రసవం గిరి పై శ్రీ రామునితో కూడి ఉన్న సుగ్రీవుడి వద్దకు వెళ్లి నమస్కరించి "ఓ వానర రాజా ! మీరు ఆదేశించినా కూడా సమస్త ప్రాంతములను పర్వతములను వనములను కీకారణ్యములను నాదీ తీరములను సముద్రాఖాతములను జానపదములను సకల గుహలను ప్రవేశించుటకు ఆసాధ్యములైన పలువిధములైన ద్వీపములను పెక్కు దేశములను కాలుమోపుటకే అస్సాధ్యముగా ఉన్న పెక్కు ప్రాంతములను అణులమాంలుము గాలించితిమి మాకు అడ్డు వచ్చిన క్రూర మృగములను చంపితిమి శ్రీరామచంద్ర ప్రభువు యొక్క కార్యము సాధించుటకు మా సర్వ శక్తులను ఒడ్డి ప్రయత్నించితిమి కానీ మా కృషి ఫలించలేదు  ఓ మహా రాజా వాయుసుతుడైన హనుమంతుడు మహా శక్తి శాలి కారణం జన్ముడు  ఆ మహా శివుడే సీతా మాట జాడను తెలుసుకొని రాగలదు ఎందుకనగా రావణుడు సీతాదేవిని అపహరించునని తీసుకువెళ్లిన దక్షిణ దిశకే హనుమంతుడు కూడా ఆంగదాది వీరులాటినో కలసి వెళ్లెను"అని పలికెను . 

రామాయణము కిష్కింద కాండ -నలుబది ఆరవసర్గ

                                 రామాయణము 

                            కిష్కింద కాండ -నలుబది ఆరవసర్గ 

 వానర ప్రముఖులందరూ తమతమ భళా ములతో వెళ్లిన తరువాత  శ్రీరాముడు  "ఈ సమస్త  భూ మండలము గురించి నీకు ఎలా తెలుసు ఇంత విపులముగా ఎలాచెప్పగలుగుతున్నావు ? " అని సుగ్రీవుని ప్రశ్నించెను

 అప్పుడు సుగ్రీవుడు శ్రీ రామునికి నమస్కరించి "రామా  మా అన్న అగు వాలి  ఒక రాక్షసుని  వెంబడిస్తూ మలయపర్వత  గుహలో ప్రవేశించెను.  ఆయన వెనుకే పరిగెడుతున్న నేను  ఆయన మీద ప్రేమతో అక్కడే వేచియున్నాను  సంవత్సర  కాలము అయినా మా అన్న తిరిగి రాలేదు. ఒక రోజు వేగముగా ప్రవహించుచు వచ్చిన రక్తమును చూసి మా అన్న ఏ  దానవుని చేతిలో మరణించి ఉండునని భావించాను, నేను తీవ్ర శోకములో మునిగి పోయాను కొంత సేపటి తరువాత అభిలము మూసివేసినచో మా అన్నాను చంపిన రాక్షసుడు కూడా మరణించునాని భావించి పెద్ద కొండరాయిని ఐ కష్టము మీద ఆ బిలామును మూసివేసితిని. పిమ్మట ఆసక్తుడ నయి  మిక్కీ విచారంతో  కాళ్ళీడ్చుకుంటూ కిష్కింధకు చేరితిని అలా ఉన్న నన్ను చూసి  మంత్రులు సన్నిహితులు నా చుట్టూ చేరి విషయమును రాబట్టి నన్ను ఓదార్చిరి  పిమ్మట సింహాసనం కాలీగా ఉండ రాదనీ నన్ను రాజును చేసితిరి అలా రాజయిన నేను కార్య భారములలో పడి  మా అన్న మరణాన్ని నెమ్మిదిగా మరచి  సంతోషముగా ఉండ సాగితిని ఇంతలో ఒక రోజు మా అన్న కిష్కింద కు రానే వచ్చెను. ఆయన్ని చూసిన వెంటనే సగౌరవంగా  సంతోషముగా, రాజ్యాధికారమును  ఆయనకు అప్పగించితిని కానీ మా అన్న నన్ను అపార్థము చేసుకొని మనస్తాపముకు లోనై క్రోధముతో ఉడికిపోవుచు నన్ను చంపుటకు సిద్దప్పడెను అప్పుడు నేను ప్రాణభయముతో నా మిత్రులతో సహా పారిపోసాగాను.   మా అన్న చాలా దూరము నా వెంట బడెను నేను మొదట తూర్పుదిశకు వేళ్లా ను. అక్కడి ప్రదేశములు అన్ని చూసాను  క్షీర సాగరమును కూడా చూసాను మా అన్న కూడా నన్ను తరుముతూ వస్తుండగా భయముతో దక్షిణ దిశగా పరుగులు తీసాను అక్కడి ప్రాంతములను వింధ్య పర్వతమును చూసాను అక్కడకి కూడా వాలి నన్ను వెంటాడుతూ వచ్చుటచే  పశ్చిమ దిక్కుకు పరిగెత్తితిని. అక్కడి ప్రదేశములను  గిరి శ్రేష్ఠ మైన అస్త్రద్రి ని చూసితిని వాలి విడిచిపెట్టక నన్ను వెంటాడుచుండుట చే  నేను ఉత్తర దిశకు పరిగెట్టితిని  ఆ దిక్కున హిమవత్పర్వతమును  మేరుగిరిని లవణ సముద్రమును గాంచితిని  ఆ విధముగా వాలి నన్ను తరుముతుండుట చే ఎక్కడ నాకు రక్షణ లేకపోయెను అప్పుడు హనుమంతుడు  మాతంగముని ఇచ్చిన సేపే కారణముగా వాలి ఋష్యమూక పర్వతముపైకి  రాలేదన్న సంగతిని నాకు జ్ఞప్తికి తెచ్చెను కావున అప్పటినుండి నేను ఈర్ష్యమూక పర్వతముపైనే ఉంటున్నాను ఓ ప్రభు ఈ విదముగా నేను భూ మండలాన్ని మొత్తాన్ని  ప్రత్యక్షంగా చూసాను అని పలికెను"

              రామాయణము  నలుబది ఆరవ సర్గ -కిష్కింద కాండ సమాప్తము . 

            శశి 

     ఎం.ఏ, ఎం.ఏ ,(తెలుగు ) తెలుగుపండితులు . 


                                    రామాయణము 

                                  కిష్కింద కాండ - నలుబదిఐదవ సర్గము 

వానర ప్రభువైన సుగ్రీవుడు ఆవానరులను అందరిని సమావేశపరిచి   "శ్రీ రామకార్యము (సీతాన్వేషణ)   సఫలమగుటకై నేను విపులముగా తెల్పిన ప్రదేశములను అన్నింటిని  వెదకుడు . " అని పల్కెను అంతట ఆవానరప్రముఖులు  తమప్రభువు యొక్క తిరుగులేని  శాసనము  తలదాల్చి మిడుతలవలె భూమిని  కప్పివేయుచు   అచ్చటినుండి బయలుదేరిరి. 


      సీతాదేవిని అన్వేషించుటకై  విధించిన  నేలగడువును  నిరీక్షించుచు  శ్రీ రాముడు లక్ష్మణ సహితుడై ఆ  ప్రస్రవణ  గిరియందే వినిపించుచుండెను. గిరిరాజమైన  హిమవత్పర్వతములో మనోహరముగా ఒప్పుచున్న ఉత్తరదిశకు వానర వీరుడైన శతవలి తన అనుచరులతో గూడి వెంటనే  బయలుదేరెను. వినతుడు అను వానర నాయకుడు తనవారితోగూడ తూర్పుదిక్కుకు  ప్రయాణమాయెను  తారుడు అంగదుడు మొదలగు వారిని వెంటనిడుకొని కపిశ్రేష్టుడైన మారుతి  అగస్త్యమహాముని  సంచరించిన  దక్షిణ దిశకు వెడలెను కపివరుడు వానర నాయకుడు ఐన సుషేణుడు వరుణదేవుని  పాలనలో ఉన్నదియు  మిక్కిలి దుర్గమమైనది అగు పడమర దిక్కుకు  తనవారిని వెంటబెట్టుకొని అటునుండి కదిలేను. 
   వానర రాజైన సుగ్రీవుడు ప్రముఖులైన వానరసేనాపతులను  నలుదిక్కులకు  యధావిధిగా  పంపించి  సంతృప్తుడై  హాయిగా ఉండెను ఆయా వానర సేన నాయకులందరూ రాజాజ్ఞనను  శిరసావహించి  తమతమదిశలకు శీఘ్రముగా సాగిపోయిరి. రావణుని  హతమార్చి సీతామాతను తీసుకొనివచ్చెదను  అని  పలుకుచు ఆ వానరులు సంతోషాతిశయముచే బిగ్గరగా అరచుచు , గర్జించుచు , తమనుతాము  తమనుతాము ప్రశంసించుకొనుచు  సింహనాదములను గావించుచు వికృతముగా కేకలు వేయుచు ముందుకు సాగిరి. 
   ఆ దుష్ట రావణుడు నా చేతికి చిక్కినచో  నేనొక్కడినే వానిని రణరంగమున నేలగూల్చెదను పిమ్మట అతని సేనానాలను అన్నింటిని చికాకు పరవహి క్షణములో జానకీదేవిని గైకొని వచ్చెదను. మీరందరును ఇక్కడే ఉండండి జానకి దేవి బిక్కుబిక్కు మనుచు పాతాళములో  ఉన్నప్పటికీ  నేను ఒక్కడినే అక్కడికి వెళ్లి ఎన్నిశ్రమాలకు ఓర్చి అయినాను  ఆ తల్లిని తీసుకు వచ్చెదను.  వృక్షములను  పెకలించి  వైచెదను  కొండలను పిండిచేసెదను  భూమిని  బ్రద్దలు కావించెదను సముద్రములను  కల్లోల పరిచెదను  నేను ఎన్ని యోజనములయెత్తుకైనను  నిస్సంశయముగా ఎగురగలను నేను వందల కొలది యోజనాలు ఎగురగలను  నేను వందల కొలది యోజనాలు ఎగురగలను  భూమండలమున గాని సముద్రమున గాని  పర్వతములయందు గాని  అరణ్యములలోగాని పాటల లోకమున గాని నన్ను ఆపగలవారు ఎవ్వరు ఉండరు భళా గర్వితులైన వానరులలో  ఒక్కొక్కడు ఈ విధముగా సుగ్రీవుని ఎదుట ఒక్కొక్కరు ప్రగల్బాములు పల్కిరి   

                          శశి 

                 ఎం.ఏ , ఎం.ఏ ,(తెలుగు ) , తెలుగు పండితులు .  

Friday, 1 March 2019

                                    రామాయణము 

                              కిష్కిందకాండ -నలుబదినాలుగవసర్గ 

ఆ విధముగా నలుదిక్కులకు వానర ప్రముఖులను సీతాన్వేషణకై సుగ్రీవుడు నియమించెను అతని మనస్సులో ఈసీతాన్వేషణ కార్యమును హనుమంతుడు సఫలం చేయగలడని గట్టి నమ్మకము . అందువలనే అక్కడే  హనుమంతుని వద్దకు వెళ్లి  ఓ వానరోత్తమా ! భూమి పై  కానీ ,నీటి పై కానీ ,ఆకాశములో కానీ, నీవు తీరగలవు అసురులు ,గంధర్వులు, నాగులు, దేవతలు, సముద్రములు, పర్వతములు, ఉండేడి సమస్త లోకములు నీవు బాగుగా ఎరుగుదువు" ఓ ఆంజనేయ! అసాధారణమైన బుద్ది కుశలత ,సాటిలేని భళా పరామక్రమములు   నీ యందు కలవు నీవు గొప్ప ఉపాయం శీలి దెస కాలములకు అనుగుణంగా ప్రవర్తించ గలవు. "అని పలికెను .  


          సుగ్రీవుని మాటాలు బట్టి సీతాన్వేషణకు హనుమంతుడు సమర్థుడు అని శ్రీ రాముడు గ్రహించెను ఒక సారి హనుమంతుణ్ణి పరికించి చూసి తన కార్య్రము  సఫల మయినట్లే అని భావించెను అప్పుడు శ్రీ రాముడు తన పేరు చెక్కబడిన ఉంగరమును సీత దేవికి  ఆనవాలుగా ఇచ్చుటకు హనుమంతునికి ఇచ్చి


 "ఓ వీరుడా !ఈముద్రికను చూసిన పిమ్మట నిన్ను రాముని వద్ద నుండి వచ్చిన దూత అని నమ్మి నీతో మాట్లాడును నీ వలన కార్య సిద్ది అగునని నమ్ము చున్నాను "అని పలికెను . 
          
       అప్పుడు ఆ వానర శ్రేష్ఠుడు అంజలి ఘటించి  రామ ముద్రికను తీసుకుని శిరస్సునందు ఉంచు కొనెను పిమ్మట అతడు శ్రీ రాముని పాదములకు ప్రణమిల్లి

 అక్కడ నుండి బయలు దేరెను వానర వీరుడైన ఆ మారుతి సుగ్రీవుడు ఇంతక ముందే నిర్దేశించిన దక్షిణ దిక్కుకు వేళ్ళ వలసిన మహా కపి సైన్యముతో పయన మయ్యెను . అప్పుడు శ్రీ రాముడు బిగ్గరగా  "వాయు సుత నీవు మిక్కిలి భళా సాలివి పైగా సింహ పరాక్రమముడివి నేను నీశక్తి సామర్ధ్యములను ఆశ్రయించితిని  అద్భుత మైన  నీ భళా పరాక్రములను పూర్తిగా ప్రదర్శించి సీతా దేవి క్షేమ సమాచారమునలు   తెలుసుకొని రమ్ము " అని పలికెను . 

  రామాయణం -కిష్కింద కాండ  నలుబది నాలుగవ సర్గ సమాప్తం . 

  శశి , 

ఎం.ఏ ,ఎం.ఏ(తెలుగు ),తెలుగుపండితులు .