Saturday 2 March 2019

                                    రామాయణము 

                                  కిష్కింద కాండ - నలుబదిఐదవ సర్గము 

వానర ప్రభువైన సుగ్రీవుడు ఆవానరులను అందరిని సమావేశపరిచి   "శ్రీ రామకార్యము (సీతాన్వేషణ)   సఫలమగుటకై నేను విపులముగా తెల్పిన ప్రదేశములను అన్నింటిని  వెదకుడు . " అని పల్కెను అంతట ఆవానరప్రముఖులు  తమప్రభువు యొక్క తిరుగులేని  శాసనము  తలదాల్చి మిడుతలవలె భూమిని  కప్పివేయుచు   అచ్చటినుండి బయలుదేరిరి. 


      సీతాదేవిని అన్వేషించుటకై  విధించిన  నేలగడువును  నిరీక్షించుచు  శ్రీ రాముడు లక్ష్మణ సహితుడై ఆ  ప్రస్రవణ  గిరియందే వినిపించుచుండెను. గిరిరాజమైన  హిమవత్పర్వతములో మనోహరముగా ఒప్పుచున్న ఉత్తరదిశకు వానర వీరుడైన శతవలి తన అనుచరులతో గూడి వెంటనే  బయలుదేరెను. వినతుడు అను వానర నాయకుడు తనవారితోగూడ తూర్పుదిక్కుకు  ప్రయాణమాయెను  తారుడు అంగదుడు మొదలగు వారిని వెంటనిడుకొని కపిశ్రేష్టుడైన మారుతి  అగస్త్యమహాముని  సంచరించిన  దక్షిణ దిశకు వెడలెను కపివరుడు వానర నాయకుడు ఐన సుషేణుడు వరుణదేవుని  పాలనలో ఉన్నదియు  మిక్కిలి దుర్గమమైనది అగు పడమర దిక్కుకు  తనవారిని వెంటబెట్టుకొని అటునుండి కదిలేను. 
   వానర రాజైన సుగ్రీవుడు ప్రముఖులైన వానరసేనాపతులను  నలుదిక్కులకు  యధావిధిగా  పంపించి  సంతృప్తుడై  హాయిగా ఉండెను ఆయా వానర సేన నాయకులందరూ రాజాజ్ఞనను  శిరసావహించి  తమతమదిశలకు శీఘ్రముగా సాగిపోయిరి. రావణుని  హతమార్చి సీతామాతను తీసుకొనివచ్చెదను  అని  పలుకుచు ఆ వానరులు సంతోషాతిశయముచే బిగ్గరగా అరచుచు , గర్జించుచు , తమనుతాము  తమనుతాము ప్రశంసించుకొనుచు  సింహనాదములను గావించుచు వికృతముగా కేకలు వేయుచు ముందుకు సాగిరి. 
   ఆ దుష్ట రావణుడు నా చేతికి చిక్కినచో  నేనొక్కడినే వానిని రణరంగమున నేలగూల్చెదను పిమ్మట అతని సేనానాలను అన్నింటిని చికాకు పరవహి క్షణములో జానకీదేవిని గైకొని వచ్చెదను. మీరందరును ఇక్కడే ఉండండి జానకి దేవి బిక్కుబిక్కు మనుచు పాతాళములో  ఉన్నప్పటికీ  నేను ఒక్కడినే అక్కడికి వెళ్లి ఎన్నిశ్రమాలకు ఓర్చి అయినాను  ఆ తల్లిని తీసుకు వచ్చెదను.  వృక్షములను  పెకలించి  వైచెదను  కొండలను పిండిచేసెదను  భూమిని  బ్రద్దలు కావించెదను సముద్రములను  కల్లోల పరిచెదను  నేను ఎన్ని యోజనములయెత్తుకైనను  నిస్సంశయముగా ఎగురగలను నేను వందల కొలది యోజనాలు ఎగురగలను  నేను వందల కొలది యోజనాలు ఎగురగలను  భూమండలమున గాని సముద్రమున గాని  పర్వతములయందు గాని  అరణ్యములలోగాని పాటల లోకమున గాని నన్ను ఆపగలవారు ఎవ్వరు ఉండరు భళా గర్వితులైన వానరులలో  ఒక్కొక్కడు ఈ విధముగా సుగ్రీవుని ఎదుట ఒక్కొక్కరు ప్రగల్బాములు పల్కిరి   

                          శశి 

                 ఎం.ఏ , ఎం.ఏ ,(తెలుగు ) , తెలుగు పండితులు .  

No comments:

Post a Comment