Friday 1 March 2019

                                    రామాయణము 

                              కిష్కిందకాండ -నలుబదినాలుగవసర్గ 

ఆ విధముగా నలుదిక్కులకు వానర ప్రముఖులను సీతాన్వేషణకై సుగ్రీవుడు నియమించెను అతని మనస్సులో ఈసీతాన్వేషణ కార్యమును హనుమంతుడు సఫలం చేయగలడని గట్టి నమ్మకము . అందువలనే అక్కడే  హనుమంతుని వద్దకు వెళ్లి  ఓ వానరోత్తమా ! భూమి పై  కానీ ,నీటి పై కానీ ,ఆకాశములో కానీ, నీవు తీరగలవు అసురులు ,గంధర్వులు, నాగులు, దేవతలు, సముద్రములు, పర్వతములు, ఉండేడి సమస్త లోకములు నీవు బాగుగా ఎరుగుదువు" ఓ ఆంజనేయ! అసాధారణమైన బుద్ది కుశలత ,సాటిలేని భళా పరామక్రమములు   నీ యందు కలవు నీవు గొప్ప ఉపాయం శీలి దెస కాలములకు అనుగుణంగా ప్రవర్తించ గలవు. "అని పలికెను .  


          సుగ్రీవుని మాటాలు బట్టి సీతాన్వేషణకు హనుమంతుడు సమర్థుడు అని శ్రీ రాముడు గ్రహించెను ఒక సారి హనుమంతుణ్ణి పరికించి చూసి తన కార్య్రము  సఫల మయినట్లే అని భావించెను అప్పుడు శ్రీ రాముడు తన పేరు చెక్కబడిన ఉంగరమును సీత దేవికి  ఆనవాలుగా ఇచ్చుటకు హనుమంతునికి ఇచ్చి


 "ఓ వీరుడా !ఈముద్రికను చూసిన పిమ్మట నిన్ను రాముని వద్ద నుండి వచ్చిన దూత అని నమ్మి నీతో మాట్లాడును నీ వలన కార్య సిద్ది అగునని నమ్ము చున్నాను "అని పలికెను . 
          
       అప్పుడు ఆ వానర శ్రేష్ఠుడు అంజలి ఘటించి  రామ ముద్రికను తీసుకుని శిరస్సునందు ఉంచు కొనెను పిమ్మట అతడు శ్రీ రాముని పాదములకు ప్రణమిల్లి

 అక్కడ నుండి బయలు దేరెను వానర వీరుడైన ఆ మారుతి సుగ్రీవుడు ఇంతక ముందే నిర్దేశించిన దక్షిణ దిక్కుకు వేళ్ళ వలసిన మహా కపి సైన్యముతో పయన మయ్యెను . అప్పుడు శ్రీ రాముడు బిగ్గరగా  "వాయు సుత నీవు మిక్కిలి భళా సాలివి పైగా సింహ పరాక్రమముడివి నేను నీశక్తి సామర్ధ్యములను ఆశ్రయించితిని  అద్భుత మైన  నీ భళా పరాక్రములను పూర్తిగా ప్రదర్శించి సీతా దేవి క్షేమ సమాచారమునలు   తెలుసుకొని రమ్ము " అని పలికెను . 

  రామాయణం -కిష్కింద కాండ  నలుబది నాలుగవ సర్గ సమాప్తం . 

  శశి , 

ఎం.ఏ ,ఎం.ఏ(తెలుగు ),తెలుగుపండితులు .  

   

No comments:

Post a Comment