Saturday 2 March 2019

రామాయణము కిష్కింద కాండ -నలుబదియేడవసర్గ

                               రామాయణము

                               కిష్కింద కాండ -నలుబదియెనిమిదవసర్గ 

తారుడు ,అంగదుడు  మొదలగు వానర వీరులతో కలిసి దక్షిణ దిక్కుకు వెళ్లిన హనుమంతుడు సుగ్రీవుడు చెప్పిన ప్రాంతములన్ని వెతుకుతూ వింధ్యకు చేరెను అక్కడ సీతామాత జాడ కోరకై వెతికేను . వింధ్య పరిసర ప్రాంతములో కల ఒక ప్రదేశములో చొరరాణి గుహాలతో కీకారణ్యములతో నిండి ఉండును . అక్కడ ప్రాణులేవి వుండవు . అక్కడ నీరు కూడా ;లభించదు . అలంటి భయంకర ప్రదేశములలో వారు పెక్కు శ్రమనోర్చి అన్వేషించిరి . పిమ్మట వారు మరొక దుర్గమ ప్రదేశములో ప్రవేశించిరి . అక్కడ అంటా సూన్యము కనీసము చెట్లు కూడా వుండవు . అక్కడ ఏ ప్రాణి ఉండదు ,నీరు దొరకదు . ఒకానొకప్పుడు 'కండుడు 'అనే మహా ముని అక్కడ వుండేవాడు . అతడి 16 సంవత్సరాల కుమారుడు అక్కడ చనిపోయినాడు . దాంతో ఆముని ఆ వనముని ప్రాణి రహితము కమ్మని శపించాడు . ఆ విధముగా ఆప్రాంతము అలా తయారయ్యినది . వానరులంతా మిక్కిలి కష్టముతో ఆప్రాంతమునంతా వెతికి పిమ్మట ఒక దుర్గమారణ్యమునకు చేరిరి . అక్కడ ఒక రాక్షసుడిని చూసిరి . ఆరాక్షసుడిని సీతామాతను అపహరించిన రావణునిగా భావించిన అంగదుడు ఒక్క దెబ్బతో అతడిని కూలవేసెను . 
అప్పుడు వానరులంతా విజయోత్సాయముతో ఆ ప్రాంతమంతా వెతికి మరి ఒక గుహను చేరిరి . వారు ఆ గుహలను కూడా వెతికి సీతాదేవి జాడ తెలియకపోవుటచే దీనవధానులై ఒక చెట్టు కింద కూర్చుండిరి . 

రామాయణము కిష్కిందకాండ నలుబదియెనిమిదవసర్గ సమాప్తము . 

               శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




No comments:

Post a Comment