Sunday 3 March 2019

                                      రామాయణము 

                                    కిష్కిందకాండ - ఏబదియవసర్గము 

వానరప్రముఖుడైన హనుమంతుడు  తారునితో,అంగదునితో గూడి, వింధ్యపర్వతములందలి గుహలను దట్టమైన అడవులను, గాలించెను. ఇంకను ఆ మహాత్ముడు సింహములు , పెద్ద పులులు సంచరించేతి గుట్టలను , గుబురులను నాదీ తీరములును ఆ వింధ్యకు సంబంధించిన ఎగుడు దిగుడు నేలలు పెద్దపెద్ద సెలయేళ్ళు గల ప్రదేశములను అన్వేషించెను. ఆ ప్రదేశమున వారు సమైక్య భావముతో ఒకరిపైఒకరు తూడుగా ప్రక్కప్రక్కనే నడుచుచుండగా మారుతి ఆ పర్వతమును పూర్తిగా గాలించెను . 
గజుడు , గవాక్షుడు, గవయుడు, శరభుడు , గంధమాదనుడు , మైందుడు మొదలగువారు మున్నగు వానరుల యాదక్షిణ దిశయందు కొండలతోనిండిన ఆయా ప్రదేశములను వెదుకుచూ ఉండగా అక్కడ వారికి తెరువబడియున్న ఒక బిలాము కనబడెను. ఆ దుర్గము పేరు" బుక్షబిలము "అది ఒక దానవుని ఆధీనములో గలదు అక్కడకు చేరిన హనుమదాదులు మిక్కిలి అలసిపోయిరి. ఆకలిదిప్పలకు లోనై యుండిరి. కనీసము దాహముతీర్పుకొనుటకై  మంచినీరైనను దొరికిన బాగుండునని తపనపడుచుండిరి. బాగుగా పరికించి చూచినా పిమ్మట  "ఆ మహా బిలము లతావృక్షములతో కప్పబడియున్నట్లు వారు గమనించిరి. ఆ గుహ లోపలినుండి క్రౌంచపక్షులు , హంసలు , బెగ్గురపక్షులు, చక్రవాకములు బయటకివచ్చుచుండెను ఆ పక్షులు నీటితో తడిసియుండెను పద్మముల రేణువులు అంటుకొని యుండుటచే అవి ఎర్రగా కనబడుచుండెను. 
పిమ్మట ఆ వానరోత్తములు బిలము  కడకు చేరిరి. ఆ బిలమునుండి సువాసనలు వచ్చుచుండెను వారికి అందు ప్రవేశించుట అసాధ్యముగా తోచిరి. ఆస్తితిని జూచి వారు ఆశ్చర్యచకితులైరి . ఆ వానర ప్రముఖులు అచటకు చేరిన పిమ్మట దానిని బాగుగా పరికించిచూచిరి . అప్పుడు వారికి ఇది పాతాళ గుహాయ?, లేక రావణుని మాయా మందిరమా ?, అను శంకలు కలిగెను పక్షులు తడసియుండుట బట్టి వాటి రాకపోకలను అనుసరించి అందు జలములుండెనని  ఊహించిరి అచటి ప్రతికూల పరిస్థితికి వారు వారు యెంతయు నీరసపడిరి 
ఎట్టి దుర్గమారణ్యములయందైనను  సంచరించుటలో నిపుణుడు , ఐన మారుతి ఆ వనరులందరితో ఇట్లు అనెను . "ఈ బిలము నుండి హంసలు బయటకు వచ్చినవి  పైగా ఈ బిలద్వారమునొద్దగల వృక్షములుఅన్నియు  పచ్చని ఆకులతో కలకాలాడుచున్నవి కావున ఇచట చక్కని జలమూలేహి నిండిన భావి గాని మడుగు గాని తప్పుగా ఉండితీరును " ఆ వానరోత్తములు వేగముతో పూర్తిగా ఆగుహ లోపలి చేరిరి ఆ ప్రదేశమంతయు వెలుతురుతో నిండియుండెను. అది మిగుల మనోహరముగా ఉండెను. 
దప్పిగొని యుండుట వలన వారిలో చురుకు దానము తగ్గియుండెను అయినాను దాహము తీర్చుకొనుటకై తహతహలాడుచు అలసత్వమునకు తావీయక కొంత తడువు వేగముగా ముందుకు సాగిరి ఆ వానర వీరులు మిక్కిలి అలసిపోయి ఆకలి దప్పులచే కృశించియుండిరి. వారు తమ జీవితములపై ఆశ వదులుకుని దీనవధానులై యుండిరి అట్టి స్థితిలో వారికి ఒక వెలుగు కనబడెను. వారు ఆ ప్రదేశమునకు రాగానే వారికి ప్రత్యేకమైన ఒక వనము కనపడెను. అది వెలుతురుతో నిండి యుండెను అందలి వృక్షములు అగ్నిజ్వాలలవలె వెలుగొందుచు బంగారు కాంతులీనుచుండెను అచటయెర్రని చిగురుటాకులు అల్లుకొని ఉన్న లతలు అచటి చెట్లకు ఆభరణములుగా విలసిల్లుచుండెను అవి ఉదయ సూర్య కాంతులతో మెరయచుండెను. వాటి వేదికలపై వైడూర్యములను పొడగబడిన భవనములు  యుండెను. 

ఆవృక్షముల కాండములు రాజతకాంతులతో తళతళ లాడుచుండెను. అక్కడి సరస్సులు నీల వైడూర్యములతో విలసిల్లుచు పలువిధములుగా పక్షులు నిలయములై యుండెను బాలభానుని కాంతులతో చక్కని కేసరళములతో ఒప్పుచున్న  అచటి పద్మములు మనో జ్ఞముగా యుండెను  ఆ సరస్సులయందలి నిర్మల జలములతో అట్టి అందమైన సరస్సులు ఆవాసరా ప్రముఖులు బాగుగా తిలకించిరి. 
మిగుల బలశాలులైన ఆవానరులు ఆ గుహ యందు పలుప్రదేశములు వెదకినా పిమ్మట సమీపమున యున్న ఒక స్త్రీని చూచిరి ఆమె కృష్ణ జనమును వస్త్రముగా ధరించి యుండెను ఆహార నియమములను పాటించుచుండుటయే ఆ సాత్వి తేజోరాశిగా విలసిల్లుచుండెను ఆ దివ్య స్త్రీని చూచి ఆ వానరులు  సంబ్రమాశ్చర్యములకు లోనై దూరముననే యుండిపోతిరి అప్పుడు హనుమంతుడు అమ్మా నీవు ఎవరావు ఈ గుహ ఎవరిదీ అని ఆమెను అడిగెను . 
పర్వతాకారుడైన హనుమంతుడు అంజలి ఘటించి వృద్ధురాలైన ఆ తాప్సికి ప్రణమిల్లి ఇట్లు అర్ధించెను "మాట, ఎవరమ్మా నీవు,?ఈ భవనము , గుహలు,బంగారురత్నరాసులు,ఎవరివి? దయతో తెల్పుము . 

రామాయణము-కిష్కింద కాండ-ఏబదియెవసర్గము సమాప్తం . 

                      శశి 

             ఎం.ఏ , ఎం.ఏ (తెలుగు),తెలుగు పండితులు . 

No comments:

Post a Comment