Saturday 2 March 2019

రామాయణము కిష్కింద కాండ -నలుబది ఆరవసర్గ

                                 రామాయణము 

                            కిష్కింద కాండ -నలుబది ఆరవసర్గ 

 వానర ప్రముఖులందరూ తమతమ భళా ములతో వెళ్లిన తరువాత  శ్రీరాముడు  "ఈ సమస్త  భూ మండలము గురించి నీకు ఎలా తెలుసు ఇంత విపులముగా ఎలాచెప్పగలుగుతున్నావు ? " అని సుగ్రీవుని ప్రశ్నించెను

 అప్పుడు సుగ్రీవుడు శ్రీ రామునికి నమస్కరించి "రామా  మా అన్న అగు వాలి  ఒక రాక్షసుని  వెంబడిస్తూ మలయపర్వత  గుహలో ప్రవేశించెను.  ఆయన వెనుకే పరిగెడుతున్న నేను  ఆయన మీద ప్రేమతో అక్కడే వేచియున్నాను  సంవత్సర  కాలము అయినా మా అన్న తిరిగి రాలేదు. ఒక రోజు వేగముగా ప్రవహించుచు వచ్చిన రక్తమును చూసి మా అన్న ఏ  దానవుని చేతిలో మరణించి ఉండునని భావించాను, నేను తీవ్ర శోకములో మునిగి పోయాను కొంత సేపటి తరువాత అభిలము మూసివేసినచో మా అన్నాను చంపిన రాక్షసుడు కూడా మరణించునాని భావించి పెద్ద కొండరాయిని ఐ కష్టము మీద ఆ బిలామును మూసివేసితిని. పిమ్మట ఆసక్తుడ నయి  మిక్కీ విచారంతో  కాళ్ళీడ్చుకుంటూ కిష్కింధకు చేరితిని అలా ఉన్న నన్ను చూసి  మంత్రులు సన్నిహితులు నా చుట్టూ చేరి విషయమును రాబట్టి నన్ను ఓదార్చిరి  పిమ్మట సింహాసనం కాలీగా ఉండ రాదనీ నన్ను రాజును చేసితిరి అలా రాజయిన నేను కార్య భారములలో పడి  మా అన్న మరణాన్ని నెమ్మిదిగా మరచి  సంతోషముగా ఉండ సాగితిని ఇంతలో ఒక రోజు మా అన్న కిష్కింద కు రానే వచ్చెను. ఆయన్ని చూసిన వెంటనే సగౌరవంగా  సంతోషముగా, రాజ్యాధికారమును  ఆయనకు అప్పగించితిని కానీ మా అన్న నన్ను అపార్థము చేసుకొని మనస్తాపముకు లోనై క్రోధముతో ఉడికిపోవుచు నన్ను చంపుటకు సిద్దప్పడెను అప్పుడు నేను ప్రాణభయముతో నా మిత్రులతో సహా పారిపోసాగాను.   మా అన్న చాలా దూరము నా వెంట బడెను నేను మొదట తూర్పుదిశకు వేళ్లా ను. అక్కడి ప్రదేశములు అన్ని చూసాను  క్షీర సాగరమును కూడా చూసాను మా అన్న కూడా నన్ను తరుముతూ వస్తుండగా భయముతో దక్షిణ దిశగా పరుగులు తీసాను అక్కడి ప్రాంతములను వింధ్య పర్వతమును చూసాను అక్కడకి కూడా వాలి నన్ను వెంటాడుతూ వచ్చుటచే  పశ్చిమ దిక్కుకు పరిగెత్తితిని. అక్కడి ప్రదేశములను  గిరి శ్రేష్ఠ మైన అస్త్రద్రి ని చూసితిని వాలి విడిచిపెట్టక నన్ను వెంటాడుచుండుట చే  నేను ఉత్తర దిశకు పరిగెట్టితిని  ఆ దిక్కున హిమవత్పర్వతమును  మేరుగిరిని లవణ సముద్రమును గాంచితిని  ఆ విధముగా వాలి నన్ను తరుముతుండుట చే ఎక్కడ నాకు రక్షణ లేకపోయెను అప్పుడు హనుమంతుడు  మాతంగముని ఇచ్చిన సేపే కారణముగా వాలి ఋష్యమూక పర్వతముపైకి  రాలేదన్న సంగతిని నాకు జ్ఞప్తికి తెచ్చెను కావున అప్పటినుండి నేను ఈర్ష్యమూక పర్వతముపైనే ఉంటున్నాను ఓ ప్రభు ఈ విదముగా నేను భూ మండలాన్ని మొత్తాన్ని  ప్రత్యక్షంగా చూసాను అని పలికెను"

              రామాయణము  నలుబది ఆరవ సర్గ -కిష్కింద కాండ సమాప్తము . 

            శశి 

     ఎం.ఏ, ఎం.ఏ ,(తెలుగు ) తెలుగుపండితులు . 


No comments:

Post a Comment