Monday, 29 February 2016

లలితా సహస్ర నామ ఫలం

లలితా సహస్ర నామ ఫలం  

ప్రతి రోజు లలితా సహస్ర నామాన్ని చదవడం మహా ఫలం . అలా వీలుకాని వారు శుక్రువారం చదివితే మంచిదే . 
అనగా లలితా దేవి కొంతకాలం కదంబ వనం లో నివసించింది . ఆవిడకు కదంబ వనం అంటే చాలా ఇష్టం . కావున కదంబ వృక్షం కింద కుర్చుని 11 రోజులు గాని 21 రోజులు కాని లలితా సహస్ర నామాన్ని పారాయణం చేస్తే పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుంది . మరియు అనుకున్న కార్యాలు తప్పక జరుగుతాయి . 
కదంబ పుష్పం 
ఆస్థి అనగా ఎముకలు . ఈ మంత్రాన్ని ఎముకలు విరిగిన వారు రోజు 108 సార్లు జపం చేసి నానపెట్టిన పెసలు అమ్మ కు నైవేద్యం పెడితే ఎముకలు చాలా త్వరగా సరవుతాయి . బందులు అయిన ఈ మంత్ర జపం చేసి తీర్ధాన్ని ఇచ్చినా ఎముకలు సరి అవుతాయి . 
పుణ్య ఘడియల్లో ,పుణ్య తిదులలో లలితా సహస్ర నామ పారాయణ పలితం ఎన్నో రెట్లు ఎక్కువగా లభిస్తుంది . అలాగే కుటుంభ సబ్యుల జన్మ నక్షత్ర సమయాల్లో చదివితే కుటుంభ శాంతి . పౌర్ణమి రోజు చంద్రుడిని చూస్తూ చదవడం వల్ల సాక్షాత్ లలితాదేవి ఎదురుగా చదివన పలితం కలుగుతుంది . 
లలితాదేవికి కలువలు ,మారేడు దళాలు ,తులసి దళాలు,మల్లెపూలు ఇష్టం . వాటితో పూజిస్తే అమ్మ త్వరగా ప్రసంనమవుతుంది . అలాగే నైవేద్యముగా పాయసము ,పులగము,చిత్రాన్నము (పులిహోర )దానిమ్మ,బూడిద గుమ్మడికాయ ప్రీతీ . 
కావున పూజకు పిదప  లలితాదేవికి పైన చెప్పినవి నైవేద్యము పెట్టిన సకల శుభ ప్రదం . 

   లలితాదేవ్యయై నమః 

                                                                                                        శశి 
                                                                                   ఎం . ఎ తెలుగు ,తెలుగు పండితులు  














Sunday, 28 February 2016

వివాహ రకాలు

         వివాహ రకాలు 

వివాహం అనగా రెండు నిండు జీవితాల కలయిక . వేరు వేరు పరిస్థితులలో పెరిగిన ఇద్దరు మాంగల్యం తో ,వేద మంత్ర ఘోషతో , అగ్ని సాక్షిగా ఒకటై కొత్త జీవితానికి పునాది వేయడం . 
  మాంగల్యం తంతునా నేనా మమ  జీవన జీవన హేతున కంటే బాధ్రామి సుభగే త్వం జీవ శరదాం శతం . 
మాంగల్యం ద్వారా మా జీవితం 100 సంవత్సరాలు సుఖ సంతోషాలతో కళకళ లాడాలి అని పై మంత్రానికి అర్ధం . 
కేవలం ఇద్దరు మనుషులు మాత్రమె కాదు రెండు కుటుంబాల కలయిక వివాహం . 
వివాహాలు 8 రకాలని మను ధర్మ శాస్త్రం లో చెప్పబడింది . అవి 

1.భ్రహ్మ వివాహం ; 

          పెళ్లి కుమార్తె తండ్రి తనకు నచ్చిన మంచి విజ్ఞానము ,నడవడి కలిగిన యువకుడిని అల్లుడిగా ఎంపిక చేస్తాడు . పెళ్లి కూతురికి వరుడి ఎంపికలో స్వేచ్చ వుండదు . దీనిలో కన్యాదానం ,అగ్నిహోమం ,సప్తపది ,వేద మంత్రోచ్చరణల మద్య వివాహం జరుగుతుంది . 

2 . ప్రజాపత్యము ; 
          ఈ పద్దతిలో వరుడ్ని కన్యాదాత తగిన రీతిని సత్కరించి , వధూవరులిద్దరిని ధర్మ సంస్థాపన కొరకు పూనుకొమ్మని చెప్పి వారి చేత ప్రమాణం చేయిన్చితరువాత వివాహము జరిపిస్తాడు . 
భ్రహ్మ వివాహం,ప్రాజాపత్యము రెండు దగ్గరగా వుంటాయి . 

3. ఆర్ష వివాహం ; 

ఈ పద్దతిలో వధువు తండ్రి వరుడు నుండి ఆవు ,ఎద్దుల జతను కానుకగా తీసుకొని తన కుమార్తెను అతనికి ఇచ్చి వివాహం చేస్తాడు . ఇది కన్యాశుల్కం క్రింద వస్తుంది .

4. దైవ వివాహం ; 

 యజ్ఞ యాగాదులు చేసేవారు తమ కుమార్తెను పురోహితునకు ఇచ్చి వివాహం చేయడాన్ని దైవ వివాహం అంటారు 

5 గాందర్వ వివాహం ; 

      గాందర్వ వివాహం (నేటి ప్రేమ వివాహాలు )లో పెద్దల ప్రమేయం లేకుండా ఇష్టపడి వివాహం చేసుకోవడం . దీనిలో స్త్రీ ,పురుషులిద్దరికీ స్వేచ్చ వుంటుంది . 
   దీనిలో స్త్రీ పురుషులు నచ్చిన వారిని పంచ భూతాల సాక్షిగా వివాహం చేసుకుంటారు . ఉదా ; శకుంతల -దుష్యంతులు ,సావిత్రి -సత్యవంతులు . 

6. అసుర వివాహం ; 

వరుడు కొంత ధనాన్ని , వధువు తండ్రికి ఇచ్చి వధువును వివాహం చేసుకుంటాడు . దీనినే కన్యా శుల్కం అంటారు . దీనికి ఆశ పడి ఒకానొక సమయంలో తమ కుమార్తెలను పండు ముసలి వారికి కుడా ఇచ్చి వివాహం చేసారు . 

7. రాక్షస వివాహం ; 

దీనిలో వరుడు కన్యను ఎత్తుకుపోయి , లేదా కన్య తరుపు వారిని యుద్దంలో ఓడించి వివాహం చేసుకుంటాడు . 
ఉదా ; రుక్మిణి దేవి ని శ్రీకృష్ణుడు ,అర్జునుడు సుభద్రను ఈ విధం గానే వివాహం చేసుకున్నారు . 

8 . పైసాచికం ; 

నిద్రిస్తున్న లేదా మత్తుమందులు సేవించిన యువతిని వివాహం చేసుకోవడాన్ని పైసాచికం అంటారు . ఈ పద్దతిని మనువు నిషేదించాడు .  





                                 ఇతి సమాప్తః 

                                                                                                                    శశి 

                                                                                                ఎం . ఎ తెలుగు ,తెలుగు పండితులు . 















Saturday, 27 February 2016

సంధి

                                           సంధి 

                                                          గుణ సంధి 

సూత్రం ; అ కారమునకు ఇ ,ఉ ,ఋ లు పరమగునపుడు క్రమముగా ఎ ,ఓ ,అర్ లు వచ్చును . 
అనగా అకారమునకు ఇ పరమగునపుడు ఎ కారము ,అ కారమునకు ఉ కారము పరమగునపుడు ఓ కారము ,అ కారమునకు ఋ పరమగునపుడు అర్ లు వస్తాయి . 
                    అ +ఇ =ఎ 
                    అ +ఉ =ఓ 
                    అ +ఋ =అర్ 
ఉదా ; దేవ +ఇంద్రుడు =దేవేంద్రుడు 
          పురుష +ఉత్తముడు =పురుషోత్తముడు 
          రాజ +ఋషి =రాజర్షి 
                                  

                                                        యణాదేశ సంధి 

సూత్రం ; ఇ ,ఉ,ఋ లకు అసవర్ణ అచ్చులు పరమగునపుడు క్రమముగా య ,వ ర లు ఆదేశముగా వస్తాయి . 
అసవర్ణములు అనగా సవర్ణములు కానివి అని అర్దము . సవర్నములు అనగా అవే వర్ణములు . అసవర్ణములు అనగా అవి కాక తక్కిన వర్ణములు . 
ఉదా ; హరి +అక్షరము =హర్యక్షరము (ఇ +అ =య) 
         గురు +అర్ధము =గుర్వర్ధము (ఉ +అ =వ )
         పితృ +ఆజ్ఞ =పిత్రాజ్ఞ (ఋ +అ =ర )

                                                            వృద్ధి సంధి 

సూత్రం ; అ కారమునకు ఎ ,ఐ లు పరమగునపుడు ఐ కారము , ఓ ,ఔ లు పరమగునపుడు ఔ కారము ఎకాదేశాముగా వచ్చును . 
అ, ఐ ,ఔ లకు వృద్దులు అని పేరు . 
                                అ +ఎ =ఐ 
                                అ +ఐ =ఐ 
                                అ +ఒ =ఔ 
                                 అ +ఔ =ఔ 
ఉదా ; భీష్మ +ఏకాదశి =భీష్మై కాదశి అ +ఎ =ఐ )
          సర్వ +ఐక్యము =సర్వై క్యము (అ +ఐ =ఐ )
          జల +ఓఘము =జలౌ ఘము (అ +ఓ =ఔ )
          మహా +ఔ దార్యము =మహౌ దార్యము (అ +ఔ =ఔ )




                                                                                                                             శశి 

                                                                                                           ఎం .ఎ తెలుగు ,తెలుగు పండితులు 








Friday, 26 February 2016

సంధి

                                               సంధి 

సంధి అనగా కలయిక అని అర్ధం . అనగా రెండు పదాలు కలసి ఒక పదం గా ఏర్పడటాన్ని సంధి అంటారు . మనం నిత్యం మాట్లాడునప్పుడు సాధారణం గా ఉచ్చారణా తొందరలో కొన్ని పదాలను కలిపి పలుకుతుంటాము అదే సంధి రూపం . 
ఉదా ; చెల్లేది (చెల్లి +ఏది ),తమ్ముడెక్కడ (తమ్ముడు +ఎక్కడ ). 

సూత్రం ; పూర్వ ,పర స్వరంబులు పరస్పరం ఎకాదేశంబయిన సంది అగును . 

ఉదా ; రామాలయం =రామ +ఆలయం 
                               /              \
                    పూర్వపదం        పరపదం లేదా వుత్తరపదం 
సంధి పూర్వ పద చివరి అక్షరానికి , పర పద మొదటి అక్షరానికి  జరుగుతుంది . 



హల్లులు ఏవి స్వయం రూపాలు కావు పొల్లులు +అచ్చుల కలయిక వల్ల హల్లులు ఏర్పడతాయి . అనగా 
                                   క్ +అ =క 
                                   గ్ +ఇ =గి 
                                   చ్ +ఉ =చు 
                                  ట్ +ఎ =టె 
ఈ విధం గా హల్లులు అన్ని అచ్చుల కలయిక తో ఏర్పడినవే . అనగా 'క 'లో ఆకారం వుంది . ఛి లో ఇ కారం వుంది . 
ఇప్పుడు మనం కొన్ని సందుల గురించి తెలుసుకుందాం . ముందుగా కొన్ని సంస్కృత సంధుల గురించి తెలుసుకుందాం  . తెలుగు అని చెబుతూ సంస్కృత సందులేమిటా అని మీకు అనుమానం రావచ్చు . కారణమేమనగా 
రామాయణ భారతాలు , అష్టా దశ పురాణాలు అన్నీ కూడా ముందుగా సంస్కృతంలో రచించబడ్డాయి . వాటిని మన కవులు తెలుగు లోకి అనువదించారు . ఆ క్రమంలో  నియమాల కారణం గానో , లేక ఆ పదం మన కవులకు బాగా నచ్చడం చేతో, లేక ఆ కవి మీద ఉన్న అభిమానం తోనో కొన్ని సంస్కృత పదాలను అనువదించాకుండానే యధాతధం గా రాశారు ఆ విధం గా మన తెలుగు గ్రంధాలలో అనేక సంస్కృత పదాలు గ్రంధస్థం కాబడ్డాయి . అటువంటి సంస్కృత పదాలతో ఏర్పడిన సందులు సంస్కృత సందులు . తెలుగు పదాలతో ఏర్పడే సందులు తెలుగు సంధులు . 

                                                    సవర్ణ దీర్ఘ సంధి 

 సూత్రం ; అ , ఇ ,ఉ , ఋ లకు సవర్ణాచ్చులు పరమగునపుడు  దీర్గాములేకాదేశామగును . 
స వర్ణాలు అనగా అవే వర్ణాలు అని అర్ధం . అనగా 
         క (క్ +అ )+అ =కా .   ఆకారానికి, అ పరమవడం వల్ల దీర్గం వచ్చింది 
        గి (గ్ +ఇ )+ఇ =గీ . ఇకారానికి, ఇ పరమవడం వల్ల దీర్గం వచ్చింది . 
         చు (చ్ +ఉ )+ఉ =చూ.   వుకారానికి ,ఉ పరమవడం వల్ల దీర్ఘం వచ్చింది . 
        కృ (క్ +ఋ )+ఋ =ఋ . ఋ కారానికి ఋ పరమవడం వల్ల దీర్గం వచ్చింది . 
స వర్ణాలు పమవడం వల్ల దీర్గం వస్తోంది కావున ఇది సవర్ణ దీర్ఘ సంధి . 
ఉదా ;        ధర +అధినాదులు =దరాధినాదులు 
                 గౌరి +ఈశ =గౌరీశ 
                 గురు +ఉపదేశం =గురూపదేశం 



                                                                                                                        శశి 

                                                                                                              ఎం . ఎ , తెలుగు పండితులు . 
             

















Thursday, 25 February 2016

వినాయకుడి పూజకి తులసి నిషిద్దం

                        వినాయకుడి పూజకు తులసి నిషిద్దం 


వినాయక చవితి రోజున బొజ్జ గణపయ్యని వివిధ పత్రాలతో పోటా పోటీగా పూజ చేస్తారు . కాని వాటిలో తులసి ఉపయోగించరాదు . కారణమేమనగా ఒక పర్యాయం గంగా నదీ తీరంలో గణ నాధుడు విహరించు సమయమున ధర్మద్వజ యువరాణి శివ పుత్రుడిని చూసి మోహించి వివాహం చేసుకోమని కోరగా ,అందులకు ఆయన కాదనడంతో ఆమె కోపించి దీర్ఘకాలం భ్రహ్మ చారిగా ఉండమని శపించింది . ప్రతిగా పార్వతీ పుత్రుడు ఆమెను రాక్షసుని చెంత దీర్ఘకాలం ఉండమని శపించాడు . లంబోదరుడి శాపానికి చింతించి ధర్మద్వజ రాజకుమార్తె స్వామిని మన్నించమని అర్దించగా విఘ్నేశ్వరుడు శాంతించి రాక్షసుడి చెంత కొంత కాలం ఉండి ,తరువాత పవిత్రమయిన తులసిగా జన్మిస్తావు అని వరం ఇచ్చాడు . 
కావున వినాయకుడికి  తులసిని తన పూజలోవినియోగించుట  ఇష్టముండదు . 




                                                                                                                                  శశి 
                                                                                                       ఎం . ఎ ,తెలుగు పండితులు . 

Wednesday, 24 February 2016

కవిత్రయం

                                        కవిత్రయం 

వేద వ్యాసుడు సంస్కృతం లో రచించిన శ్రీమదాంధ్ర మహా భారతాన్ని నన్నయ ,తిక్కన ,ఎఱ్ఱన తెలుగులో అనువదించారు . కావున ఈ ముగ్గురికి కవిత్రయం అని పేరు వచ్చింది . కవిత్రయంలో మొదటివాడు నన్నయ, రెండో వాడు తిక్కన ,మూడోవాడు ఎర్రన . 
నన్నయ ; 
      ఆది కవి నన్నయ 11 వ శతాబ్దానికి చెందినవాడు . రాజమహెంద్రవరాన్ని రాజదానిగా చేసుకుని వేంగి సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజరాజ నరేంద్రుడి ఆస్థానం లో ఉండేవాడు . నన్నయ అవిరల జపహోమ తత్పరుడు ,విపుల శబ్దశాసనుడు ,సంహితాబ్యాసుడు,భ్రహ్మాన్డాడి నానాపురాణ విజ్ఞాన నిరతుడు ,ఆపస్తంబ సూథ్రుదు ,ముద్గల గోత్రజుడు ,లోకజ్ఞుడు ,ఉభయభాషా కావ్య రచనా శోభితుడు . 
రాజరాజ నరేంద్రుడు నన్నయను మహాభారతాన్ని అనువదించమని ప్రోత్సహించాడు . అంతకు పూర్వం తెలుగులో కావ్యాలేవి లేని కారణంగా నన్నయ ఆంద్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రందాన్ని రచించి మహా భారత రచనకు ఉపక్రమించి తనదైన శైలిలో అద్బుతంగా రచించారు . 

రచనా శైలి 

నన్నయ కవిత్వంలో మూడు ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి . అవి 
1. ప్రసన్న కధా కలితార్దాయుక్తి 
2. అక్షరరమ్యత 
3. నానా రుచిరార్ద సూక్థి నిదిత్వం . 
నన్నయ అనువదించినా అందులో వున్నా అనవసరమయిన వర్ణనలను తొలగించాడు ,అవసరం అనుకున్నచోట వర్ణనలను పెంచి పోషించారు . ఎంతో అద్భుతంగా తీర్చి దిద్దారు . ఎన్నో నీతులను కధలలో జొప్పించి మనసుకు హత్తుకునేలా చెప్పారు . అల్లా ఆ మహానుభావుడు 2 పర్వాలు(ఆదిపర్వం,సభాపర్వం ) పూర్తిచేసారు ,మూడవ పర్వమయిన అరణ్యపర్వంలో 4 వ ఆశ్వాసం లో 142 వ పద్యమయిన" శారద రాత్రులుజ్జ్వల "వరకు అనువదించారు . అంతటితో ఆ మహా కవి ఘంటం  ఆగిపోయింది (మరణించారు ). 
రాజరాజ నరేంద్రుడు మహా కావ్యం ఆగిపోకూడదనే ఉద్దేశ్యం తో నన్నయ గారు వ్రాసిన చివరి పద్యాన్ని గుర్రం ముఖానికి తగిలించి గ్రందాన్ని పూర్తి చేసిన వారికి కోరిన భాహుమానాలు ఇస్తానని ప్రచారం చెయించారు. కాని ఎవరు ముందుకు రాలేదు . 
తరువాతి కాలం(12వ శతాబ్దం ) శివకవులది . కుమారసంభవం వంటి అద్భుత కావ్యాలు వచ్చాయి . మొట్టమొదటి శతకం (వృషా దిప శతకం )వచ్చింది . కాని మహా భారత రచన ముందుకు సాగలేదు 

తిక్కన ; 


తరువాతి కాలం(13 వ శతాబ్దం ) వాడు తిక్కన . నెల్లూరును రాజధానిగా చేసుకుని పరిపాలించిన మనుమసిద్ది ఆస్థానంలో మహా మంత్రిగా ఉండేవాడు . ఈయన రాజకీయ చతురత అంతా అయన రాసిన భారత బాగం చూసినట్లయితే మనకు అర్ధం అవుతుంది . 

ఒకసారి మనుమసిద్ది దయాదులవల్ల రాజ్యాన్ని కోల్పోగా కాకతీయ రాజయిన గణపతి దేవుడిని తన ప్రతిభా పాటవాలతో మెప్పించి ఆయన సాయం తో మనుమసిద్ది రాజ్యం తిరిగి వచ్చేలా చేసాడు . అంతటి గొప్ప ప్రతిభా పాటవాలు కలవాడు తిక్కన . ఈయన మహాభారత  రచనకు ఉపక్రమించే ముందు సోమయాగం చేసి పునీతుడు అయి అప్పుడు భారత రచన మొదలపెట్టారు .  ఈయనకు కవిభ్రహ్మ ఉభయకవి మిత్రుడు అనే భిరుదులు వున్నాయి . తరువాత అనీక మంది కవులకు ఆదర్సప్రాయుడు అయ్యాడు కావున కవిభ్రహ్మ,సంస్కృత, తెలుగు కవుల ను ఇద్దరినీ తన కవితా పాండిత్యం తో మెప్పించగల సామర్ద్యం కలవాడు కావున ఉభయకవి మిత్రుడు భిరుదులు సార్దకమయ్యాయి . తిక్కన గారిది పాత గుంటూరు . ఇప్పటికి ఆయన ఇంటిని మనం అక్కడ దర్శించవచ్చు . ఈయన తాత భాస్కర మంత్రి , అన్నమ, కొమ్మన మంత్రి తల్లి తండ్రులు . తిక్కన కాలంలో శివ కేశవుల భక్తులలో మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అనే బేదాభిప్రాయాలు చాలా ఎక్కువుగా ఉండేవి . సమాజం అల్లకల్లోలం గా వుండేది . ఈ భేదాలు తొలగిపోవాలనే ఉద్దేశ్యంతో తిక్కన గారు హరిహరనాదుడనే దేవుడిని సృష్టించి తాను రాసిన మహా భారత గ్రందాన్ని ఆయనకే అంకితం ఇచ్చాడు . తిక్కన గారు నన్నయ గారు మద్యలో వదిలివేసిన అరణ్య పర్వ శేషాన్ని వదిలి విరాట పర్వం మొదలుకుని స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం 15 పర్వాలను నిర్వుఘ్నంగా రచించారు . ఈయన రాసిన భారతం అద్వితీయం . కావునే అనేకమంది కవులకు ఆదర్సప్రాయుడు అయాడు . 

                                                ఎఱ్ఱన 
తరువాతి కాలం (14 వ శతాబ్దం )వాడుఎఱ్ఱన .  అద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానం లోని వాడు . ఈయన రెండు ముక్కలుగా ఉండిపోయిన మహాభారతాన్ని అరణ్యపర్వ శేషాన్ని పూర్తి చేయడం ద్వారా ఏకం చేసారు . ఈయన రాసినది పర్వం లో అర భాగమే అయినా అటు నన్నయ గారి కవితా శైలిని అందుకుంటూ ఇటు తిక్కన గారి రచనా విధానానికి చక్కగా సరిపోయేలా మద్య భాగాన్ని రచించడం అంత తేలికయిన విషయమేమీ కాదు . అనితర సాద్యమయినది . ఎఱ్ఱన గారిది ఇప్పటి ప్రకాశం జిల్లాలోని గుడ్లూరు గ్రామం . ఈయన తల్లితండ్రులు పోతమామ్బికా ,సురనార్యులు . ఈయన పితామహుడు పోతన సూరి . ఎర్రన గారు అరణ్య పర్వ శేషమే కాక హరివంశం ,నృశింహ పురాణాలను రచించారు . 

భిరుదులు 

ఎర్రన గారికి శంభు దాసుడు , ప్రభంద పరమేశ్వరుడు అనే భిరుదులు కలవు . 



సమాప్తం 



                                                                                                                  శశి 




Tuesday, 23 February 2016

దీపారాధన

                                దీపారాధన 

దీపారాధన వెండి ,ఇత్తడి,రాగి,లేదా మట్టి ప్రమిదల్లో చేయవచ్చు .స్టీలు కుందులలో దీపారాధన చేయరాదు .  రెండు వత్తులు కచ్చితం గా వుండాలి . ఏక వత్తి వెలిగించుట  మహా దోషము. ఏక వత్తిని శవం వద్ద వెలిగిస్తారు .  
పరమేశ్వరునికి  ఎడమవైపు ,విష్ణు మూర్తికి కుడివైపు దీపాన్ని ఉంచాలి . ఎదురుగా వుంచరాదు . నిత్య దీపారాధన సకల శుభప్రదం .  దీపాన్ని అగరవత్తి తో వెలిగించాలి అగ్గిపుల్లతో వెలిగించరాదు . తామర వత్తుల(తమర పూవు కాదను విరిచి దానిని నలిపి పొడుగ్గా దరాలలా విడదీసి నీడలో 7 రోజులు ఆరబెట్టి వాటిని మామూలు వత్తి మద్యలో పెట్టి తయారు చేసిన వత్తి )తో దీపారాధన లక్ష్మి దేవికి అత్యంత ప్రీతికరం . రోజు దీపారాధన చేయడం వల్ల దుష్ట శక్తులు దరిచేరవు . రోజు ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేయాలి . ఒక్కోసారి దీపారాధన చేయడం కుదరకపోవచ్చు . అలాంటి దోషాలు నివృత్తి అయ్యేందుకు గాను కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులు వెలిగిస్తారు . దీపారాధన కొన్దేక్కితే 108 సార్లు ఓం నమః శివాయ మంత్రాన్ని జపించి తిరిగి దీపారాధన చేయవలెను . 


                                          సర్వే జనాం సుఖినో భవంతు . 




                                                                                                                         శశి