Wednesday 24 February 2016

కవిత్రయం

                                        కవిత్రయం 

వేద వ్యాసుడు సంస్కృతం లో రచించిన శ్రీమదాంధ్ర మహా భారతాన్ని నన్నయ ,తిక్కన ,ఎఱ్ఱన తెలుగులో అనువదించారు . కావున ఈ ముగ్గురికి కవిత్రయం అని పేరు వచ్చింది . కవిత్రయంలో మొదటివాడు నన్నయ, రెండో వాడు తిక్కన ,మూడోవాడు ఎర్రన . 
నన్నయ ; 
      ఆది కవి నన్నయ 11 వ శతాబ్దానికి చెందినవాడు . రాజమహెంద్రవరాన్ని రాజదానిగా చేసుకుని వేంగి సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజరాజ నరేంద్రుడి ఆస్థానం లో ఉండేవాడు . నన్నయ అవిరల జపహోమ తత్పరుడు ,విపుల శబ్దశాసనుడు ,సంహితాబ్యాసుడు,భ్రహ్మాన్డాడి నానాపురాణ విజ్ఞాన నిరతుడు ,ఆపస్తంబ సూథ్రుదు ,ముద్గల గోత్రజుడు ,లోకజ్ఞుడు ,ఉభయభాషా కావ్య రచనా శోభితుడు . 
రాజరాజ నరేంద్రుడు నన్నయను మహాభారతాన్ని అనువదించమని ప్రోత్సహించాడు . అంతకు పూర్వం తెలుగులో కావ్యాలేవి లేని కారణంగా నన్నయ ఆంద్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రందాన్ని రచించి మహా భారత రచనకు ఉపక్రమించి తనదైన శైలిలో అద్బుతంగా రచించారు . 

రచనా శైలి 

నన్నయ కవిత్వంలో మూడు ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి . అవి 
1. ప్రసన్న కధా కలితార్దాయుక్తి 
2. అక్షరరమ్యత 
3. నానా రుచిరార్ద సూక్థి నిదిత్వం . 
నన్నయ అనువదించినా అందులో వున్నా అనవసరమయిన వర్ణనలను తొలగించాడు ,అవసరం అనుకున్నచోట వర్ణనలను పెంచి పోషించారు . ఎంతో అద్భుతంగా తీర్చి దిద్దారు . ఎన్నో నీతులను కధలలో జొప్పించి మనసుకు హత్తుకునేలా చెప్పారు . అల్లా ఆ మహానుభావుడు 2 పర్వాలు(ఆదిపర్వం,సభాపర్వం ) పూర్తిచేసారు ,మూడవ పర్వమయిన అరణ్యపర్వంలో 4 వ ఆశ్వాసం లో 142 వ పద్యమయిన" శారద రాత్రులుజ్జ్వల "వరకు అనువదించారు . అంతటితో ఆ మహా కవి ఘంటం  ఆగిపోయింది (మరణించారు ). 
రాజరాజ నరేంద్రుడు మహా కావ్యం ఆగిపోకూడదనే ఉద్దేశ్యం తో నన్నయ గారు వ్రాసిన చివరి పద్యాన్ని గుర్రం ముఖానికి తగిలించి గ్రందాన్ని పూర్తి చేసిన వారికి కోరిన భాహుమానాలు ఇస్తానని ప్రచారం చెయించారు. కాని ఎవరు ముందుకు రాలేదు . 
తరువాతి కాలం(12వ శతాబ్దం ) శివకవులది . కుమారసంభవం వంటి అద్భుత కావ్యాలు వచ్చాయి . మొట్టమొదటి శతకం (వృషా దిప శతకం )వచ్చింది . కాని మహా భారత రచన ముందుకు సాగలేదు 

తిక్కన ; 


తరువాతి కాలం(13 వ శతాబ్దం ) వాడు తిక్కన . నెల్లూరును రాజధానిగా చేసుకుని పరిపాలించిన మనుమసిద్ది ఆస్థానంలో మహా మంత్రిగా ఉండేవాడు . ఈయన రాజకీయ చతురత అంతా అయన రాసిన భారత బాగం చూసినట్లయితే మనకు అర్ధం అవుతుంది . 

ఒకసారి మనుమసిద్ది దయాదులవల్ల రాజ్యాన్ని కోల్పోగా కాకతీయ రాజయిన గణపతి దేవుడిని తన ప్రతిభా పాటవాలతో మెప్పించి ఆయన సాయం తో మనుమసిద్ది రాజ్యం తిరిగి వచ్చేలా చేసాడు . అంతటి గొప్ప ప్రతిభా పాటవాలు కలవాడు తిక్కన . ఈయన మహాభారత  రచనకు ఉపక్రమించే ముందు సోమయాగం చేసి పునీతుడు అయి అప్పుడు భారత రచన మొదలపెట్టారు .  ఈయనకు కవిభ్రహ్మ ఉభయకవి మిత్రుడు అనే భిరుదులు వున్నాయి . తరువాత అనీక మంది కవులకు ఆదర్సప్రాయుడు అయ్యాడు కావున కవిభ్రహ్మ,సంస్కృత, తెలుగు కవుల ను ఇద్దరినీ తన కవితా పాండిత్యం తో మెప్పించగల సామర్ద్యం కలవాడు కావున ఉభయకవి మిత్రుడు భిరుదులు సార్దకమయ్యాయి . తిక్కన గారిది పాత గుంటూరు . ఇప్పటికి ఆయన ఇంటిని మనం అక్కడ దర్శించవచ్చు . ఈయన తాత భాస్కర మంత్రి , అన్నమ, కొమ్మన మంత్రి తల్లి తండ్రులు . తిక్కన కాలంలో శివ కేశవుల భక్తులలో మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అనే బేదాభిప్రాయాలు చాలా ఎక్కువుగా ఉండేవి . సమాజం అల్లకల్లోలం గా వుండేది . ఈ భేదాలు తొలగిపోవాలనే ఉద్దేశ్యంతో తిక్కన గారు హరిహరనాదుడనే దేవుడిని సృష్టించి తాను రాసిన మహా భారత గ్రందాన్ని ఆయనకే అంకితం ఇచ్చాడు . తిక్కన గారు నన్నయ గారు మద్యలో వదిలివేసిన అరణ్య పర్వ శేషాన్ని వదిలి విరాట పర్వం మొదలుకుని స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం 15 పర్వాలను నిర్వుఘ్నంగా రచించారు . ఈయన రాసిన భారతం అద్వితీయం . కావునే అనేకమంది కవులకు ఆదర్సప్రాయుడు అయాడు . 

                                                ఎఱ్ఱన 
తరువాతి కాలం (14 వ శతాబ్దం )వాడుఎఱ్ఱన .  అద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానం లోని వాడు . ఈయన రెండు ముక్కలుగా ఉండిపోయిన మహాభారతాన్ని అరణ్యపర్వ శేషాన్ని పూర్తి చేయడం ద్వారా ఏకం చేసారు . ఈయన రాసినది పర్వం లో అర భాగమే అయినా అటు నన్నయ గారి కవితా శైలిని అందుకుంటూ ఇటు తిక్కన గారి రచనా విధానానికి చక్కగా సరిపోయేలా మద్య భాగాన్ని రచించడం అంత తేలికయిన విషయమేమీ కాదు . అనితర సాద్యమయినది . ఎఱ్ఱన గారిది ఇప్పటి ప్రకాశం జిల్లాలోని గుడ్లూరు గ్రామం . ఈయన తల్లితండ్రులు పోతమామ్బికా ,సురనార్యులు . ఈయన పితామహుడు పోతన సూరి . ఎర్రన గారు అరణ్య పర్వ శేషమే కాక హరివంశం ,నృశింహ పురాణాలను రచించారు . 

భిరుదులు 

ఎర్రన గారికి శంభు దాసుడు , ప్రభంద పరమేశ్వరుడు అనే భిరుదులు కలవు . 



సమాప్తం 



                                                                                                                  శశి 




4 comments: