సంధి
సంధి అనగా కలయిక అని అర్ధం . అనగా రెండు పదాలు కలసి ఒక పదం గా ఏర్పడటాన్ని సంధి అంటారు . మనం నిత్యం మాట్లాడునప్పుడు సాధారణం గా ఉచ్చారణా తొందరలో కొన్ని పదాలను కలిపి పలుకుతుంటాము అదే సంధి రూపం .
ఉదా ; చెల్లేది (చెల్లి +ఏది ),తమ్ముడెక్కడ (తమ్ముడు +ఎక్కడ ).
సూత్రం ; పూర్వ ,పర స్వరంబులు పరస్పరం ఎకాదేశంబయిన సంది అగును .
ఉదా ; రామాలయం =రామ +ఆలయం
/ \
పూర్వపదం పరపదం లేదా వుత్తరపదం
సంధి పూర్వ పద చివరి అక్షరానికి , పర పద మొదటి అక్షరానికి జరుగుతుంది .
హల్లులు ఏవి స్వయం రూపాలు కావు పొల్లులు +అచ్చుల కలయిక వల్ల హల్లులు ఏర్పడతాయి . అనగా
క్ +అ =క
గ్ +ఇ =గి
చ్ +ఉ =చు
ట్ +ఎ =టె
ఈ విధం గా హల్లులు అన్ని అచ్చుల కలయిక తో ఏర్పడినవే . అనగా 'క 'లో ఆకారం వుంది . ఛి లో ఇ కారం వుంది .
ఇప్పుడు మనం కొన్ని సందుల గురించి తెలుసుకుందాం . ముందుగా కొన్ని సంస్కృత సంధుల గురించి తెలుసుకుందాం . తెలుగు అని చెబుతూ సంస్కృత సందులేమిటా అని మీకు అనుమానం రావచ్చు . కారణమేమనగా
రామాయణ భారతాలు , అష్టా దశ పురాణాలు అన్నీ కూడా ముందుగా సంస్కృతంలో రచించబడ్డాయి . వాటిని మన కవులు తెలుగు లోకి అనువదించారు . ఆ క్రమంలో నియమాల కారణం గానో , లేక ఆ పదం మన కవులకు బాగా నచ్చడం చేతో, లేక ఆ కవి మీద ఉన్న అభిమానం తోనో కొన్ని సంస్కృత పదాలను అనువదించాకుండానే యధాతధం గా రాశారు ఆ విధం గా మన తెలుగు గ్రంధాలలో అనేక సంస్కృత పదాలు గ్రంధస్థం కాబడ్డాయి . అటువంటి సంస్కృత పదాలతో ఏర్పడిన సందులు సంస్కృత సందులు . తెలుగు పదాలతో ఏర్పడే సందులు తెలుగు సంధులు .
సవర్ణ దీర్ఘ సంధి
సూత్రం ; అ , ఇ ,ఉ , ఋ లకు సవర్ణాచ్చులు పరమగునపుడు దీర్గాములేకాదేశామగును .
స వర్ణాలు అనగా అవే వర్ణాలు అని అర్ధం . అనగా
క (క్ +అ )+అ =కా . ఆకారానికి, అ పరమవడం వల్ల దీర్గం వచ్చింది
గి (గ్ +ఇ )+ఇ =గీ . ఇకారానికి, ఇ పరమవడం వల్ల దీర్గం వచ్చింది .
చు (చ్ +ఉ )+ఉ =చూ. వుకారానికి ,ఉ పరమవడం వల్ల దీర్ఘం వచ్చింది .
కృ (క్ +ఋ )+ఋ =ఋ . ఋ కారానికి ఋ పరమవడం వల్ల దీర్గం వచ్చింది .
స వర్ణాలు పమవడం వల్ల దీర్గం వస్తోంది కావున ఇది సవర్ణ దీర్ఘ సంధి .
ఉదా ; ధర +అధినాదులు =దరాధినాదులు
గౌరి +ఈశ =గౌరీశ
గురు +ఉపదేశం =గురూపదేశం
శశి
ఎం . ఎ , తెలుగు పండితులు .
No comments:
Post a Comment