రామాయణము
అయోధ్యకాండ- నూటఅయిదవసర్గ
పురుషశ్రేష్ఠులైన రామలక్ష్మణభరతశత్రుఘ్నులు బంధుమిత్రులతో కూడి పితృవియోగముతో తపిస్తూ ఉండగా ఆ రాత్రి గడిచెను . తెల్లవారగానే భరతుడు అన్నను ఒప్పించి అయోధ్యకు తీసుకువెళ్లవలననే కోరికతో శ్రీరాముని తన మాటలతో ఒప్పించుటకు యత్నించెను . కానీ శ్రీరాముడు ఒప్పుకొనక 'భరతా !మనుషులు దేవతల వలె ఇష్టాచరులు కారు . నన్ను తండ్రి వనములలో 14ఏండ్లు ఉండమని ఆజ్ఞాపించినారు కావున ఆ సమయము గడవక ముందే నేను అయోధ్యలోకి రాలేను . నీవుకూడా తండ్రి ఆజ్ఞప్రకారం అయోధ్యకు రాజువయి పాలించు . మన తండ్రి మిక్కిలి పుణ్యాత్ముడు అతడు అనేక పుణ్యకార్యములు ,యాగములు చేసి ఉన్నతలోకములకు చేరినాడు . కావున ఆయనను గూర్చి చింతించక రాజ్యమును పాలించుము "అని పలికి ఒక్క క్షణము మౌనము వహించెను .
రామాయణము అయోధ్యకాండ నూటఅయిదవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment