Monday 29 February 2016

లలితా సహస్ర నామ ఫలం

లలితా సహస్ర నామ ఫలం  

ప్రతి రోజు లలితా సహస్ర నామాన్ని చదవడం మహా ఫలం . అలా వీలుకాని వారు శుక్రువారం చదివితే మంచిదే . 
అనగా లలితా దేవి కొంతకాలం కదంబ వనం లో నివసించింది . ఆవిడకు కదంబ వనం అంటే చాలా ఇష్టం . కావున కదంబ వృక్షం కింద కుర్చుని 11 రోజులు గాని 21 రోజులు కాని లలితా సహస్ర నామాన్ని పారాయణం చేస్తే పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుంది . మరియు అనుకున్న కార్యాలు తప్పక జరుగుతాయి . 
కదంబ పుష్పం 
ఆస్థి అనగా ఎముకలు . ఈ మంత్రాన్ని ఎముకలు విరిగిన వారు రోజు 108 సార్లు జపం చేసి నానపెట్టిన పెసలు అమ్మ కు నైవేద్యం పెడితే ఎముకలు చాలా త్వరగా సరవుతాయి . బందులు అయిన ఈ మంత్ర జపం చేసి తీర్ధాన్ని ఇచ్చినా ఎముకలు సరి అవుతాయి . 
పుణ్య ఘడియల్లో ,పుణ్య తిదులలో లలితా సహస్ర నామ పారాయణ పలితం ఎన్నో రెట్లు ఎక్కువగా లభిస్తుంది . అలాగే కుటుంభ సబ్యుల జన్మ నక్షత్ర సమయాల్లో చదివితే కుటుంభ శాంతి . పౌర్ణమి రోజు చంద్రుడిని చూస్తూ చదవడం వల్ల సాక్షాత్ లలితాదేవి ఎదురుగా చదివన పలితం కలుగుతుంది . 
లలితాదేవికి కలువలు ,మారేడు దళాలు ,తులసి దళాలు,మల్లెపూలు ఇష్టం . వాటితో పూజిస్తే అమ్మ త్వరగా ప్రసంనమవుతుంది . అలాగే నైవేద్యముగా పాయసము ,పులగము,చిత్రాన్నము (పులిహోర )దానిమ్మ,బూడిద గుమ్మడికాయ ప్రీతీ . 
కావున పూజకు పిదప  లలితాదేవికి పైన చెప్పినవి నైవేద్యము పెట్టిన సకల శుభ ప్రదం . 

   లలితాదేవ్యయై నమః 

                                                                                                        శశి 
                                                                                   ఎం . ఎ తెలుగు ,తెలుగు పండితులు  














Sunday 28 February 2016

వివాహ రకాలు

         వివాహ రకాలు 

వివాహం అనగా రెండు నిండు జీవితాల కలయిక . వేరు వేరు పరిస్థితులలో పెరిగిన ఇద్దరు మాంగల్యం తో ,వేద మంత్ర ఘోషతో , అగ్ని సాక్షిగా ఒకటై కొత్త జీవితానికి పునాది వేయడం . 
  మాంగల్యం తంతునా నేనా మమ  జీవన జీవన హేతున కంటే బాధ్రామి సుభగే త్వం జీవ శరదాం శతం . 
మాంగల్యం ద్వారా మా జీవితం 100 సంవత్సరాలు సుఖ సంతోషాలతో కళకళ లాడాలి అని పై మంత్రానికి అర్ధం . 
కేవలం ఇద్దరు మనుషులు మాత్రమె కాదు రెండు కుటుంబాల కలయిక వివాహం . 
వివాహాలు 8 రకాలని మను ధర్మ శాస్త్రం లో చెప్పబడింది . అవి 

1.భ్రహ్మ వివాహం ; 

          పెళ్లి కుమార్తె తండ్రి తనకు నచ్చిన మంచి విజ్ఞానము ,నడవడి కలిగిన యువకుడిని అల్లుడిగా ఎంపిక చేస్తాడు . పెళ్లి కూతురికి వరుడి ఎంపికలో స్వేచ్చ వుండదు . దీనిలో కన్యాదానం ,అగ్నిహోమం ,సప్తపది ,వేద మంత్రోచ్చరణల మద్య వివాహం జరుగుతుంది . 

2 . ప్రజాపత్యము ; 
          ఈ పద్దతిలో వరుడ్ని కన్యాదాత తగిన రీతిని సత్కరించి , వధూవరులిద్దరిని ధర్మ సంస్థాపన కొరకు పూనుకొమ్మని చెప్పి వారి చేత ప్రమాణం చేయిన్చితరువాత వివాహము జరిపిస్తాడు . 
భ్రహ్మ వివాహం,ప్రాజాపత్యము రెండు దగ్గరగా వుంటాయి . 

3. ఆర్ష వివాహం ; 

ఈ పద్దతిలో వధువు తండ్రి వరుడు నుండి ఆవు ,ఎద్దుల జతను కానుకగా తీసుకొని తన కుమార్తెను అతనికి ఇచ్చి వివాహం చేస్తాడు . ఇది కన్యాశుల్కం క్రింద వస్తుంది .

4. దైవ వివాహం ; 

 యజ్ఞ యాగాదులు చేసేవారు తమ కుమార్తెను పురోహితునకు ఇచ్చి వివాహం చేయడాన్ని దైవ వివాహం అంటారు 

5 గాందర్వ వివాహం ; 

      గాందర్వ వివాహం (నేటి ప్రేమ వివాహాలు )లో పెద్దల ప్రమేయం లేకుండా ఇష్టపడి వివాహం చేసుకోవడం . దీనిలో స్త్రీ ,పురుషులిద్దరికీ స్వేచ్చ వుంటుంది . 
   దీనిలో స్త్రీ పురుషులు నచ్చిన వారిని పంచ భూతాల సాక్షిగా వివాహం చేసుకుంటారు . ఉదా ; శకుంతల -దుష్యంతులు ,సావిత్రి -సత్యవంతులు . 

6. అసుర వివాహం ; 

వరుడు కొంత ధనాన్ని , వధువు తండ్రికి ఇచ్చి వధువును వివాహం చేసుకుంటాడు . దీనినే కన్యా శుల్కం అంటారు . దీనికి ఆశ పడి ఒకానొక సమయంలో తమ కుమార్తెలను పండు ముసలి వారికి కుడా ఇచ్చి వివాహం చేసారు . 

7. రాక్షస వివాహం ; 

దీనిలో వరుడు కన్యను ఎత్తుకుపోయి , లేదా కన్య తరుపు వారిని యుద్దంలో ఓడించి వివాహం చేసుకుంటాడు . 
ఉదా ; రుక్మిణి దేవి ని శ్రీకృష్ణుడు ,అర్జునుడు సుభద్రను ఈ విధం గానే వివాహం చేసుకున్నారు . 

8 . పైసాచికం ; 

నిద్రిస్తున్న లేదా మత్తుమందులు సేవించిన యువతిని వివాహం చేసుకోవడాన్ని పైసాచికం అంటారు . ఈ పద్దతిని మనువు నిషేదించాడు .  





                                 ఇతి సమాప్తః 

                                                                                                                    శశి 

                                                                                                ఎం . ఎ తెలుగు ,తెలుగు పండితులు . 















Saturday 27 February 2016

సంధి

                                           సంధి 

                                                          గుణ సంధి 

సూత్రం ; అ కారమునకు ఇ ,ఉ ,ఋ లు పరమగునపుడు క్రమముగా ఎ ,ఓ ,అర్ లు వచ్చును . 
అనగా అకారమునకు ఇ పరమగునపుడు ఎ కారము ,అ కారమునకు ఉ కారము పరమగునపుడు ఓ కారము ,అ కారమునకు ఋ పరమగునపుడు అర్ లు వస్తాయి . 
                    అ +ఇ =ఎ 
                    అ +ఉ =ఓ 
                    అ +ఋ =అర్ 
ఉదా ; దేవ +ఇంద్రుడు =దేవేంద్రుడు 
          పురుష +ఉత్తముడు =పురుషోత్తముడు 
          రాజ +ఋషి =రాజర్షి 
                                  

                                                        యణాదేశ సంధి 

సూత్రం ; ఇ ,ఉ,ఋ లకు అసవర్ణ అచ్చులు పరమగునపుడు క్రమముగా య ,వ ర లు ఆదేశముగా వస్తాయి . 
అసవర్ణములు అనగా సవర్ణములు కానివి అని అర్దము . సవర్నములు అనగా అవే వర్ణములు . అసవర్ణములు అనగా అవి కాక తక్కిన వర్ణములు . 
ఉదా ; హరి +అక్షరము =హర్యక్షరము (ఇ +అ =య) 
         గురు +అర్ధము =గుర్వర్ధము (ఉ +అ =వ )
         పితృ +ఆజ్ఞ =పిత్రాజ్ఞ (ఋ +అ =ర )

                                                            వృద్ధి సంధి 

సూత్రం ; అ కారమునకు ఎ ,ఐ లు పరమగునపుడు ఐ కారము , ఓ ,ఔ లు పరమగునపుడు ఔ కారము ఎకాదేశాముగా వచ్చును . 
అ, ఐ ,ఔ లకు వృద్దులు అని పేరు . 
                                అ +ఎ =ఐ 
                                అ +ఐ =ఐ 
                                అ +ఒ =ఔ 
                                 అ +ఔ =ఔ 
ఉదా ; భీష్మ +ఏకాదశి =భీష్మై కాదశి అ +ఎ =ఐ )
          సర్వ +ఐక్యము =సర్వై క్యము (అ +ఐ =ఐ )
          జల +ఓఘము =జలౌ ఘము (అ +ఓ =ఔ )
          మహా +ఔ దార్యము =మహౌ దార్యము (అ +ఔ =ఔ )




                                                                                                                             శశి 

                                                                                                           ఎం .ఎ తెలుగు ,తెలుగు పండితులు 








Friday 26 February 2016

సంధి

                                               సంధి 

సంధి అనగా కలయిక అని అర్ధం . అనగా రెండు పదాలు కలసి ఒక పదం గా ఏర్పడటాన్ని సంధి అంటారు . మనం నిత్యం మాట్లాడునప్పుడు సాధారణం గా ఉచ్చారణా తొందరలో కొన్ని పదాలను కలిపి పలుకుతుంటాము అదే సంధి రూపం . 
ఉదా ; చెల్లేది (చెల్లి +ఏది ),తమ్ముడెక్కడ (తమ్ముడు +ఎక్కడ ). 

సూత్రం ; పూర్వ ,పర స్వరంబులు పరస్పరం ఎకాదేశంబయిన సంది అగును . 

ఉదా ; రామాలయం =రామ +ఆలయం 
                               /              \
                    పూర్వపదం        పరపదం లేదా వుత్తరపదం 
సంధి పూర్వ పద చివరి అక్షరానికి , పర పద మొదటి అక్షరానికి  జరుగుతుంది . 



హల్లులు ఏవి స్వయం రూపాలు కావు పొల్లులు +అచ్చుల కలయిక వల్ల హల్లులు ఏర్పడతాయి . అనగా 
                                   క్ +అ =క 
                                   గ్ +ఇ =గి 
                                   చ్ +ఉ =చు 
                                  ట్ +ఎ =టె 
ఈ విధం గా హల్లులు అన్ని అచ్చుల కలయిక తో ఏర్పడినవే . అనగా 'క 'లో ఆకారం వుంది . ఛి లో ఇ కారం వుంది . 
ఇప్పుడు మనం కొన్ని సందుల గురించి తెలుసుకుందాం . ముందుగా కొన్ని సంస్కృత సంధుల గురించి తెలుసుకుందాం  . తెలుగు అని చెబుతూ సంస్కృత సందులేమిటా అని మీకు అనుమానం రావచ్చు . కారణమేమనగా 
రామాయణ భారతాలు , అష్టా దశ పురాణాలు అన్నీ కూడా ముందుగా సంస్కృతంలో రచించబడ్డాయి . వాటిని మన కవులు తెలుగు లోకి అనువదించారు . ఆ క్రమంలో  నియమాల కారణం గానో , లేక ఆ పదం మన కవులకు బాగా నచ్చడం చేతో, లేక ఆ కవి మీద ఉన్న అభిమానం తోనో కొన్ని సంస్కృత పదాలను అనువదించాకుండానే యధాతధం గా రాశారు ఆ విధం గా మన తెలుగు గ్రంధాలలో అనేక సంస్కృత పదాలు గ్రంధస్థం కాబడ్డాయి . అటువంటి సంస్కృత పదాలతో ఏర్పడిన సందులు సంస్కృత సందులు . తెలుగు పదాలతో ఏర్పడే సందులు తెలుగు సంధులు . 

                                                    సవర్ణ దీర్ఘ సంధి 

 సూత్రం ; అ , ఇ ,ఉ , ఋ లకు సవర్ణాచ్చులు పరమగునపుడు  దీర్గాములేకాదేశామగును . 
స వర్ణాలు అనగా అవే వర్ణాలు అని అర్ధం . అనగా 
         క (క్ +అ )+అ =కా .   ఆకారానికి, అ పరమవడం వల్ల దీర్గం వచ్చింది 
        గి (గ్ +ఇ )+ఇ =గీ . ఇకారానికి, ఇ పరమవడం వల్ల దీర్గం వచ్చింది . 
         చు (చ్ +ఉ )+ఉ =చూ.   వుకారానికి ,ఉ పరమవడం వల్ల దీర్ఘం వచ్చింది . 
        కృ (క్ +ఋ )+ఋ =ఋ . ఋ కారానికి ఋ పరమవడం వల్ల దీర్గం వచ్చింది . 
స వర్ణాలు పమవడం వల్ల దీర్గం వస్తోంది కావున ఇది సవర్ణ దీర్ఘ సంధి . 
ఉదా ;        ధర +అధినాదులు =దరాధినాదులు 
                 గౌరి +ఈశ =గౌరీశ 
                 గురు +ఉపదేశం =గురూపదేశం 



                                                                                                                        శశి 

                                                                                                              ఎం . ఎ , తెలుగు పండితులు . 
             

















Thursday 25 February 2016

వినాయకుడి పూజకి తులసి నిషిద్దం

                        వినాయకుడి పూజకు తులసి నిషిద్దం 


వినాయక చవితి రోజున బొజ్జ గణపయ్యని వివిధ పత్రాలతో పోటా పోటీగా పూజ చేస్తారు . కాని వాటిలో తులసి ఉపయోగించరాదు . కారణమేమనగా ఒక పర్యాయం గంగా నదీ తీరంలో గణ నాధుడు విహరించు సమయమున ధర్మద్వజ యువరాణి శివ పుత్రుడిని చూసి మోహించి వివాహం చేసుకోమని కోరగా ,అందులకు ఆయన కాదనడంతో ఆమె కోపించి దీర్ఘకాలం భ్రహ్మ చారిగా ఉండమని శపించింది . ప్రతిగా పార్వతీ పుత్రుడు ఆమెను రాక్షసుని చెంత దీర్ఘకాలం ఉండమని శపించాడు . లంబోదరుడి శాపానికి చింతించి ధర్మద్వజ రాజకుమార్తె స్వామిని మన్నించమని అర్దించగా విఘ్నేశ్వరుడు శాంతించి రాక్షసుడి చెంత కొంత కాలం ఉండి ,తరువాత పవిత్రమయిన తులసిగా జన్మిస్తావు అని వరం ఇచ్చాడు . 
కావున వినాయకుడికి  తులసిని తన పూజలోవినియోగించుట  ఇష్టముండదు . 




                                                                                                                                  శశి 
                                                                                                       ఎం . ఎ ,తెలుగు పండితులు . 

Wednesday 24 February 2016

కవిత్రయం

                                        కవిత్రయం 

వేద వ్యాసుడు సంస్కృతం లో రచించిన శ్రీమదాంధ్ర మహా భారతాన్ని నన్నయ ,తిక్కన ,ఎఱ్ఱన తెలుగులో అనువదించారు . కావున ఈ ముగ్గురికి కవిత్రయం అని పేరు వచ్చింది . కవిత్రయంలో మొదటివాడు నన్నయ, రెండో వాడు తిక్కన ,మూడోవాడు ఎర్రన . 
నన్నయ ; 
      ఆది కవి నన్నయ 11 వ శతాబ్దానికి చెందినవాడు . రాజమహెంద్రవరాన్ని రాజదానిగా చేసుకుని వేంగి సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజరాజ నరేంద్రుడి ఆస్థానం లో ఉండేవాడు . నన్నయ అవిరల జపహోమ తత్పరుడు ,విపుల శబ్దశాసనుడు ,సంహితాబ్యాసుడు,భ్రహ్మాన్డాడి నానాపురాణ విజ్ఞాన నిరతుడు ,ఆపస్తంబ సూథ్రుదు ,ముద్గల గోత్రజుడు ,లోకజ్ఞుడు ,ఉభయభాషా కావ్య రచనా శోభితుడు . 
రాజరాజ నరేంద్రుడు నన్నయను మహాభారతాన్ని అనువదించమని ప్రోత్సహించాడు . అంతకు పూర్వం తెలుగులో కావ్యాలేవి లేని కారణంగా నన్నయ ఆంద్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రందాన్ని రచించి మహా భారత రచనకు ఉపక్రమించి తనదైన శైలిలో అద్బుతంగా రచించారు . 

రచనా శైలి 

నన్నయ కవిత్వంలో మూడు ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి . అవి 
1. ప్రసన్న కధా కలితార్దాయుక్తి 
2. అక్షరరమ్యత 
3. నానా రుచిరార్ద సూక్థి నిదిత్వం . 
నన్నయ అనువదించినా అందులో వున్నా అనవసరమయిన వర్ణనలను తొలగించాడు ,అవసరం అనుకున్నచోట వర్ణనలను పెంచి పోషించారు . ఎంతో అద్భుతంగా తీర్చి దిద్దారు . ఎన్నో నీతులను కధలలో జొప్పించి మనసుకు హత్తుకునేలా చెప్పారు . అల్లా ఆ మహానుభావుడు 2 పర్వాలు(ఆదిపర్వం,సభాపర్వం ) పూర్తిచేసారు ,మూడవ పర్వమయిన అరణ్యపర్వంలో 4 వ ఆశ్వాసం లో 142 వ పద్యమయిన" శారద రాత్రులుజ్జ్వల "వరకు అనువదించారు . అంతటితో ఆ మహా కవి ఘంటం  ఆగిపోయింది (మరణించారు ). 
రాజరాజ నరేంద్రుడు మహా కావ్యం ఆగిపోకూడదనే ఉద్దేశ్యం తో నన్నయ గారు వ్రాసిన చివరి పద్యాన్ని గుర్రం ముఖానికి తగిలించి గ్రందాన్ని పూర్తి చేసిన వారికి కోరిన భాహుమానాలు ఇస్తానని ప్రచారం చెయించారు. కాని ఎవరు ముందుకు రాలేదు . 
తరువాతి కాలం(12వ శతాబ్దం ) శివకవులది . కుమారసంభవం వంటి అద్భుత కావ్యాలు వచ్చాయి . మొట్టమొదటి శతకం (వృషా దిప శతకం )వచ్చింది . కాని మహా భారత రచన ముందుకు సాగలేదు 

తిక్కన ; 


తరువాతి కాలం(13 వ శతాబ్దం ) వాడు తిక్కన . నెల్లూరును రాజధానిగా చేసుకుని పరిపాలించిన మనుమసిద్ది ఆస్థానంలో మహా మంత్రిగా ఉండేవాడు . ఈయన రాజకీయ చతురత అంతా అయన రాసిన భారత బాగం చూసినట్లయితే మనకు అర్ధం అవుతుంది . 

ఒకసారి మనుమసిద్ది దయాదులవల్ల రాజ్యాన్ని కోల్పోగా కాకతీయ రాజయిన గణపతి దేవుడిని తన ప్రతిభా పాటవాలతో మెప్పించి ఆయన సాయం తో మనుమసిద్ది రాజ్యం తిరిగి వచ్చేలా చేసాడు . అంతటి గొప్ప ప్రతిభా పాటవాలు కలవాడు తిక్కన . ఈయన మహాభారత  రచనకు ఉపక్రమించే ముందు సోమయాగం చేసి పునీతుడు అయి అప్పుడు భారత రచన మొదలపెట్టారు .  ఈయనకు కవిభ్రహ్మ ఉభయకవి మిత్రుడు అనే భిరుదులు వున్నాయి . తరువాత అనీక మంది కవులకు ఆదర్సప్రాయుడు అయ్యాడు కావున కవిభ్రహ్మ,సంస్కృత, తెలుగు కవుల ను ఇద్దరినీ తన కవితా పాండిత్యం తో మెప్పించగల సామర్ద్యం కలవాడు కావున ఉభయకవి మిత్రుడు భిరుదులు సార్దకమయ్యాయి . తిక్కన గారిది పాత గుంటూరు . ఇప్పటికి ఆయన ఇంటిని మనం అక్కడ దర్శించవచ్చు . ఈయన తాత భాస్కర మంత్రి , అన్నమ, కొమ్మన మంత్రి తల్లి తండ్రులు . తిక్కన కాలంలో శివ కేశవుల భక్తులలో మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అనే బేదాభిప్రాయాలు చాలా ఎక్కువుగా ఉండేవి . సమాజం అల్లకల్లోలం గా వుండేది . ఈ భేదాలు తొలగిపోవాలనే ఉద్దేశ్యంతో తిక్కన గారు హరిహరనాదుడనే దేవుడిని సృష్టించి తాను రాసిన మహా భారత గ్రందాన్ని ఆయనకే అంకితం ఇచ్చాడు . తిక్కన గారు నన్నయ గారు మద్యలో వదిలివేసిన అరణ్య పర్వ శేషాన్ని వదిలి విరాట పర్వం మొదలుకుని స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం 15 పర్వాలను నిర్వుఘ్నంగా రచించారు . ఈయన రాసిన భారతం అద్వితీయం . కావునే అనేకమంది కవులకు ఆదర్సప్రాయుడు అయాడు . 

                                                ఎఱ్ఱన 
తరువాతి కాలం (14 వ శతాబ్దం )వాడుఎఱ్ఱన .  అద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానం లోని వాడు . ఈయన రెండు ముక్కలుగా ఉండిపోయిన మహాభారతాన్ని అరణ్యపర్వ శేషాన్ని పూర్తి చేయడం ద్వారా ఏకం చేసారు . ఈయన రాసినది పర్వం లో అర భాగమే అయినా అటు నన్నయ గారి కవితా శైలిని అందుకుంటూ ఇటు తిక్కన గారి రచనా విధానానికి చక్కగా సరిపోయేలా మద్య భాగాన్ని రచించడం అంత తేలికయిన విషయమేమీ కాదు . అనితర సాద్యమయినది . ఎఱ్ఱన గారిది ఇప్పటి ప్రకాశం జిల్లాలోని గుడ్లూరు గ్రామం . ఈయన తల్లితండ్రులు పోతమామ్బికా ,సురనార్యులు . ఈయన పితామహుడు పోతన సూరి . ఎర్రన గారు అరణ్య పర్వ శేషమే కాక హరివంశం ,నృశింహ పురాణాలను రచించారు . 

భిరుదులు 

ఎర్రన గారికి శంభు దాసుడు , ప్రభంద పరమేశ్వరుడు అనే భిరుదులు కలవు . 



సమాప్తం 



                                                                                                                  శశి 




Tuesday 23 February 2016

దీపారాధన

                                దీపారాధన 

దీపారాధన వెండి ,ఇత్తడి,రాగి,లేదా మట్టి ప్రమిదల్లో చేయవచ్చు .స్టీలు కుందులలో దీపారాధన చేయరాదు .  రెండు వత్తులు కచ్చితం గా వుండాలి . ఏక వత్తి వెలిగించుట  మహా దోషము. ఏక వత్తిని శవం వద్ద వెలిగిస్తారు .  
పరమేశ్వరునికి  ఎడమవైపు ,విష్ణు మూర్తికి కుడివైపు దీపాన్ని ఉంచాలి . ఎదురుగా వుంచరాదు . నిత్య దీపారాధన సకల శుభప్రదం .  దీపాన్ని అగరవత్తి తో వెలిగించాలి అగ్గిపుల్లతో వెలిగించరాదు . తామర వత్తుల(తమర పూవు కాదను విరిచి దానిని నలిపి పొడుగ్గా దరాలలా విడదీసి నీడలో 7 రోజులు ఆరబెట్టి వాటిని మామూలు వత్తి మద్యలో పెట్టి తయారు చేసిన వత్తి )తో దీపారాధన లక్ష్మి దేవికి అత్యంత ప్రీతికరం . రోజు దీపారాధన చేయడం వల్ల దుష్ట శక్తులు దరిచేరవు . రోజు ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేయాలి . ఒక్కోసారి దీపారాధన చేయడం కుదరకపోవచ్చు . అలాంటి దోషాలు నివృత్తి అయ్యేందుకు గాను కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులు వెలిగిస్తారు . దీపారాధన కొన్దేక్కితే 108 సార్లు ఓం నమః శివాయ మంత్రాన్ని జపించి తిరిగి దీపారాధన చేయవలెను . 


                                          సర్వే జనాం సుఖినో భవంతు . 




                                                                                                                         శశి 

Monday 22 February 2016

ఉదయం నిద్ర లేవగానే పటించ వలసిన స్తోత్రం

ఉదయం నిద్ర లేవగానే పటించ వలసిన స్తోత్రం 

       కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్యేచ పార్వతి 
       కరమూలె ద్వసే వాణి ప్రభాతే కర దర్శనం 

కరము అనగా చేయి . చేతి చివరి భాగాన లక్ష్మీ దేవి ,చేతి మద్య భాగంలో పార్వతి దేవి ,చేతి మొదలు భాగంలో వాణి అనగా సరస్వతి దేవి నివాసం వుంటారు ,కావున ఉదయం లేవగానే చేతిని దర్శించుకుంటూ ఈ స్తోత్రాన్ని పాటించాలి . అలా చేసినట్లయితే ఆ రోజు ఆ ముగ్గురు మాతల అనుగ్రహం వల్ల మంచి జరుగుతుంది . 




                                                                                                                          శశి 

Sunday 21 February 2016

                         కుల కాంత తోడ నెప్పుడు 
                           గలహింపకు ,వట్టి తప్పు ఘటియింపకుమీ 
                          కలకంటి కంట కన్నీ 
                          రొలికిన సిరి ఇంట నుండ నొల్లదు సుమతీ !
భావం ; చీటికీ మాటికీ బార్యతో తగవులు పెట్టుకొనరాదు . లేని నేరాలను ఆరొపించరాదు . ఉత్తమ ఇల్లాలి యొక్క కంట నీరు క్రింద పడినచో ఆ ఇంట సంపదలు తొలగిపోవును . అనగా సంపద సౌఖ్యము తొలగి దారిద్రము రాగలదని భావము . 
భార్యా భర్తలు ఇద్దరు ఒకరినొకరు అర్ధం చేసుకుని సంతోషంగా ఉన్నట్లయితే ఆ ఇల్లు స్వర్గం తో సమానం అది ధనవంతుల ఇల్లయినా ,మధ్యతరగతి ఇల్లయినా, పేద ఇల్లయినా సంతోషాలలో వారిది కోటీశ్వర కుటుంభమే అనడం లో ఎ సందేహం లేదు . భార్యా భర్తల మద్య ఎ అనుమానాలు అపోహలు లేక ప్రేమానురాగాలతో ఉన్నట్లయితే చేసే పని లేదా ఉద్యోగానికి 100%న్యాయం చెయ్యగలరు . తద్వారా ఉద్యోగంలో మంచి పేరును తెచ్చుకుని మంచి స్థితిని కూడా పొందగలరు . ఇక్కడ మనం గమనించినట్లయితే భార్య భర్తలు అన్యోన్యంగా ఉన్నట్లయితే ఇంట బయట కూడా సంతోషం గ ఉండగలరు . అలాగే మనస్సు ప్రశాంతం గా వుండడం వల్ల బి పి ,షుగర్ ,గుండె జబ్బులు ఇంకా అనేక రోగాలు దరిదాపుల్లోకి కూడా రావు . అంతే కాక అటువంటి ప్రశాంత సంతోషకరమయిన వాతావరణం లో పెరిగిన పిల్లలు మంచి, మానవత్వం కలిగి మన దేశానికి ఉత్తమ పౌరులు అవుతారు .
పుట్టి పెరిగిన వాతావరణాన్ని ,తల్లి తండ్రులను , తోడ  పుట్టిన వాళ్ళని వదిలి భర్తే లోకంగా బతికే భార్యను చక్కగా చూసుకోవలసిన భాద్యత భర్తది . అదే విధంగా ఇల్లు,భార్య , పిల్లలు కోసం కష్టపడి సంపాదిస్తూ అనుక్షణం తన పిల్లలు తన కుటుంభ సభ్యుల కోసమే ఆలోచిస్తూ కష్టపడే భర్తను అర్ధం చేసుకుని ,ఇంటిని ,పిల్లలను చక్కగా చూసుకోవలసిన భాద్యత భార్యది . ఎవరి భాద్యతలను వారు సక్రమంగా నిర్వహించుకుంటూ ఒకరినొకరు అర్ధం చేసుకుంటూ ప్రతి ఇల్లు ఒక నందన వనం లా సుందరంగా మారాలని మనస్పూర్తిగా కోరుకుంటూ 




                                                                                                                           మీ శశి 









 

Saturday 20 February 2016

పారిజాతాపహరణం

                                 పారిజాతాపహరణం 

పారిజాతాపహరణం గ్రంధ రచయిత నంది తిమ్మన .  ఈయననే ముక్కు తిమ్మన అని కూడా అంటారు . ఈయన శ్రీ కృష్ణ దేవరాయాలి ఆస్థాన అష్ట దిగ్గజ కవులలో ఒకరు . రాయల వారి వివాహ సమయంలో ఈయన అరణపు కవిగా వచ్చారు . అనగా పూర్వం రాజుల వివాహ సమయంలో అత్తారింటికి వెళ్లే ఆడపిల్లలతో పాటు చెలికత్తెలను కూడా పంపేవారు అదేవిధంగా నంది తిమ్మనగారు శ్రీ కృష్ణదేవరాయల వివాహ సమయం లో  అయన అత్తవారింటి నుండి వచ్చారు . 

కధ ;

నారదుడు ఇంద్ర లోకంలో ఇంద్రుడు తనకు భాహుమతిగా ఇచ్చిన అపురూప పుష్పం(ఆ పువ్వు ను ధరిస్తే ఎప్పటికి ఎవ్వనులుగా ఉంటారని నమ్మకం . ఆ వృక్షం దేవలోకంలో మాత్రమే వుండేది ) పారిజాతాన్ని ద్వారకలో ఉన్న శ్రీ కృష్ణుడికి ఇస్తాడు . అప్పుడు కృష్ణుడు రుక్మిణి దేవి అంతః పురం లో వున్నారు . ఆ పువ్వు ను ఎదురుగా వున్న రుక్మిణికి ఇవ్వాలా ?సత్య భామకు ఇవ్వాలా అన్న సందిగ్దావస్థలో వున్న కృష్ణుడికి నారదుడు రుక్మిణికి ఇమ్మని సైగ చేస్తాడు . దాంతో కృష్ణుడు రుక్మిణికి ఇస్తాడు . రుక్మిణి దేవి ని నారదుడు పొగుడుతాడు . జరిగిన వృత్తాంతాన్ని అంతటిని చిలవలు పలవలు చేసి చెలికత్తె సత్యభామకు  చెబుతుంది . అది విన్న సత్యభామ తోక తొక్కిన ఆడత్రాచు పాముల లేస్తుంది . నెయ్యి పోస్తే బగ్గున మండిన మంటలా లేస్తుంది . ఆభరణాలను తీసివేసి కోపగృహానికి వెళ్లి తనలో తాను భాద పడుతూ వుంటుంది . మగ వారి ప్రేమ ఎదురుగా ఉన్నప్పుడే లేకపోతే వుండదు అనుకుంటుంది . తనకు అవమానం జరిగినట్లుగా భావించి భాదపడుతుంటుంది . పరిస్థితిని అంచనా వేసిన శ్రీకృష్ణుడు నారదుడి సేవకు ప్రద్యుమ్నుడిని పురమాయించి తాను సత్యభామ గృహానికి వెళ్తాడు . కోప గృహంలో వున్నా సత్యభామ వద్దకు వెళ్లి 
"సత్యా ఎన్దుకుఇలా వున్నావు ఆభరణాలు ఎందుకు ధరించలేదు . ఎప్పుడు బంగారు రంగు అంచు కలిగిన  కావిరంగు (కాషాయ రంగు )చీరలే కట్టుకునే దానివి మాసిన చీర ఎందుకు కట్టుకున్నావు . నిన్ను ఎవరయినా ఎమన్నా అన్నారా ?చెప్పు ఇప్పుడే వాళ్ళ ప్రాణాలు తీసి వేస్తాను" అని అనునయం గా అడుగుతాడు . దానికి సత్య "ఎందుకు లేనిపోని ప్రేమలు కురుపిస్తారు మీకు ఎక్కడ నిజం గ ప్రేమ వుంటే అక్కడికే వెళ్ళండి .అయిన గోపాలుడికి మన్మద రహస్యాలు ఎలా తెలుస్తాయి ఇన్నాళ్ళు అత్తగారు దేవకీ దేవి సేవకి అందరికంటే ముందుగా నేనే వెళ్ళేదాన్ని ఇప్పుడు ఎ మొహం పెట్టుకుని వెళ్ళను . అందరు నా చాటుగా నన్ను చూసి నవ్వుకుంటూ వుంటే నేను తల ఎత్తుకుని ఎలా తిరగను ? "అని కటువుగా సమాధానం చేభుతుంది . అప్పుడు కృష్ణుడు సత్యా నా వాళ్ళ ఏదయినా పొరబాటు జరిగితే నన్ను క్షమించు అంతే కాని నన్ను దూరం పెట్టకు నేను భరించలేను అని జగత్పాలకుడు తన శిరస్సును సత్యభామ దేవి కుడి కాలి పాదం మీద వుంచి అడుగుతాడు . సత్య భామ తన ఎడమ కాలి తో అకిలాండనాయకుడి శిరస్సుని తోసివేస్తుంది . అయిన కృష్ణుడు భాద పడక కోపం తో వున్న కాంతలు వుచిథానుచిథములు ఎరుగరు అనుకుని , నాసిరస్సు తోసివేసినందుకు నాకు భాద లేదు నా శిరస్సు కిరీటం తగిలి నీ సుకుమారమయిన పాదం కందిందేమో చుసుకొఅని ప్రేమగా అంటాడు . అయిన సత్య కోపం తగ్గకపోవడంతో  కోపానికి అసలు కారణం పువ్వు అని తెలుసుకుని "పిచ్చిదానా పువ్వు కోసం భాద పడతావా నీ పెరట్లో పారిజాత వృక్షాన్నే నాటతాను . అని చెప్పడం తో సత్య భామ దేవే కాక అంతః పురం అంతా సంతోషం వెల్లివిరుస్తుంది . 

అనంతరం ఇంద్రలోకం వెళ్లి సత్యా శ్రీకృష్ణులు అడ్డు వచ్చిన వారితో యుద్ధం చేసి ఆ పారిజాత వృక్షాన్ని భూమి మీదకు తెస్తారు . 

గ్రంధ రచన  చేయడానికి కారణం ;

ఒక సారి శ్ర్రీ కృష్ణ దేవరాయలు వారు అయన భార్య ఉద్యానవనంలోని సరస్సులో జలకాలాడుతున్నారు . రాయల వారు నీటితో ఆయన భార్య ను కొడుతున్నారు ." అప్పుడు ఆవిడ మమోదకే తాడయత ". అంది రాయల వారు మము (మమ్మల్ని )మొదకే (కుడుములతో )తడయతా (కొట్టండి )అని అరదం చేసుకుని , ఇదేమిటి రాణి గారు ఇలా అన్నారు ఒక వేల ఆవిడకు అది సరదా ఏమో అని మనస్సులో అనుకుని "ఎవరక్కడ" అన్నారు.  వెంటనే భేతులు పరిగెత్తుకొచ్చారు వారితో కుడుములు తేమ్మన్నారు . వాళ్ళు పరుగు పరుగున వెళ్లి కుడుములు తెచ్చి రాజుగారికి ఇచ్చారు . వాటితో ఆయన రాణి గారిని కొట్టడం ప్రారంభించారు . దాంతో ఆవిడ "మీరు గొప్ప సాహితీ సమరాంగణ చక్రవర్తి అంటారు పామరుడి లా చిన్నా పదానికి అరదం తెలుసుకోలేకపోయారు . నేను మము (మమ్మల్ని )న వుదకే తాడయత (నీటితో కొట్టద్దు )అన్నాను . అని చెప్పగా రాయల వారు ఆవడ అన్న మాటలకు అలిగి ఆవిడ అంతః పురానికి వెళ్ళడం మానివేశారు . దాంతో భాద పడిన రాణి గారు తన పుట్టింటి నుండి వచ్చిన ,తన తరుపు పెద్ద అయిన నంది తిమ్మన గారితో జరిగిన విషయం చెప్పి భాద పడుతుంది . అప్పుడు నంది తిమ్మన గారు రాయల వారి మనసు మార్చేందుకు గాను పారిజాతాపహరణ గ్రంధాన్ని రచించి ఆయనకు అంకితం ఇచ్చారు . దానిలోని అంతరార్ధాన్ని(భార్య అలిగి నపుడు భర్త ఆమెను భతిమాలినా తప్పులేదు ) గ్రహించిన రాయలవారు తిరిగి రాణి గారి అంతః పురానికి వెల్లనారంభించారు . 



              ఇతి కధా  సమాప్తః 

                                                                                                                               శశి 


'











Friday 19 February 2016

భువనవిజయం

                                            భువనవిజయం 

శ్రీ కృష్ణదేవరాయుల సభకు భువనవిజయం అని పేరు . ఈయన సాహితీ సమరాంగణ చక్రవర్తి . ఈయన పాలనా కాలాన్ని స్వర్ణ యుగం గా కీర్తిస్తారు . అలాగే ఆ కాలాన్ని ప్రభంద యుగం అని కూడా అంటారు . ప్రభందం (ప్రకృష్ట్తో ఇతి భందః ప్రభందః )అనగా పురాణాలు , ఇతిహాసాలనుండి చిన్న కధను తీసుకుని స్వతంత్ర వర్ణనలతో పెంచి పోషించటం . శ్రీ కృష్ణ దేవరాయలి  కాలం లో అనేక ప్రభందాలు వెలువడ్డాయి . ఈయన ఆస్థానంలో అష్ట దిఘ్ఘజాలు అనబడే ఎనిమిదిమంది కవులు వుండేవారు . 
నామసార్ధక్యం ;
       పూర్వకాలంలో చదువుకున్న వారు చాలా తక్కువుగా వుండేవారు . కవులు ఒక కావ్యాన్ని రచించి రాజు గారికి అంకితం ఇస్తే అగ్రహారాలు దానం చేసేవారు ,కనకాభిషేకాలు చేసేవారు . ఆవిధంగా కవులకు చాలా విలువ వుండేది . కొంతమంది కవులు దెస దేశాలు తిరిగి అక్కడి కవులను సవాలు చేసి వారిని గెలిచి ఆ దేశ రాజుల చేత సన్మానాలు భహుమానాలు పొందేవారు . అలా ఎంతమంది గొప్ప కవులు శ్రీకృష్ణ దేవరాయాలి సభకు వచ్చినా అష్టదిగ్గజాల చేతిలో ఓడిపోయేవారు . ఆ విధంగా భువన విజయం పేరు సార్దాక్యమయింది . 

అష్ట దిగ్గజాలు ;

శ్రీ కృష్ణ దేవరాయాలి ఎనిమిది మంది ఆస్థాన కవులకు అష్టదిగ్గజాలు అని పేరు . వారు 
అల్లసాని పెద్దన ;                   మను చరిత్ర 
అయ్యలరాజు రామభద్రుడు ;    రామాభ్యుధయం 
పింగలిసూరన ;                       కళాపూర్ణోదయం 
ధూర్జటి ;                                శ్రీ కాలహస్తీశ్వర మహత్యం 
రామరాజ భూషణుడు ;           వసు చరిత్ర 
మాదయగారి మల్లన ;             రాజశేకర చరిత్రము 
నంది తిమ్మన ;                        పారిజాతాపహరణం 
తెనాలి రామకృష్ణుడు ;             పాండురంగ మహత్యం 

స్వర్ణయుగం ; 

  రాయల యుగాన్ని స్వర్ణ యుగంగా చరిత్రకారులు సాహిత్యాభిమానులు కీర్తిస్తారు . ఈయన కాలం లో సాహిత్య లక్ష్మి దేవి ఉత్సాహం తో కొత్త పుంతలు తొక్కింది . అద్వితీయమయిన ప్రభంద గ్రందాలను ఈ యుగం తన ఖాతాలో జమ చేసుకుంది . అష్టదిగ్గజ కవులు తమ నామాన్ని సార్ధక్యం చేసుకుంటూ అపురూపయిన ప్రభందాలను ముందు తరాలకు వరం లా ఇచ్చారు . స్వయం గా శ్రీ కృష్ణదేవరాయలు కుడా కవి ఆముక్త మాల్యద అనే గ్రంధాన్ని రచించారు . ఎంత గొప్ప పండితులు అయినా నిఘంటువు చూడకుండా దీన్ని సాంతం అర్డంచేసుకోలేరు అంత గొప్పగా రాసారు . దేశ భాషలందు తెలుగు లెస్స అన్నది శ్రీ కృష్ణ దేవరాయలు . ఈయన పాలనలో బజారులో రత్నాలను రాసులుగా పోసి అమ్మేవారు . ఇంతటి అద్వితీయమయిన యుగాన్ని స్వర్ణయుగం అనడం ఎంతో సమంజసమ్. 

ఇతర విశేషాలు ;

శ్రీ కృష్ణ దేవరాయలు దేశ పర్యటనలో విజయవాడ మీదగా వెళ్తూ కొండపల్లి తదితర ప్రాంతాలను దర్శించి ,ఆంద్ర మహా విష్ణువు గురించి తెలుసుకుని శ్రీకాకుళం వెళ్లి అక్కడ ఏకాదశి వ్రతం చేసాడు . అక్కడే తెల్లవారు జామున స్వామి వారు అయన కల లోకి వచ్చి గ్రంధం రాయమని అడుగగా అందుకు గాను రాయలు ఆముక్త మాల్యద రచించారని ఒక గాధ . తిరుపతి లో అనేక కట్టడాలు కట్టించారు . స్వామీ వారికి విలువ కట్టలేని అనేక దివ్యాభారణాలు సమర్పించారు . తిరుపతి ఆలయ వెలుపల ఆవరణలో శ్రీ కృష్ణదేవరాయలు అయన ఇద్దరు బార్యలు తిరుమలదేవి చిన్నదేవుల విగ్రహాలు ఇప్పటికి మనం దర్శించవచ్చు . 



                                         స్వస్తి 

                                                                                                              శశి 



Thursday 18 February 2016

జై భారత్

మిత్రులందరికి నమస్కారము 
ఈ వినీలాకాశం చల్లటి గాలి మేఘాలు చూసి నాకు వచ్చిన ఒక చిలిపి ఆలోచన 
వినీలాకాశంలో హాయిగా ఎగరాలని వుంది 
అయితే ఎలా మారను ?

పావురంలా మారి కబురులను చేరవేయ్యనా ?
జాషువా గబ్బిలం లా మారి జాతికి సందేశాన్ని అందించనా ?
విమానం లా మారి విదేశాలలోని పిల్లలను తల్లితండ్రులను చేరువచేయనా ?
రాజ హంస లా మారి నల దమయంతుల వంటి ప్రేమికులను వోకటిచేయ్యనా ?
మేఘం లా మారి దూరంగా ఉన్న జంటలకు ఒకరి కబురులు మరొకరికి తెలియజేయనా ?
ఎలా మారను ?
ఎలా ఎగరను ?
ఆ 
 మువ్వన్నెల జండా లా మారి ఎగురుతా . 
ప్రతి భారతీయుడు గర్వంతో తల ఎత్తుకునేలా ఎగురుతా . 
మన భారత దేశ కీర్తి దేశ దేశాలకు వ్యాపించేలా ఎగురుతా . 

                                               జై భారత్   
                                                 జై హింద్ 


                                                                                                                                    శశి 

Wednesday 17 February 2016

భీష్మ ఏకాదశి

                                భీష్మ ఏకాదశి 

భీష్ముడు కురు పితామహుడు . గొప్ప  జ్ఞాని . కార్యాచరణ దక్షుడు ,ధీరుడు ధర్మ శాస్త్ర జ్ఞానం తెలిసినవాడు ,రాజకీయచతురత తెలిసినవాడు ,స్వచ్చంద మరణ వర ప్రసాదుదు , దైవానుగ్రహం కలిగినవాడు . వేద వేదాంగాలను అభ్యసించినవాడు , అస్త్ర శస్త్ర విద్యను అవపోసన పట్టినవాడు , ఎన్ని అవాంతరాలు వచ్చినా మాట మీద నిలబడే స్వభావం కలవాడు . ఈయన అసలు పేరు దేవవ్రతుడు . 
జన్మ వృత్తాంతం ;పూర్వము ఇక్ష్వాకు వంశం లో మహా భిషుడు అనే వాడు పుట్టి ధర్మస్వరూపుడై వేయి అశ్వమేధ యాగాలు ,నూరు రాజసూయములు చేసి దేవతలను తృప్తి పరచి స్వర్గానికి వెళ్లి ,అక్కడ దేవతలతో కలసి భ్రహ్మ ను సేవిస్తున్నాడు . ఒక నాడు భ్రహ్మ సభకు గంగా దేవి స్త్రీ రూప ధారిణి అయి దివ్యాభారణాలు ధరించి వచ్చినది . అప్పుడు గాలికి గంగా దేవి చీర తొలగగా  దేవతలు ఆమెను చూడకుండా తలలు తిప్పుకున్నారు . ఒక్క మహాభిషుడు మాత్రం సాభిలాషగా చూసెను . అది  చూసిన భ్రహ్మ బూలోకంలో పుట్టుము అని శాపం ఇచ్చెను . మహాభిషుడు మన్నించమని ప్రార్దించి ,భ్రహ్మ పలుకు తధ్యం . కావున నన్ను అన్యులకు కాక ప్రతీపుడనే ధర్మపరుడికి కొడుకుగా పుట్టించమని కోరతాడు . భ్రహ్మ సరే అంటాడు . 
గంగా దేవి కూడా జరిగిన వృత్తాంతాన్ని తలుచుకుని తన వల్లే మహాభిషుడు శాపగ్రస్తుడయ్యాడని భాద పడుతూ వస్తూ వుండగా వసువులు ఆమెకు ఎదురై వసిష్టుని శాప  కారణంగా భూలోకంలో జన్మించడానికి వెళ్తున్నామని అన్యుల కడుపునా పుట్టలేమని నీ కడుపునా పుడతామని ప్రార్దిస్తారు . మహాభిశుడిని తలచుకుని గంగ ఒప్పుకుంటుంది . 
భూలోకంలో ప్రతీపుడు గంగా తీరంలో తపస్సు చేసుకుంటూ వుండగా గంగ స్త్రీ రూపం ధరించి వచ్చి ప్రతీపుడి కుడి తొడ మీద కూర్చుంటుంది . ప్రతీపుడు నీవెవరు అని అడుగగా నన్ను వివాహము చేసుకోనమని గంగ అడుగుతుంది . ఎడమభాగం స్త్రీ భాగం ,కుడి భాగం పురుష భాగం . నీవు కుడి వైపున కూర్చున్నావు కావున నీవు నాకు పుత్రిక తో సమానం . కావున నీవు నా కొడుకుని  చేసుకున్డువు అని చెప్పగా గంగ కూడా సరేనని అన్థర్దానమయ్యెను . 
ప్రతీపుని పూజల తపస్సుల పలితం వల్ల అతనికి సద్గుణుడు అయిన కుమారుడు జన్మించెను . అతనికి శంతనుడు అనిపేరు పెట్టెను , శంతనుడు పెద్దయిన తర్వాత గంగా తీరంలో తను సుందర కన్యకకు జరిగిన వృత్తాంతాన్ని  చెప్పి ఆమెను కుల గోత్ర వివరములు అడుగక వివాహము చేసుకోనమని చెప్పి తపోవనాలకు వెళ్తాడు . 
ఒక రోజు వేటకు వెళ్లి గంగా తీరమునకు వెళ్ళగా అక్కడ దివ్యాభారణాలు ధరించి అద్భుత కాంతితో ప్రకాశించే ఒక సుందర కన్యను చూస్తాడు . ఆమె ఎ దేవ కన్యకో అనుకుంటాడు ఆమె కుడా తన వైపు చూడగా నీవ్వేవారు ఎక్కడి దానివి అని అడుగుతాడు . దానికి ఆమె నాకులగోత్రాలు నీకేల ?నేను నచ్చితే వివాహం చేసుకొనుము ,కాని నాదొక షరతు ఎప్పుడు నాకు అప్రియములు పలుకరాదు . ఆవిధంగా పలికినచో నేను వెంటనే వదిలి వెల్లిపొయెదనని  చెప్పగా శంతనుడు ఒప్పుకుని వివాహం చేసుకొనెను . 
కొన్ని రోజులకు వారికి పండంటి కొడుకు పుట్టెను శంతన మహారాజు ఆనందమునకు  అవధులు లేకున్దపోఎను . ఇంతలో ఆమె పుట్టిన కొడుకుని గంగలో వదిలివేసెను . శంతనుడు దుఖసాగరంలో మునిగిపోఎను . కాని అడిగితే  బార్య వదిలి వేల్లోపోతుందని భయం తో మాట్లాడకుండా వుండిపోయేను . కొన్నాళ్ళకి మరొక పుత్రుడు పుట్టెను అతడిని కూడా పుట్టిన వెంటనే నీళ్ళలో పడవేసెను . ఆవిధంగా ఏడుగురు కొడుకులను పుట్టినవెంటనే నీళ్ళలో పడవేసెను . ఎనిమదవ పుత్రుడు పుట్టెను పుత్ర ప్రేమ అడికమవడంతో పుత్రుడిని కాపాడుకోవాలనే  ఉద్దేశ్యంతో భార్య వద్దకు వెళ్లి 'ఇన్నాళ్ళు నీమీద పిచ్చి ప్రేమతో నువ్వు ఏమిచేసినా మాట్లాడలేదు కాని ఈ సారికుడా నా పుత్రుడిని గంగలో పడవేస్తే ఊరుకోను ' అని కఠినం గ చెప్పెను . అప్పుడు ఆమె నువ్వు కఠినం గ మాట్లాడావు కావున ఇక నేను నీతో ఉండను ఈ పుత్రుడిని నీటిలో పారవేయ్యను . ఇతడు చిర కాలం కీర్తిప్రతిష్ట లతో భూలోకం లో వర్దిల్లుతాడు . నేను గంగను నాకు పుట్టిన వారంతా వసువులు వారి అభ్యర్దన మేరకు వారిని వారి లోకాలకు పంపి వేసాను . నాకు పుత్రుడి ముద్దు ముచ్చట చుదాలనుందని అడుగగా వారు ఈ ఆఖరివాడు ఉంటాడని చెప్పారు . పసివాడి భాద్యత తండ్రి వహించలేదు కావున నీను నాతో తీసుకువెళ్ళి పెంచి తీసుకొస్తానని చెప్పి పుత్రుడి తో సహా అన్థర్దానమయ్యెను . 
కొంతకాలానికి శంతనుడు గంగా తీరానికి వెళ్ళగా అక్కడఒక అస్త్ర శస్త్ర లాఘవం కలిగిన దివ్య పురుషుడిని గాంచెను . అప్పుడు గంగ ప్రత్యక్షమై ఇతడు నీ పుత్రుడని అతని చేతిని శంతన మహారాజు చేతిలో పెట్టి మాయ మయ్యెను . 
భీష్మ ప్రతిజ్ఞ ;కుమారుడి ప్రతిభా పాటవాలు ధర్మ శాస్త్రజ్ఞానం చూసి మురిసిపోతున్నాడు శంతనుడు . ఇదిలా వుండగా ఒక రోజు శంతనుడు సత్యవతీ దేవి ని చూసి  వివాహం చేసుకోనదలచి ఆమె తండ్రిని అడుగగా అతడు తన కుమార్తెకు పుట్టబోయే బిడ్డలకే రాజ్యాని అప్పగిన్చేపద్దదయితే వివాహం చేసుకోమంటాడు . కాని సకల శాస్త్రాలలో నిస్నాతుడై , విద్యా వినయ సంపన్నుడయిన చెట్టంత కొడుకుని కాదని ఇలా మాతివ్వడం సబబు కాదని వచ్చేస్తాడు . జరిగిన విషయం తెలుసుకున్న దేవవ్రతుడు సత్యవతీదేవి తండ్రి వద్దకు వెళ్లి తన తండ్రికి సత్యవతీ దేవిని ఇచ్చి వివాహం చేయమని తనకు రాజ్యం మీద మమకారం లేదని చెబుతాడు . దానికి దాశరాజు (సత్యవతి దేవి తండ్రి )నీకు రాజ్యం పై మమకారం లేకపోయినా నీ పుత్రులు మా రాజ్యం మాము కావలి అని అడిగితే ఏమి చెయ్యాలి అని అంటాడు . దానికి దేవా వ్రతుడు నేను వివాహం చేసుకుంటేనే కదా పుత్రులు పుట్టేది నేనసలు వివాహమే చేసుకోను అని భీషణ ప్రతిజ్ఞ  చేస్తాడు . భీషణ ప్రతిజ్ఞ చేసాడు కావున భీష్ముడు అయ్యాడు . శంతనుడు,దేవవ్రతుడి తండ్రి ప్రేమకు మెచ్చి స్వచ్చంద మరణాన్ని వరంగా ఇస్తాడు . 
 
భీష్ముడి గొప్పదనం ; తండ్రి మరణానంతరం భీష్ముడు కురు వంశానికి తానే పెద్ద దిక్కై నిలబడ్డాడు . కాశి రాజు కుమార్తెల స్వయంవరానికి వెళ్లి అమ్భను ఆమె ఇష్టానికి విడిచి మిగిలిన అంభిక ,అమ్భాలికలను తన తమ్ముడికి (శంతనుడు ,సత్యవతుల పుత్రుడు )ఇచ్చి వివాహం చేసెను . అతడు సంతానం కలగకనే చనిపోగా సత్యవతి దేవి భీఎశ్ముదిని వివాహం చేసుకోనమని అడిడినా తన ప్రతిజ్ఞా పాలనా నిమిత్తం వివాహం చేసుకోలీడు . ఆ జన్మాంతం భ్రహ్మచారి గానే వున్నాడు . ఆయన గొప్ప యోదుడు యుద్దంలో ఎవరు ఈయనతో గెలవలేరు . తండ్రి కోసం వివాహాన్ని సయితం త్యజించిన గొప్పవాడు భీష్ముడు . కురు వంశ పేరు ప్రఖ్యాతలు నిలబెట్టాడు . ధర్మశాస్త్ర సూక్ష్మాలు తెలిసినవాడు . ముదుసలి వయసులో కూడా యుద్దంలో నిలబడి పాండవులకు వెన్నులో వణుకు పుట్టించాడు . కనుకనే ఎదురుగా ఆయన్ని ఎఅమి చెయ్యలేక శిఖండిని అడ్డం పెట్టుకుని అయన మీదకు అస్త్ర ప్రయోగం చేసారు . తన స్వచ్చంద మరణ వరం చేత 58 రోజులు అంపశయ్య మీదే ఉత్తరాయణ  వచ్చే వరకు వుండి  మాఘమాస ఏకాదశి రోజున తనువు చాలించాడు కావుననే దీనికి భీష్మ ఏకాదశి అని పేరు వచ్చింది . 
ఇటువంటి గొప్ప మహానుభావులు చాలా అరుదుగా వుంటారు . వారి జీవిత గాధలను తెలుసుకోవడం ద్వారా ఎన్నో మంచి విషయాలను తెలుసుకోవచ్చు . 




                                                         స్వస్తి 


                                                                                                                                             శశి 







Tuesday 16 February 2016

వ్యాస భగవానుడు

                          వ్యాస భగవానుడు 

ప్రాచీన కాలం లో ప్రస్తుతం ఉన్నంత సాంకేతిక పరిజ్ఞానం గాని, అబివృద్ది గాని ,ప్రజలకు అన్ని విషయాలమీద అవగాహన గాని వుండేది కాదు . ప్రాచీన కాలం లో అరణ్య ప్రాంతం ఎక్కువగా వుండేది . సాంకేతికత అభివృద్ధి చెందని కారణంగా ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఎక్కువ శాతం ప్రజలు నడిచే వెళ్ళేవాళ్ళు . కాస్తోకూస్తో డబ్బు వున్నవాళ్ళు ఎడ్ల బండ్ల మీదో , గుర్రాల మీదో వెళ్ళేవారు . ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వార్త చేరాలంటే ఎవరయినా  ఆ ప్రాంతానికి  వెళ్లి చెప్పాలి . డబ్బు వున్నా వాళ్ళు పావురాల ద్వారా సందేశాన్ని పంపేవారు . అందుకే పెద్దలు కాశీకి వెళ్ళిన వాళ్ళు కాటికి వెళ్ళిన వాళ్ళతో సమానం అనేవారు . కాశీకి వెళ్ళాలంటే అరణ్యాలగుండా వెళ్ళాలి ,నడిచి వెళ్ళాలి , అలా వెళ్లి రావడానికి కొన్ని నెలల లేదా సంవత్సరం పైనే సమయం పట్టొచ్చు . ఈలోపు వాళ్ళ గురించిన సమాచారం దారిలో వాళ్ళను ఎవరయినా చూసి వచ్చి చెబితే   తెలిసేది . లేకపోతే ఆ సమాచారం కూడా తెలిసేది కాదు . పై పెచ్చు వాళ్ళు వెళ్ళే మార్గం అరణ్య మార్గం కావడం వల్ల , అరణ్యంలో వుండే క్రూర మృగాల వల్ల  చాలా మంది మృత్యు వాత పడేవాళ్లు . ఆ వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తే తప్ప వాళ్ళు ఎలావున్నారో ఎక్కడవున్నారో తెలియని పరిస్థితి . 
జనాలకు వారి వారి కుల వృత్తులే జీవనాధారం . ఏ ఇతర జీవనోపాది మార్గాలు లేవు . కనుక పిల్లలను  చిన్నప్పటి నుండే వారి వృత్తి విద్యల్లో బాగాస్వాములను చేసేవారు .  చదువు కునే వారు చాలా తక్కువగా వుండేవారు . చదువు చెప్పే వారు కూడా తక్కువగా వుండేవారు . అప్పట్లో దేవాలయాలు  జ్ఞాన కేంద్రాలుగా ఉండేవి . సాయంత్ర సమయాలలో చిన్నా పెద్దా అందరు దేవాలయాలకు చేరుకునే వారు . అక్కడ చదువుకున్న పండితులు పురాణాలు, గ్రంధాలు చదివి వాటికి అర్ధం చెప్పెవారు. అప్పుడప్పుడు హరికధలు , బుర్రకధలను ప్రదర్శించేవారు . ఆ విధంగా ప్రజలు మంచి, చెడు తెలుసుకునేవారు . ఉదా ;రామాయణం విని రాముడిలా వుండాలి రావణుడిలా ఉండకూడదు  అని తెలుసుకునేవారు . 
పురాణాలను మొట్టమొదటగా రాసినది వ్యాసభగవానుడు . పురాణాలు మొత్తం 18 అవి 
1మత్య పురాణం ;ఇది మత్యావతారుడు అయిన విష్ణు ముర్తిచే మనువుకు భోదిమ్పబడినది . ఇందు 14000 శ్లోకములు కలవు .  దీనియందు కార్తికేయ ,యయాతి సావిత్రి చరిత్రలు ప్రయాగ వారణాసి మొదలగు పుణ్యక్షేత్ర మహత్యములు చెప్పబదినవి. 
2. మార్కండేయ పురాణం ;ఇది మార్కండేయ మహర్షి చే చెప్పబడింది . ఇందు 9000 శ్లోకములు కలవు . దీనిలో శివ విష్ణువుల మహత్యములు , ఇంద్ర , అగ్ని, సూర్య , మరియు దేవి మహత్యాలు చెప్పబడినవి . చండీ హోమమ , శత చండీ హోమం , సహస్ర చండీ హోమముల విధానాలకు ఇదే ఆధారం . 
3భాగవతం ; వేదవ్యాసుని వల్ల  శుకునికి , శుకుని వల్ల పరీక్షిత్ మహారాజుకు తెలుపబడింది . దీనిలో 18000 శ్లోకములు కలవు . ఇది మొత్తం 12 స్కందములు . దీనిలో శ్రీకృష్ణ జనన విశేషాలు లీలలు చరితము వివరింపబడినది . 
4. భవిష్య పురాణం ; సూర్య భగవానునిచే  మనువుకు సూర్యోపాసన విధి, అగ్ని దేవతారాదన విధానం , వర్ణాశ్రమ  ధర్మాలు వివరింపబడింది . ఇందు 14500 శ్లోకములు కలవు . ముఖ్యం గా జరగబోవు విషయాల వివరణ ఇందు ఇవ్వబడింది . 
5. భ్రహ్మ పురాణం ; భ్రహ్మ చే దక్షుడికి చెప్పబడింది . ఇందు 10,000 శ్లోకములు కలవు . దీనిలో శ్రీకృష్ణ , మార్కండేయ ,కశ్యప చరితలు , వర్ణ ధర్మాలు ,ధర్మాచారణాలు ,స్వర్గ నరకాల గురించి తెలుపబడింది . 
6. భ్రహ్మండ పురాణం ; ఇది భ్రహ్మ చే మరీచికి చెప్పబడింది . ఇందు 12,000 శ్లోకాలు కలవు . రాధాదేవి శ్రీకృష్ణుడు , పరశురామ , శ్రీరామ చంద్రుల చరితలు , శ్రీ లలితాసహస్ర నామస్త్రోత్రాలు , శివ కృష్ణ స్త్రోత్రాలు , గాన్దర్వం , ఖగోళ శాస్త్రం , స్వర్గ నరకాలు దీనిలో వివరింపబడినవి . 
7. భ్రహ్మ వైవర్త పురాణం ;ఇది సావర్ణుని చే నారదుడికి చెప్పబడింది . దీనిలో 18,000 శ్లోకములు కలవు . స్కంద , గణేశ , రుద్రా శ్రీకృష్ణుని వైభవాలు , సృష్టి కర్త భ్రహ్మ , సృష్టికి కారణమయిన బౌతిక జగత్తు (ప్రకృతి ), మరియు రాధ , దుర్గా, లక్ష్మి ,సరస్వతి సావిత్రి మొదలగు పంచ శక్తుల గురించి వివరింప బడింది . 
8. వరాహ పురాణం ; వరాహ అవతారమెత్తిన విష్ణు మూర్తి చే భూదేవికి చెప్పబడింది . ఇందు 24,000 శ్లోకములు కలవు . విష్ణుమూర్తి ఉపాసనా విధానం ఎక్కువగా కలదు . పరమేశ్వరీ, పరమేశ్వరుల చరితలు , ధర్మ శాస్త్రము వ్రాత కల్పములు , పుణ్య క్షేత్ర వర్ణనలు కలవు. 
9. వామన పురాణం ;పులస్త్య ఋషి నారద మహర్షి కి వుపదేసించినది . ఇందు 10,000 శ్లోకములు కలవు . శివలింగ ఉపాసన , శివ  పార్వతుల కల్యాణం , శివ గణేశ కార్తికేయ చరితలు , భూగోళము , రుతు వర్ణన వర్ణింపబడింది . 
10. వాయు పురాణం ; ఇది వాయు దేవుడి చే చెప్పబడింది . దీనిలో 24,000 శ్లోకములు కలవు . శివుడి మహత్యం , కాలమానం ,భూగోళం , సౌరమండలం గురించి చెప్పబడింది . 
11. విష్ణు పురాణం ; పరాశరుడు తన శిష్యుడయిన మైత్రేయునికి భోదించినది . ఇందు 23,000 శ్లోకములు కలవు . విష్ణు మహత్యం , ధ్రువ ,ప్రహ్లాద , ధ్రువ , భారతుల చరిత్రలు వివరింపబడింది . 
12.అగ్ని పురాణం ; అగ్ని భగవానునిచే వసిష్టునకు చెప్పబడింది . ఇందు 15,400 శ్లోకములు కలవు. శివ గణేశ , దుర్గ , భగవదుపాసన , వ్యాకరణం, ఛందస్సు, వైద్యం,లౌకిక ధర్మాలు , రాజకీయము, భూగోళ,ఖగోళ  శాస్త్రాలు, జ్యోతిషం మొదలగు విషయాలు వివరింప బడినవి . 
13. నారద పురాణం ;నారదుడు,సనక,సనందుడు,సనత్కుమార , సనాతన అను నలుగురు భ్రహ్మ మానస పుత్రులు చెప్పినది . ఇందు 25,000 శ్లోకములు కలవు. అతి ప్రసిద్ది చెందిన శివస్త్రోత్రము ఇందు కలదు. వేదాంగములు,వ్రతములు ,భదరి ,ప్రయాగ, వారణాసి క్షేత్ర మహత్యములు ఇందు కలవు. 
14. స్కంద పురాణం ;ఇది కుమారస్వామి చే చెప్పబడింది . ఇందు 81,000 శ్లోకములు కలవు. శివ చరిత్ర వర్ణన , స్కందుని మహత్యం, ప్రదోష స్త్రోత్రం , కాసి ఖండం,కేదార ఖండం,రేవ ఖండం(అన్నవరం), వైష్ణవ ఖండం (తిరుపతి)ఉత్కళ ఖండం (జగన్నాద క్షేత్రం ), కుమారికా ఖండం(అరుణాచల ), భ్రహ్మ ఖండం ,(రామేశ్వరం) , భ్రహ్మోత్థర ఖండం(గోకర్ణం)మొదలుగున్నవి చెప్పబదినవి. 
15. లింగ పురాణం;ఇది శివుని ఉపదేశములు . లింగరూప శివ మహిమ , దేవాలయ ఆరాధనతో పాటు వ్రతములు , ఖగోళ,జ్యోతిష్య, భూగోళ శాస్త్రములు వివరిమ్పబదినవి. 
16. గరుడ పురాణం ; ఇది విష్ణువు చే గరుత్మంతుడికి వుపదేసించబడినది . ఇందు మహా విష్ణు ఉపాసన,గరుత్మంతుడి ఆవిర్భావం,జనన మరణములు,జీవి యొక్క స్వర్గ నరక ప్రయానములు థెలుపబదినవి. 
17. కూర్మ పురాణం ;కూర్మ అవతారం ఎత్తిన విష్ణువు చే చెప్పబడింది . ఇందు 17,000 శ్లోకములు వున్నవి. వరాహ నారసిహ్మ అవతారములు , లింగరుప శివారాధన ,ఖగోళము భుగోలములతో పాటు వారణాసి ప్రయాగ క్షేత్రముల వర్ణనలు కలవు. 
18. పద్మ పురాణం ;ఇందు 85,000 శ్లోకములు కలవు. ఇది వినినంత మాత్రముననే జన్మాన్తరాలనుంది చేసిన పాపములు తొలగిపోవును . ఇందు పద్మ కల్పమున జరిగిన విశేషాలు , భ్రహ్మ సృష్టికార్యం , గీతార్దాసారం -పతనమహత్వం ,గంగా మహత్వం,గాయత్రీ చరితము,రావి వృక్ష మహిమ విభూది మహత్యం , పూజా విధులు విధానం , భగవంతుని సన్నిదిలో ఏవిదం గ ప్రవర్తించాలో విస్తారం గ వివరింపబడింది . 

ఇవే కాక హిందువులు అంతా పంచామవేదంగా కీర్తించే జయ కావ్యం గా భావించే మహాభారతాన్ని కూడా రచించారు . వీటన్నింటిని సంస్కృత భాషలో విరచించారు. మహాభారతం చెడు మీద మంచి సాదించిన విజయం కావున దీనికి జయకావ్యం అను పేరు వచ్చిందని ఒక నమ్మకం,దీనిని చదివినా విన్నా చేసే పనులలో జయం చేకూరుతుందని ఒక నమ్మకం . వేద వ్యాసుడు మహా భారత రచయిత మాత్రమే కాదు భారతానికి మూలా పురుషుడు కూడా . 
కురు వంశం నిర్వంశం అయ్యే స్థితిలో తన తల్లి సత్యవతీ దేవి ఆజ్ఞ మేరకు దృతరాష్ట్ర,పాండు ,విదురులను ప్రసాదించి ఆదుకున్నాడు . అలాగే గందారి దేవికి గర్బస్రావమ్ అయినప్పుడు ఆ ముక్కలను నేతి కుండల్లో పెట్టించి కౌరవుల పుట్టుకకు కారణమయ్యాడు . అదే విధం గ ద్రౌపది కి పాండవులతో వివాహ విషయం లో కుంతీ దేవికి వచ్చిన ధర్మ సందేహాన్ని నివృత్తి చేసాడు . ఇలా అనేక సందర్భాలలో సహాయపడ్డాడు . 
ఈయన అసలు పేరు క్రిష్ణద్యయిపాయనుడు అనర్గళం గ వున్న వేదాలను శిష్యులతో కలసి విడదీయుట వలన ఈయనకు వేద వ్యాసుడు అనే పేరు వచ్చింది . 
                                                                 ఇతి సమాప్తః 


                                                                                                                                             శశి 

Monday 15 February 2016

ఉండదగిన ప్రదేశం

                             ఉండదగిన ప్రదేశం 

  అప్పిచ్చువాడు వైద్యుడు 
నెప్పుడు నెడతెగక బారు నేరును ,ద్విజుడున్ 
జొప్పడిన యూర నుండుము 
జోప్పదకున్నట్టి యూర జొరకుము సుమతీ !
భావం ;అవసరానికి అప్పు ఇచ్చేవాడు ,వైద్యుడు , ఎల్లప్పుడూ ఆగకుండా ప్రవహించే నది లేదా ఏరు ,భ్రాహ్మణుడు గల గ్రామమన్దె నివసించాలి . వారు లేనట్టి గ్రామమందు నివసిన్చకూడదు . 
ఎప్పుడు మనకు ఏ అవసరం వస్తుందో ఎవరు చెప్పలేరు . కావున అవసరానికి అప్పు ఇచ్చి ఆడుకునే వాడు కావాలి . మనకు ఏ  చిన్న భాద కలిగినా వైద్యుడు అందుబాటులో వుంటే అది త్వరగా  నయం చేసుకోవచ్చు . బయపడనవసరం లేదు . అదే అందుబాటులో లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు కూడా అర్ధంకాక లేని పోనీ అపోహలు పెరిగి , లేనిపోని రోగాలు వచ్చే ప్రమాదం ఉంది .  కావున వైద్యుడు అందుబాటులో వుండాలి .   నీరు మనకు నిత్యావసరం నీరు లేనిదే ఏ పనీ జరగదు . కావున ఎప్పుడు ఆగకుండా ప్రవహించే నది లేదా ఏరు వుంటే ఎ ఇబ్బంది వుండదు పంటలు కూడా బాగా పండుతాయి . తద్వారా ఊరు సస్యశ్యామలంగా ఉంటుంది . ఇక మనకు మంచి చెడు చెప్పడానికి భ్రాహ్మణుడు కావాలి . అలాగే వేద మంత్ర గోష వినిపిస్తువుంటే అక్కడ  ఏ  చెడు  వుండదు . ఎల్లపుడు మంచి జరుగుతుంది . 


                                                                                                                              శశి 



Sunday 14 February 2016

sakalapraanikotiki muladharam suryudu

                               సకలలోకాలకు మూలాధారం  సూర్య భగవానుడు

                      సప్థాశ్వరధ సమారూదమ్ ప్రచండం కస్యపాత్మజం
                      శ్వేత పద్మధరమ్ దేవం తం సూర్యం ప్రణమామ్యహం
సకల జీవకోటికి మూలధారమ్ సూర్య భగవానుడు . వానలు పడాలన్నా పంటలు పండాలన్నా సర్వ జీవకోటి మనుగడ సాధించాలన్నా సూర్యుడే మూల కారణం .  కనిపించే ప్రత్యక్ష దేవుడు సూర్య భగవానుడు . కనుకే అయన పయనించే దిశను బట్టి ఉత్తరాయణం ,దక్షిణాయనం అని విభజించారు . 
రోజుల పసిపిల్లలను సయితం సూర్యుడి కాంతి తగిలితే ఎటువంటి రోగాలు దరిచేరవని నమ్ముతారు . తనను నమ్మిన వాళ్ళను చల్లగా చూసే భగవానుడు సూర్యుడు అనడానికి ఇంతకన్నా పెద్ద నిదర్సనం ఎక్కడా వుండదు . సూర్యుడు ఆరోగ్య ప్రదాత . ఆయనను పూజించే వారికీ ఆయు రారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి . నేటి ఆదునిక కాలంలో కూడా ఆరోగ్యం కోసం చాలా మంది సూర్య నమస్కారాలు చేయడం చూస్తూనే వుంటాం . 
మన హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం 7 సంఖ్యకు చాలా ప్రాధాన్యత వుంది . వారానికి రోజులు 7,కలిసి జీవించాలనుకునే వధూ వరులు వేసే అడుగులు 7, ఇంద్రదనస్సులో రంగులు 7,సూర్యుడి రధానికి గుర్రాలు 7 . తిదులలో 7 వ రోజు వచ్చేదే సప్తమి . మాఘమాసంలో వచ్చే సప్తమిని రధసప్తమి అంటారు . 
ఈ తిధిన సుర్యభాగావనుడికి పూజ చేయడం ద్వారా అయన అనుగ్రహానికి పాత్రులం కావచ్చు . శ్రీమత్ సూర్య భగవానుడు ఏడూ గుర్రాల రధాన్ని అధిరోహించి తూర్పు నుండి పడమరకు తిరుగుతుంటాడు . అయన రధ సారధి పేరు అనూరుడు . ఆయనకు నడుము నుండి పై భాగం మాత్రమే వుండడం వల్ల ఆ పేరు వచ్చింది . ఆయన విష్ణు మూర్తి వాహనం అయిన గరుత్మంతుడి అన్న . శ్రీ రామ చంద్రుడు సూర్య వంశస్థుడు . 

ఈ తిధిన ఉదయాన్నే లేచి జిల్లేడు ఆకులు , రేగి ఆకులు తల మీద పెట్టుకుని తల స్నానం చెయ్యాలి . ఆరుబయట ఆవు పేడతో అలికి ముగ్గు వేసి ,ఆవు పిడకల మీద కొత్త గిన్నెతో పాలు పొంగించి , పరవాన్నం వండాలి . చిక్కుడు కాయలతో రధాన్ని తయారు చేసి చిక్కుడు ఆకు మీద వండిన పరవన్నాన్ని పెట్టి సూర్యుడికి నైవేద్యం పెట్టాలి . ఇది తరతరాల నుండి వస్తున్న ఆచారం . ఇప్పటి తరానికి ఈ ఆచార సంప్రదాయాలు ఏవి తెలియకుండా పోతున్నాయి . మన ఆచారాలు పద్దతులు అంతరించిపోకూడదు . అలా అంతరించి పోకుండా ఉండాలంటే పిల్లలకు  మన ఆచార వ్యవహారాలను తెలియచెప్పాల్సిన ఆవశ్యకత ఎంతయినా వుంది . 
ప్రపంచం అంతా మెచ్చే మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ , వాటి పలితాలను మనందరం పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను చివరిసారిగా మరొక్కసారి ఆరోగ్య ఐశ్వర్య ప్రదాత ,ప్రత్యక్ష భగవంతుడు అయిన సూర్య భగవానుడికి నమస్కారములు . ఆ సూర్య దేవుడి అనుగ్రహం ఈ జగతికి అంతటికి ఎప్పటికి ఇలానే వుండాలని కోరుకుంటున్నాను . 

                              సర్వేషాం స్వస్తిర్భవతు 
                              సర్వేషాం శాంతిర్భవతు 
                              సర్వేషాం పూర్ణం భవతు 
                              సర్వేషాం మంగళం భవతు .  


                                                                                                                                        శశి 

Saturday 13 February 2016

suryaaya namaha


సూర్యాయనమహ 

suuryaayanamahaసప్తాశ్వ రధ  సమరూధమ్ ప్రచండం కస్యపాత్మజం 

శ్వేతపద్మ ధరం దేవం తం సూర్యమ్ ప్రణమామ్యహం . 



Thursday 11 February 2016

janmanakshatram mokkalu

జన్మ నక్షత్రం ప్రకారం పూజించవలసిన మొక్కలు 

1అశ్విని నక్షత్రం                 విషముష్టి లేదా జీడి మామిడి 
పలితం                              పెంచడం లేదా పూజించడం ద్వారా సంతానవ్రుద్ది . అన్నిటా విజయం 
2భరణి                               ఉసిరి చెట్టు 
పలితం                               జీర్నవ్యవస్థ ,ఉదర సంబందిత బాధల నుండి ఉపశమనం పొన్ధవచు. 
3కృత్తిక                              అత్తి లేదా మేడి 
పలితం                              గుండె జబ్బులు నయం అవుతాయి . ఎఅటువంటి విమర్సలనైన తట్టుకునే శక్తి కలుగుతుంది . 
4రోహిణి                           నేరేడు 
పలితం                           షుగర్ వ్యాది తగ్గుతుంది . ఎఅటువంటి సమస్యలనుండి అయిన బయట పడగలరు ఆకర్షనీయమైన రూపం కలుగుతుంది . వ్యవసాయం వాటికీ సంబందించిన వృత్తులలో ఎఅదగదనికి ఉపయోగపడుతుంది . 
5మృగశిర                         మారేడు లేదా చండ్ర 
పలితాలు                           గొంతు సంబందిత వ్యాదుల నుండి ఉపశమనం పొందుతారు భుదవారం పూజించడం వల్ల ఆర్దిక పరమయిన చిక్కుల నుండి బయట పడతారు 
6ఆరుద్ర                             చింత 
పలితాలు                        గొంతు స్వరపేటిక బాధల నుండి విముక్తి పొందగలరు విష జంతువుల బారి నుండి బయట పడగలరు 
7పునర్వసు                    వెదురు లేదా గన్నేరు 
పలితాలు                       ఊపిరితిత్తులు ,క్షయ ,క్యాన్సర్ నుండి ఉపసమనం పొందుతారు . బాలింతలు దీనిని పెంచడం వలన పాలకి లోటు ఉండదు 
8పుష్యమి                      రావి లేదా పిప్పలి 
పలితాలు                       నరాలు సంబంధ బాధల నుండి విముక్తి పొందడం ,శత్రువుల నుండి రక్షణ కలుగుతుంది ,ఆర్దిక ,ఋణ బాధ నుండి విముక్తి లబిస్తుంది ,స్త్రీలు సంతనవతులు అవుతారు . 
9ఆశ్లేష                           సంపంగి ,చంపకం 
పలితాలు                        ఎఅతువంటి వ్యాదులనుండి అయిన రక్షణ పొందగలరు ఎఅతువన్తి సమస్య అయిన తట్టుకోవచ్చు. 
10మఖ                          మఱ్ఱి . 
పలితాలు                        తల్లితండ్రులకు సంతానానికి మేలు జరుగుతుంది . అన్ని పనులలో విజయం చెకూరుతున్ది . 
11పుబ్బ                         మోదుగ 
పలితాలు                       సంతానం కలుగుతుంది . 
12ఉత్తర                         జువ్వి 
పలితాలు                        హృదయ సంబందిత వ్యాదుల నుండి బయటపడతారు అందరు స్నేహితులుగా వుంటారు 
13హస్త                        సన్నజాజి కుంకుడు 
పలితాలు                      ఎఅతువన్తి పరిస్తుతులనయిన తట్టుకుని విజయం సాదిస్తారు 
14చిత్త                          మారేడు లేదా తాళ్ళ చెట్టు 
పలితాలు                      ఈశ్వరానుగ్రహం కలుగుతుంది వారి సొంత తెలివి తేటలతో ఇతరులను చిత్తు చేయగల నైపుణ్యం కలుగుతుంది . 
15స్వాతి                      మద్ది 
పలితాలు                     అన్ని రకాల విద్యలలో రాణిస్తారు ,ఆత్మ విశ్వాసం కలుగుతుంది . 
16 విశాక                     వెలగ లేదా మొగలి 
పలితాలు                    గౌరవ మర్యాదలు ధనము లబిస్తాయి . 
17 అనురాధ               పొగడ 
పలితాలు                     గుర్తింపు లబిస్తుంది . 
18జ్యేష్ట                        విష్టి 
పలితాలు                    ఆత్మ విశ్వాసం లబిస్తుంది . 
19 మూల                  వేగి 
పలితాలు                    ఆరోగ్య సమస్యలనుండి బయట పడతారు శాస్త్ర ప్రావీణ్యం లభిస్తుంది జుట్టు రాలడం తగ్గుతుంది . 
20 పూర్వాషాడ            నిమ్మ లేదా అశోక 
పలితాలు                     సెగగడ్డలు రావు పరోపకారం వినయ విదేయతలు పెరుగుతాయి . కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి . 
21ఉత్తరాషాడ             పనస 
పలితాలు                     ఆరిక సమస్యలు రావు భూములకు సంబందించిన వ్యవహారాలు కలసి వస్తాయి . 
22 శ్రవణం                    జిల్లేడు 
పలితాలు                    మానసిక ,ఆర్దిక  బాధలు తొలగి కార్య జయం కలుగు తుంది . 
23ధనిష్ఠ                     జమ్మి 
పలితాలు                    తెలివితేటలు పెరుగుతాయి . కుటుంబ సబ్యుల అండదండలు పెరుగుతాయి . సంతానం కలుగుతుంది . 
24 సతబిషం               కడిమి లేదా అరటి 
పలితాలు                   వుద్యోగం,జీవితం లో స్థిరపడతారు . 
25పుర్వబాద్ర              మామిడి 
పలితాలు                    ఉద్యోగంలో మంచి స్థితి పొందడానికి రాజకీయం లో రాణించడానికి ఆర్దికం గ స్థిరపడడానికి ఉపయోగపడుతుంది . 
26 వుత్తరబాద్ర            వేప 
పలితాలు                    విదేశాలలో ఉన్నత విద్య ఉన్నత పదవులు పొందుతారు జీవితం ఆనందంగా వుంటుంది . 
27 రేవతి                     విప్ప 
పలితాలు                   మంచి విజ్ఞానం లబిస్తాయి మంచి శిథి పొందుతారు 
                       

ఈ జగానికి అంతటికి పార్వతి పరమేశ్వరులు తల్లితండ్రులు
జగన్మాత పార్వతీదేవి శక్తీ స్వరూపిణి ఈ చారాచార జగమంతటిలోని శక్తికి మూలం, అయినప్పటికీ పతవ్రత (పతియే వ్రతముగా కలది )సదాచార పరాయిని యావత్ స్త్రీ జగతికే ఆదర్సమూర్థి.  విగ్నాధిపతి వినాయకుడికి ,దేవ సైన్యాదిపతి కుమారస్వామికి జనని .
జగత్పిత పరమేశ్వరుడు సంబుడు బక్త సులబుడు హరహర అంటు కాసిని నీళ్లు శివుడి శిరస్సున పోస్తే చాలు కోరిన కోర్కెలన్నీ తీర్చే బోలా శంకరుడు ఇ జగత్ కోసం హాలాహలాన్ని కూడా గొంతులో ఇముడ్చుకున్న కరుణామయుడు బక్తితో ప్రార్దిస్తే మరణం ను కూడా దరిచేరనివ్వడు
దివ్య కాంతితో ,మణి రత్న వజ్ర వైదూర్యాలథొ ప్రకాశించే చూడగానే బక్తి బావం కలిగే పాద పద్మాలకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను . ఏ పాద పద్మాలకు దేవతలు అందరూ శిరస్సు వంచి నమస్కరిస్తారో అటువంటి పాద పద్మాలకు నమస్కరిస్తున్నాను 

Wednesday 10 February 2016

वागर्दा विव स्म्प्रुक्थव्  वगर्दः प्रथिपथये
जगदः पिथरव् वन्दे पर्वथि परमेस्वरव्