Sunday 14 February 2016

sakalapraanikotiki muladharam suryudu

                               సకలలోకాలకు మూలాధారం  సూర్య భగవానుడు

                      సప్థాశ్వరధ సమారూదమ్ ప్రచండం కస్యపాత్మజం
                      శ్వేత పద్మధరమ్ దేవం తం సూర్యం ప్రణమామ్యహం
సకల జీవకోటికి మూలధారమ్ సూర్య భగవానుడు . వానలు పడాలన్నా పంటలు పండాలన్నా సర్వ జీవకోటి మనుగడ సాధించాలన్నా సూర్యుడే మూల కారణం .  కనిపించే ప్రత్యక్ష దేవుడు సూర్య భగవానుడు . కనుకే అయన పయనించే దిశను బట్టి ఉత్తరాయణం ,దక్షిణాయనం అని విభజించారు . 
రోజుల పసిపిల్లలను సయితం సూర్యుడి కాంతి తగిలితే ఎటువంటి రోగాలు దరిచేరవని నమ్ముతారు . తనను నమ్మిన వాళ్ళను చల్లగా చూసే భగవానుడు సూర్యుడు అనడానికి ఇంతకన్నా పెద్ద నిదర్సనం ఎక్కడా వుండదు . సూర్యుడు ఆరోగ్య ప్రదాత . ఆయనను పూజించే వారికీ ఆయు రారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి . నేటి ఆదునిక కాలంలో కూడా ఆరోగ్యం కోసం చాలా మంది సూర్య నమస్కారాలు చేయడం చూస్తూనే వుంటాం . 
మన హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం 7 సంఖ్యకు చాలా ప్రాధాన్యత వుంది . వారానికి రోజులు 7,కలిసి జీవించాలనుకునే వధూ వరులు వేసే అడుగులు 7, ఇంద్రదనస్సులో రంగులు 7,సూర్యుడి రధానికి గుర్రాలు 7 . తిదులలో 7 వ రోజు వచ్చేదే సప్తమి . మాఘమాసంలో వచ్చే సప్తమిని రధసప్తమి అంటారు . 
ఈ తిధిన సుర్యభాగావనుడికి పూజ చేయడం ద్వారా అయన అనుగ్రహానికి పాత్రులం కావచ్చు . శ్రీమత్ సూర్య భగవానుడు ఏడూ గుర్రాల రధాన్ని అధిరోహించి తూర్పు నుండి పడమరకు తిరుగుతుంటాడు . అయన రధ సారధి పేరు అనూరుడు . ఆయనకు నడుము నుండి పై భాగం మాత్రమే వుండడం వల్ల ఆ పేరు వచ్చింది . ఆయన విష్ణు మూర్తి వాహనం అయిన గరుత్మంతుడి అన్న . శ్రీ రామ చంద్రుడు సూర్య వంశస్థుడు . 

ఈ తిధిన ఉదయాన్నే లేచి జిల్లేడు ఆకులు , రేగి ఆకులు తల మీద పెట్టుకుని తల స్నానం చెయ్యాలి . ఆరుబయట ఆవు పేడతో అలికి ముగ్గు వేసి ,ఆవు పిడకల మీద కొత్త గిన్నెతో పాలు పొంగించి , పరవాన్నం వండాలి . చిక్కుడు కాయలతో రధాన్ని తయారు చేసి చిక్కుడు ఆకు మీద వండిన పరవన్నాన్ని పెట్టి సూర్యుడికి నైవేద్యం పెట్టాలి . ఇది తరతరాల నుండి వస్తున్న ఆచారం . ఇప్పటి తరానికి ఈ ఆచార సంప్రదాయాలు ఏవి తెలియకుండా పోతున్నాయి . మన ఆచారాలు పద్దతులు అంతరించిపోకూడదు . అలా అంతరించి పోకుండా ఉండాలంటే పిల్లలకు  మన ఆచార వ్యవహారాలను తెలియచెప్పాల్సిన ఆవశ్యకత ఎంతయినా వుంది . 
ప్రపంచం అంతా మెచ్చే మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ , వాటి పలితాలను మనందరం పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను చివరిసారిగా మరొక్కసారి ఆరోగ్య ఐశ్వర్య ప్రదాత ,ప్రత్యక్ష భగవంతుడు అయిన సూర్య భగవానుడికి నమస్కారములు . ఆ సూర్య దేవుడి అనుగ్రహం ఈ జగతికి అంతటికి ఎప్పటికి ఇలానే వుండాలని కోరుకుంటున్నాను . 

                              సర్వేషాం స్వస్తిర్భవతు 
                              సర్వేషాం శాంతిర్భవతు 
                              సర్వేషాం పూర్ణం భవతు 
                              సర్వేషాం మంగళం భవతు .  


                                                                                                                                        శశి 

No comments:

Post a Comment