Tuesday 16 February 2016

వ్యాస భగవానుడు

                          వ్యాస భగవానుడు 

ప్రాచీన కాలం లో ప్రస్తుతం ఉన్నంత సాంకేతిక పరిజ్ఞానం గాని, అబివృద్ది గాని ,ప్రజలకు అన్ని విషయాలమీద అవగాహన గాని వుండేది కాదు . ప్రాచీన కాలం లో అరణ్య ప్రాంతం ఎక్కువగా వుండేది . సాంకేతికత అభివృద్ధి చెందని కారణంగా ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఎక్కువ శాతం ప్రజలు నడిచే వెళ్ళేవాళ్ళు . కాస్తోకూస్తో డబ్బు వున్నవాళ్ళు ఎడ్ల బండ్ల మీదో , గుర్రాల మీదో వెళ్ళేవారు . ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వార్త చేరాలంటే ఎవరయినా  ఆ ప్రాంతానికి  వెళ్లి చెప్పాలి . డబ్బు వున్నా వాళ్ళు పావురాల ద్వారా సందేశాన్ని పంపేవారు . అందుకే పెద్దలు కాశీకి వెళ్ళిన వాళ్ళు కాటికి వెళ్ళిన వాళ్ళతో సమానం అనేవారు . కాశీకి వెళ్ళాలంటే అరణ్యాలగుండా వెళ్ళాలి ,నడిచి వెళ్ళాలి , అలా వెళ్లి రావడానికి కొన్ని నెలల లేదా సంవత్సరం పైనే సమయం పట్టొచ్చు . ఈలోపు వాళ్ళ గురించిన సమాచారం దారిలో వాళ్ళను ఎవరయినా చూసి వచ్చి చెబితే   తెలిసేది . లేకపోతే ఆ సమాచారం కూడా తెలిసేది కాదు . పై పెచ్చు వాళ్ళు వెళ్ళే మార్గం అరణ్య మార్గం కావడం వల్ల , అరణ్యంలో వుండే క్రూర మృగాల వల్ల  చాలా మంది మృత్యు వాత పడేవాళ్లు . ఆ వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తే తప్ప వాళ్ళు ఎలావున్నారో ఎక్కడవున్నారో తెలియని పరిస్థితి . 
జనాలకు వారి వారి కుల వృత్తులే జీవనాధారం . ఏ ఇతర జీవనోపాది మార్గాలు లేవు . కనుక పిల్లలను  చిన్నప్పటి నుండే వారి వృత్తి విద్యల్లో బాగాస్వాములను చేసేవారు .  చదువు కునే వారు చాలా తక్కువగా వుండేవారు . చదువు చెప్పే వారు కూడా తక్కువగా వుండేవారు . అప్పట్లో దేవాలయాలు  జ్ఞాన కేంద్రాలుగా ఉండేవి . సాయంత్ర సమయాలలో చిన్నా పెద్దా అందరు దేవాలయాలకు చేరుకునే వారు . అక్కడ చదువుకున్న పండితులు పురాణాలు, గ్రంధాలు చదివి వాటికి అర్ధం చెప్పెవారు. అప్పుడప్పుడు హరికధలు , బుర్రకధలను ప్రదర్శించేవారు . ఆ విధంగా ప్రజలు మంచి, చెడు తెలుసుకునేవారు . ఉదా ;రామాయణం విని రాముడిలా వుండాలి రావణుడిలా ఉండకూడదు  అని తెలుసుకునేవారు . 
పురాణాలను మొట్టమొదటగా రాసినది వ్యాసభగవానుడు . పురాణాలు మొత్తం 18 అవి 
1మత్య పురాణం ;ఇది మత్యావతారుడు అయిన విష్ణు ముర్తిచే మనువుకు భోదిమ్పబడినది . ఇందు 14000 శ్లోకములు కలవు .  దీనియందు కార్తికేయ ,యయాతి సావిత్రి చరిత్రలు ప్రయాగ వారణాసి మొదలగు పుణ్యక్షేత్ర మహత్యములు చెప్పబదినవి. 
2. మార్కండేయ పురాణం ;ఇది మార్కండేయ మహర్షి చే చెప్పబడింది . ఇందు 9000 శ్లోకములు కలవు . దీనిలో శివ విష్ణువుల మహత్యములు , ఇంద్ర , అగ్ని, సూర్య , మరియు దేవి మహత్యాలు చెప్పబడినవి . చండీ హోమమ , శత చండీ హోమం , సహస్ర చండీ హోమముల విధానాలకు ఇదే ఆధారం . 
3భాగవతం ; వేదవ్యాసుని వల్ల  శుకునికి , శుకుని వల్ల పరీక్షిత్ మహారాజుకు తెలుపబడింది . దీనిలో 18000 శ్లోకములు కలవు . ఇది మొత్తం 12 స్కందములు . దీనిలో శ్రీకృష్ణ జనన విశేషాలు లీలలు చరితము వివరింపబడినది . 
4. భవిష్య పురాణం ; సూర్య భగవానునిచే  మనువుకు సూర్యోపాసన విధి, అగ్ని దేవతారాదన విధానం , వర్ణాశ్రమ  ధర్మాలు వివరింపబడింది . ఇందు 14500 శ్లోకములు కలవు . ముఖ్యం గా జరగబోవు విషయాల వివరణ ఇందు ఇవ్వబడింది . 
5. భ్రహ్మ పురాణం ; భ్రహ్మ చే దక్షుడికి చెప్పబడింది . ఇందు 10,000 శ్లోకములు కలవు . దీనిలో శ్రీకృష్ణ , మార్కండేయ ,కశ్యప చరితలు , వర్ణ ధర్మాలు ,ధర్మాచారణాలు ,స్వర్గ నరకాల గురించి తెలుపబడింది . 
6. భ్రహ్మండ పురాణం ; ఇది భ్రహ్మ చే మరీచికి చెప్పబడింది . ఇందు 12,000 శ్లోకాలు కలవు . రాధాదేవి శ్రీకృష్ణుడు , పరశురామ , శ్రీరామ చంద్రుల చరితలు , శ్రీ లలితాసహస్ర నామస్త్రోత్రాలు , శివ కృష్ణ స్త్రోత్రాలు , గాన్దర్వం , ఖగోళ శాస్త్రం , స్వర్గ నరకాలు దీనిలో వివరింపబడినవి . 
7. భ్రహ్మ వైవర్త పురాణం ;ఇది సావర్ణుని చే నారదుడికి చెప్పబడింది . దీనిలో 18,000 శ్లోకములు కలవు . స్కంద , గణేశ , రుద్రా శ్రీకృష్ణుని వైభవాలు , సృష్టి కర్త భ్రహ్మ , సృష్టికి కారణమయిన బౌతిక జగత్తు (ప్రకృతి ), మరియు రాధ , దుర్గా, లక్ష్మి ,సరస్వతి సావిత్రి మొదలగు పంచ శక్తుల గురించి వివరింప బడింది . 
8. వరాహ పురాణం ; వరాహ అవతారమెత్తిన విష్ణు మూర్తి చే భూదేవికి చెప్పబడింది . ఇందు 24,000 శ్లోకములు కలవు . విష్ణుమూర్తి ఉపాసనా విధానం ఎక్కువగా కలదు . పరమేశ్వరీ, పరమేశ్వరుల చరితలు , ధర్మ శాస్త్రము వ్రాత కల్పములు , పుణ్య క్షేత్ర వర్ణనలు కలవు. 
9. వామన పురాణం ;పులస్త్య ఋషి నారద మహర్షి కి వుపదేసించినది . ఇందు 10,000 శ్లోకములు కలవు . శివలింగ ఉపాసన , శివ  పార్వతుల కల్యాణం , శివ గణేశ కార్తికేయ చరితలు , భూగోళము , రుతు వర్ణన వర్ణింపబడింది . 
10. వాయు పురాణం ; ఇది వాయు దేవుడి చే చెప్పబడింది . దీనిలో 24,000 శ్లోకములు కలవు . శివుడి మహత్యం , కాలమానం ,భూగోళం , సౌరమండలం గురించి చెప్పబడింది . 
11. విష్ణు పురాణం ; పరాశరుడు తన శిష్యుడయిన మైత్రేయునికి భోదించినది . ఇందు 23,000 శ్లోకములు కలవు . విష్ణు మహత్యం , ధ్రువ ,ప్రహ్లాద , ధ్రువ , భారతుల చరిత్రలు వివరింపబడింది . 
12.అగ్ని పురాణం ; అగ్ని భగవానునిచే వసిష్టునకు చెప్పబడింది . ఇందు 15,400 శ్లోకములు కలవు. శివ గణేశ , దుర్గ , భగవదుపాసన , వ్యాకరణం, ఛందస్సు, వైద్యం,లౌకిక ధర్మాలు , రాజకీయము, భూగోళ,ఖగోళ  శాస్త్రాలు, జ్యోతిషం మొదలగు విషయాలు వివరింప బడినవి . 
13. నారద పురాణం ;నారదుడు,సనక,సనందుడు,సనత్కుమార , సనాతన అను నలుగురు భ్రహ్మ మానస పుత్రులు చెప్పినది . ఇందు 25,000 శ్లోకములు కలవు. అతి ప్రసిద్ది చెందిన శివస్త్రోత్రము ఇందు కలదు. వేదాంగములు,వ్రతములు ,భదరి ,ప్రయాగ, వారణాసి క్షేత్ర మహత్యములు ఇందు కలవు. 
14. స్కంద పురాణం ;ఇది కుమారస్వామి చే చెప్పబడింది . ఇందు 81,000 శ్లోకములు కలవు. శివ చరిత్ర వర్ణన , స్కందుని మహత్యం, ప్రదోష స్త్రోత్రం , కాసి ఖండం,కేదార ఖండం,రేవ ఖండం(అన్నవరం), వైష్ణవ ఖండం (తిరుపతి)ఉత్కళ ఖండం (జగన్నాద క్షేత్రం ), కుమారికా ఖండం(అరుణాచల ), భ్రహ్మ ఖండం ,(రామేశ్వరం) , భ్రహ్మోత్థర ఖండం(గోకర్ణం)మొదలుగున్నవి చెప్పబదినవి. 
15. లింగ పురాణం;ఇది శివుని ఉపదేశములు . లింగరూప శివ మహిమ , దేవాలయ ఆరాధనతో పాటు వ్రతములు , ఖగోళ,జ్యోతిష్య, భూగోళ శాస్త్రములు వివరిమ్పబదినవి. 
16. గరుడ పురాణం ; ఇది విష్ణువు చే గరుత్మంతుడికి వుపదేసించబడినది . ఇందు మహా విష్ణు ఉపాసన,గరుత్మంతుడి ఆవిర్భావం,జనన మరణములు,జీవి యొక్క స్వర్గ నరక ప్రయానములు థెలుపబదినవి. 
17. కూర్మ పురాణం ;కూర్మ అవతారం ఎత్తిన విష్ణువు చే చెప్పబడింది . ఇందు 17,000 శ్లోకములు వున్నవి. వరాహ నారసిహ్మ అవతారములు , లింగరుప శివారాధన ,ఖగోళము భుగోలములతో పాటు వారణాసి ప్రయాగ క్షేత్రముల వర్ణనలు కలవు. 
18. పద్మ పురాణం ;ఇందు 85,000 శ్లోకములు కలవు. ఇది వినినంత మాత్రముననే జన్మాన్తరాలనుంది చేసిన పాపములు తొలగిపోవును . ఇందు పద్మ కల్పమున జరిగిన విశేషాలు , భ్రహ్మ సృష్టికార్యం , గీతార్దాసారం -పతనమహత్వం ,గంగా మహత్వం,గాయత్రీ చరితము,రావి వృక్ష మహిమ విభూది మహత్యం , పూజా విధులు విధానం , భగవంతుని సన్నిదిలో ఏవిదం గ ప్రవర్తించాలో విస్తారం గ వివరింపబడింది . 

ఇవే కాక హిందువులు అంతా పంచామవేదంగా కీర్తించే జయ కావ్యం గా భావించే మహాభారతాన్ని కూడా రచించారు . వీటన్నింటిని సంస్కృత భాషలో విరచించారు. మహాభారతం చెడు మీద మంచి సాదించిన విజయం కావున దీనికి జయకావ్యం అను పేరు వచ్చిందని ఒక నమ్మకం,దీనిని చదివినా విన్నా చేసే పనులలో జయం చేకూరుతుందని ఒక నమ్మకం . వేద వ్యాసుడు మహా భారత రచయిత మాత్రమే కాదు భారతానికి మూలా పురుషుడు కూడా . 
కురు వంశం నిర్వంశం అయ్యే స్థితిలో తన తల్లి సత్యవతీ దేవి ఆజ్ఞ మేరకు దృతరాష్ట్ర,పాండు ,విదురులను ప్రసాదించి ఆదుకున్నాడు . అలాగే గందారి దేవికి గర్బస్రావమ్ అయినప్పుడు ఆ ముక్కలను నేతి కుండల్లో పెట్టించి కౌరవుల పుట్టుకకు కారణమయ్యాడు . అదే విధం గ ద్రౌపది కి పాండవులతో వివాహ విషయం లో కుంతీ దేవికి వచ్చిన ధర్మ సందేహాన్ని నివృత్తి చేసాడు . ఇలా అనేక సందర్భాలలో సహాయపడ్డాడు . 
ఈయన అసలు పేరు క్రిష్ణద్యయిపాయనుడు అనర్గళం గ వున్న వేదాలను శిష్యులతో కలసి విడదీయుట వలన ఈయనకు వేద వ్యాసుడు అనే పేరు వచ్చింది . 
                                                                 ఇతి సమాప్తః 


                                                                                                                                             శశి 

No comments:

Post a Comment