Sunday 21 February 2016

                         కుల కాంత తోడ నెప్పుడు 
                           గలహింపకు ,వట్టి తప్పు ఘటియింపకుమీ 
                          కలకంటి కంట కన్నీ 
                          రొలికిన సిరి ఇంట నుండ నొల్లదు సుమతీ !
భావం ; చీటికీ మాటికీ బార్యతో తగవులు పెట్టుకొనరాదు . లేని నేరాలను ఆరొపించరాదు . ఉత్తమ ఇల్లాలి యొక్క కంట నీరు క్రింద పడినచో ఆ ఇంట సంపదలు తొలగిపోవును . అనగా సంపద సౌఖ్యము తొలగి దారిద్రము రాగలదని భావము . 
భార్యా భర్తలు ఇద్దరు ఒకరినొకరు అర్ధం చేసుకుని సంతోషంగా ఉన్నట్లయితే ఆ ఇల్లు స్వర్గం తో సమానం అది ధనవంతుల ఇల్లయినా ,మధ్యతరగతి ఇల్లయినా, పేద ఇల్లయినా సంతోషాలలో వారిది కోటీశ్వర కుటుంభమే అనడం లో ఎ సందేహం లేదు . భార్యా భర్తల మద్య ఎ అనుమానాలు అపోహలు లేక ప్రేమానురాగాలతో ఉన్నట్లయితే చేసే పని లేదా ఉద్యోగానికి 100%న్యాయం చెయ్యగలరు . తద్వారా ఉద్యోగంలో మంచి పేరును తెచ్చుకుని మంచి స్థితిని కూడా పొందగలరు . ఇక్కడ మనం గమనించినట్లయితే భార్య భర్తలు అన్యోన్యంగా ఉన్నట్లయితే ఇంట బయట కూడా సంతోషం గ ఉండగలరు . అలాగే మనస్సు ప్రశాంతం గా వుండడం వల్ల బి పి ,షుగర్ ,గుండె జబ్బులు ఇంకా అనేక రోగాలు దరిదాపుల్లోకి కూడా రావు . అంతే కాక అటువంటి ప్రశాంత సంతోషకరమయిన వాతావరణం లో పెరిగిన పిల్లలు మంచి, మానవత్వం కలిగి మన దేశానికి ఉత్తమ పౌరులు అవుతారు .
పుట్టి పెరిగిన వాతావరణాన్ని ,తల్లి తండ్రులను , తోడ  పుట్టిన వాళ్ళని వదిలి భర్తే లోకంగా బతికే భార్యను చక్కగా చూసుకోవలసిన భాద్యత భర్తది . అదే విధంగా ఇల్లు,భార్య , పిల్లలు కోసం కష్టపడి సంపాదిస్తూ అనుక్షణం తన పిల్లలు తన కుటుంభ సభ్యుల కోసమే ఆలోచిస్తూ కష్టపడే భర్తను అర్ధం చేసుకుని ,ఇంటిని ,పిల్లలను చక్కగా చూసుకోవలసిన భాద్యత భార్యది . ఎవరి భాద్యతలను వారు సక్రమంగా నిర్వహించుకుంటూ ఒకరినొకరు అర్ధం చేసుకుంటూ ప్రతి ఇల్లు ఒక నందన వనం లా సుందరంగా మారాలని మనస్పూర్తిగా కోరుకుంటూ 




                                                                                                                           మీ శశి 









 

No comments:

Post a Comment