ఉండదగిన ప్రదేశం
అప్పిచ్చువాడు వైద్యుడు
నెప్పుడు నెడతెగక బారు నేరును ,ద్విజుడున్
జొప్పడిన యూర నుండుము
జోప్పదకున్నట్టి యూర జొరకుము సుమతీ !
భావం ;అవసరానికి అప్పు ఇచ్చేవాడు ,వైద్యుడు , ఎల్లప్పుడూ ఆగకుండా ప్రవహించే నది లేదా ఏరు ,భ్రాహ్మణుడు గల గ్రామమన్దె నివసించాలి . వారు లేనట్టి గ్రామమందు నివసిన్చకూడదు .
ఎప్పుడు మనకు ఏ అవసరం వస్తుందో ఎవరు చెప్పలేరు . కావున అవసరానికి అప్పు ఇచ్చి ఆడుకునే వాడు కావాలి . మనకు ఏ చిన్న భాద కలిగినా వైద్యుడు అందుబాటులో వుంటే అది త్వరగా నయం చేసుకోవచ్చు . బయపడనవసరం లేదు . అదే అందుబాటులో లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు కూడా అర్ధంకాక లేని పోనీ అపోహలు పెరిగి , లేనిపోని రోగాలు వచ్చే ప్రమాదం ఉంది . కావున వైద్యుడు అందుబాటులో వుండాలి . నీరు మనకు నిత్యావసరం నీరు లేనిదే ఏ పనీ జరగదు . కావున ఎప్పుడు ఆగకుండా ప్రవహించే నది లేదా ఏరు వుంటే ఎ ఇబ్బంది వుండదు పంటలు కూడా బాగా పండుతాయి . తద్వారా ఊరు సస్యశ్యామలంగా ఉంటుంది . ఇక మనకు మంచి చెడు చెప్పడానికి భ్రాహ్మణుడు కావాలి . అలాగే వేద మంత్ర గోష వినిపిస్తువుంటే అక్కడ ఏ చెడు వుండదు . ఎల్లపుడు మంచి జరుగుతుంది .
శశి
No comments:
Post a Comment