Saturday 20 February 2016

పారిజాతాపహరణం

                                 పారిజాతాపహరణం 

పారిజాతాపహరణం గ్రంధ రచయిత నంది తిమ్మన .  ఈయననే ముక్కు తిమ్మన అని కూడా అంటారు . ఈయన శ్రీ కృష్ణ దేవరాయాలి ఆస్థాన అష్ట దిగ్గజ కవులలో ఒకరు . రాయల వారి వివాహ సమయంలో ఈయన అరణపు కవిగా వచ్చారు . అనగా పూర్వం రాజుల వివాహ సమయంలో అత్తారింటికి వెళ్లే ఆడపిల్లలతో పాటు చెలికత్తెలను కూడా పంపేవారు అదేవిధంగా నంది తిమ్మనగారు శ్రీ కృష్ణదేవరాయల వివాహ సమయం లో  అయన అత్తవారింటి నుండి వచ్చారు . 

కధ ;

నారదుడు ఇంద్ర లోకంలో ఇంద్రుడు తనకు భాహుమతిగా ఇచ్చిన అపురూప పుష్పం(ఆ పువ్వు ను ధరిస్తే ఎప్పటికి ఎవ్వనులుగా ఉంటారని నమ్మకం . ఆ వృక్షం దేవలోకంలో మాత్రమే వుండేది ) పారిజాతాన్ని ద్వారకలో ఉన్న శ్రీ కృష్ణుడికి ఇస్తాడు . అప్పుడు కృష్ణుడు రుక్మిణి దేవి అంతః పురం లో వున్నారు . ఆ పువ్వు ను ఎదురుగా వున్న రుక్మిణికి ఇవ్వాలా ?సత్య భామకు ఇవ్వాలా అన్న సందిగ్దావస్థలో వున్న కృష్ణుడికి నారదుడు రుక్మిణికి ఇమ్మని సైగ చేస్తాడు . దాంతో కృష్ణుడు రుక్మిణికి ఇస్తాడు . రుక్మిణి దేవి ని నారదుడు పొగుడుతాడు . జరిగిన వృత్తాంతాన్ని అంతటిని చిలవలు పలవలు చేసి చెలికత్తె సత్యభామకు  చెబుతుంది . అది విన్న సత్యభామ తోక తొక్కిన ఆడత్రాచు పాముల లేస్తుంది . నెయ్యి పోస్తే బగ్గున మండిన మంటలా లేస్తుంది . ఆభరణాలను తీసివేసి కోపగృహానికి వెళ్లి తనలో తాను భాద పడుతూ వుంటుంది . మగ వారి ప్రేమ ఎదురుగా ఉన్నప్పుడే లేకపోతే వుండదు అనుకుంటుంది . తనకు అవమానం జరిగినట్లుగా భావించి భాదపడుతుంటుంది . పరిస్థితిని అంచనా వేసిన శ్రీకృష్ణుడు నారదుడి సేవకు ప్రద్యుమ్నుడిని పురమాయించి తాను సత్యభామ గృహానికి వెళ్తాడు . కోప గృహంలో వున్నా సత్యభామ వద్దకు వెళ్లి 
"సత్యా ఎన్దుకుఇలా వున్నావు ఆభరణాలు ఎందుకు ధరించలేదు . ఎప్పుడు బంగారు రంగు అంచు కలిగిన  కావిరంగు (కాషాయ రంగు )చీరలే కట్టుకునే దానివి మాసిన చీర ఎందుకు కట్టుకున్నావు . నిన్ను ఎవరయినా ఎమన్నా అన్నారా ?చెప్పు ఇప్పుడే వాళ్ళ ప్రాణాలు తీసి వేస్తాను" అని అనునయం గా అడుగుతాడు . దానికి సత్య "ఎందుకు లేనిపోని ప్రేమలు కురుపిస్తారు మీకు ఎక్కడ నిజం గ ప్రేమ వుంటే అక్కడికే వెళ్ళండి .అయిన గోపాలుడికి మన్మద రహస్యాలు ఎలా తెలుస్తాయి ఇన్నాళ్ళు అత్తగారు దేవకీ దేవి సేవకి అందరికంటే ముందుగా నేనే వెళ్ళేదాన్ని ఇప్పుడు ఎ మొహం పెట్టుకుని వెళ్ళను . అందరు నా చాటుగా నన్ను చూసి నవ్వుకుంటూ వుంటే నేను తల ఎత్తుకుని ఎలా తిరగను ? "అని కటువుగా సమాధానం చేభుతుంది . అప్పుడు కృష్ణుడు సత్యా నా వాళ్ళ ఏదయినా పొరబాటు జరిగితే నన్ను క్షమించు అంతే కాని నన్ను దూరం పెట్టకు నేను భరించలేను అని జగత్పాలకుడు తన శిరస్సును సత్యభామ దేవి కుడి కాలి పాదం మీద వుంచి అడుగుతాడు . సత్య భామ తన ఎడమ కాలి తో అకిలాండనాయకుడి శిరస్సుని తోసివేస్తుంది . అయిన కృష్ణుడు భాద పడక కోపం తో వున్న కాంతలు వుచిథానుచిథములు ఎరుగరు అనుకుని , నాసిరస్సు తోసివేసినందుకు నాకు భాద లేదు నా శిరస్సు కిరీటం తగిలి నీ సుకుమారమయిన పాదం కందిందేమో చుసుకొఅని ప్రేమగా అంటాడు . అయిన సత్య కోపం తగ్గకపోవడంతో  కోపానికి అసలు కారణం పువ్వు అని తెలుసుకుని "పిచ్చిదానా పువ్వు కోసం భాద పడతావా నీ పెరట్లో పారిజాత వృక్షాన్నే నాటతాను . అని చెప్పడం తో సత్య భామ దేవే కాక అంతః పురం అంతా సంతోషం వెల్లివిరుస్తుంది . 

అనంతరం ఇంద్రలోకం వెళ్లి సత్యా శ్రీకృష్ణులు అడ్డు వచ్చిన వారితో యుద్ధం చేసి ఆ పారిజాత వృక్షాన్ని భూమి మీదకు తెస్తారు . 

గ్రంధ రచన  చేయడానికి కారణం ;

ఒక సారి శ్ర్రీ కృష్ణ దేవరాయలు వారు అయన భార్య ఉద్యానవనంలోని సరస్సులో జలకాలాడుతున్నారు . రాయల వారు నీటితో ఆయన భార్య ను కొడుతున్నారు ." అప్పుడు ఆవిడ మమోదకే తాడయత ". అంది రాయల వారు మము (మమ్మల్ని )మొదకే (కుడుములతో )తడయతా (కొట్టండి )అని అరదం చేసుకుని , ఇదేమిటి రాణి గారు ఇలా అన్నారు ఒక వేల ఆవిడకు అది సరదా ఏమో అని మనస్సులో అనుకుని "ఎవరక్కడ" అన్నారు.  వెంటనే భేతులు పరిగెత్తుకొచ్చారు వారితో కుడుములు తేమ్మన్నారు . వాళ్ళు పరుగు పరుగున వెళ్లి కుడుములు తెచ్చి రాజుగారికి ఇచ్చారు . వాటితో ఆయన రాణి గారిని కొట్టడం ప్రారంభించారు . దాంతో ఆవిడ "మీరు గొప్ప సాహితీ సమరాంగణ చక్రవర్తి అంటారు పామరుడి లా చిన్నా పదానికి అరదం తెలుసుకోలేకపోయారు . నేను మము (మమ్మల్ని )న వుదకే తాడయత (నీటితో కొట్టద్దు )అన్నాను . అని చెప్పగా రాయల వారు ఆవడ అన్న మాటలకు అలిగి ఆవిడ అంతః పురానికి వెళ్ళడం మానివేశారు . దాంతో భాద పడిన రాణి గారు తన పుట్టింటి నుండి వచ్చిన ,తన తరుపు పెద్ద అయిన నంది తిమ్మన గారితో జరిగిన విషయం చెప్పి భాద పడుతుంది . అప్పుడు నంది తిమ్మన గారు రాయల వారి మనసు మార్చేందుకు గాను పారిజాతాపహరణ గ్రంధాన్ని రచించి ఆయనకు అంకితం ఇచ్చారు . దానిలోని అంతరార్ధాన్ని(భార్య అలిగి నపుడు భర్త ఆమెను భతిమాలినా తప్పులేదు ) గ్రహించిన రాయలవారు తిరిగి రాణి గారి అంతః పురానికి వెల్లనారంభించారు . 



              ఇతి కధా  సమాప్తః 

                                                                                                                               శశి 


'











No comments:

Post a Comment