Wednesday 17 February 2016

భీష్మ ఏకాదశి

                                భీష్మ ఏకాదశి 

భీష్ముడు కురు పితామహుడు . గొప్ప  జ్ఞాని . కార్యాచరణ దక్షుడు ,ధీరుడు ధర్మ శాస్త్ర జ్ఞానం తెలిసినవాడు ,రాజకీయచతురత తెలిసినవాడు ,స్వచ్చంద మరణ వర ప్రసాదుదు , దైవానుగ్రహం కలిగినవాడు . వేద వేదాంగాలను అభ్యసించినవాడు , అస్త్ర శస్త్ర విద్యను అవపోసన పట్టినవాడు , ఎన్ని అవాంతరాలు వచ్చినా మాట మీద నిలబడే స్వభావం కలవాడు . ఈయన అసలు పేరు దేవవ్రతుడు . 
జన్మ వృత్తాంతం ;పూర్వము ఇక్ష్వాకు వంశం లో మహా భిషుడు అనే వాడు పుట్టి ధర్మస్వరూపుడై వేయి అశ్వమేధ యాగాలు ,నూరు రాజసూయములు చేసి దేవతలను తృప్తి పరచి స్వర్గానికి వెళ్లి ,అక్కడ దేవతలతో కలసి భ్రహ్మ ను సేవిస్తున్నాడు . ఒక నాడు భ్రహ్మ సభకు గంగా దేవి స్త్రీ రూప ధారిణి అయి దివ్యాభారణాలు ధరించి వచ్చినది . అప్పుడు గాలికి గంగా దేవి చీర తొలగగా  దేవతలు ఆమెను చూడకుండా తలలు తిప్పుకున్నారు . ఒక్క మహాభిషుడు మాత్రం సాభిలాషగా చూసెను . అది  చూసిన భ్రహ్మ బూలోకంలో పుట్టుము అని శాపం ఇచ్చెను . మహాభిషుడు మన్నించమని ప్రార్దించి ,భ్రహ్మ పలుకు తధ్యం . కావున నన్ను అన్యులకు కాక ప్రతీపుడనే ధర్మపరుడికి కొడుకుగా పుట్టించమని కోరతాడు . భ్రహ్మ సరే అంటాడు . 
గంగా దేవి కూడా జరిగిన వృత్తాంతాన్ని తలుచుకుని తన వల్లే మహాభిషుడు శాపగ్రస్తుడయ్యాడని భాద పడుతూ వస్తూ వుండగా వసువులు ఆమెకు ఎదురై వసిష్టుని శాప  కారణంగా భూలోకంలో జన్మించడానికి వెళ్తున్నామని అన్యుల కడుపునా పుట్టలేమని నీ కడుపునా పుడతామని ప్రార్దిస్తారు . మహాభిశుడిని తలచుకుని గంగ ఒప్పుకుంటుంది . 
భూలోకంలో ప్రతీపుడు గంగా తీరంలో తపస్సు చేసుకుంటూ వుండగా గంగ స్త్రీ రూపం ధరించి వచ్చి ప్రతీపుడి కుడి తొడ మీద కూర్చుంటుంది . ప్రతీపుడు నీవెవరు అని అడుగగా నన్ను వివాహము చేసుకోనమని గంగ అడుగుతుంది . ఎడమభాగం స్త్రీ భాగం ,కుడి భాగం పురుష భాగం . నీవు కుడి వైపున కూర్చున్నావు కావున నీవు నాకు పుత్రిక తో సమానం . కావున నీవు నా కొడుకుని  చేసుకున్డువు అని చెప్పగా గంగ కూడా సరేనని అన్థర్దానమయ్యెను . 
ప్రతీపుని పూజల తపస్సుల పలితం వల్ల అతనికి సద్గుణుడు అయిన కుమారుడు జన్మించెను . అతనికి శంతనుడు అనిపేరు పెట్టెను , శంతనుడు పెద్దయిన తర్వాత గంగా తీరంలో తను సుందర కన్యకకు జరిగిన వృత్తాంతాన్ని  చెప్పి ఆమెను కుల గోత్ర వివరములు అడుగక వివాహము చేసుకోనమని చెప్పి తపోవనాలకు వెళ్తాడు . 
ఒక రోజు వేటకు వెళ్లి గంగా తీరమునకు వెళ్ళగా అక్కడ దివ్యాభారణాలు ధరించి అద్భుత కాంతితో ప్రకాశించే ఒక సుందర కన్యను చూస్తాడు . ఆమె ఎ దేవ కన్యకో అనుకుంటాడు ఆమె కుడా తన వైపు చూడగా నీవ్వేవారు ఎక్కడి దానివి అని అడుగుతాడు . దానికి ఆమె నాకులగోత్రాలు నీకేల ?నేను నచ్చితే వివాహం చేసుకొనుము ,కాని నాదొక షరతు ఎప్పుడు నాకు అప్రియములు పలుకరాదు . ఆవిధంగా పలికినచో నేను వెంటనే వదిలి వెల్లిపొయెదనని  చెప్పగా శంతనుడు ఒప్పుకుని వివాహం చేసుకొనెను . 
కొన్ని రోజులకు వారికి పండంటి కొడుకు పుట్టెను శంతన మహారాజు ఆనందమునకు  అవధులు లేకున్దపోఎను . ఇంతలో ఆమె పుట్టిన కొడుకుని గంగలో వదిలివేసెను . శంతనుడు దుఖసాగరంలో మునిగిపోఎను . కాని అడిగితే  బార్య వదిలి వేల్లోపోతుందని భయం తో మాట్లాడకుండా వుండిపోయేను . కొన్నాళ్ళకి మరొక పుత్రుడు పుట్టెను అతడిని కూడా పుట్టిన వెంటనే నీళ్ళలో పడవేసెను . ఆవిధంగా ఏడుగురు కొడుకులను పుట్టినవెంటనే నీళ్ళలో పడవేసెను . ఎనిమదవ పుత్రుడు పుట్టెను పుత్ర ప్రేమ అడికమవడంతో పుత్రుడిని కాపాడుకోవాలనే  ఉద్దేశ్యంతో భార్య వద్దకు వెళ్లి 'ఇన్నాళ్ళు నీమీద పిచ్చి ప్రేమతో నువ్వు ఏమిచేసినా మాట్లాడలేదు కాని ఈ సారికుడా నా పుత్రుడిని గంగలో పడవేస్తే ఊరుకోను ' అని కఠినం గ చెప్పెను . అప్పుడు ఆమె నువ్వు కఠినం గ మాట్లాడావు కావున ఇక నేను నీతో ఉండను ఈ పుత్రుడిని నీటిలో పారవేయ్యను . ఇతడు చిర కాలం కీర్తిప్రతిష్ట లతో భూలోకం లో వర్దిల్లుతాడు . నేను గంగను నాకు పుట్టిన వారంతా వసువులు వారి అభ్యర్దన మేరకు వారిని వారి లోకాలకు పంపి వేసాను . నాకు పుత్రుడి ముద్దు ముచ్చట చుదాలనుందని అడుగగా వారు ఈ ఆఖరివాడు ఉంటాడని చెప్పారు . పసివాడి భాద్యత తండ్రి వహించలేదు కావున నీను నాతో తీసుకువెళ్ళి పెంచి తీసుకొస్తానని చెప్పి పుత్రుడి తో సహా అన్థర్దానమయ్యెను . 
కొంతకాలానికి శంతనుడు గంగా తీరానికి వెళ్ళగా అక్కడఒక అస్త్ర శస్త్ర లాఘవం కలిగిన దివ్య పురుషుడిని గాంచెను . అప్పుడు గంగ ప్రత్యక్షమై ఇతడు నీ పుత్రుడని అతని చేతిని శంతన మహారాజు చేతిలో పెట్టి మాయ మయ్యెను . 
భీష్మ ప్రతిజ్ఞ ;కుమారుడి ప్రతిభా పాటవాలు ధర్మ శాస్త్రజ్ఞానం చూసి మురిసిపోతున్నాడు శంతనుడు . ఇదిలా వుండగా ఒక రోజు శంతనుడు సత్యవతీ దేవి ని చూసి  వివాహం చేసుకోనదలచి ఆమె తండ్రిని అడుగగా అతడు తన కుమార్తెకు పుట్టబోయే బిడ్డలకే రాజ్యాని అప్పగిన్చేపద్దదయితే వివాహం చేసుకోమంటాడు . కాని సకల శాస్త్రాలలో నిస్నాతుడై , విద్యా వినయ సంపన్నుడయిన చెట్టంత కొడుకుని కాదని ఇలా మాతివ్వడం సబబు కాదని వచ్చేస్తాడు . జరిగిన విషయం తెలుసుకున్న దేవవ్రతుడు సత్యవతీదేవి తండ్రి వద్దకు వెళ్లి తన తండ్రికి సత్యవతీ దేవిని ఇచ్చి వివాహం చేయమని తనకు రాజ్యం మీద మమకారం లేదని చెబుతాడు . దానికి దాశరాజు (సత్యవతి దేవి తండ్రి )నీకు రాజ్యం పై మమకారం లేకపోయినా నీ పుత్రులు మా రాజ్యం మాము కావలి అని అడిగితే ఏమి చెయ్యాలి అని అంటాడు . దానికి దేవా వ్రతుడు నేను వివాహం చేసుకుంటేనే కదా పుత్రులు పుట్టేది నేనసలు వివాహమే చేసుకోను అని భీషణ ప్రతిజ్ఞ  చేస్తాడు . భీషణ ప్రతిజ్ఞ చేసాడు కావున భీష్ముడు అయ్యాడు . శంతనుడు,దేవవ్రతుడి తండ్రి ప్రేమకు మెచ్చి స్వచ్చంద మరణాన్ని వరంగా ఇస్తాడు . 
 
భీష్ముడి గొప్పదనం ; తండ్రి మరణానంతరం భీష్ముడు కురు వంశానికి తానే పెద్ద దిక్కై నిలబడ్డాడు . కాశి రాజు కుమార్తెల స్వయంవరానికి వెళ్లి అమ్భను ఆమె ఇష్టానికి విడిచి మిగిలిన అంభిక ,అమ్భాలికలను తన తమ్ముడికి (శంతనుడు ,సత్యవతుల పుత్రుడు )ఇచ్చి వివాహం చేసెను . అతడు సంతానం కలగకనే చనిపోగా సత్యవతి దేవి భీఎశ్ముదిని వివాహం చేసుకోనమని అడిడినా తన ప్రతిజ్ఞా పాలనా నిమిత్తం వివాహం చేసుకోలీడు . ఆ జన్మాంతం భ్రహ్మచారి గానే వున్నాడు . ఆయన గొప్ప యోదుడు యుద్దంలో ఎవరు ఈయనతో గెలవలేరు . తండ్రి కోసం వివాహాన్ని సయితం త్యజించిన గొప్పవాడు భీష్ముడు . కురు వంశ పేరు ప్రఖ్యాతలు నిలబెట్టాడు . ధర్మశాస్త్ర సూక్ష్మాలు తెలిసినవాడు . ముదుసలి వయసులో కూడా యుద్దంలో నిలబడి పాండవులకు వెన్నులో వణుకు పుట్టించాడు . కనుకనే ఎదురుగా ఆయన్ని ఎఅమి చెయ్యలేక శిఖండిని అడ్డం పెట్టుకుని అయన మీదకు అస్త్ర ప్రయోగం చేసారు . తన స్వచ్చంద మరణ వరం చేత 58 రోజులు అంపశయ్య మీదే ఉత్తరాయణ  వచ్చే వరకు వుండి  మాఘమాస ఏకాదశి రోజున తనువు చాలించాడు కావుననే దీనికి భీష్మ ఏకాదశి అని పేరు వచ్చింది . 
ఇటువంటి గొప్ప మహానుభావులు చాలా అరుదుగా వుంటారు . వారి జీవిత గాధలను తెలుసుకోవడం ద్వారా ఎన్నో మంచి విషయాలను తెలుసుకోవచ్చు . 




                                                         స్వస్తి 


                                                                                                                                             శశి 







No comments:

Post a Comment