Friday 19 February 2016

భువనవిజయం

                                            భువనవిజయం 

శ్రీ కృష్ణదేవరాయుల సభకు భువనవిజయం అని పేరు . ఈయన సాహితీ సమరాంగణ చక్రవర్తి . ఈయన పాలనా కాలాన్ని స్వర్ణ యుగం గా కీర్తిస్తారు . అలాగే ఆ కాలాన్ని ప్రభంద యుగం అని కూడా అంటారు . ప్రభందం (ప్రకృష్ట్తో ఇతి భందః ప్రభందః )అనగా పురాణాలు , ఇతిహాసాలనుండి చిన్న కధను తీసుకుని స్వతంత్ర వర్ణనలతో పెంచి పోషించటం . శ్రీ కృష్ణ దేవరాయలి  కాలం లో అనేక ప్రభందాలు వెలువడ్డాయి . ఈయన ఆస్థానంలో అష్ట దిఘ్ఘజాలు అనబడే ఎనిమిదిమంది కవులు వుండేవారు . 
నామసార్ధక్యం ;
       పూర్వకాలంలో చదువుకున్న వారు చాలా తక్కువుగా వుండేవారు . కవులు ఒక కావ్యాన్ని రచించి రాజు గారికి అంకితం ఇస్తే అగ్రహారాలు దానం చేసేవారు ,కనకాభిషేకాలు చేసేవారు . ఆవిధంగా కవులకు చాలా విలువ వుండేది . కొంతమంది కవులు దెస దేశాలు తిరిగి అక్కడి కవులను సవాలు చేసి వారిని గెలిచి ఆ దేశ రాజుల చేత సన్మానాలు భహుమానాలు పొందేవారు . అలా ఎంతమంది గొప్ప కవులు శ్రీకృష్ణ దేవరాయాలి సభకు వచ్చినా అష్టదిగ్గజాల చేతిలో ఓడిపోయేవారు . ఆ విధంగా భువన విజయం పేరు సార్దాక్యమయింది . 

అష్ట దిగ్గజాలు ;

శ్రీ కృష్ణ దేవరాయాలి ఎనిమిది మంది ఆస్థాన కవులకు అష్టదిగ్గజాలు అని పేరు . వారు 
అల్లసాని పెద్దన ;                   మను చరిత్ర 
అయ్యలరాజు రామభద్రుడు ;    రామాభ్యుధయం 
పింగలిసూరన ;                       కళాపూర్ణోదయం 
ధూర్జటి ;                                శ్రీ కాలహస్తీశ్వర మహత్యం 
రామరాజ భూషణుడు ;           వసు చరిత్ర 
మాదయగారి మల్లన ;             రాజశేకర చరిత్రము 
నంది తిమ్మన ;                        పారిజాతాపహరణం 
తెనాలి రామకృష్ణుడు ;             పాండురంగ మహత్యం 

స్వర్ణయుగం ; 

  రాయల యుగాన్ని స్వర్ణ యుగంగా చరిత్రకారులు సాహిత్యాభిమానులు కీర్తిస్తారు . ఈయన కాలం లో సాహిత్య లక్ష్మి దేవి ఉత్సాహం తో కొత్త పుంతలు తొక్కింది . అద్వితీయమయిన ప్రభంద గ్రందాలను ఈ యుగం తన ఖాతాలో జమ చేసుకుంది . అష్టదిగ్గజ కవులు తమ నామాన్ని సార్ధక్యం చేసుకుంటూ అపురూపయిన ప్రభందాలను ముందు తరాలకు వరం లా ఇచ్చారు . స్వయం గా శ్రీ కృష్ణదేవరాయలు కుడా కవి ఆముక్త మాల్యద అనే గ్రంధాన్ని రచించారు . ఎంత గొప్ప పండితులు అయినా నిఘంటువు చూడకుండా దీన్ని సాంతం అర్డంచేసుకోలేరు అంత గొప్పగా రాసారు . దేశ భాషలందు తెలుగు లెస్స అన్నది శ్రీ కృష్ణ దేవరాయలు . ఈయన పాలనలో బజారులో రత్నాలను రాసులుగా పోసి అమ్మేవారు . ఇంతటి అద్వితీయమయిన యుగాన్ని స్వర్ణయుగం అనడం ఎంతో సమంజసమ్. 

ఇతర విశేషాలు ;

శ్రీ కృష్ణ దేవరాయలు దేశ పర్యటనలో విజయవాడ మీదగా వెళ్తూ కొండపల్లి తదితర ప్రాంతాలను దర్శించి ,ఆంద్ర మహా విష్ణువు గురించి తెలుసుకుని శ్రీకాకుళం వెళ్లి అక్కడ ఏకాదశి వ్రతం చేసాడు . అక్కడే తెల్లవారు జామున స్వామి వారు అయన కల లోకి వచ్చి గ్రంధం రాయమని అడుగగా అందుకు గాను రాయలు ఆముక్త మాల్యద రచించారని ఒక గాధ . తిరుపతి లో అనేక కట్టడాలు కట్టించారు . స్వామీ వారికి విలువ కట్టలేని అనేక దివ్యాభారణాలు సమర్పించారు . తిరుపతి ఆలయ వెలుపల ఆవరణలో శ్రీ కృష్ణదేవరాయలు అయన ఇద్దరు బార్యలు తిరుమలదేవి చిన్నదేవుల విగ్రహాలు ఇప్పటికి మనం దర్శించవచ్చు . 



                                         స్వస్తి 

                                                                                                              శశి 



No comments:

Post a Comment