Saturday 30 April 2016

సతీ దేవి వృత్తాంతం (పార్ట్ -7)

          సతీ దేవి వృత్తాంతం (పార్ట్ -7)

వీరభద్రుడు ,రుద్ర గణములు యజ్ఞ వాటిక వద్దకు వచ్చి అక్కడ వున్నా వారందరినీ దొరికిన వారిని దొరికినట్లు చితక భాదు చుండెను . అది చుసిన ఇంద్రుడు ,అగ్ని ,వరుణ ,యముడు ,గందవాహనులు మొదలైన వారు వారిని ఎదుర్కున్నారు . వీర భద్రుడు ప్రచండ నాట్యం చేయుచు యజ్ఞ వాటిక అంతా దొరికిన వారిని చిదక తన్నుతూ వీర విహారము చేసెను . అజేయుడయిన వీరాభాద్రుడిని చూసి ,తాము శివ భక్తులమే అని విధి ప్రేరణ వాళ్ళ ఇక్కడికి వచ్చామని ,శివ నింద చేసినవారు ఫలితము అనుభవించక తప్పదు కావున దక్షుడిని చేరమని ,ఇంద్రుడు మొదలైన వారు పలుకగా వీరభద్రుడు ప్రీతీ చెంది వారిని విడిచిపెట్టెను . అప్పుడు భయపడిన మహా మునులు విదాతను శరణు వేడగా అతడు వారితో గూడి విష్ణుమూర్తిని శరణు వేడెను . 
విష్ణుమూర్తి శరణా గత రక్షకుడు అగుట చేత వీర భద్రుడితో యుద్దము చేయ ప్రారంభించెను . వారిరువునకు ఘోర యుద్దము జరుగుచుండ వీరభద్రుడు నారాయణుని త్రిశులముతో బోడవగా విష్ణుమూర్తి భూమి మీద పడెను . మునులు ,దేవతలు మిక్కిలి ఆశ్చర్యము పొందారు . లేచిన విష్ణుమూర్తి కోపావేశాముతో సుదర్శన చక్రమును ప్రయోగించెను . వీరభద్రుడు శివుడిని తలుచుకోగానే అది కదలక వున్నా చోటే వుండిపోయేను . విష్ణువు ఎన్ని అస్త్ర శస్త్రములను ప్రయోగించినా వీరభద్రుడు వాటిని  ముక్కలుగా చేసెను . 


అప్పుడు బ్రహ్మ విష్ణుమూర్తితో రహస్యముగా" కానున్నది కాకమానదు మనము ఇక్కడనుండి వేల్లిపోదాము "అని చెప్పెను . అప్పుడు విష్ణుమూర్తి సూక్ష్మ రూపము ధరించి అక్కడనుండి వెళ్ళిపోయెను . బ్రహ్మ కుడా అలాగే తపోవనమునకు వెళ్ళిపోయెను . అంత వీరభద్రుడు దక్షుని శిరమును ఖండించి విజయుడయ్యెను . పరమేశ్వరుని వద్దకు వెళ్లి విజయ వార్త తెలుపగా అతడు సంతసించి వీరభాద్రుడిని గణమునకు అద్యక్షుడిగా చేసెను . 


                     శశి ,

ఎం . ఎ (తెలుగు )తెలుగు పండితులు . 






Friday 29 April 2016

               సతీ దేవి వృత్తాంతం (పార్ట్ -6)

సతీ దేవి యోగాగ్నికి ఆహుతి అవుట చూసిన శివ గణములు యజ్ఞ వాటికను అల్లకల్లోలము చేయ ప్రయత్నించి రుత్విజుడయిన బృగు మహర్షి రగిల్చిన దక్షినాగ్నికి భయపడి ఊర కుండిరి . అంతలో ఆకాశవాణి అందరు ఆశ్చర్యపోయేట్లు దక్షుడిని ఉద్దేశించి "ఓరి గర్వముతో శివుని నిందిన్చితివి . శివ నిందా ఫలమును వెంటనే అనుభవింతువు . "అని పలికెను . నారదాది మునీ ముఖ్యులు వేగముగా వెళ్లి జరిగిన వృత్తాంతమును శివుడికి తెలియ జేసిరి . 
నారదాదుల వలన సతీ దేవి మరణ వార్త విన్న శివుడు భాద ,కోపములు నిండి వుండగా తన శిరము నందలి జటా జుటము నుండి ఒక జటను పీకి నేలపై విసరగా అందుండి భద్రకాళీ సమేత వీరభద్రుడు ఉద్భవించెను . 


వారివురు ఈశ్వరుడిని ధ్యానించి కర్తవ్యము ఆదేశింపమని వేడుకొనిరి . అంత పరమేశ్వరుడు వీర భద్రుని చూసి "పుత్రా నీవు గణములతో కుడి నీవు భద్రకాళి తో కూడి దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞ వాటికకు ఏగి యాగమును ద్వంసము గావించి అక్కడ ఉన్న ప్రేక్షకులను కూడా బహువిధములుగా శిక్షించి రా .  అడ్డగించే వారు ఎవరు లేరు . అని వారిని నియమించి పంపెను . అంత సతీ వియోగమున శంకరుడు శోకించుచు ఉండెను . అంత వీరభద్రుడు సింహములను పూన్చిన దివ్య రధమును అధిరోహించి సింహ ,శార్దూల ,గజ ,తురగ ములను ఎక్కి సాయుధములై ముక్కోటి రుద్ర గణములు తో కూడి యుద్ద బేరిణి ,శంకమును ఊదుతూ ముదంగ నాదములు ,గంట ,వేణు వీణా ,డమరు మొదలైన వాయిద్యములు వాయించుచు  భయంకరముగా యుద్దానికి వచ్చిరి . 
ఇంకా శంకర్లుండు అను గణపాలుండు ,అమోఘుడు ,కోకిలుడు ,కాష్టాను ఘుష్టుండు ,సమంతకుడు ,కాక పాదోధరుడు ,సంతానకుడు ,మహా భలుడు ,మధు పింగడు ,సంవర్తకుడు ,లకులీశుండు ,లోకాంతకుడు ,దైత్యాంతకుడు ,అశని ,బాలకుడు ,కాపాలికుడు ,సంచారకుడు ,కుండ విష్టన్డకుడు ,సన్నాడుండు ,పిప్పలుండు ,జంద్రతాపసుడు ,మహావేశుడు, కాలకాలకమహాకాలురు ,అగ్నిక్రుత్త్తు ,అగ్నిముఖుడు ఆదిత్యముర్ఖుడు ,విక్రుతుడు ,సశాకుడు ,సర్వాంకకుడు ,జ్యాలాదేశుడు ,పర్వతకుండుడు ,క్షేత్ర పాలకున్డగు భైరవుండు ,నందీశుండు ,సర్వ సేనాని అగు చందీశుండు, మనీ మంతుడు ,అనేక కోటి ప్రమదాది భూత వీర సైన్యముతో వెళ్ళిరి . ఇంకా భద్రకాళి సాయుదులగు మహాకాళీ ,గౌరీ ,కాత్యాయిని,చాముండి ,ముండమర్ధిని ,భద్రా వైష్ణవి ,నారసింహీ నామక నవ దుర్గలతో శాకినీ ,డాకినీ ,కుష్మండి ,పర్పటి ,చటికా ,యక్షినీ ,మోహినీ లు వచ్చెను . యుద్దము చేయుటకు వచ్చిన వారందరిపై శివాజ్ఞ తో పూల  కురిసెను . వారికి అనేక శుభ శకునములు కనిపించెను . 

అక్కడ దక్షునికి అనేక దుశ్శకునములు కనిపించెను . అక్కడ ఉన్న ఋత్విజులు ,మునులు ఆ దుశ్శకునములకు భయపడి ఏమి చేయాలో తెలియక పారిపోవు చుండిరి . దక్షుడు ఆ ఘటనను చూసి ఆశ్చర్య పోతూ ఉండెను . దక్షుడి ధర్మ పత్ని వీరణి కుడా ఆధుశ్శకునములకు భయపడుతూ ఉండెను . 
ఆ సమయములో వీరభద్ర గణమందరు యజ్ఞ వాటిక వద్దకు చేరిరి . 



శశి ,

                                       ఎం . ఎ (తెలుగు ),తెలుగుపండితులు . 












Thursday 28 April 2016

సతీ దేవి వృత్తాంతం (పార్ట్ -5

                     సతీ దేవి వృత్తాంతం (పార్ట్ -5)

సతీ దేవి వృషభం ఎక్కి 20000 గణములతో మాతృ గృహానికి వెళ్ళుతూ మనసులో చాలా ఆనందము పొందుతూ ,దారిలో దుశ్శకునములను చూసి మదిలో ఆందోళన చెందుతూ త్వరితముగా దక్ష యజ్ఞము వద్దకు వెళ్ళెను . గణములను అక్కడే ఉండమని కొద్ది మందిని మాత్రం తనతో ప్రాకారము లోపలకి తీసుకు వెళ్ళెను . వీరణి కూతురుని చూసి సంతోషించి ఎదురువెళ్ళి ఆహ్వానించి తీసుకువచ్చి ఆసనమును చూపించెను . సతీ దేవి అక్కా చెల్లెళ్ళు అలాగే ఆమె తో ప్రేమగా మాట్లాడెను . కాని తండ్రి అయిన దక్షుడు మాత్రం చూసి కుడా చూడనట్లు పలకరించక ఉండెను . దేవతలందరూ దక్షుడి అనుమతితో సతీ దేవిని చూసి కూడా చూడనట్లు నటించుచు వారి వారి హావిర్భావములను అందుకొనుచు ఉండెను . ప్రాణ వల్లభుడగు శివునకు మాత్రము హావిర్భావము లేకుండుట ఎరిగి తన తల్లి చూపించిన ఆసనమున ఉండక సతీ దేవి కోపముతో దక్షుడిని చూస్తూ "జనకా ఎందుకు మహేశ్వరుడిని ఆహ్వానించలేదు . శివుడికి హవిర్భావము ఒసగి యజ్ఞము పరిసమాప్తి చేయనిచో శుభము కలుగక పోగా అసుభము కలుగుతుందని ఎరుగవా "అని ప్రశ్నించెను . మహా మునులు భవాని మాటలు పరమ సత్యాలని చెబుతున్నా వినక దక్షుడు మరల ఈశ్వరుడిని దూషించి కూతురుని పొమ్మని గద్దించాడు . దక్షుడి రుద్ర స్వరూపమును చుసిన వారందరూ మాట్లాడక మిన్నకుండిరి . సతీ దేవి తన భర్త హిత వాక్యములను పేద చెవిన పెట్టినందుకు మిక్కిలి చింతించుచు తాను తిరిగి భర్త వద్దకు వెళ్ళుట అవమానకరమని భావించి ,అవమానముతో కోపావేశామును పొంది మరు జన్మకు కుడా శివుడే తన భర్తగా భావించి ,హిమవంతునికి పుత్రిక పార్వతిగా జన్మింతునని దివ్య దృష్టితో కాంచి పరమేశ్వరుడిని తలచుకుని పలు విధములగా స్తుతించుచు స్వీయ యోగాగ్ని ప్రజ్వలింప చేసుకుని దక్ష పుత్రికగా వున్నా తన శరీరమును త్యజించెను . 

                                  శశి ,

  ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 

                                                  








Wednesday 27 April 2016

సతీ దేవి వృత్తాంతం (పార్ట్ -4)

           సతీ దేవి వృత్తాంతం (పార్ట్ -4)

ఆ విధముగా పరమేశ్వరుడి అందు కోపము కలిగి ఉన్న దక్షుడు ,దానం చేసి యజ్ఞ యాగాది క్రతువులందు పరమేశ్వరునికి లేకుండా చేయ సంకల్పించి మహా మునులను రావించి తన ఇంట వాజిపేయంబను ఒక యాగమును మొదలుపెట్టెను . తదననంతరం మరియొక యజ్ఞమును అద్భుతంబగు సన్నాహంబులతో చేయదలిచి సకలలోకములలో వున్న వారందరినీ పిలిచెను అల్లుడి పై అలుక కారణం గా సతీ శంకరులను మాత్రం పిలవలేదు . 
 



విశ్వకర్మచే నిర్మింపబడిన యాగాశాలయందు  యాగమును తిలకించుటకు వచ్చిన వారందరూ కూర్చున్నారు . ఇంద్రుడు ,విష్ణుమూర్తి ,యక్షులు ,సిద్దులు ,సాద్యులు ,గంధర్వులు ,దేవతలు ,దానవులు ,మొదలగు సకల జనులచే యజ్ఞశాల కనుల పండుగగా ఉండెను . దక్షుడు యజ్ఞదీక్ష వహించి ధర్మపత్నీ సమేతముగా నిలిచి వుండగా మారీచుడాదిగా గల మహర్షులు సతీ శంకరులను పిలువలేదా అని ప్రశ్నించిరి . అప్పుడు దక్షుడు అహంకారంతో ,కోపముతో ,ఎర్రబడిన కన్నులతో పరమేశ్వరుడిని అనేక రకాలుగా నిందించుచు స్మశానవాసి ,పిశాచ నాయకుడు ,కపాల పాత్ర అందు భుజించువాడు అగు శివుడికి ఈ మహా యాగములొ పాల్గొను అర్హత లేదు కావున పిలవలేదని చెప్పెను . అతని మాటలు విన్న కొందరు శివుడ్ని దుషించుటే కాదు ఆ మాటలు విన్నా పాపం చుట్టుకుంటుందని అక్కడనుండి వెళ్ళిపోయిరి . పరమేశ్వరుడు లేనిచో ఈ యజ్ఞము పూర్తి కాదని శివుడు లేని ఈ యజ్ఞం వల్ల యజ్ఞ కర్తలకు ప్రేక్షకులకు కూడా అనేక ఆపదలు వస్తాయని దధీచి యక్షునకు చెప్పి ,గౌతముడు మొదలయిన మునులను తీసుకుని వెళ్ళిపోయెను . ఈ విధముగా యజ్ఞశాలను విడిచి అనేక మంది వెడలిపోయెను . అలా వెళ్ళే వారందరినీ దక్షుడు పాషండులు ,పాపాత్ములు అని నిందించుచు ఉండెను . 
దక్ష ప్రజాపతి యజ్ఞమును చేయుచున్నారని ,ఆ యాగమునకు విశ్వా దేవతలు ,మరుత్తులు ,గాంధర్వ ,సిద్ద ,విద్యాధర ,కిన్నెర ,యక్ష మొదలగు దేవతా ముఖ్యులు ,కశ్యప ,అగస్త్య వామదేవాశ్రి ,భ్రుగు ,మరీచ ,నారద ,పరాశర ,గర్గ ,భార్గవ మొదలగు పరమ మునీంద్రులు వెళ్ళారని , తన చెలికత్తెలచె తెలుకున్న సతీ దేవి ,పరమేశ్వరుడి ని దాని గూర్చి అడుగగా శివుడు "దేవీ మీ తండ్రి మనలను పాపకర్ములమని ,హీనులమని ,భావించి ఆహ్వానించలేదు  . పిలువకుండా వెళ్తే కష్టములు ప్రాప్తిస్తాయి . నీ సంకల్పం గ్రహించి వున్నాను . నీవు అక్కడికి వెళ్ళాలనే ప్రయత్నము మానుకొనుట మంచిది . "అని హితవు చెప్పెను . తల్లి తండ్రులపై గల సహజ ప్రేమతో సతీ దేవి "పుట్టింటికి వెళ్ళుటకు ఆహ్వానం ఎందుకు ?మిమ్ము ఆహ్వానింప లేదు కావున మీరు రావద్దు . నేను వెళ్లి మా తండ్రి మిమ్ములను ఎందుకు ఆహ్వానించలేదో కారణము తెలుసుకుని మిమ్ములని ప్రార్ధించి పిలుచుకు పోయేట్లు యథ్నించెదను . కావున రుద్ర గణమును సహాయముగా ఇచ్చి నన్ను పంపమని "ప్రార్ధించెను . అయినా పరమేశ్వరుడు అంగీకరించక పోవడముతో సతీ దేవి ఆయన పాదములపై పడి పంపమని ప్రార్ధించెను . కాదనలేక ఈశ్వరుడు నందీశ్వరుడిని రక్షకుడిగా నియమించి రుద్ర గణములను తోడుగా ఇచ్చి పంపెను . 
ఆ విధముగా సతీ దేవి దక్ష యజ్ఞమునకు బయలుదేరినది . 




శశి ,

                                 ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 











Tuesday 26 April 2016

సతీ దేవి వృత్తాంతం (పార్ట్ -3)

             సతీ దేవి వృత్తాంతం (పార్ట్ -3)

ఒకానొక సమయములో మునులందరూ కలసి ప్రయాగ క్షేత్రమున ఒక గొప్ప యాగము చేయ సంకల్పించినారు . తపోధనులను ,విజ్ఞానులను ,ఆత్మజ్ఞానులను ,లోకపాలురను ఆహ్వానించారు . ఆ యాగమునకు దక్ష ప్రజాపతి తన పరివారముతో కుడి రాగా మునులు దేవతలు ఎదురేగి ఆహ్వానించారు . నిర్వికారుడు ,ఆదిమద్యాంత రహితుడు అయిన ఆ అది దేవుడు మాత్రం వున్నా చోటే మాట్లాడక ఉండెను . ఆ కారణం వలన దక్షప్రజాపతికి పరమేశ్వరుడు అంటే కోపం వచ్చి శివుడిని నిందించి ,దేవతలు మునులు చెప్పినా వినక నిజ గృహమునకు వెళ్ళెను . ఆ సమయములో నంది శివుడిని నిందిస్తూ పలికిన మాటలు వినలేక "శివ దుషానము చేసిన నీ తల తెగి హోమములో పడుతుంది . "అని శపించెను . దానికి దక్షుడు "మీ శివ గణము పాషండు లై వేద క్రియా చరణలు కోల్పోఎదరు గాక "అని ప్రతి శాపం ఇచ్చెను . తరువాత ఆ యాగము జయప్రదముగా ముగిసెను . 

ఇంటికి వెళ్ళిన దక్షుడు పరమేశ్వరుడి అందు ద్వేష భావముతో ,కోపముతో రగిలిపోతు ఉండెను . పరమేశ్వరుడిని అవమానింప ఒక యాగము చేయ తలపెట్టెను . 


సర్వే జనా సుఖినో భవంతు . 


                                                    శశి ,

            ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 












0

Monday 25 April 2016

సతీ దేవి వృత్తాంతం ( పార్ట్ 2)

               సతీ దేవి వృత్తాంతం  ( పార్ట్ 2)

ఆ విధంగా దక్షుని పుత్రిక గా పెరిగిన సతీ దేవి శివుడిని భర్తగా చేసుకో గోరి "నందావ్రతం "ను ఆచరించెను . అంత శివుడి ప్రత్యక్షమై వరము కోరుకోమనగా సతీ దేవి వివాహము చేసుకోమని కోరుకొనెను . దక్షుడు అది తెలుసుకుని సంతోషించి అందర్ని పిలిచి వివాహ ఏర్పాట్లు చేసెను . అంత శివానుమతితో బ్రహ్మ వధువరులను యాగశాల వద్దకు రప్పించి యజ్ఞ ప్రతిష్ట ఒనరించి విధి ప్రకారము హోమము నిర్వహించి వధూ వరుల చేత అగ్ని ప్రదక్షణ చేయించెను . ఆ సమయములో సతీ దేవి పాదములను చుసిన బ్రహ్మ దేవుడికి మనసు గతి తప్పెను . అప్పుడు ఆయన నుండి ద్రోణ సంవర్తకములు అను పేర్లు కల మేఘములు పుట్టి శివుడి ఆజ్ఞ తో ఆకాశానికి వెళ్ళెను . బ్రహ్మ ఒనరించిన నేరమునకు శివుడు శిక్షింప భూనినపుడు అక్కడ వున్న దేవతలు పరివారము జనులు అందరు విదాతను మన్నిమ్పమని వేడుకొనగా శివుడు కరుణించి వదిలివేసెను . తదుపరి ఆ నూతన దంపతులు కైలాసము చేరి అందరిని సముచితముగా వస్త్ర ఆభరణముల తో  గౌరవించెను అంతట వచ్చిన వారందరూ తమ తమ గృహములకు వెడలగా నందీశ్వరుడిని వాకిట వుంచి సతీ దేవి తన అంతః పురమున ప్రవేశించెను . 
ఆ విధముగా సతీ దేవిని వివాహము చేసుకున్న పరమేశ్వరుడు ముల్లోకములచే పూజలు అందుకుంటూ కైలాసమున ఉండెను . 



                    సర్వేజనా సుఖినో భవంతు . 


                                                 శశి ,

                     ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 


            








Sunday 24 April 2016

సతీ దేవి వృత్తాంతం (పార్ట్ -1)

                 సతీ దేవి వృత్తాంతం     (పార్ట్ -1)

బ్రహ్మ దేవుడు మున్ను మరీచి మొదలగు ముఖ్యులగు పుత్రులను సృజించిన కాలమందు తాపస చిత్తయు ,జగదేక సుందరి అగు సంధ్య అను బాలిక కుడా జన్మించినది . ఆమె రూప లావణ్య ములకు సంభ్రమా శ్చర్యములు పొందిన బ్రహ్మ ,అతని పుత్రులు భాన్దవ్యము మరచి పరిణయమాడకోరిరి . బ్రహ్మ కూతురు అనెడి ధర్మము మరుచుట చేతను ,అతని పుత్రులు సోదరి అను ధర్మము మరుచుట చేతను ధర్మ విరుద్ద భావములను పొంది ఉండుట గ్రహించి మనసులో బాధపడి సంద్యా దేవి రక్షించమని శివుని ప్రార్ధింప పరమేశ్వరుడు ప్రత్యక్షమై బ్రహ్మ దేవుని అతని కుమారులను చూసి నవ్వి ధర్మమును తెలియజేసి మందలించెను . అంత విధాత సిగ్గుపడి చింతిన్చుచుండగా స్వెదముద్భవించి అందునుండి అనేకులు జన్మించిరి . బ్రహ్మ పుత్రుడగు దక్షునికిశివుని ధర్మ బోద  వల్ల భాదపడుతుండగా ఆతని చమట నుండి జగన్మోహిని వాలే వుండు ఒక బాలిక జన్మించింది . ఆమెకు రతీ దేవి అని పేరిడిరి . 
బ్రహ్మ దేవుడు ఆత్మ పరీక్ష చేసుకోనగా తన అసందర్భ మొహమునకు కారణం మన్మదుడు అని తెలుసుకుని "మమ్మల్ని చూసి రుద్రుడు నవ్వడానికి కారణం నీవు కావున నీవు శివ నేత్రాగ్ని యందు దహింప బడుదువు గాక "అని శపించెను . అంత మన్మదుడి వేడుకోలుపై శివుని పెళ్ళికి ఆ ఆది దేవుడి చే తిరిగి దేహమును పొండుతావని దీవించి దక్ష పుత్రిక అగు రతీ దేవి ని ఇచ్చి వివాహము చేసెను . 
 బ్రహ్మ తనను పరిహసించిన శివునికి మొహావేశము కల్పిమ్పమని మన్మదుడిని నియోగించెను . మన్మడుడు తన శాయశక్తులా ప్రయత్నించి శివుడి దృడ చిత్తమును చెదరగొట్ట లేక బ్రహ్మ దగ్గరకు వెళ్లి ఆ పని తన వలన కాదని నివేదించెను . అంత బ్రహ్మ విష్ణు మూర్తి వద్దకు వెళ్లి జరిగిన అవమానమును తెలిపి ఉపాయము చెప్పమనగా విష్ణు మూర్తి" శివ శక్త్యావతారమునకై ప్రయత్నిన్చము . ఆమె దక్షుని కుమార్తె గా జన్మించును ". అని హితోపదేశము చెప్పెను . 
బ్రహ్మ జ్ఞానమును పొంది తన పుత్రుడు దక్షుని పిలిపించి శివ శక్తిని ఆరాధించి ఆమెను పుత్రికగా పొందమని ఆమె శివుడిని పెళ్ళాడి సకల లోక రక్షణము కావించునని  చెప్పెను . అంత దక్షుడు మహేశ్వరుని గూర్చి నిష్టతో తపమొనరించాగా పర దేవత ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకో అనెను . దక్షుడు ఆమెను కూతురుగా జన్మించమని వరము కోరగా అలాగే పుడతానని ,తనపై అనాదరణ చూపినపుడు తనువును వదిలి వేరొక జన్మను పొందుతానని హెచ్చరించి అంతర్దానమయ్యేను . 
అంత దక్షుడు స్వగృహమునకు చేరి తండ్రి ఆనతి అనుసరించి" వీరణ "పుత్రిక అయిన "వీరిణి "అను ఆమెను వివాహమాడి పదివేల మంది కుమారులను కని వారిని తపసోనరించి సృష్టి గావిమ్పమని నియోగించెను . తపసుకు వెళ్ళిన వారు నారద మునీంద్రుడి హితబోదచే విరాగులై తమ తండ్రి వద్దకు వెళ్లక మోక్షార్దులై చనిరి . దక్షుడు తన కుమారులు రానందుకు భాదపడి తిరిగి వేయి మంది పుత్రులను కని వారిని కూడా పూర్వపు పనికే నియోగించెను . వారు కూడా నారదుడి హితబోదలచే మొక్షార్డులై వెళ్ళిరి . తన పుత్రులు తన ఆజ్ఞను పాటించ కుండుటకు కారణం తెలుసుకుని దక్షుడు నారదుడిని కలభోజనుడవు కమ్మని శపించెను . తదనంతరం కుమార్తెలు పొంద కోరినంత తన భార్య వీరణి గర్భము నుండి 60 మంది కన్యలు జనియించిరి . తనకు వరమిచ్చిన శివ శక్తిని ప్రార్ధింపగా ఆమె కుడా పుత్రిక ఐ జన్మించి సతీ అనే పేరు తో పెరిగి పెద్దవుతోంది . 


సర్వే జనా సుఖినో భవంతు . 


                             శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 









Friday 22 April 2016

రాజా విక్రమార్క

                రాజా విక్రమార్క 

మన దేశాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తులలో విక్రమాదిత్యుడు అగ్రగణ్యుడు . ఆయన మంత్రి పేరు బట్టి ,అతని పేరు  మీద విక్రమార్కుడిని బట్టి విక్రమార్క అని పిలుస్థారు. 

విక్రమార్కుడు ;

విక్రమార్కుడు ఉజ్జయిని దేశాన్ని పాలించాడు . ఇతని సోదరుడి పేరు భర్తృహరి . అతడు రాజ్యమును పాలించి విరక్తి చెంది తపోవనమునకేగుచు సోదరుడు విక్రమార్కుడికి రాజ్యమప్పగించెను . అతని విరక్తికి మూల కారణమైన జరామరణము లను పోగొట్టు నట్టి ఫలమును గూడా నితనికి ఇచ్చెను . 

ఫల వృత్తాంతం ;

ఒక బ్రాహ్మణుడు మిక్కిలి పేదవాడు . సదా దేవిని నిష్టతో పూజిస్తూ ఉండెను . అమ్మవారు కరుణించి ప్రత్యక్షమై అతనికి ఒక ఫలమును ఇచ్చి దీని వలన జరా మరణములు (వృద్దాప్యం ,చావు )దరిచేరవు అని చెప్పెను . "నేను చిరకాలము జీవించినను భిక్షాటనే చేసుకోన వలెను . పరోపకారము చేయు రాజు చిరకాలము జీవించుట మంచిది . అని బావించి ఆ బ్రాహ్మణుడు ఆ వర ఫలమును భర్తృహరికి ఇచ్చెను . తను జీవించి వుండగా తన బార్య మరణించుట ఇష్టపడక భర్తృహరి ఆ ఫలమును భార్య మీద ప్రేమ తో ఆమెకు ఇచ్చెను . ఆమెకు గుర్రములను తోలు వాడు ప్రియుడు  కావున ఆమె ఆ ఫలమును అతడికి ఇచ్చెను . అతడు దానిని తన ప్రియమైన దాసికి ఇచ్చెను . ఆ దాసీ తన ప్రియుడైన గోపునకు ఇచ్చెను . అతడు దానిని తనకు ఇష్టమైన పేడ ప్రోగు చేసుకోను దానికి ఇచ్చెను . అది పేడలో పెట్టి తీసుకు వెళ్ళుచుండగా భర్తృహరి చూసి ఆ వృత్తాంతమంతా తెలుసుకుని  ఆమె వద్ద నుండి ఆ ఫలమును తీసుకుని విక్రమార్కునికి ఇచ్చెను . 
 విక్రమార్కుడు పాలించుచుండగా ఒక సారి ఒకడు వచ్చి "నేను యాగము చేయుచున్నాను నాకు సహాయము చేయుము "అని కోరెను . విక్రమార్కుడు అతడితో భిత్రువనమునకు వెళ్ళెను . వీనినాతడు చంపబోయెను అది గ్రహించిన విక్రమార్కుడు అతడినే చంపెను . అది చుసిన బేతాళుడు అప్పటి నుండి విక్రమార్కునికి మిత్రుడయ్యెను . ఊర్వశి ,రంభ లకు మద్యలో నృత్య నైపుణ్యము గురించి నేను గొప్ప అంటే నేను గొప్ప అని వివాదము వచ్చెను . ఇంద్రుడా గొడవను తీర్చలేక రధమును పంపి విక్రమార్కుడిని రప్పించెను. విక్రమార్కుడు ఊర్వశి ఏ గొప్ప నర్తకి అని తీర్పు చెప్పెను . ఆ సహాయానికి ప్రతిగా ఇంద్రుడు విక్రమార్కునికి మణిమయ  సింహాసనమును ఇచ్చెను . దానికి 32సాలభంజికలు కలవు . ఈ సింహాసనాన్ని అధిష్టించి విక్రమార్కుడు పెద్దకాలము రాజ్యమును పరిపాలించెను . 

సాహస వుదారములు మొదలైన సుగుణములలో ఇతనికి సాటి వచ్చు వారు లేరు . ఇతడు పరులకై తన ప్రాణమును ఇచ్చుటకు కూడా సిద్దమయ్యేదివాడు . ఇతడోనరించిన మహత్తర కార్యములను ఈ సాల భంజికలే చెప్పినవి . విక్రమార్కుడు ఒనరించిన తపస్సుకు మెచ్చిన శివుడు అమరత్వము కంటే వేరు వరమును కోరుకోమనగా రెండున్నర సంవత్సరముల పాపకు పుత్రుడు పుట్టినపుడు మరణం సంభవిన్చునట్లు విక్రమార్కుడు కోరెను . ఇట్లు ఎంతో కాలము ప్రజానురంజకంగా పరిపాలించాడు . చాల కాలము తర్వాత రెండున్నర ఏళ్ల పాపకు బాబు పుట్టగా నిజ కడ్గము తో తానే పొడుచుకుని చనిపోయెను . అతని మరణము తర్వాత అతడి సింహాసనాన్ని అధిష్టించే అర్హులు లేరని ఇతని మంత్రులు దానిని దాచిపెట్టేను . తదుపరి భోజ రాజు ఆ సింహాసనాన్ని గైకొనెను . 


సర్వే  జనా సుఖినో భవంతు . 

                                                        శశి ,

      ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 










Thursday 21 April 2016

బృహస్పతి వాక్యం

      బృహస్పతి  వాక్యం 

దేవతల గురువు బృహస్పతి . బుద్దిన బృహస్పతి అని పెద్దలు అంటారు . బృహస్పతిని తలచినా ,పూజించినా మంచి తెలివి తేటలు ,జ్ఞానం అబ్బుతాయి . చదువుకునే పిల్లలు బృహస్పతి వాక్యాన్ని రోజు ఉదయం ఫటిస్తే మంచిది . 

బృహస్పతి వాక్యం ;

శన్నో మిత్రశ్యం వరుణః శన్నో భవత్ పరియమా 
శన్న ఇంద్రో బృహస్పతి శన్నో విష్ణు రురుక్రమా 


         సర్వే  జనా సుఖినో భవంతు . 

                                                శశి ,

                           ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 








Wednesday 20 April 2016

కుంకుమ బొట్టు

                         కుంకుమ బొట్టు 




మన హిందూ సాంప్రదాయం లో బొట్టును చాలా పవిత్రం గా భావిస్తారు . ఇంటికి వచ్చిన ముత్థయుదువుకి బొట్టు పెట్టడం హిందువుల ఆచారం . పెళ్ళికో పేరంటానికో పిలవాలన్నా బొట్టు పెట్టి పిలుస్తారు . ఆడవాళ్ళు బొట్టుని తమ సౌభాగ్యం గా భావిస్తారు . కేవలం ఆడవాళ్ళు మాత్రమే కాదు మగవాళ్ళు కూడా బొట్టును ధరించవచ్చు . 
  మన ప్రతి ఆచారం లోను ఏదో ఒక అర్దము అంతరార్ధము వుంటాయి . మన పూర్వికులు ఎంతో విజ్ఞాన వంతులు వారు ఎంతో ఆలోచించి ఇటువంటి ఆచారాలను సంప్రదాయాలను పెట్టారు . ఇక బొట్టు విషయానికి వస్తే ,
మన శరీరం లో ప్రతి భాగంలో ఒక్కో భాగానికి ఒక్కో అది దేవత ఉంటాడు . లలాట (నుదురు )అది దేవత బ్రహ్మ . అనగా లలాటం బ్రహ్మ స్థానం . బ్రహ్మ దేవుడి దేహం రంగు ఎరుపు . అందువల్ల బ్రహ్మ స్థానం అయిన లలాటం లో ఎరుపు రంగు బొట్టు ధరించాలి . అంటే పవిత్ర కుంకుమ ధరించాలి . లలాట స్థానాన్ని సూర్య కిరణాలు తాకరాదు . 

కుంకుమను ఎ వేలితో ధరించాలి ?

కుంకుమ ను ఉంగరం వేలితో ధరిస్తే మనః శాంతి లభిస్తుంది . 
నడి  వేలుతో కుంకుమ ధరిస్తే దీర్గాయుష్షు లభిస్తుంది . 
బొటన వేలితో కుంకుమ ధరిస్తే శరీరం చురుగ్గా పని చేసే శక్తి వస్తుంది . 
చూపుడు వేలితో పెట్టుకుంటే భగవంతునిపై భక్తి ,జన్మ ముక్తి లభిస్తాయి . 
బొట్టు బిళ్ళలు కాక కుంకుమను ధరించాలి . అప్పుడే ఫలితం వస్తుంది . లలతంలో కుంకుమ ధరిస్తే జ్ఞాన చక్రాన్ని పూజిం చిన  ఫలం లభిస్తుంది . కావున ఆడ మగ తేడా లేకుండా అందరు బొట్టు  ధరించాలి . మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలి . 
సర్వే జన సుఖినో భవంతు . 


                                      శశి ,

  ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు .  
















Tuesday 19 April 2016

జయ విజయలు

                               జయ విజయలు 


విష్ణు మూర్తి ద్వారపాలకుల పేర్లు జయ విజయలు . ఒక సారి సనకసనందాదులు విష్ణు మూర్తి ని దర్శించుటకై వచ్చిరి . వారిని జయ విజయలుద్వారము వద్దే నిలిపి వేసారు . వారు విష్ణు మూర్తిని దర్శించుకుంటాం అని చెప్పగా ఇప్పుడు సమయము కాదు కొంత సేపు ఆగమని జయ విజయాలు చెప్పెను . విష్ణుమూర్తి దర్శనానికి వచ్చిన మమ్ములను మీరడ్డగింతురా మీరు రాక్షసులుగా పుట్టండి అని శపించారు . విష్ణు మూర్తి అది ఎరింగి సంకసనందాదులకు దర్శనమిచ్చి ,జయ విజయలను పిలిపించి "భయపడొద్దు ,మునీశ్వరుల మాటకు తిరుగుండదు కావున అది తప్పదని కాని తుదకు మీరు నాలో ఐక్యం అవుతారు "అని చెప్పెను . వారే హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులు  ,రావణ కుంభకర్ణులు ,శిశుపాల దంతవక్త్రులు గా పుట్టి తుదకు విష్ణుమూర్తి లో ఐక్యం అయ్యారు . 


     సర్వే  జనా సుఖినో భవంతు . 


                                                            శశి ,

                                        ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 






 

Monday 18 April 2016

పాంచజన్యము

                           పాంచజన్యము 

శ్రీ కృష్ణుడి శంఖం పేరు పాంచజన్యం . బలరామ కృష్ణులు సాందీపుడు అనే ముని వద్ద విద్యాబ్యాసము చేసారు . ఆ సాందీప ముని కుమారుడు ఒక సారి సముద్రము నందు స్నానము చేయుచుండగా కెరటము ల ఉదృతి వలన సముద్రము లోకి కొట్టుకు పోయెను . ఆతడిని పంచజనుడు అను దనుజుడు మింగగా ఆ దనుజుది శరీరము నందున్న శంకము లోకి గురు పుత్రుడు ప్రవేశించెను . బలరామ కృష్ణులు తమ గురువు గారైన సాందీప మహర్షికి గురు దక్షణ గా ఆయన పుత్రుడుని తీసుకు రావాలని తలచి ,గురుపుత్రుడు స్నానానికి వెళ్ళిన సముద్ర తీరానికి వెళ్లి సముద్రుడిని అడుగగా సముద్రుడు పంచజనుడు గురు పుత్రుడిని మింగెనని చెప్పెను . అప్పుడు వారు పంచజనుడిని వెతికి అతడిని చంపి అతడి శరీరమును చీల్చగా శంఖము లభించెను . అప్పుడు శ్రీ కృష్ణుడు ఆ శంఖమును తీసుకుని యమపురికి వెళ్లి అక్కడ ఆ శంఖమును ఉదేను . ఆ శబ్దమునకు యముడు అదిరిపడి వచ్చి శ్రీ కృష్ణుని చూసి వచ్చినపని తెలుపమని కోరగా శ్రీ కృష్ణుడు వచ్చిన పనిని తెలిపెను అప్పుడు యముడు గురు పుత్రుడిని శ్రీ కృష్ణుడికి అప్పగించెను . శ్రీ కృష్ణుడు అతడిని గురువు గారికి అప్పగించెను . పంచజన్యుడి శరీరం లో దొరికిన శంఖమును ఆ నాటి నుండి తాను ధరించెను . 
 

                             సర్వే  జనా సుఖినో భవంతు . 

                                                                                  శశి , 

                                                                  ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 






Sunday 17 April 2016

telugu vignanam:   ఏ దిక్కుగా కుర్చుని భోజనము చేయవలెను ?మన హిందూ సా...

telugu vignanam:   ఏ దిక్కుగా కుర్చుని భోజనము చేయవలెను ?మన హిందూ సా...:   ఏ దిక్కుగా కుర్చుని భోజనము చేయవలెను ? మన హిందూ సాంప్రదాయము ప్రకారము అన్నాన్ని పరభ్రహ్మ స్వరూపంగా ,సాక్షాత్ అన్నపూర్ణా దేవి స్వరూపము గా...

  ఏ దిక్కుగా కుర్చుని భోజనము చేయవలెను ?

మన హిందూ సాంప్రదాయము ప్రకారము అన్నాన్ని పరభ్రహ్మ స్వరూపంగా ,సాక్షాత్ అన్నపూర్ణా దేవి స్వరూపము గాను భావించి గౌరవిస్తారు . 
అన్నపూర్ణే సదా పూర్ణే శంకరః ప్రాణ వల్లబే 
అనునది ఆర్యోక్తి . 


సాక్షాత్ ఆది దేవుడు పరమేశ్వరుడికే అన్నదానం చేసిన లోకైక మాత అన్నపూర్ణా దేవి . మనము మూడు పూటలా కడుపు నిండా భోజనము చేస్తున్నాము అంటే ఆ తల్లి అనుగ్రహము మన మీద ఉండటము వల్లనే . అన్నాన్ని అవమానిస్తే ఆ తల్లి ని అవమానించినట్టే . ఈ లోకము లో ఎందఱో తినడానికి తిండి లేక ఒక్క ముద్ద తిండి కోసం  అనేక భాదలు పడుతున్నారు . రైతులు ఎండా ,వానలను లెక్క చేయక ఎంతో కష్ట పడితేగాని మనం తినే ఆహారము తయారవదు . అటువంటి భోజనాన్ని వృధా చేయకుండా ,వున్నంతలో ఆకలితో వున్న వారికి భోజనము పెట్టినట్లయితే ఆ అన్నపూర్ణా దేవి చాలా సంతోషించి ,కరుణా కతాక్షాలతో మనలని చల్లగా చూస్తుంది . 
భోజన విషయములో అందరు పాటించవలసిన మరొక నియమము ,స్నానం చేయకుండా భోజనాన్ని వండ కూడదు ,తినకూడదు . 

భోజనము ఎ దిక్కున కూ ర్చుని భుజించవలెను ?;

తూర్పు ముఖముగా కుర్చుని భుజిస్తే ఆయుర్వుద్ది కలుగుతుంది . 
దక్షిణ ముఖముగా కుర్చుని భుజిస్తే కీర్తి లభిస్తుంది . 
పశ్చిమ ముఖముగా కుర్చుని భుజిస్తే సంపదలు చేకురుతాయి . 
ఉత్తర ముఖముగా కుర్చుని భోజనము చేయరాదు . 




                    సర్వ్ జనా సుఖినో భవంతు . 
 

                                                               శశి ,

                                   ఎం . ఎ తెలుగు ,తెలుగు పండితులు . 









Friday 15 April 2016

కోరికలు నెరవేరడానికి పటించవలసిన రామాయణ ఘట్టములు

     కోరికలు నెరవేరడానికి పటించవలసిన రామాయణ ఘట్టములు 

రామ కధ మధురము మాత్రమే కాదు . దాని నుండి నేర్చుకోవసినది కూడా ఎంతో వుంది .  రామాయణం లో పెద్దలు గురువుల పట్ల భక్తి శ్రద్దలు ,స్త్రీలను గౌరవించడం ,భార్యా భర్తల అన్యోన్యత ,అన్నదమ్ముల ఆప్యాయత ,సత్య వాక్యానికి కట్టుబడటం ,ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మం ను తప్పకపోవడం  ఇలా ఎన్నో వున్నాయి .  ప్రస్తుత సమాజములో మానవ సంభందాలు బలహీనమవుతున్న తరుణములో వీటిని   గ్రహించడం అత్యంత ఆవశ్యకము .రామ నామ మహిమతో పాటు రామాయణ మహిమ కూడా అష్టాదశ పురాణాలలో సవిస్తారముగా వివరింపబడింది . రామాయణం లో ఒక్కో ఘట్టము ఒక్కో ఆణిముత్యము . కలియుగములో మానవుల సకల కోరికలు తీర్చే కల్పవృక్షము రామాయణము అనడం లో ఎ సందేహము లేదు . 

    కోరికలు నెరవేరడానికి పటించవలిసిన  రామాయణ ఘట్టాలు ;

1. ధర్మ కార్యముల సిద్ధికై ;

ధర్మ కార్యముల సిద్ధికై అయోధ్య కాన్డలోని కౌసల్య రామ సంవాదము 21,22,23,24,25 సర్గములను పారాయణ చేసి 5 అరిటి పళ్ళను నివేదన చేయాలి . 

2. ధన లాభముకై ;

అయోధ్యా కాండ లోని ,32 వ సర్గలోని ,యాత్రా దానము అను ఘట్టమును పారాయణ చేసి 5 అరిటి పళ్ళను నివేదన చేయాలి . 

3. వివాహము జరుగుట కై ;

బాల కాండ లోని ,73 సర్గలోని ,సీతా కళ్యాణ ఘట్టము ను పారాయణ చేసి అప్పుడే పితికిన పాలను నివేదన చేయవలెను . 

4 . మోక్ష ప్రాప్తికై ;

అరణ్య కాండ లోని ,65 ,66,67,68 సర్గలలోని,జటాయు మోక్ష ఘట్టమును పారాయణ చేసి 5 అరటి పళ్ళను నివేదన చేయవలెను . 

5 . సకల రోగ నివారణకు ;

యుద్ద కాండ లోని ,59 వ సర్గలోని ,రావణ కిరీట భంగ ఘట్టమును పారాయణ చేసి ప్రారంభములో తేనె సమాప్తిలో పాలు నివేదన చేయవలెను . 

6. భూత పిశాచ బాధల నివృత్తికై ;

సుందర కాండ లోని ,3 వ సర్గ లోని ,లంకా విజయము ఘట్టమును పారాయణ చేసి చెక్కెరపొంగలి నివేదన చేయవలెను . 

7 . చిత్త భ్రమ తొలగుటకై ;

సుందర కాండ లోని ,13 వ సర్గ లోని ,మారుతి నిర్వీదము ఘట్టమును పారాయణ చేసి మినుముల పొడి కలిపిన అన్నమును నివేదన  చేయవలెను . 

8. దారిద్ర నివృత్తికై ;

సుందర కాండ లోని,15 వ సర్గ లోని ,హనుమత్క్రుత సీత దర్శనము ఘట్టమును పారాయణ చేసి 5 అరటి పళ్ళను నివేదన చేయవలెను . 

9. సకల దుఖ నివృత్తికై ;

యుద్ద కాన్దలోని, 116 వ సర్గ లోని ,సీతాంజనేయ సంవాద ఘట్టమును పారాయణ చేసి 5 అరటి పళ్ళను నివేదన చేయవలెను . 

10 . ఆపదను వారించుటకై ; 

యుద్ద కాండ లోని ,18 ,19 సర్గలలోని ,విభీషణ సంగ్రహ ఘట్టమును పారాయణ చేసి టెంకాయ నివేదన చేయవలెను . 

11. భందువు స్వస్థానము చేరుటకై ; 

సుందర కాండ లోని ,36 వ సర్గ లోని ,అంగుళీయ ప్రధాన ఘట్టమును పారాయణ చేసి పనస పండు మామిడి పండు లను నివేదన చేయవలెను . 

12. దుస్వప్న దోష శాంతికి ; 

సుందర కాండ లోని ,27 వ సర్గలోని ,తిజటా స్వప్న వృత్తాంత ఘట్టమును పారాయణ చేసి పంచదార నివేదన చేయవలెను . 

13. జన్మాన్తరమున సకల శుక ప్రాప్తికి ; 

యుద్ద కాండ లోని ,131 వ సర్గ లోని ,శ్రీ రామ పట్టాభిషేక ఘట్టమును పారాయణ చేసి పెసరపప్పు చేర్చిన ఉప్పు పొంగలి నివేదన చేయవలెను . 

14. పుత్ర సంతాన ప్రాప్తికై ;

బాల కాండ లోని ,15 ,16 సర్గలలోని పుత్ర కామేష్టి ఘట్టమును పారాయణ చేసి నేయి కలిపినా పాయసమును నివేదన చేయవలెను . 

15 . సుఖ ప్రసవమునకు ; 

బాల కాండ లోని 18 వ సర్గ లోని శ్రీ రామావతార ఘట్టమును పారాయణ చేసి ఆ సమయములో దొరకు పళ్ళను నివేదన చేయవలెను . 

16 . కారా గృహ భయ నివృత్తికి ;

యుద్ద కాండ లోని ,117 వ సర్గ లోని ,సీతా నయన ఘట్టమును పారాయణ చేసి తీపి వస్తువును నివేదన చేయవలెను . 

17 . సంతానమునకు సద్భుద్ది కలుగుటకై ;

అయోధ్య కాండ లోని ,1,2 ల సర్గ ల లోని శ్రీ రామ గుణ వర్ణన ఘట్టమును పారాయణ చేసి 5 అరటి పళ్ళను నివేదన చేయవలెను . 

18 . సకలాభీష్ట కార్య సిద్ధికై ;

బాల కాండ లోని 75,76 సర్గలలోని భార్గవ విజయ ఘట్టమును పారాయణ చేసి పాయసము అప్పాలు నివేదన చేయవలెను . 

19 . రాజ ద్వారమున సర్వానుకుల సిద్ధికై ;

అయోధ్య కాండ లోని ,100 వ సర్గ లోని ,శ్రీ రాముని చే భరతుడికి రాజ ధర్మోపదేశము ఘట్టమును పారాయణ చేసి 5 అరటి పళ్ళను నివేదన చేయవలెను . 
భక్తి తో శ్రీ రాముడి మీదనే ద్యాసను వుంచి మండల కాలము (40 లేదా 45 రోజులు )భక్తి తో పారాయణ చేసిన ఫలితము తప్పక కలుగుతుంది . 





అందరికి ఆ శ్రీ రామ రక్ష లభించు గాక 


                                           శశి ,

 ఎం . ఎ తెలుగు ,తెలుగు పండితులు . 















Thursday 14 April 2016

రామ కధామృతము

                  రామ కధామృతము 



విష్ణు మూర్తి దశావతారాలలో ఎంతో విశిష్టమైనది రామావతారము . ఎటువంటి మాయలు ప్రదర్శించకుండా ఎన్నో కష్టాలకు వోర్చి ధర్మాన్ని నిలబెట్టిన మహాను భావుడు ఇక్ష్వాకు కుల తిలకుడు శ్రీ రాముడు . ఎన్ని యుగాలు గడిచినా ఆడపిల్లలు రాముడి లాంటి భర్త కావాలని ,తండ్రి తన కొడుకు రాముడు లా వుండాలని కోరుకుంటున్నారు . రాముడు మంచి బాలుడు అనే వాక్యం మనం చిన్నప్పటి నుండి ఎన్నో సార్లు వింటూనే ఉంటాము  అంటే  రాముడు ఎంతటి శుభ లక్షణ శోభితుడో స్పష్టంగా అర్ధమవుతుంది . 

    ఇక సీతా దేవి పతివ్రత, పరమ సాధ్వి ,అయినప్పటికీ తన వ్యక్తిత్వాన్ని ,ఆత్మ గౌరవాన్ని కాపాడుకున్న స్త్రీ జాతి ఆణిముత్యం సీత . 
  రామాయణం లోని భాగాలను కాండలు అంటారు . 

రామ జన్మ వృత్తాంతం  ;

అయోధ్యా నగరాన్ని రాజధానిగా చేసుకుని అయోధ్యను పరిపాలిస్తున్న దశరధ మహా రాజు పుత్రులు లేరనే భాధతో పుత్రార్ది అయి ఋష్యశృంగుని బ్రహ్మత్వంలో పుత్ర కామేష్టి యజ్ఞాన్ని ఎంతో భక్తి శ్రద్దలతో చక్కగా ఆచరించాడు . తత్ ఫలితం గా యజ్ఞ ప్రసాద మహత్తు చే దశరద మహారాజుకు తన ముగ్గురు పట్ట పురాణుల నందు నలుగురు కుమారులు రామ ,లక్ష్మణ ,భరత,శతృజ్ఞులు  జనియించినారు . ముద్దు మురిపాలతో రాకుమారులు నలుగురూ అయోధ్యలో పెరిగి పెద్దవారవుతున్నారు . 

సీతా జన్మ వృత్తాంతం ;

మిధిలా రాజ్యాన్ని జనక మహారాజు పరిపాలిస్తున్నాడు . ఆయనకు పిల్లలు లేని కారణం గా చింతతో ఉండెను . ఒకనాడు ఆయన  యజ్ఞం చేసి  భూమిని దున్నుతుండగా భూమిలో పసిపాప  దొరికింది ఆ పాపే  సీతాదేవి . తరువాత జనక మహారాజుకి ఊర్మిళ జన్మించింది . జనక మహారాజు తమ్ముడు కుశ ద్వజుడికి మాండవి ,శ్రుతకీర్తి జన్మించారు . నలుగురు అక్కచెల్లెళ్ళు ఎంతో అన్యోన్యం గా పెరుగుతున్నారు . 

విశ్వామిత్రుడి  రాక ;

విశామిత్రుడు తన యాగ పరిరక్షనార్ధం రాముడిని తీసుకు వెళ్లాలని భావించి అయోధ్యకు వచ్చి దశరధ మహా రాజుని రాముడిని పంపించమని అడుగుతాడు . దశరధుడు మొదట భయపడినా తన కుల గురువు వశిష్టుడు చెప్పడంతో పంపిస్తాడు . విశ్వామిత్రుడి వెనక వెళ్ళిన రామ లక్ష్మణులు బల, అతిబల ,దండ చక్ర ,ధర్మ చక్ర ,కాల చక్ర ,విఘ్న చక్ర ,ఐషీక , ఐంద్ర ,వజ్ర ,ఆగ్నేయ వాయువ్య ,వారుణాస్త్రాలు వాటి ఉపసంహరనలు  విశ్వామిత్రుడి వలన పొందారు . 

విశ్వామిత్రుడి యజ్ఞానికి కావలి కాసి దానిని పాడు చేయడానికి వచ్చిన మారీచ సుభాహులను ఎదుర్కుని యజ్ఞాన్ని సంపూర్ణమయ్యేలా చేసారు . తదుపరి విశ్వామిత్రుడితో శివ ధనస్సు సందర్శనార్ధం మిధిలా నగరానికి వెళ్ళారు . మార్గ మద్యములో అహల్యకు శాప విమోచనం కావించాడు పరం పావన మూర్తి శ్రీరాముడు . 
  సీతా స్వయం వరములో శివధనుర్భగము ద్వారా సీతా రాముల వివాహం నిశ్చయమైనది . ఇరువురి కుల గురువుల ప్రోద్బల్యం తో రాముడు -సీత ,లక్ష్మణుడు -ఊర్మిళ ,భరతుడు -మాండవి ,శాత్రుగ్నుడు -శ్రుతకీర్తి  ల వివాహములు అంగరంగ వైభవముగా జరిగాయి . 

సీతా రాముల వనవాసం ;


రాకుమారుల వివాహము కొత్త కోడళ్ళ రాకతో అయోధ్యా ప్రజలు రాజ మందిరము ఆనందములో మునిగి వున్నారు . కొంత కాలానికి ధశరద మహారాజుకి తన కుమారుడు రాముడికి రాజ్య భారాన్ని అప్పగించి విశ్రాంతి తీసుకోవాలని ఏర్పాట్లు చేస్తాడు . కాని ధశరదుడి చిన్న భార్య కైక మంధర వుద్భోదతో  తనకు ఇస్తానన్న వరాలను ఇప్పుడు ఇవ్వమని ఆ వరాలు భరతుడిని రాజ్యాభిషిక్తుడిని చేయడం ,రాముడిని వనవాసానికి పంపడం . అని కోరుకుంది . రామ వియోగాన్ని వుహించలేని మహారాజు కుప్పకులిపోతాడు . రాముడు జరిగిన వృత్తాంతాని తెలుసుకుని ,లక్ష్మణుడు ,సీత వెంట రాగ వనవాసానికి బయలుదేరతాడు . రాముడి మీద అభిమానం తో అయోధ్యా వాసులు చాలా దూరం రాముడి వెంటే వెళ్ళారు . 

అరణ్య వాసం లో సీతా రాములు కొంత కాలం చిత్రకూటం మీద తదుపరి పచవటిన నివసించారు . ఆ సమయములలో శ్రీరాముడు అనేక మంది రాక్షసులను హతమార్చి జగానికి శాంతిని కలుగజేసెను ఆ సమయములోనే శుర్పనఖ ముక్కు చెవులను కోసాడు లక్ష్మణుడు . 
  శూర్పనఖ  మాయ మాటలు నమ్మిన రావణుడు మారీచుని బంగారు లేడిగా మారమని   ,ఆ లేడిని వెంబడిస్తూ రాముడు వల్లగ సీతను అపహరించి లంకకు తీసుకు  వెళ్లి తన అశోక వనము నందు ఉంచెను . సీతకోరకు రాముడు ఎంతో విలపించెను .  వాలిని సంహరించి సుగ్రీవుని రాజుగా చేసెను .  ఆంజనేయుడు సీతా జాడ కనిపెట్టి చెప్పెను .  ఆంజనేయుడు ,సుగ్రీవుడు ,జామ్భావంతుడు , మొదలగు వానరులంతా  తోడు నిలువగా ,లంక పై దండెత్తి రావణుడిని సంహరించి సీత ను చెర విడిపించెను . సీతా సమేతుడై శ్రీ రాముడు  అయోధ్యకు వెళ్ళెను . అక్కడ సీతారాముల పట్టాభిషేకము ఎంతో దివ్యముగా అత్యంత వైభవముగా జరిగెను . శ్రీ రాముడు ప్రజానురంజకముగా రాజ్యమును పాలించెను . శ్రీ రాముడి పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో వుండేవారు . వానలు సకాలంలో పది పంటలు సుభిక్షముగా పండేవి .  కావుననే నేటికి రామ రాజ్యము అను నానుడి ప్రజలలో వినుపించును . రామ నామం రాయడం చేతనే రాళ్ళు కూడా లంకకు వారధి కట్టు సమయములో సముద్రములో తేలి ఆడినవి . అంతటి గొప్ప శక్తి కలిగినది రామ నామము .మంగళ కారుడు శ్రీ రాముడు . నమ్మిన వారిని కాచే దైవం సీతాపతి . 


                    

  జనులందరికి శ్రీ రామ రక్షా కలుగు గాక 
సర్వ్ జన సుఖినో భవంతు . 

                                                           శశి ,                                 

                                                      ఎం ఎ ,తెలుగు ,తెలుగు పండితులు .   
















Wednesday 6 April 2016

అష్ట దిక్పాలకులు 
1. ఇంద్రుడు _  అమరావతి 
2. అగ్ని _తేజోవతి 
3.యముడు _సంయమని 
4.నైరుతి _కృష్ణాంగన 
5. వరుణుడు _శ్రద్దావతి 
6.వాయువు _గంధవతి 
7.కుబేరుడు _మహోదయ 
8.ఈశాన్యుడు _యశోవతి 

                          

            శశి 

Tuesday 5 April 2016

ఉగాది

                           ఉగాది


తెలుగు వారి నూతన  సంవత్సరాదిని ఉగాది అంటారు . నిజానికి ఇది యుగాది (యుగ +ఆది ). ఉగాది ప్రతీ సంవత్సరం చైత్ర శుద్ద పాడ్యమి రోజున వస్తుంది . ఈ సంవత్సరం  చైత్ర శుద్ద పాడ్యమికి వచ్చు ఉగాదితో దుర్ముఖి నామ సంవత్సరం ప్రారంభమవుతుంది . 
     నూతన సంవత్సర ఆరంభ కాలంలో వాతావరణం అంతా ఆహ్లాదంగా ,చెట్లన్నీ పూలు ,పళ్ళు తో ఎంతో రమణీయముగా,కోకిలల కూతలతో ,పచ్చని పంట పొలాలతో  వసంత శోభతో  చాలా మనోహరంగా వుంటుంది . ఇటువంటి మనోరంజక పరిస్థితులు సుఖ ,సంతోషాలకు ,శుభాలకు ప్రతీకలు . ఇటువంటి అద్భుతమైన వాతావరణంలో ప్రారభమైన సంవత్సరంలో జనులంతా కుడా సుఖ సంతోషాలతో వుంటారు . 
   ఉగాది రోజున తెల్లవారుజామునే లేచి  ఉదయం 5. 30లోపు నువ్వులనూనెతో తలంటు పోసుకోవాలి . నుదుటన బొట్టు దరించి నూతన వస్త్రాలు ధరించాలి . తరువాత సుర్యభగవానుడికి నూతన సంవత్సర సంకల్పం చెప్పుకుంటూ పుష్పాంజలి ,అర్గ్యము ,దీపం దూపం సమర్పించాలి . వేప పూత పచ్చడిని విధిగా అందరు తినాలి . 
  వేప పూత పచ్చడి షడ్రుషులతో తయారు చేస్తారు .  జీవితంలో ఒక్క సుఖాలు మాత్రమె కాకుండా అన్ని రకాలు (కష్టాలు ,బాదలు సరదాలు బాద్యతలు   . . . . . . . . . . . . .  ) వుంటాయి . వాటిని కుడా ఆస్వాదించాలి దైర్యముగా ఎదుర్కోవాలి ఇదే ఉగాది పచ్చడి లో రుచుల అంతరార్దం . ఉగాది పచ్చడిలో మామిడి చిగుళ్ళు అశోక చిగుళ్ళు కుడా వెయ్యాలి . అల వేసినట్లయితే దానిని "నిమ్బకుసుమం "అంటారు . 
                    శతాయు ర్వజ్ర దేహాయుహు సర్వ సంపత్కరాయ చ 
                    సర్వారిష్ట వినాశాయ ,నింభ కుసుమ భక్షణం . 
 నింబ కుసుమం తినడం వల్ల  నూరు సంవత్సరాల ఆయుర్దాయం , దృడమయిన దేహము కలిగి సర్వ అరిష్టాలు నాశనము అయి అంత శుభం జరుగుతుంది అని పై  శ్లోకార్ధము . 
    త్వామష్ట శోక నరాభీష్ట !మధు మాస సముద్భవ !
     నిభావి శోక   సంతాప్తాం మమ శోకం సదా కురు 
అనగా జీవితంలో శోకాలతో భాదపడుతున్న నేను ఓ అసోకమా !నిన్ను సేవించుచున్నాను . మధు మాసం(వసంతం ) లోచిగురించిన అశోకమా !నీవు నాకు శోకములు లేకుండా (అ +శోకము ) చేయుదువు గాక !అని అర్ధము . అశోక వృక్షములో అట్టి దివ్య శక్తి కలదు . 

పంచాగ శ్రవణం ;

ఉగాది రోజున దేవాలయములలో పంచాంగ శ్రావణము చేస్తారు  . పంచాంగ శ్రావణము వినుత వలన తిది వలన సంపదయు ,వారము వలన ఆయుష్య ము ,నక్షత్రము వలన పాప పరిహారము యోగము వలన వ్యాధి నివ్రుత్తియు ,కరణము వలన కార్యానుకూలము కల్గును . అంతేకాక రాజాధి నవ నాయకుల యొక్క గ్రహ ఫలితాలను వినుట వల్ల గ్రహ దోషములు నివారణ అయి ,విను వారికి ఆరోగ్యము ,ఆయుష్షు ,సంపదలు ,శుభ ఫలితాలు కలుగుతాయి . 
  ఉగాది రోజున మన సంప్రదాయాలను పాటించి భావి తరాలకు వాటి గొప్పదనాన్ని తెలెయ చెప్పుదాం . 
ఉగాది లానే ప్రజలందరి జీవితం అంతా సుఖ సంతోషాలతో నవ వసంతం లా సాగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ 



                                                                      మీ శశి