Sunday 24 April 2016

సతీ దేవి వృత్తాంతం (పార్ట్ -1)

                 సతీ దేవి వృత్తాంతం     (పార్ట్ -1)

బ్రహ్మ దేవుడు మున్ను మరీచి మొదలగు ముఖ్యులగు పుత్రులను సృజించిన కాలమందు తాపస చిత్తయు ,జగదేక సుందరి అగు సంధ్య అను బాలిక కుడా జన్మించినది . ఆమె రూప లావణ్య ములకు సంభ్రమా శ్చర్యములు పొందిన బ్రహ్మ ,అతని పుత్రులు భాన్దవ్యము మరచి పరిణయమాడకోరిరి . బ్రహ్మ కూతురు అనెడి ధర్మము మరుచుట చేతను ,అతని పుత్రులు సోదరి అను ధర్మము మరుచుట చేతను ధర్మ విరుద్ద భావములను పొంది ఉండుట గ్రహించి మనసులో బాధపడి సంద్యా దేవి రక్షించమని శివుని ప్రార్ధింప పరమేశ్వరుడు ప్రత్యక్షమై బ్రహ్మ దేవుని అతని కుమారులను చూసి నవ్వి ధర్మమును తెలియజేసి మందలించెను . అంత విధాత సిగ్గుపడి చింతిన్చుచుండగా స్వెదముద్భవించి అందునుండి అనేకులు జన్మించిరి . బ్రహ్మ పుత్రుడగు దక్షునికిశివుని ధర్మ బోద  వల్ల భాదపడుతుండగా ఆతని చమట నుండి జగన్మోహిని వాలే వుండు ఒక బాలిక జన్మించింది . ఆమెకు రతీ దేవి అని పేరిడిరి . 
బ్రహ్మ దేవుడు ఆత్మ పరీక్ష చేసుకోనగా తన అసందర్భ మొహమునకు కారణం మన్మదుడు అని తెలుసుకుని "మమ్మల్ని చూసి రుద్రుడు నవ్వడానికి కారణం నీవు కావున నీవు శివ నేత్రాగ్ని యందు దహింప బడుదువు గాక "అని శపించెను . అంత మన్మదుడి వేడుకోలుపై శివుని పెళ్ళికి ఆ ఆది దేవుడి చే తిరిగి దేహమును పొండుతావని దీవించి దక్ష పుత్రిక అగు రతీ దేవి ని ఇచ్చి వివాహము చేసెను . 
 బ్రహ్మ తనను పరిహసించిన శివునికి మొహావేశము కల్పిమ్పమని మన్మదుడిని నియోగించెను . మన్మడుడు తన శాయశక్తులా ప్రయత్నించి శివుడి దృడ చిత్తమును చెదరగొట్ట లేక బ్రహ్మ దగ్గరకు వెళ్లి ఆ పని తన వలన కాదని నివేదించెను . అంత బ్రహ్మ విష్ణు మూర్తి వద్దకు వెళ్లి జరిగిన అవమానమును తెలిపి ఉపాయము చెప్పమనగా విష్ణు మూర్తి" శివ శక్త్యావతారమునకై ప్రయత్నిన్చము . ఆమె దక్షుని కుమార్తె గా జన్మించును ". అని హితోపదేశము చెప్పెను . 
బ్రహ్మ జ్ఞానమును పొంది తన పుత్రుడు దక్షుని పిలిపించి శివ శక్తిని ఆరాధించి ఆమెను పుత్రికగా పొందమని ఆమె శివుడిని పెళ్ళాడి సకల లోక రక్షణము కావించునని  చెప్పెను . అంత దక్షుడు మహేశ్వరుని గూర్చి నిష్టతో తపమొనరించాగా పర దేవత ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకో అనెను . దక్షుడు ఆమెను కూతురుగా జన్మించమని వరము కోరగా అలాగే పుడతానని ,తనపై అనాదరణ చూపినపుడు తనువును వదిలి వేరొక జన్మను పొందుతానని హెచ్చరించి అంతర్దానమయ్యేను . 
అంత దక్షుడు స్వగృహమునకు చేరి తండ్రి ఆనతి అనుసరించి" వీరణ "పుత్రిక అయిన "వీరిణి "అను ఆమెను వివాహమాడి పదివేల మంది కుమారులను కని వారిని తపసోనరించి సృష్టి గావిమ్పమని నియోగించెను . తపసుకు వెళ్ళిన వారు నారద మునీంద్రుడి హితబోదచే విరాగులై తమ తండ్రి వద్దకు వెళ్లక మోక్షార్దులై చనిరి . దక్షుడు తన కుమారులు రానందుకు భాదపడి తిరిగి వేయి మంది పుత్రులను కని వారిని కూడా పూర్వపు పనికే నియోగించెను . వారు కూడా నారదుడి హితబోదలచే మొక్షార్డులై వెళ్ళిరి . తన పుత్రులు తన ఆజ్ఞను పాటించ కుండుటకు కారణం తెలుసుకుని దక్షుడు నారదుడిని కలభోజనుడవు కమ్మని శపించెను . తదనంతరం కుమార్తెలు పొంద కోరినంత తన భార్య వీరణి గర్భము నుండి 60 మంది కన్యలు జనియించిరి . తనకు వరమిచ్చిన శివ శక్తిని ప్రార్ధింపగా ఆమె కుడా పుత్రిక ఐ జన్మించి సతీ అనే పేరు తో పెరిగి పెద్దవుతోంది . 


సర్వే జనా సుఖినో భవంతు . 


                             శశి ,

ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 









No comments:

Post a Comment