Monday 25 April 2016

సతీ దేవి వృత్తాంతం ( పార్ట్ 2)

               సతీ దేవి వృత్తాంతం  ( పార్ట్ 2)

ఆ విధంగా దక్షుని పుత్రిక గా పెరిగిన సతీ దేవి శివుడిని భర్తగా చేసుకో గోరి "నందావ్రతం "ను ఆచరించెను . అంత శివుడి ప్రత్యక్షమై వరము కోరుకోమనగా సతీ దేవి వివాహము చేసుకోమని కోరుకొనెను . దక్షుడు అది తెలుసుకుని సంతోషించి అందర్ని పిలిచి వివాహ ఏర్పాట్లు చేసెను . అంత శివానుమతితో బ్రహ్మ వధువరులను యాగశాల వద్దకు రప్పించి యజ్ఞ ప్రతిష్ట ఒనరించి విధి ప్రకారము హోమము నిర్వహించి వధూ వరుల చేత అగ్ని ప్రదక్షణ చేయించెను . ఆ సమయములో సతీ దేవి పాదములను చుసిన బ్రహ్మ దేవుడికి మనసు గతి తప్పెను . అప్పుడు ఆయన నుండి ద్రోణ సంవర్తకములు అను పేర్లు కల మేఘములు పుట్టి శివుడి ఆజ్ఞ తో ఆకాశానికి వెళ్ళెను . బ్రహ్మ ఒనరించిన నేరమునకు శివుడు శిక్షింప భూనినపుడు అక్కడ వున్న దేవతలు పరివారము జనులు అందరు విదాతను మన్నిమ్పమని వేడుకొనగా శివుడు కరుణించి వదిలివేసెను . తదుపరి ఆ నూతన దంపతులు కైలాసము చేరి అందరిని సముచితముగా వస్త్ర ఆభరణముల తో  గౌరవించెను అంతట వచ్చిన వారందరూ తమ తమ గృహములకు వెడలగా నందీశ్వరుడిని వాకిట వుంచి సతీ దేవి తన అంతః పురమున ప్రవేశించెను . 
ఆ విధముగా సతీ దేవిని వివాహము చేసుకున్న పరమేశ్వరుడు ముల్లోకములచే పూజలు అందుకుంటూ కైలాసమున ఉండెను . 



                    సర్వేజనా సుఖినో భవంతు . 


                                                 శశి ,

                     ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 


            








No comments:

Post a Comment