Friday 29 April 2016

               సతీ దేవి వృత్తాంతం (పార్ట్ -6)

సతీ దేవి యోగాగ్నికి ఆహుతి అవుట చూసిన శివ గణములు యజ్ఞ వాటికను అల్లకల్లోలము చేయ ప్రయత్నించి రుత్విజుడయిన బృగు మహర్షి రగిల్చిన దక్షినాగ్నికి భయపడి ఊర కుండిరి . అంతలో ఆకాశవాణి అందరు ఆశ్చర్యపోయేట్లు దక్షుడిని ఉద్దేశించి "ఓరి గర్వముతో శివుని నిందిన్చితివి . శివ నిందా ఫలమును వెంటనే అనుభవింతువు . "అని పలికెను . నారదాది మునీ ముఖ్యులు వేగముగా వెళ్లి జరిగిన వృత్తాంతమును శివుడికి తెలియ జేసిరి . 
నారదాదుల వలన సతీ దేవి మరణ వార్త విన్న శివుడు భాద ,కోపములు నిండి వుండగా తన శిరము నందలి జటా జుటము నుండి ఒక జటను పీకి నేలపై విసరగా అందుండి భద్రకాళీ సమేత వీరభద్రుడు ఉద్భవించెను . 


వారివురు ఈశ్వరుడిని ధ్యానించి కర్తవ్యము ఆదేశింపమని వేడుకొనిరి . అంత పరమేశ్వరుడు వీర భద్రుని చూసి "పుత్రా నీవు గణములతో కుడి నీవు భద్రకాళి తో కూడి దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞ వాటికకు ఏగి యాగమును ద్వంసము గావించి అక్కడ ఉన్న ప్రేక్షకులను కూడా బహువిధములుగా శిక్షించి రా .  అడ్డగించే వారు ఎవరు లేరు . అని వారిని నియమించి పంపెను . అంత సతీ వియోగమున శంకరుడు శోకించుచు ఉండెను . అంత వీరభద్రుడు సింహములను పూన్చిన దివ్య రధమును అధిరోహించి సింహ ,శార్దూల ,గజ ,తురగ ములను ఎక్కి సాయుధములై ముక్కోటి రుద్ర గణములు తో కూడి యుద్ద బేరిణి ,శంకమును ఊదుతూ ముదంగ నాదములు ,గంట ,వేణు వీణా ,డమరు మొదలైన వాయిద్యములు వాయించుచు  భయంకరముగా యుద్దానికి వచ్చిరి . 
ఇంకా శంకర్లుండు అను గణపాలుండు ,అమోఘుడు ,కోకిలుడు ,కాష్టాను ఘుష్టుండు ,సమంతకుడు ,కాక పాదోధరుడు ,సంతానకుడు ,మహా భలుడు ,మధు పింగడు ,సంవర్తకుడు ,లకులీశుండు ,లోకాంతకుడు ,దైత్యాంతకుడు ,అశని ,బాలకుడు ,కాపాలికుడు ,సంచారకుడు ,కుండ విష్టన్డకుడు ,సన్నాడుండు ,పిప్పలుండు ,జంద్రతాపసుడు ,మహావేశుడు, కాలకాలకమహాకాలురు ,అగ్నిక్రుత్త్తు ,అగ్నిముఖుడు ఆదిత్యముర్ఖుడు ,విక్రుతుడు ,సశాకుడు ,సర్వాంకకుడు ,జ్యాలాదేశుడు ,పర్వతకుండుడు ,క్షేత్ర పాలకున్డగు భైరవుండు ,నందీశుండు ,సర్వ సేనాని అగు చందీశుండు, మనీ మంతుడు ,అనేక కోటి ప్రమదాది భూత వీర సైన్యముతో వెళ్ళిరి . ఇంకా భద్రకాళి సాయుదులగు మహాకాళీ ,గౌరీ ,కాత్యాయిని,చాముండి ,ముండమర్ధిని ,భద్రా వైష్ణవి ,నారసింహీ నామక నవ దుర్గలతో శాకినీ ,డాకినీ ,కుష్మండి ,పర్పటి ,చటికా ,యక్షినీ ,మోహినీ లు వచ్చెను . యుద్దము చేయుటకు వచ్చిన వారందరిపై శివాజ్ఞ తో పూల  కురిసెను . వారికి అనేక శుభ శకునములు కనిపించెను . 

అక్కడ దక్షునికి అనేక దుశ్శకునములు కనిపించెను . అక్కడ ఉన్న ఋత్విజులు ,మునులు ఆ దుశ్శకునములకు భయపడి ఏమి చేయాలో తెలియక పారిపోవు చుండిరి . దక్షుడు ఆ ఘటనను చూసి ఆశ్చర్య పోతూ ఉండెను . దక్షుడి ధర్మ పత్ని వీరణి కుడా ఆధుశ్శకునములకు భయపడుతూ ఉండెను . 
ఆ సమయములో వీరభద్ర గణమందరు యజ్ఞ వాటిక వద్దకు చేరిరి . 



శశి ,

                                       ఎం . ఎ (తెలుగు ),తెలుగుపండితులు . 












No comments:

Post a Comment