Friday 15 April 2016

కోరికలు నెరవేరడానికి పటించవలసిన రామాయణ ఘట్టములు

     కోరికలు నెరవేరడానికి పటించవలసిన రామాయణ ఘట్టములు 

రామ కధ మధురము మాత్రమే కాదు . దాని నుండి నేర్చుకోవసినది కూడా ఎంతో వుంది .  రామాయణం లో పెద్దలు గురువుల పట్ల భక్తి శ్రద్దలు ,స్త్రీలను గౌరవించడం ,భార్యా భర్తల అన్యోన్యత ,అన్నదమ్ముల ఆప్యాయత ,సత్య వాక్యానికి కట్టుబడటం ,ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మం ను తప్పకపోవడం  ఇలా ఎన్నో వున్నాయి .  ప్రస్తుత సమాజములో మానవ సంభందాలు బలహీనమవుతున్న తరుణములో వీటిని   గ్రహించడం అత్యంత ఆవశ్యకము .రామ నామ మహిమతో పాటు రామాయణ మహిమ కూడా అష్టాదశ పురాణాలలో సవిస్తారముగా వివరింపబడింది . రామాయణం లో ఒక్కో ఘట్టము ఒక్కో ఆణిముత్యము . కలియుగములో మానవుల సకల కోరికలు తీర్చే కల్పవృక్షము రామాయణము అనడం లో ఎ సందేహము లేదు . 

    కోరికలు నెరవేరడానికి పటించవలిసిన  రామాయణ ఘట్టాలు ;

1. ధర్మ కార్యముల సిద్ధికై ;

ధర్మ కార్యముల సిద్ధికై అయోధ్య కాన్డలోని కౌసల్య రామ సంవాదము 21,22,23,24,25 సర్గములను పారాయణ చేసి 5 అరిటి పళ్ళను నివేదన చేయాలి . 

2. ధన లాభముకై ;

అయోధ్యా కాండ లోని ,32 వ సర్గలోని ,యాత్రా దానము అను ఘట్టమును పారాయణ చేసి 5 అరిటి పళ్ళను నివేదన చేయాలి . 

3. వివాహము జరుగుట కై ;

బాల కాండ లోని ,73 సర్గలోని ,సీతా కళ్యాణ ఘట్టము ను పారాయణ చేసి అప్పుడే పితికిన పాలను నివేదన చేయవలెను . 

4 . మోక్ష ప్రాప్తికై ;

అరణ్య కాండ లోని ,65 ,66,67,68 సర్గలలోని,జటాయు మోక్ష ఘట్టమును పారాయణ చేసి 5 అరటి పళ్ళను నివేదన చేయవలెను . 

5 . సకల రోగ నివారణకు ;

యుద్ద కాండ లోని ,59 వ సర్గలోని ,రావణ కిరీట భంగ ఘట్టమును పారాయణ చేసి ప్రారంభములో తేనె సమాప్తిలో పాలు నివేదన చేయవలెను . 

6. భూత పిశాచ బాధల నివృత్తికై ;

సుందర కాండ లోని ,3 వ సర్గ లోని ,లంకా విజయము ఘట్టమును పారాయణ చేసి చెక్కెరపొంగలి నివేదన చేయవలెను . 

7 . చిత్త భ్రమ తొలగుటకై ;

సుందర కాండ లోని ,13 వ సర్గ లోని ,మారుతి నిర్వీదము ఘట్టమును పారాయణ చేసి మినుముల పొడి కలిపిన అన్నమును నివేదన  చేయవలెను . 

8. దారిద్ర నివృత్తికై ;

సుందర కాండ లోని,15 వ సర్గ లోని ,హనుమత్క్రుత సీత దర్శనము ఘట్టమును పారాయణ చేసి 5 అరటి పళ్ళను నివేదన చేయవలెను . 

9. సకల దుఖ నివృత్తికై ;

యుద్ద కాన్దలోని, 116 వ సర్గ లోని ,సీతాంజనేయ సంవాద ఘట్టమును పారాయణ చేసి 5 అరటి పళ్ళను నివేదన చేయవలెను . 

10 . ఆపదను వారించుటకై ; 

యుద్ద కాండ లోని ,18 ,19 సర్గలలోని ,విభీషణ సంగ్రహ ఘట్టమును పారాయణ చేసి టెంకాయ నివేదన చేయవలెను . 

11. భందువు స్వస్థానము చేరుటకై ; 

సుందర కాండ లోని ,36 వ సర్గ లోని ,అంగుళీయ ప్రధాన ఘట్టమును పారాయణ చేసి పనస పండు మామిడి పండు లను నివేదన చేయవలెను . 

12. దుస్వప్న దోష శాంతికి ; 

సుందర కాండ లోని ,27 వ సర్గలోని ,తిజటా స్వప్న వృత్తాంత ఘట్టమును పారాయణ చేసి పంచదార నివేదన చేయవలెను . 

13. జన్మాన్తరమున సకల శుక ప్రాప్తికి ; 

యుద్ద కాండ లోని ,131 వ సర్గ లోని ,శ్రీ రామ పట్టాభిషేక ఘట్టమును పారాయణ చేసి పెసరపప్పు చేర్చిన ఉప్పు పొంగలి నివేదన చేయవలెను . 

14. పుత్ర సంతాన ప్రాప్తికై ;

బాల కాండ లోని ,15 ,16 సర్గలలోని పుత్ర కామేష్టి ఘట్టమును పారాయణ చేసి నేయి కలిపినా పాయసమును నివేదన చేయవలెను . 

15 . సుఖ ప్రసవమునకు ; 

బాల కాండ లోని 18 వ సర్గ లోని శ్రీ రామావతార ఘట్టమును పారాయణ చేసి ఆ సమయములో దొరకు పళ్ళను నివేదన చేయవలెను . 

16 . కారా గృహ భయ నివృత్తికి ;

యుద్ద కాండ లోని ,117 వ సర్గ లోని ,సీతా నయన ఘట్టమును పారాయణ చేసి తీపి వస్తువును నివేదన చేయవలెను . 

17 . సంతానమునకు సద్భుద్ది కలుగుటకై ;

అయోధ్య కాండ లోని ,1,2 ల సర్గ ల లోని శ్రీ రామ గుణ వర్ణన ఘట్టమును పారాయణ చేసి 5 అరటి పళ్ళను నివేదన చేయవలెను . 

18 . సకలాభీష్ట కార్య సిద్ధికై ;

బాల కాండ లోని 75,76 సర్గలలోని భార్గవ విజయ ఘట్టమును పారాయణ చేసి పాయసము అప్పాలు నివేదన చేయవలెను . 

19 . రాజ ద్వారమున సర్వానుకుల సిద్ధికై ;

అయోధ్య కాండ లోని ,100 వ సర్గ లోని ,శ్రీ రాముని చే భరతుడికి రాజ ధర్మోపదేశము ఘట్టమును పారాయణ చేసి 5 అరటి పళ్ళను నివేదన చేయవలెను . 
భక్తి తో శ్రీ రాముడి మీదనే ద్యాసను వుంచి మండల కాలము (40 లేదా 45 రోజులు )భక్తి తో పారాయణ చేసిన ఫలితము తప్పక కలుగుతుంది . 





అందరికి ఆ శ్రీ రామ రక్ష లభించు గాక 


                                           శశి ,

 ఎం . ఎ తెలుగు ,తెలుగు పండితులు . 















No comments:

Post a Comment