Tuesday 5 April 2016

ఉగాది

                           ఉగాది


తెలుగు వారి నూతన  సంవత్సరాదిని ఉగాది అంటారు . నిజానికి ఇది యుగాది (యుగ +ఆది ). ఉగాది ప్రతీ సంవత్సరం చైత్ర శుద్ద పాడ్యమి రోజున వస్తుంది . ఈ సంవత్సరం  చైత్ర శుద్ద పాడ్యమికి వచ్చు ఉగాదితో దుర్ముఖి నామ సంవత్సరం ప్రారంభమవుతుంది . 
     నూతన సంవత్సర ఆరంభ కాలంలో వాతావరణం అంతా ఆహ్లాదంగా ,చెట్లన్నీ పూలు ,పళ్ళు తో ఎంతో రమణీయముగా,కోకిలల కూతలతో ,పచ్చని పంట పొలాలతో  వసంత శోభతో  చాలా మనోహరంగా వుంటుంది . ఇటువంటి మనోరంజక పరిస్థితులు సుఖ ,సంతోషాలకు ,శుభాలకు ప్రతీకలు . ఇటువంటి అద్భుతమైన వాతావరణంలో ప్రారభమైన సంవత్సరంలో జనులంతా కుడా సుఖ సంతోషాలతో వుంటారు . 
   ఉగాది రోజున తెల్లవారుజామునే లేచి  ఉదయం 5. 30లోపు నువ్వులనూనెతో తలంటు పోసుకోవాలి . నుదుటన బొట్టు దరించి నూతన వస్త్రాలు ధరించాలి . తరువాత సుర్యభగవానుడికి నూతన సంవత్సర సంకల్పం చెప్పుకుంటూ పుష్పాంజలి ,అర్గ్యము ,దీపం దూపం సమర్పించాలి . వేప పూత పచ్చడిని విధిగా అందరు తినాలి . 
  వేప పూత పచ్చడి షడ్రుషులతో తయారు చేస్తారు .  జీవితంలో ఒక్క సుఖాలు మాత్రమె కాకుండా అన్ని రకాలు (కష్టాలు ,బాదలు సరదాలు బాద్యతలు   . . . . . . . . . . . . .  ) వుంటాయి . వాటిని కుడా ఆస్వాదించాలి దైర్యముగా ఎదుర్కోవాలి ఇదే ఉగాది పచ్చడి లో రుచుల అంతరార్దం . ఉగాది పచ్చడిలో మామిడి చిగుళ్ళు అశోక చిగుళ్ళు కుడా వెయ్యాలి . అల వేసినట్లయితే దానిని "నిమ్బకుసుమం "అంటారు . 
                    శతాయు ర్వజ్ర దేహాయుహు సర్వ సంపత్కరాయ చ 
                    సర్వారిష్ట వినాశాయ ,నింభ కుసుమ భక్షణం . 
 నింబ కుసుమం తినడం వల్ల  నూరు సంవత్సరాల ఆయుర్దాయం , దృడమయిన దేహము కలిగి సర్వ అరిష్టాలు నాశనము అయి అంత శుభం జరుగుతుంది అని పై  శ్లోకార్ధము . 
    త్వామష్ట శోక నరాభీష్ట !మధు మాస సముద్భవ !
     నిభావి శోక   సంతాప్తాం మమ శోకం సదా కురు 
అనగా జీవితంలో శోకాలతో భాదపడుతున్న నేను ఓ అసోకమా !నిన్ను సేవించుచున్నాను . మధు మాసం(వసంతం ) లోచిగురించిన అశోకమా !నీవు నాకు శోకములు లేకుండా (అ +శోకము ) చేయుదువు గాక !అని అర్ధము . అశోక వృక్షములో అట్టి దివ్య శక్తి కలదు . 

పంచాగ శ్రవణం ;

ఉగాది రోజున దేవాలయములలో పంచాంగ శ్రావణము చేస్తారు  . పంచాంగ శ్రావణము వినుత వలన తిది వలన సంపదయు ,వారము వలన ఆయుష్య ము ,నక్షత్రము వలన పాప పరిహారము యోగము వలన వ్యాధి నివ్రుత్తియు ,కరణము వలన కార్యానుకూలము కల్గును . అంతేకాక రాజాధి నవ నాయకుల యొక్క గ్రహ ఫలితాలను వినుట వల్ల గ్రహ దోషములు నివారణ అయి ,విను వారికి ఆరోగ్యము ,ఆయుష్షు ,సంపదలు ,శుభ ఫలితాలు కలుగుతాయి . 
  ఉగాది రోజున మన సంప్రదాయాలను పాటించి భావి తరాలకు వాటి గొప్పదనాన్ని తెలెయ చెప్పుదాం . 
ఉగాది లానే ప్రజలందరి జీవితం అంతా సుఖ సంతోషాలతో నవ వసంతం లా సాగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ 



                                                                      మీ శశి 

     










No comments:

Post a Comment