Wednesday 20 April 2016

కుంకుమ బొట్టు

                         కుంకుమ బొట్టు 




మన హిందూ సాంప్రదాయం లో బొట్టును చాలా పవిత్రం గా భావిస్తారు . ఇంటికి వచ్చిన ముత్థయుదువుకి బొట్టు పెట్టడం హిందువుల ఆచారం . పెళ్ళికో పేరంటానికో పిలవాలన్నా బొట్టు పెట్టి పిలుస్తారు . ఆడవాళ్ళు బొట్టుని తమ సౌభాగ్యం గా భావిస్తారు . కేవలం ఆడవాళ్ళు మాత్రమే కాదు మగవాళ్ళు కూడా బొట్టును ధరించవచ్చు . 
  మన ప్రతి ఆచారం లోను ఏదో ఒక అర్దము అంతరార్ధము వుంటాయి . మన పూర్వికులు ఎంతో విజ్ఞాన వంతులు వారు ఎంతో ఆలోచించి ఇటువంటి ఆచారాలను సంప్రదాయాలను పెట్టారు . ఇక బొట్టు విషయానికి వస్తే ,
మన శరీరం లో ప్రతి భాగంలో ఒక్కో భాగానికి ఒక్కో అది దేవత ఉంటాడు . లలాట (నుదురు )అది దేవత బ్రహ్మ . అనగా లలాటం బ్రహ్మ స్థానం . బ్రహ్మ దేవుడి దేహం రంగు ఎరుపు . అందువల్ల బ్రహ్మ స్థానం అయిన లలాటం లో ఎరుపు రంగు బొట్టు ధరించాలి . అంటే పవిత్ర కుంకుమ ధరించాలి . లలాట స్థానాన్ని సూర్య కిరణాలు తాకరాదు . 

కుంకుమను ఎ వేలితో ధరించాలి ?

కుంకుమ ను ఉంగరం వేలితో ధరిస్తే మనః శాంతి లభిస్తుంది . 
నడి  వేలుతో కుంకుమ ధరిస్తే దీర్గాయుష్షు లభిస్తుంది . 
బొటన వేలితో కుంకుమ ధరిస్తే శరీరం చురుగ్గా పని చేసే శక్తి వస్తుంది . 
చూపుడు వేలితో పెట్టుకుంటే భగవంతునిపై భక్తి ,జన్మ ముక్తి లభిస్తాయి . 
బొట్టు బిళ్ళలు కాక కుంకుమను ధరించాలి . అప్పుడే ఫలితం వస్తుంది . లలతంలో కుంకుమ ధరిస్తే జ్ఞాన చక్రాన్ని పూజిం చిన  ఫలం లభిస్తుంది . కావున ఆడ మగ తేడా లేకుండా అందరు బొట్టు  ధరించాలి . మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలి . 
సర్వే జన సుఖినో భవంతు . 


                                      శశి ,

  ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు .  
















No comments:

Post a Comment