Monday 18 April 2016

పాంచజన్యము

                           పాంచజన్యము 

శ్రీ కృష్ణుడి శంఖం పేరు పాంచజన్యం . బలరామ కృష్ణులు సాందీపుడు అనే ముని వద్ద విద్యాబ్యాసము చేసారు . ఆ సాందీప ముని కుమారుడు ఒక సారి సముద్రము నందు స్నానము చేయుచుండగా కెరటము ల ఉదృతి వలన సముద్రము లోకి కొట్టుకు పోయెను . ఆతడిని పంచజనుడు అను దనుజుడు మింగగా ఆ దనుజుది శరీరము నందున్న శంకము లోకి గురు పుత్రుడు ప్రవేశించెను . బలరామ కృష్ణులు తమ గురువు గారైన సాందీప మహర్షికి గురు దక్షణ గా ఆయన పుత్రుడుని తీసుకు రావాలని తలచి ,గురుపుత్రుడు స్నానానికి వెళ్ళిన సముద్ర తీరానికి వెళ్లి సముద్రుడిని అడుగగా సముద్రుడు పంచజనుడు గురు పుత్రుడిని మింగెనని చెప్పెను . అప్పుడు వారు పంచజనుడిని వెతికి అతడిని చంపి అతడి శరీరమును చీల్చగా శంఖము లభించెను . అప్పుడు శ్రీ కృష్ణుడు ఆ శంఖమును తీసుకుని యమపురికి వెళ్లి అక్కడ ఆ శంఖమును ఉదేను . ఆ శబ్దమునకు యముడు అదిరిపడి వచ్చి శ్రీ కృష్ణుని చూసి వచ్చినపని తెలుపమని కోరగా శ్రీ కృష్ణుడు వచ్చిన పనిని తెలిపెను అప్పుడు యముడు గురు పుత్రుడిని శ్రీ కృష్ణుడికి అప్పగించెను . శ్రీ కృష్ణుడు అతడిని గురువు గారికి అప్పగించెను . పంచజన్యుడి శరీరం లో దొరికిన శంఖమును ఆ నాటి నుండి తాను ధరించెను . 
 

                             సర్వే  జనా సుఖినో భవంతు . 

                                                                                  శశి , 

                                                                  ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 






No comments:

Post a Comment