Sunday 17 April 2016

  ఏ దిక్కుగా కుర్చుని భోజనము చేయవలెను ?

మన హిందూ సాంప్రదాయము ప్రకారము అన్నాన్ని పరభ్రహ్మ స్వరూపంగా ,సాక్షాత్ అన్నపూర్ణా దేవి స్వరూపము గాను భావించి గౌరవిస్తారు . 
అన్నపూర్ణే సదా పూర్ణే శంకరః ప్రాణ వల్లబే 
అనునది ఆర్యోక్తి . 


సాక్షాత్ ఆది దేవుడు పరమేశ్వరుడికే అన్నదానం చేసిన లోకైక మాత అన్నపూర్ణా దేవి . మనము మూడు పూటలా కడుపు నిండా భోజనము చేస్తున్నాము అంటే ఆ తల్లి అనుగ్రహము మన మీద ఉండటము వల్లనే . అన్నాన్ని అవమానిస్తే ఆ తల్లి ని అవమానించినట్టే . ఈ లోకము లో ఎందఱో తినడానికి తిండి లేక ఒక్క ముద్ద తిండి కోసం  అనేక భాదలు పడుతున్నారు . రైతులు ఎండా ,వానలను లెక్క చేయక ఎంతో కష్ట పడితేగాని మనం తినే ఆహారము తయారవదు . అటువంటి భోజనాన్ని వృధా చేయకుండా ,వున్నంతలో ఆకలితో వున్న వారికి భోజనము పెట్టినట్లయితే ఆ అన్నపూర్ణా దేవి చాలా సంతోషించి ,కరుణా కతాక్షాలతో మనలని చల్లగా చూస్తుంది . 
భోజన విషయములో అందరు పాటించవలసిన మరొక నియమము ,స్నానం చేయకుండా భోజనాన్ని వండ కూడదు ,తినకూడదు . 

భోజనము ఎ దిక్కున కూ ర్చుని భుజించవలెను ?;

తూర్పు ముఖముగా కుర్చుని భుజిస్తే ఆయుర్వుద్ది కలుగుతుంది . 
దక్షిణ ముఖముగా కుర్చుని భుజిస్తే కీర్తి లభిస్తుంది . 
పశ్చిమ ముఖముగా కుర్చుని భుజిస్తే సంపదలు చేకురుతాయి . 
ఉత్తర ముఖముగా కుర్చుని భోజనము చేయరాదు . 




                    సర్వ్ జనా సుఖినో భవంతు . 
 

                                                               శశి ,

                                   ఎం . ఎ తెలుగు ,తెలుగు పండితులు . 









No comments:

Post a Comment