Thursday 28 April 2016

సతీ దేవి వృత్తాంతం (పార్ట్ -5

                     సతీ దేవి వృత్తాంతం (పార్ట్ -5)

సతీ దేవి వృషభం ఎక్కి 20000 గణములతో మాతృ గృహానికి వెళ్ళుతూ మనసులో చాలా ఆనందము పొందుతూ ,దారిలో దుశ్శకునములను చూసి మదిలో ఆందోళన చెందుతూ త్వరితముగా దక్ష యజ్ఞము వద్దకు వెళ్ళెను . గణములను అక్కడే ఉండమని కొద్ది మందిని మాత్రం తనతో ప్రాకారము లోపలకి తీసుకు వెళ్ళెను . వీరణి కూతురుని చూసి సంతోషించి ఎదురువెళ్ళి ఆహ్వానించి తీసుకువచ్చి ఆసనమును చూపించెను . సతీ దేవి అక్కా చెల్లెళ్ళు అలాగే ఆమె తో ప్రేమగా మాట్లాడెను . కాని తండ్రి అయిన దక్షుడు మాత్రం చూసి కుడా చూడనట్లు పలకరించక ఉండెను . దేవతలందరూ దక్షుడి అనుమతితో సతీ దేవిని చూసి కూడా చూడనట్లు నటించుచు వారి వారి హావిర్భావములను అందుకొనుచు ఉండెను . ప్రాణ వల్లభుడగు శివునకు మాత్రము హావిర్భావము లేకుండుట ఎరిగి తన తల్లి చూపించిన ఆసనమున ఉండక సతీ దేవి కోపముతో దక్షుడిని చూస్తూ "జనకా ఎందుకు మహేశ్వరుడిని ఆహ్వానించలేదు . శివుడికి హవిర్భావము ఒసగి యజ్ఞము పరిసమాప్తి చేయనిచో శుభము కలుగక పోగా అసుభము కలుగుతుందని ఎరుగవా "అని ప్రశ్నించెను . మహా మునులు భవాని మాటలు పరమ సత్యాలని చెబుతున్నా వినక దక్షుడు మరల ఈశ్వరుడిని దూషించి కూతురుని పొమ్మని గద్దించాడు . దక్షుడి రుద్ర స్వరూపమును చుసిన వారందరూ మాట్లాడక మిన్నకుండిరి . సతీ దేవి తన భర్త హిత వాక్యములను పేద చెవిన పెట్టినందుకు మిక్కిలి చింతించుచు తాను తిరిగి భర్త వద్దకు వెళ్ళుట అవమానకరమని భావించి ,అవమానముతో కోపావేశామును పొంది మరు జన్మకు కుడా శివుడే తన భర్తగా భావించి ,హిమవంతునికి పుత్రిక పార్వతిగా జన్మింతునని దివ్య దృష్టితో కాంచి పరమేశ్వరుడిని తలచుకుని పలు విధములగా స్తుతించుచు స్వీయ యోగాగ్ని ప్రజ్వలింప చేసుకుని దక్ష పుత్రికగా వున్నా తన శరీరమును త్యజించెను . 

                                  శశి ,

  ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 

                                                  








No comments:

Post a Comment