Friday 22 April 2016

రాజా విక్రమార్క

                రాజా విక్రమార్క 

మన దేశాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తులలో విక్రమాదిత్యుడు అగ్రగణ్యుడు . ఆయన మంత్రి పేరు బట్టి ,అతని పేరు  మీద విక్రమార్కుడిని బట్టి విక్రమార్క అని పిలుస్థారు. 

విక్రమార్కుడు ;

విక్రమార్కుడు ఉజ్జయిని దేశాన్ని పాలించాడు . ఇతని సోదరుడి పేరు భర్తృహరి . అతడు రాజ్యమును పాలించి విరక్తి చెంది తపోవనమునకేగుచు సోదరుడు విక్రమార్కుడికి రాజ్యమప్పగించెను . అతని విరక్తికి మూల కారణమైన జరామరణము లను పోగొట్టు నట్టి ఫలమును గూడా నితనికి ఇచ్చెను . 

ఫల వృత్తాంతం ;

ఒక బ్రాహ్మణుడు మిక్కిలి పేదవాడు . సదా దేవిని నిష్టతో పూజిస్తూ ఉండెను . అమ్మవారు కరుణించి ప్రత్యక్షమై అతనికి ఒక ఫలమును ఇచ్చి దీని వలన జరా మరణములు (వృద్దాప్యం ,చావు )దరిచేరవు అని చెప్పెను . "నేను చిరకాలము జీవించినను భిక్షాటనే చేసుకోన వలెను . పరోపకారము చేయు రాజు చిరకాలము జీవించుట మంచిది . అని బావించి ఆ బ్రాహ్మణుడు ఆ వర ఫలమును భర్తృహరికి ఇచ్చెను . తను జీవించి వుండగా తన బార్య మరణించుట ఇష్టపడక భర్తృహరి ఆ ఫలమును భార్య మీద ప్రేమ తో ఆమెకు ఇచ్చెను . ఆమెకు గుర్రములను తోలు వాడు ప్రియుడు  కావున ఆమె ఆ ఫలమును అతడికి ఇచ్చెను . అతడు దానిని తన ప్రియమైన దాసికి ఇచ్చెను . ఆ దాసీ తన ప్రియుడైన గోపునకు ఇచ్చెను . అతడు దానిని తనకు ఇష్టమైన పేడ ప్రోగు చేసుకోను దానికి ఇచ్చెను . అది పేడలో పెట్టి తీసుకు వెళ్ళుచుండగా భర్తృహరి చూసి ఆ వృత్తాంతమంతా తెలుసుకుని  ఆమె వద్ద నుండి ఆ ఫలమును తీసుకుని విక్రమార్కునికి ఇచ్చెను . 
 విక్రమార్కుడు పాలించుచుండగా ఒక సారి ఒకడు వచ్చి "నేను యాగము చేయుచున్నాను నాకు సహాయము చేయుము "అని కోరెను . విక్రమార్కుడు అతడితో భిత్రువనమునకు వెళ్ళెను . వీనినాతడు చంపబోయెను అది గ్రహించిన విక్రమార్కుడు అతడినే చంపెను . అది చుసిన బేతాళుడు అప్పటి నుండి విక్రమార్కునికి మిత్రుడయ్యెను . ఊర్వశి ,రంభ లకు మద్యలో నృత్య నైపుణ్యము గురించి నేను గొప్ప అంటే నేను గొప్ప అని వివాదము వచ్చెను . ఇంద్రుడా గొడవను తీర్చలేక రధమును పంపి విక్రమార్కుడిని రప్పించెను. విక్రమార్కుడు ఊర్వశి ఏ గొప్ప నర్తకి అని తీర్పు చెప్పెను . ఆ సహాయానికి ప్రతిగా ఇంద్రుడు విక్రమార్కునికి మణిమయ  సింహాసనమును ఇచ్చెను . దానికి 32సాలభంజికలు కలవు . ఈ సింహాసనాన్ని అధిష్టించి విక్రమార్కుడు పెద్దకాలము రాజ్యమును పరిపాలించెను . 

సాహస వుదారములు మొదలైన సుగుణములలో ఇతనికి సాటి వచ్చు వారు లేరు . ఇతడు పరులకై తన ప్రాణమును ఇచ్చుటకు కూడా సిద్దమయ్యేదివాడు . ఇతడోనరించిన మహత్తర కార్యములను ఈ సాల భంజికలే చెప్పినవి . విక్రమార్కుడు ఒనరించిన తపస్సుకు మెచ్చిన శివుడు అమరత్వము కంటే వేరు వరమును కోరుకోమనగా రెండున్నర సంవత్సరముల పాపకు పుత్రుడు పుట్టినపుడు మరణం సంభవిన్చునట్లు విక్రమార్కుడు కోరెను . ఇట్లు ఎంతో కాలము ప్రజానురంజకంగా పరిపాలించాడు . చాల కాలము తర్వాత రెండున్నర ఏళ్ల పాపకు బాబు పుట్టగా నిజ కడ్గము తో తానే పొడుచుకుని చనిపోయెను . అతని మరణము తర్వాత అతడి సింహాసనాన్ని అధిష్టించే అర్హులు లేరని ఇతని మంత్రులు దానిని దాచిపెట్టేను . తదుపరి భోజ రాజు ఆ సింహాసనాన్ని గైకొనెను . 


సర్వే  జనా సుఖినో భవంతు . 

                                                        శశి ,

      ఎం . ఎ (తెలుగు ),తెలుగు పండితులు . 










No comments:

Post a Comment