Sunday 20 March 2016

                యడాగమ సంధి 

సంధి లేని చోట స్వరంబు కంటే పరంబయిన స్వరమునకు యడాగమంబగు . 
అత్వ ,ఇత్వ సందులలో సంధి కార్యం జరగనప్పుడు ఈ సూత్రం చే యడాగమం (య ఆగమం గా )వచ్చును . 
ఆగమము అనగా వర్ణము అధికముగా వచ్చుట . 
ఉదా ;మా +అమ్మ =మాయమ్మ
         మీ +ఇల్లు =మీయిల్లు 



                                                               శశి  

Saturday 19 March 2016

దశావతారములు

                దశావతారములు 

6. పరశురామావతారము ;
   ఈయన రేణుక ,జమదగ్నిల పుత్రుడు . రాక్షసులు దేవతల మీదకు దాడి చేసి వారి నగరమును ద్వంసం చేస్తుండగా దేవతలు శివుడి దగ్గరకు వెళ్లి రక్షించమని ప్రార్దించగా శివుడు పరసురాముడిని పిలిపించి పరశువును ఇచ్చి దానవులను చంపమని చెప్పెను. ఆకారణముగా తన తండ్రిని చంపిన హయహయుడు అను రాజు మీద కోపముతో    యావత్ ప్రపంచములోని రాజులందరి మీదకు 21 సార్లు దండయాత్ర చేసి రాజులందరిని చంపివేసెను . 
7. రామావతారము ;
ఇప్పటికి మనందరమూ  రామరాజ్యము ,అని రాముడు లాంటి భర్త అని ,రాముడిని  ఉంటాము . అయోధ్యా  నగరాధీసుదు అయిన దశరడుడికి పుత్ర కామేష్టి యాగ ఫలముగా జన్మిస్తాడు . తండ్రి మాట కోసము రాజ్యాన్ని సైతం వదిలి అరణ్యవాసానికి వెళ్ళిన సర్వోత్తముడు రాముడు .  అరణ్య వాస సమయములోను ,సీతాన్వేషణ సమయములోను అనేక మంది రాక్షసులను చంపి లోకములో శాంతిని నిలిపెను . ఎన్ని యుగాలు మారినా ఇప్పటికి ఎందరికో ఆదర్శమూర్తి సీతాపతి . 
8 . బలరామ ;
రోహిణి వసుదేవుల పుత్రుడు . అనేకమంది రాక్షసులను చమ్పదములొ శ్రీకృష్ణుడికి తన సహాయ సహకారములను అందించెను . ఇతను గదా విద్యా నిపుణుడు . బలమైన దేహము కలవాడు . 
9. కృష్ణ ;
దేవకీ వసుదేవుల పుత్రుడు దేవకీ దేవి అష్టమ గర్భం లో జనించెను . కంసుడిని చంపి తల్లి తండ్రుల చేర  విడిపించెను . ఎందరో రాక్షసులను సంహరించెను . భక్తి తో పిలిచిన భక్తుల మొరలు వినే దయాముర్తి కృష్ణ పరమాత్ముడు . ద్రౌపది ని నిండు సభలో వస్త్రాపహరణం చేయాలని చూసినా ,అక్కడ వున్నా వారంతా బొమ్మల్లా చూస్తూ నిలబడిని ఆవిడ మోర విని ఆవిడను కాపాడిన కరునాన్థరంగుడు . ఆ ఒక్క సారే కాదు ఎన్నో సార్లు ఆవిడను రక్షించాడు . కురుక్షేత్ర సమయములో అర్జునికి గీతోపదేశము చేసాడు . ఇప్పటికి భాగావత్గీతను దైవ సమానముగా పూజిస్తారు . పారాయణ చేస్తున్నాము . ఇంట్లో భగవత్ గీత వుంటే సకల కార్యాలు దిగ్వుజయముగా నెరవేరుతాయి ఎటువంటి ఆపదలు రావు . 
10 కల్కి ;
విష్ణు మూర్తి కలియుగాన్థమున కల్క్యత్మకుడై విష్ణు యశుడను పేరున పుట్టును . అతడు సకల ధర్మములను నిలుపును . అధర్మములను మ్లేచ్చులను సంహరించును 


సర్వేజన సుఖినో భవంతు . 




                                                                శశి , 
                                                ఎం . ఎ తెలుగు ,తెలుగు పండితులు .  











Friday 18 March 2016

దశావతారములు

                   దశావతారములు 




1. మత్స్యావతారము ;
    సోమకాసురుడు అను రాక్షసుడు చతుర్వేదములను అపహరించి సముద్రమున దాక్కోనేను.  అప్పుడు  విష్ణు మూర్తి మత్స్యావతారమున అవతరించి  ఆ రక్కసుడుని సంహరించి వేదములను రక్షించెను . 
2 . కూర్మావతారము ;
దేవతలును ,రాక్షసులు కలసి మంధర పర్వతాన్ని కవ్వముగా ,వాసుకిని తాడుగా చేసి సముద్రమును మదించు సమయములో మంధర పర్వతము  కూలెను . అప్పుడు  దేవతలు విష్ణు మూర్తిని ప్రార్దించగా విష్ణు మూర్తి కూర్మ అవతారమెత్తి మంధర పర్వతము యొక్క  చేరి అది  కూలకుండా చేసెను . 
3. వరాహావతారము ;
  హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని చుట్టచుట్టి సముద్రమున ముంచెను . అందరి ప్రార్ధనలు మన్నించి విష్ణుమూర్తి వరాహరూపుడై హిరణ్యాక్షుడిని చంపి భూమిని రక్షించెను . 
4. నృసింహావతారము ;
 హిరణ్యకశిపుడు బ్రహ్మ ను గూర్చి తపస్సు చేసి నరుల చేత కాని,మృగముల చేతకాని ,దేవతల చేత కాని,పగలు కాని,రాత్రి కాని,భూమి మీద కాని, ఆకాశంలో  కాని ,ఇంట కాని,బయట కాని,మరణం లేకుండా వరమును పొందాడు . పిమ్మట అతడు దేవతలను ముల్లోకములను మిక్కిలి భాద పెట్టెను . విష్ణు భక్తుడైన తన పుత్రుని కూడా భాదలు పెట్టుచుండెను . విష్ణువు సర్వాన్తరయామి అని అన్న తన కుమారుడి మాటలకు ఎదురుగా వున్నా స్తంబములో చూపించమని దానిని తన్నెను . హిరణ్యకశిపుడు ని సంహరించుటకై ఆ స్తంభము నుండి వచ్చెను . బ్రహ్మ ఇచ్చిన వరము భాగము కాకుండా సగము నర రూపములో సగము మృగ రూపములో వచ్చి దనుజుడిని ఇంటి గడప మీద కుర్చుని గోళ్ళతో చీల్చి సంహరించెను . 
5 .వామనావతారము 
 బలి చక్రవర్తి ముల్లోకములను ఆక్రమించి పాలించుచుండెను . దేవతల ప్రభావము తగ్గిపోయెను . ఇంద్రుడు తన రాజ్యమును పూగోట్టుకోనేను . దేవతలు మోర పెట్టుకొనగా విష్ణు మూర్తి వామనావతారమును ఎత్తి బాలి చక్రవర్తి కడకు వచ్చెను. బ్ర్రాహ్మన బ్రహ్మచారి అయిన వామనుదుని చుసిన బలి చక్రవర్తి ఎం కావాలో కోరుకో అని అడిగాడు . వామనుడు మూడు అడుగుల నేలను కోరగా రాక్షస గురువు శుక్రాచార్యుడు దానం ఇవ్వద్దని అడ్డుకుంటాడు . బాలి  తో కీతకమై కమండలములో దానం ఇవ్వకుండా అడ్డుపడగా కమండలం నుండి నీరు రాకపోవడంతో  వామనుడు దర్భతో కమండలమును పొడవగా శుక్రుడి కన్ను పోయెను . దానితో శుక్రుడు కమండలం నుండి బయటకు వచ్చేయగా నీరు వచ్చినది . బాలి మూడు అడుగుల నేలను దానం చేసాడు . వామనుడు విశ్వమంతా వ్యాపించి ఒక పాదముతో భుమినంతటిని కప్పెను రెండోవ పాదముతో ఆకాశమును కప్పెను . మూడోవ పాదమునకు చోటు లేకపోయెను తన వచనము తప్పకుండా మూడవ పాదము తన శిరస్సుపై పెట్టమని బాలి శిరస్సు వంచెను . వామనుడు బలిని పాతాళమునకు అనగదొక్కెను . 



మిగిలిన అవతారములు రేపు తెలుకున్దాము . 

                                                                     శశి ,

                                                                ఎం .ఎ తెలుగు,తెలుగు పండితులు . 
















 

Thursday 17 March 2016

దైవ దర్శనం

                       దైవ దర్శనం 

అందరం సాదారణంగా గుడి కి  వెళ్తూ ఉంటాము . సోమవారం రోజున శివాలయాలయమునకు ,మంగళవారము ఆంజనేయస్వామి గుడికి ,గురువారము సాయిబాబా గుడికి ,శుక్రవారము అమ్మవారి గుడికి ,శని వారము వెంకటేశ్వరా స్వామి  గుడికి ,లేదా దగ్గరలో ఉన్న గుడికి రోజునో వెళ్తూ ఉంటాము . అయితే ఏ దేవాలయమునకు ఏ  సమయములో వెళ్తే మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాము . 

ఉదయాన్నే శ్రీ మహా విష్ణువు ఆలయానికి వెళ్తే మంచిది . విష్ణువు స్థితి కారకుడు కావున ఆయన మన జీవన పోరాటంలో నిత్యం వచ్చే సమస్యలను తొలగించి మనల్ని సుఖం గా ఉండేలా చేస్తాడు . 
సాయం సమయంలో ఈశ్వరుడిని దేవాలయాన్ని దర్శిస్తే చాలా మంచిది . రోజు పూర్తి అవుతున్న సమయములో శివుడిని దర్శిస్తే రెట్టింపు ఫలితాన్ని అందించి మనల్ని సుఖ సంతోషాలతో ఉండేలా చేస్తాడు ఆ అపార దయాముర్తి . 



ఏ దేవాలయానికి ఏ సమయములో వెళ్ళినా తొందరపడకూడదు . ప్రశాంతముగా నెమ్మిదిగా భగవంతుణ్ణి దర్శించుకోవాలి . దేవాలయములో ఉన్న కాసేపయినా కోప ద్వేషాలను వదిలి ఏ ఆలోచనలు లేకుండా భగవంతుడి మీదనే పూర్తి ద్యాసను పెట్టి భగవంతుడిని దర్శించుకోవాలి . 
దర్శనము ,,షడగోప్యము ,తీర్ద ,ప్రసాదాలు అయ్యాక కొంచుం సేపయిన కూర్చుని వెళ్ళాలి . అలా కూర్చోవడం వల్ల ప్రశాంతత ,ఫుణ్యము లభిస్తాయి . అలా కూర్చోకుండా వచ్చేస్తే దైవ దర్శన ఫలం కూడా లభించదు . కేవలం కూర్చోవడమే కాకుండా ఓ రెండు నిముషాలు కనులు మూసుకొని ధ్యానం చేస్తే మరింత శుభం కలుగుతుంది . 

                                           సర్వే జనా సుఖినో భవంతు . 


                                                                                     శశి ,

                                                                     ఎం . ఎ తెలుగు ,తెలుగు పండితులు . 









Wednesday 16 March 2016

ఉత్వ సంధి

                         ఉత్వ సంధి 

1. ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధి అగును . 
ఉత్తు అనగా హ్రస్వమైన ఉకారం 
హ్రస్వమైన ఉకారమునకు అచ్చు పరమగునపుడు సంధి వచ్చునని సూత్రార్ధం . 
ఉదా ;
    రాముడు +అతడు =రాముడతడు . 
    సోముడు +ఇతడు =సోముడితడు 
    మనము +ఉంటిమి =మనముంటిమి . 
2 . ప్రధమేతర విభక్తి శత్రర్ధ చువర్ణంబులందున్నఉ కారమునకు సంధి వైకల్పికముగా అగు . 
ప్రధమేతర విభక్తులు అనగా ప్రధమా విభక్తి కాక మిగిలిన విభక్తులు (ద్వితీయ మొదలుకుని సప్తమి వరకు గ విభక్తులు )
శత్రర్ధ చువర్ణంబులు అనగా వర్తమానకాలపుటర్ధమును  తెలియజేయు "చున్ "ప్రత్యయములు 
ద్వితీయ మొదలగు విభక్తులందు ,చున్ ప్రత్యయము నందు ఉన్న ఉకారమునకు అచ్చు పరమగునపుడు సంధి వికల్పముగా వచ్చునని సూత్రార్ధం . 

ఉదా ; నన్నున్ +అడిగె =నన్నడిగే (సంధి వచ్చిన రూపం )
                                  =నన్నునడిగే (సంధి రాని  రూపం )
        నా కొఱకున్ +ఇచ్చె =నాకొరకిచ్చె (సంధి వచ్చిన రూపం )
                                     =నాకొరకునిచ్చె (సంధి రాని  రూపం )



                                                                                      శశి ,

                                                                    ఎం  . ఎ  తెలుగు ,తెలుగు పండితులు . 


















Tuesday 15 March 2016

శ్రీ శైలక్షేత్రం

                      శ్రీ శైలక్షేత్రం 


ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో,అష్టాదశ శక్తీ పీతాలలో ఒకటయిన శ్రీ శైల క్షేత్రంలో ఆది దేవుడు పరమేశ్వరుడు మల్లికార్జునుడిగా ,లోకైక మాత పార్వతీ దేవి భారమరామ్బికా దేవిగా కొలువై భక్తుల మొరలను వింటూ పూజలు అందుకుంటున్నారు  . 
ఈ క్షేత్రం ఆంద్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ,ఆత్మకూరు తాలుకాలోని నల్లమల అడవి లో కలదు . ఈ మహా క్షేత్రం వేదాలకు ఆలవాలమై ,సకల సంపదలకు పుట్టినిల్లై ,పరాశర ,భరద్వాజాది మహర్షుల తపో వనాలతో ,అనేక లింగాలతో ,అనంతమైన ఓషదులతో విరాజిల్లుతూ అక్కడికి వచ్చిన భక్త కోటికి మల్లికార్జునుడి కరుణా కటాక్షనాలతో పాటు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తోంది . 

శ్రీ శైల దర్శన ఫలం ; 

కురుక్షేత్రంలో లక్షల కొలది దానం ఇచ్చినా ,రెండు వేల సార్లు గంగా స్నానం చేసినా ,నర్మదా నదీ తీరంలో ఎక్కువకాలం తపస్సు ఆచరించినా ,కాశీ క్షేత్రం లో లక్షల సంవత్సరాలు నివశించినా ఎంత పుణ్యం లభిస్తుందో అంతటి గొప్ప పుణ్యం శ్రీ శైల మల్లికార్జున స్వామిని ఒక్కసారి దర్శించినంత మాత్రం చేతనే కలుగుతుందని స్కాందపురాణం చెబుతోంది . శిఖర దర్శన మాత్రం చేత అనంతమైన పుణ్య సంప్రాప్తమై మోక్షం కలుగుతుంది . పుణ్య మాసాలలో దర్శించే వారికి వాజపేయ అతిరాత మొదలైన మహాయజ్ఞాలు ఆచరించినందువల్ల కలిగే ఫలాన్ని ,కన్యాదానం ,గోదానం మొదలైన మహా దానాలు చేసినందువల్ల కలిగే ఫలాన్ని అనాయాసంగా పొందుతారని సాక్షాత్ మహేశ్వరుడే ,పార్వతీ దేవికి చెప్పినట్లు స్కాంద పురాణం చెబుతోంది . సాక్షి గణపతిని దర్శించి మన గోత్ర నామాలు చెప్పుకున్న ఎడల గణపతి మనము వచ్చినట్టు సాక్షం చెబుతాడు . కనుకనే ఆయన చేతిలో కలము, పుస్తకము వుంటాయి . 

క్షేత్ర ప్రాముఖ్యం ; 

శ్రీ శైల మహా క్షేత్రం  భూమండలానికి నాభి స్థానమని పురాణాలు చెబుతున్నాయి . ప్రపంచంలోని ఎ ప్రాంతం లో ఎ పూజ చేసినా ఎ వ్రతం ఆచరించినా సంకల్పంలో శ్రీ శైలాన్ని స్మరిస్తూ శ్రీ శైల ఈశాన్య ప్రదేశే ,ఉత్తర దిగ్భాగే అని తాము శ్రీ శైల క్షేత్రానికి ఎ దిక్కున వున్నామో వివరంగా చెబుతారు . 
యుగ యుగాలుగా ప్రసిద్ది చెందినా ఈ శైవ క్షేత్రం కృత యుగంలో హిరణ్య కశిపునికి పూజా మందిరం కాగా ,ఆహోభిల క్షేత్రం సభా మండపమని ప్రతీతి  . త్రేతా యుగంలో శ్రీ రామచంద్రుడు అరణ్య వాస సమయంలో సతీ సమేతుడై శ్రీ శైల నాధుని సేవించి సహస్ర లింగాన్ని ప్రతిష్టించాడని ,పాండవులు తమ వన వాస సమయంలో ద్రౌపది సమేతులై ఈ క్షేత్రంలో కొంతకాలం వుండి ,లింగాలను ప్రతిష్టించారని చెప్పబడుతోంది . ఇందుకు నిదర్సనం గా సీత ప్రతిష్టిత సహస్ర లింగం ,పాండవులచే ప్రతిష్టించబడిన సద్యోజాత మొదలయిన 5 లింగాలు ఇప్పటికి భాక్తులచేత పూజలను అందుకుంటున్నాయి . 


పురాణ గాధలు ;

1. కుమారా స్వామిగాధ ;

గణపతి ,కుమారస్వాములు ఆధిపత్యం కోసం  పోటి రాగా ,పార్వతి పరమేశ్వరులు ఎవరు ముందు భూ ప్రదక్షణం చేసి వస్తారో వారికే గణాధిపత్యము అని చెప్పగా కుమారస్వామి వెంటనే తన వాహన మైన నెమలిని ఎక్కి వాయు వేగంతో భూ ప్రదక్షనకై వెళ్ళగా తన మూషిక వాహనము పై ,తన ఆకారంతో భూ ప్రదక్షణ వీలు కాదని తలచిన గణేశుడు తల్లి ,తండ్రుల పాద పద్మములకు భక్తి పూర్వకముగా పూజ చేసి వారికి మూడు సార్లు ప్రదక్షణ చేసెను . గణపతి యుక్తిని మెచ్చిన పార్వతిపరమేశ్వరులు అతడికి ఆధిపత్యమును ఒసగగా ,భు ప్రదక్షణ చేసి వచ్చిన కుమారా స్వామి అదంతా చూసి అలిగి క్రౌంచ పర్వతము మీదకు వెళ్లి కుర్చున్నాడుట  . బతిమాలి తీసుకు రమ్మని పార్వతి పరమేశ్వరులు నారదుడిని పంపినా ప్రయోజనం లేకపోవడంతో పార్వతి పరమేశ్వరులే స్వయముగా వచ్చి కుమారుడి కోసం శ్రీ శైల క్షేత్రము నందే నిలిచిపోయారు . 

వృద్ధ మాల్లికార్జనుని గాధ ; 

పూర్వం  ఒక రాకుమార్తె సివుడునే తన భర్తగా బావించి ఆరాధించడం మొదలుపెట్టగా దానికి ఆమె తల్లి తండ్రులు అంగీకరించరు .  ఒక   రోజు కలలో శివుడు కనిపించి ఒక తుమ్మెదను చూపించి అది వాలిన చోట తన కోసం ఎదురు చూడమని తానే వచ్చి వివాహం చేసుకుంటానని  చెబుతాడు . కళ్ళు తెరచి చూడగా బ్రమరం (తుమ్మెద )కనిపిస్తుంది . దానిని అనుసరిస్తూ ఆ రాకుమారి శ్రీ శైల ప్రాంతం లోని ఒక పొద దగ్గర తుమ్మెద వాలగా అక్కడే శివుడిని ద్యనిస్తూ వుంటుంది . ఆ అడవిలోని చెంచులు ఆమెకు పాలు పళ్ళు ఆహారం గా ఇస్తువుంటారు . ఇలా కొన్ని రోజులు గడవగా పార్వతి పరమేశ్వరులు విహారానికి ఆ ప్రదేశానికి వచ్చారు . అప్పుడు శివుడు పార్వతికి జరిగినది చెప్పి ఆమెను వివాహం చేసుకుంటానని చెబుతాడు . అప్పుడు పార్వతి హేళన చేయగా శివుడు వృద్దుడి వేషంలో ఆమె వద్దకు వచ్చి నీకోసం వెతికి వెతికి ముసలివాడిని అయిపోయాను నన్ను వివాహం చేసుకో అని అడుగుతాడు . చెంచులు వద్దన్నా వినకుండా ఆమె ఆయనను వివాహం చేసుకుంటుంది . అప్పుడు చెంచులు శివుడిని తమ అల్లుడుగా భావించి కొత్త అల్లుడుకి మద్య మాంసాలతో కూడిన విందుని ఏర్పాటు చేయగా ,శివుడు ఆ విందుని నిరాకరించి వెల్లిపోతుంటాడు . రాకుమార్తె చెప్పినా వినపదినట్టు వేల్లిపోతుంటాడు . అప్పుడు ఆమె మల్లయ్యా .... చెవిటి మల్లయ్యా నిలబడు అని గట్టిగా అరిచింది . అయినా శివుడు వినపడనట్టే వేల్లిపోతుంటాడు . దానితో కోపించిన రాకుమారి "లింగ రూపదారివై అక్కడే నిలిచిపో "అని శపిస్తుంది . ఈ విషయం తెలిసిన పార్వతి దేవి "బ్రమరం ను వెంబడించి వచ్చావు కావున నువ్వు బ్రమరము అయిపో "అని శపించింది . ఈ ప్రకారంగా ఎప్పటికి వృద్ద మల్లికార్జున స్వామిని చెవిటి మల్లన్న ,వృద్ద మల్లన్న అని పిలుస్తారు. 

భ్రమరాంబాదేవి ;

ఒకప్పుడు అరుణాసురుడు అనే రాక్షసుడు భ్రహ్మను గురించి తపస్సు చేసి రెండు కాళ్ళ జీవులనుండి గాని,నాలుగు కాళ్ళ జీవులనుండి గాని మరణం లేకుండా వరాన్ని పొందాడు . వర గర్వంతో సర్వ లోకాలను భాదించే అరుణాసురుడిని  చంపే వారే లేక దేవతలు మునులు అందరు ఆది పరాశక్తిని శరణు వేడగా అప్పుడు ఆమె ఆ రక్కసుడితో యుద్దానికి తలపడి వేలాది బ్రమరాలను (తుమ్మెదలను )అరుణాసురుడి మీదకు పురిగొల్పింది . ఆరు కాళ్ళ జీవులైన తుమ్మెదలు అరుణాసురుడిని కుట్టి కుట్టి చంపుతాయి . దేవతల కోరికపై అమ్మ భ్రమరాంబా దేవిగా అక్కడే వెలిసింది ఇందుకు గుర్తుగా అమ్మవారి ఆలయం వెనక గోడల నుండి బ్రమర ఝుంకారం ఇప్పటికి వినిపిస్తూ వుంటుంది . 

ఇంకా దర్శనీయ స్థలాలు ; 

ఆలయ ప్రాకారం ,గుడి గోపురాలు ,మల్లికార్జునస్వామి ,బ్రమరాంభా దేవి ,శనగల బసవన్న ,సప్త మాతృకలు ,మనోహరగుండం ,భ్రహ్మ గుండం ,విష్ణు గుండం ,నవ భ్రహ్మాలయాలు ,అక్క మహాదేవి ,ఉమా మహేశ్వరుడు ,అద్దాలమందపం ,అర్ధనారీశ్వరుడు ,పాండవ ప్రతిశిత లింగాలు ,వీరభద్ర స్వామీ ,మల్లికా గుండం ,బలిపీటం ,వృద్ద మల్లికార్జనుడు ,రామ ప్రతిష్టిత సహస్ర లింగం ,త్రి ఫలవృక్షం ,సీతా ప్రతిష్టిత సహస్ర లింగం ,లోపా ముద్ర ,శిల్ప మండపం,రుదిరగుండం ,యాగశాల ,నిత్య కళ్యాణ మండపం ,అన్నపూర్ణా మందిరం ,శంకర మటం ,ఆరామ వీరేశ్వరాలయం ,గంగాధర మండపం,శృంగేరి శారదా మటం ,నందుల మఠం ,గిరిజా శంకరుడు ,వరాహ తీర్దం ,పశుపతి నాద లింగం ,గోగర్భం ,బయలు వీరభద్రుడు ,గంగా భావాన్ని స్నాన గట్టాలు ,శివాజీ స్ఫూర్తి కేంద్రం ,చంద్ర కుండం ,అన్కాలమ్మగుడి ,ప్రసంనంజనేయస్వామి ,పాతాలేశ్వరుడు ,విటలేస్వరాలయం ,పాతాల గంగా ,సిద్ది రామప్ప కొలను,సాక్షి గణపతి ,హటకేశ్వరం పాలధార,పంచదార ,శిఖరేశ్వరం ,భీముని కొలను ,నాగలూటి వీరభద్రుడు ,అక్క మహాదేవి గుహలు ,ఇష్ట కామేశ్వరి ,కధలీవనం ,దత్తాత్రేయ పాదుకలు
ఇవే కాక ,
ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం తూర్పు ద్వారం గాను ,కడప జిల్లా లోని సిద్ధవటం దక్షిణ ద్వారం గాను ,మహభూబ్ నగర్ జిల్లాలోని అలంపురం పశ్చిమ ద్వారం గాను,ఉమా మహేశ్వరం ఉత్తర ద్వారం గాను వున్నాయని పురాణాలు చెబుతున్నాయి . 



                                                                                              శశి ,

                                                                                     ఎం . ఎ తెలుగు తెలుగు పండితులు 














Monday 14 March 2016

పీడ కలలు రాకుండా పటించవలసిన స్తోత్రం

                    పీడ కలలు రాకుండా పటించవలసిన స్తోత్రం 



సాధారణంగా చాలా మందిని పీడ కలలు  భాదిస్తూ వుంటాయి . అటువంటి పీడకలలు రాకుండా క్రింది స్తోత్రాన్ని పటించాలి . 
ఆగస్తి ర్మాదవశ్చైవ ముచు కుందో మహా బలః !
కపిలో ముని రాస్తీకః పంచైతే సుఖ శాయినః !1
కేశవం మాధవం విష్ణుం శేష సాయిన మచ్యుతం !
హంసం నారాయణం కృష్ణం స్మరే ద్దుస్స్వప్న శాంతయే !!
పై మంత్రాన్ని రోజు నిద్రకు వుపక్రమించాబోయే ముందు  పటించడం వల్ల పీడ కలలు రావు ,సుఖంగా నిద్రపడుతుంది . 




సర్వే  జనా సుఖినో బవంతు . 




                                                                                                  శశి , 

                                                                               ఎం . ఎ తెలుగు ,తెలుగు పండితులు . 

Sunday 13 March 2016

గాయత్రీ మంత్రం

                         గాయత్రీ మంత్రం 

"ఓంభూ ర్భవస్సువః 
తత్స వితుర్వరేణ్యం 
భర్గో దేవస్య ధీమహి 
ధియో యోనః ప్రచోదయాత్ "
వేదాలకు అది దేవత గాయత్రి దేవి .కనుక ఆ తల్లిని వేద గాయత్రి అని కుడా అంటారు .  మాత 5ముఖాలను కలిగి వుంటుంది . 10 చేతులను కలిగి వుంటుంది .  

గాయత్రి మంత్రం ను ఉదయ, మద్యాహ్న, సాయం సంద్యలలో  తప్పకుండా జపించాలి . "న గాయత్రాః పరో మంత్రః "గాయత్రి కంటే ఉత్తమమైన మంత్రం మరొకటి లేదని పెద్దల వాక్కు . గాయత్రీ మంత్రాన్ని రోజుకి 108 సార్లు జపించాలి . అలా జపించలేని వారు తమ శక్తీ మేర జపించవచ్చు ." గాయంతం త్రాయత ఇతి గాయత్రి "తనను జపించే వారిని తప్పకుండా కాపాడుతుంది గాయత్రీ మాత . గాయత్రీ మంత్రాన్ని ప్రతి రోజు జపించే వారికి ఎటువంటి దోషాలు దరి చేరవు .విఘ్నాలు తొలగిపోతాయి .  అనుకున్న పనులన్నీ సక్రమం గా జరుగుతాయి . మనసు చాలా ప్రశాంతం గా వుంటుంది . ముఖం ఒక రకమైన తేజస్సును కలిగివుంటుంది . గాయత్రి మాత తల్లి వంటిది . తల్లి వలే  సదా రక్షిస్తూ వుంటుంది . 





సర్వే జనా సుఖినో భవంతు . 


                                                                                                                       శశి , 

                                                                                                  ఎం . ఎ ,తెలుగు ,తెలుగు పండితులు . 






Saturday 12 March 2016

పుత్ర గణపతి వ్రతం

                         పుత్ర గణపతి వ్రతం 

ఫాల్గుణ మాసం విష్ణువుకు అత్యంత ప్రీతికరమని భాగవతం చేభుతోంది . ఫాల్గుణ శుక్ల పాడ్యమి మొదలుకుని 12 దినాలు పయో వ్రతం (విష్ణు మూర్తికి పాలను నివేదించి వాటిని ప్రసాదంగా స్వీకరించే వ్రతం )అదితీ  దేవి ఈ వ్రతాన్ని ఆచరించి వామనుడిని పుత్రుడిగా కన్నది . ఈ మాసం లో గోదానం ,ధాన్య దానం ,వస్త్ర దానం చేయడం ద్వారా శ్రీ మహా విష్ణువు ప్రీతికి పాత్రులం కాగలమని ధర్మ శాస్త్ర వచనం . 
పౌర్ణమి తరువాత వచ్చు చవితి నాడు గణపతిని దీక్షగా ఆరాధించిన వారికి పుత్ర ప్రాప్తి కలుగుతుంది ,మరియు సమస్త కష్టాలూ తీరతాయి . 
 

వ్రత ఆచరణ ;

ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి ,భక్తి శ్రద్ద లతో గణపతిని పూజించాలి . పూజకు కుసుమాలు (పూలు ),అక్షింతలు ,గరిక ,మారేడు ,చందనాదులు ను వుపయోగించి స్వామిని అర్చించి షోడసోపచార పూజ చేయాలి . గణపతికి ప్రీతికరమైన ఉండ్రాళ్ళు, కుడుములు , వడపప్పు ,బెల్లం,కొబ్బరి,అరిటిపల్లు వంటివి నివేదన చేసి ,వాటిని ప్రసాదం గా స్వీకరించాలి . ఇలా వ్రతం చేసిన వారికి సత్ పుత్రులు జన్మిస్తారు . 



పార్వతి పుత్రుడు ,గణనాదుడి అనుగ్రహం సదా బక్తులమీద వుండు గాక . 
సరేజనా సుఖినో భవంతు . 



                                                                                    శశి ,

                                                                           ఎం . ఎ తెలుగు ,తెలుగు పండితులు . 












Friday 11 March 2016

తిరుమల ఏడుకొండలు

                    తిరుమల ఏడుకొండలు 

తిరుమల తిరుపతి లోగల ఏడు కొండలపై కొలువై వున్నాడు కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు . భక్తుల కోరికలను తీర్చే అభయ హస్తుడు శ్రీనివాసుడు . వెంకన్న కొలువై వున్నా ఏడూ కొండలు కేవలం అద్రులు (కొండలు )మాత్రమె కాదు వాటి వెనుక కొన్ని గాధలు వున్నాయి . అవి 
1. వృషభాద్రి ; 
పూర్వం వృషభాసురుడు అనే శివ భక్తుడు భల గర్వితుడై సాక్షాత్ శ్రీహరితోనే యుద్దానికి తలపడ్డాడు . యుద్ధం లో చావుతప్పదని గ్రహించిన రక్కసుడు "తమ చేతిలో మరణించడం నా మహద్భాగ్యం మీరు వున్న ఈ పర్వతానికి నా పేరు ప్రసాదించవలసింది "అని శ్రీహరిని వేడుకున్నాడు . స్వామీ కరుణించి అతడు కోరిన వరాన్ని ఇచ్చి తరువాత వ్రుశాభాసురుడిని సంహరించాడు . ఆ ప్రకారం గా వృషభాద్రి అను పేరు వచ్చినది . 
2. నీలాధ్రి ;
స్వామీ వారికి తొలిసారిగా తన తల నీలాలు సమర్పించిన భక్తురాలి పేరు నీలాంభరి. ఆమె భక్తి కి మెచ్చిన వేంకటేశ్వరుడు ఏడూ కొనదలలో ఒక కొండ కి ఆమె పేరుగా  పేరుని పెట్టారు . 
3. గరుడాద్రి;
శ్రీ మహా విష్ణువు హిరణ్యాక్షుని సంహరించిన తరువాత గరుత్మంతుని పిలిచి తన క్రీడాద్రిని తీసుకు రమ్మని ఆదేశిస్తాడు . ఆ ఆజ్ఞ మేరకు గరత్మంతుడు దానిని తెచ్చినండువల్లె అది గరుడాద్రి గా ప్రసిద్ది చెందింది . 
4. అంజనాద్రి ; 
సంతానం కోసం అంజనా దేవి వెంకతాచల క్షేత్రంలో తపస్సు ఆచరించింది . తానితో ఆమె గర్భాన్ని దాల్చి అనంత బలశాలి,చిరంజీవి అయిన ఆంజనేయుడికి జన్మ నిచ్చింది . అందుకే ఈ పర్వతం అంజనాద్రి గా ప్రసిద్ది పొందింది . 
5. నారాయణాద్రి ; 
నారాయణుడు అనే భక్తుడు స్వామీ పుష్కరిణి తీరాన తపస్సు చేయడంతో అతడి పేరు మీదగా ఈ పర్వతం నారాయణాద్రి గా ఖ్యాతి పొందింది . 
6. వేంకటాద్రి ; 
వేం అనగా సమస్త పాపాలనుకటః అనగా దహించునది అంటే పాప రాశులను  భస్మం  చేసేది కావున ఈ క్షేత్రానికి వెంకటాచలం అని పేరు వచ్చింది . 
7. శేషాద్రి ; 
ఓ సారి ఆది శేషుడికి వాయు దేవునికి మధ్య ఎవరు గొప్ప అనే వివాదం రేగింది . "నీకు శక్తి వుంటే నన్ను కదుల్చు "అంటూ ఆదిశేషుడు వెంకతాచాలాన్ని చుట్టుకున్నాడు . వాయు దేవుడు అతడిని వేసిరి వేయగా పర్వతం తో పాటు ఎక్కడ వచ్చి పడతాడు . ఓడిపోయినా భాదతో వున్నా ఆది శేషుడిని వెంకటేశ్వరస్వామి ఓదార్చుతూ ,"నిన్ను ఆభరణం గా ధరిస్తాను . నీ పేరుతో ఈ క్షేత్రం ప్రసిద్ది పొందుతుంది అని వరం ఇచ్చాడు . దానితో ఈ కొండ శేషాద్రి గా ప్రసిద్ది పొందింది . 
ఈ విధం గా ఏడూ కొండలు ఏర్పడి స్వామీ వారు వాటి మీద వసిస్తూ సదా తన భక్తులను కంటికి రెప్పలా కాపాడుతూ కలియుగ దైవం గా ప్రసిద్ది పొందాడు . 



                                                                                                             శశి , 

                                                                                      ఎం. ఎ తెలుగు,తెలుగు పండితులు . 

























 

Thursday 10 March 2016

ఇత్వ సంధి

                         ఇత్వ సంధి 

1. ఏమ్యదుల ఇత్తుకి సంధి వైకల్పికంగ నగు 
వివరణ ; ఏమ్యాదులు =ఏమి +ఆదులు 
అనగా ఏమి మొదలయినవి . 
ఏమి,మఱి ,కి,అది,అవి,ఇది,ఇవి,ఏది,ఏవి మొదలయినవి ఏమ్యాదులు . 
ఇత్తు అనగా హ్రస్వమయిన ఇకారం (హ్రస్వమనగా దీర్గం లేకపోవడం అనగా కి,గి,ఛి,........ )
ఏమి మొదలయిన వాటి తో హ్రస్వమయిన ఇకారమునకు సంధి వికల్పముగా వచ్చునని సూత్రార్ధం
వికల్పికముగా అని చెప్పబడింది కావున సంధి జరుగుట ,జరగ కుండుట అని రెండు మార్గములు కలవు . 
ఉదా ;ఏమి +అంటిని =ఏమంటిని (సంధి వచ్చిన రూపం )
                              =ఏమియంటిని (సంధి రాని  రూపం )
        హరికిన్ +ఇచ్చె =హరికిచ్చె (సంధి వచ్చిన రూపం )
                               =హరికినిచ్చె (సంధి రాని రూపం )
2.  క్వార్ధంబైన ఇత్తుకి సంధి లేదు . 
వివరణ ;క్వార్దం అనగా భూతకాల అసమాపకక్రియ (క్రియ తో వాక్యం పూర్తికాక ఇంకా మిగిలి వుంటే దానిని అసమాపకక్రియ అన్తారు. )
ఇత్తు అనగా హ్రస్వ మైన ఇకారం 
హ్రస్వమైన ఇకారం అంతమందు గల అసమాపక క్రియనే క్వార్ధం అంటారు . 
ఉదా ; చేసి ,చూచి,తిని,వచ్చి 
ఇట్టి  ఇకారాన్తములయిన అసమాపక క్రియలకు సంధి రాదని సుత్రార్ధం . 
ఉదా ; వచ్చి +ఇచ్చెను =వచ్చియిచ్చెను 
          తెచ్చి +ఇచ్చెను =తెచ్చియిచ్చెను 
3. మాద్యమ పురుష క్రియలయన్దిత్తునకు సంధి యగును. 
మాద్యమ పురుష క్రియల మీది ఇకారమునకు సంధి తప్పక జరుగును అని సూత్రార్ధం. 
ఉదా ; ఎలితివి +అపుడు =ఎలితివపుడు 
4. క్రియా పదంబుల నందు ఇత్తునకు సంధి వైకల్పికంగా నగు 
వివరణ ; క్రియా పదముల చివరనున్న హ్రస్వ ఇకారమునకు సంధి వికల్పముగా వచ్చునని సూత్రార్ధం  . 
ఇచ్చట క్రియ పదములనగా ప్రధమపురుష ,ఉత్తమపురుష క్రియా పదములని గ్రహింపవలెను . 
ఉదా ; వచ్చిరి +అప్పుడు =వచ్చిరప్పుడు (సంధి వచ్చిన రూపం)
                                    =వచ్చిరియప్పుడు (సంధి రాని  రూపం )
         వచ్చితిమి +ఇప్పుడు =వచ్చితిమిప్పుడు (సంధి వచ్చిన రూపం )
                                        =వచ్చితిమియిప్పుడు (సంధి రాని రూపం )
5 . ఇకారాంత తత్సమ పదముల కచ్చు పరమైన సంధి లేదు . 
 ఉదా ; హరి +ఇతడు =హరియితడు 
        కవి +అతడు =కవియతడు 
హరి ,కవి అనునవి ఇకారాన్థములయిన తత్సమ పదములు . వానికి అచ్చు పరముగా వున్నాను సంధి జరుగదు . 
6 . ఇకాదులకు తప్ప ద్రుతప్రక్రుతములకు సంధి లేదు ; 
ఉదా ; ఇకాదులు అనగా ఇక మొదలయినవి . 
ఇకన్ ,ఇగన్,ఎట్టకేలకున్ ,ఎత్తకేనిన్ అనునవి ఇకాదులు .
ద్రుత ప్రక్రుతములు అనగా ద్రుతము(న్ ) అంతముగా కల పదములు .
ఇకన్ ,ఇగన్ ఎట్టకేలకున్ ,ఎట్టకేనిన్ అనునవి ద్రుతప్రక్రుతములు అయినాను అచ్చులు పరమగునపుడు సంధి వికల్పముగా వచ్చును . వీనికే తప్పమిగిలిన  ద్రుతప్రక్రుతములకు సంధి రాదనీ సూ త్రార్ధం  
ఉదా ; వచ్చున్ +ఇపుడు=వచ్చునిపుడు 
           ఉండేడిన్ +అతడు =ఉండెడినితడు 



                                                                                                                శశి , 

                                                                      ఎం . ఎ తెలుగు,తెలుగు పండితులు . 




















Wednesday 9 March 2016

దర్భ విశిష్టత

దర్భ విశిష్టత 

దర్భని పిత్రు కార్యక్రమాలలో వాడతారు . యజ్ఞాది కార్యక్రమాలకి ,దైవ పూజాది కార్యక్రమాలలోనూ వాడతారు . అలాగే గ్రహణ సమయములో పాలు పెరుగు మొదలయిన ఆహారపదార్దాలమీద వేస్తారు . దర్భకు ఇంతటి విశిష్టత లభించడం వెనుక ఒక కధ ఉంది . 
కశ్యప ప్రజాపతి కృత యుగం నాటి వాడు . ఆయనకు కద్రువ,వినత అనే ఇద్దారు బార్యలు వుండేవారు . వారు సంతానం కోసం భర్త కశ్యపుని ఆరాధించారు . ఆయన సంతుష్టుడై వరములను కోరుకొమ్మని చెప్పాడు . కద్రువ అగ్ని తేజులు,దీర్గ దేహులు ,మంచి బలవంతులు అయిన వేయి మంది పుత్రులు తనకు కావాలని కోరింది . వినత తన సవతి బిడ్డల కంటే భుజపరాక్రమము కలవారు ,బలాధికులు అయిన ఇద్దరు పుత్రులు కావాలని కోరింది . కశ్యపుడు వారు కోరిన వరాలను ఇచ్చాడు . కొంతకాలానికి వారి గర్భాములనుండి గుడ్లు ఉద్భవించాయి . కొన్ని వందల సంవత్సరముల తరువాత ,కద్రువ గుడ్లు ఒకటొకటిగా బద్దలై శేషుడు ,వాసుకి ,ఐరావతుడు ,తక్షకుడు,కర్కోటకుడు,మహోదరుడు,మొదలయిన వేయి మంది నాగులు జన్మించాయి . 
వినత తనకు ఇంకా పిల్లలు పుట్టలేదు సవతికి పుట్టేసారు అనే ఆత్రం తో ఒక గుడ్డుని బద్దలుకొట్టింది . దానిలోనుండి పై భాగం మాత్రమే తయారై నడుము నుండి కింది భాగం ఏర్పడని పుత్రుడు అనూరుడు జన్మించాడు . తాను వికలాంగునిగా జన్మించడానికి కారణమైన తల్లినితొందరపడి గుడ్డు ని బద్దలు కొట్టావు కాబట్టి సవతికి దాసివి గా ఉండమని  శపించాడు . రెండో గుడ్డు దానతట అది బద్దలయ్యేవరకు దానిని రక్షించమని దానిలో నుండి పుట్టేవాడు మహా భలవంతుడు అయి తల్లికి దాస్య విముక్తి కలిగిస్తాడని చెబుతాడు . అనూరుడు సూర్యుడికి రాధా సారధిగా వెళ్తాడు . పాల సముద్రం నుండి మధన సమయం లో పుట్టిన వుచ్చైశ్వం ఇంద్రుడు స్వీకరించాడు . అది ఒకరోజు క్షీర సముద్రం తీరం లో తిరుగుతువుంది . అదే సమయంలో వినత,కద్రువలు విహారార్దామై సముద్ర తీరానికి వచ్చి వుచ్చైశ్వం తోక లో నలుపు ఉంటుందనికద్రువ  ,ఉండదనివినత  వాదించుకుంటూ పందెం కడతారు ఎవరు గెలిస్తే వారు రెందోవాల్లకు దాస్యం చెయ్యాలని వారి పందెం . వినత దగ్గరకు వెళ్లి చూద్దామని కద్రువతో చెప్పగా, కద్రువ ఇప్పుడు పొద్దుపోయింది . అదీకాక భర్త సేవకు సమయము మించిపోతోంది రేపు వద్దాము అని చెప్పి వినతను తీసుకుని ఇంటికి వచ్చేస్తుంది . 
ఇంటికి వచ్చిన పిదప తన కుమారులయిన నాగులను పిలచి తమ పందెం గురించి చెప్పి , మీరు ఇష్ట రూపదారులు కావున గుర్రం తోకను నల్లగా చేయమని అడుగుతుంది . నాగులందరూ తాము తప్పు చేయమని అభాడ్డం చెప్పమని చెబుతారు . దానితి కద్రువకు కోపం వచ్చి జనమేజయుడు చేసే సర్పయాగం  లో పడి  చస్తారు అని కుమారులను శపించింది . శాపానికి భయపడిన కర్కోటకుడు వుచ్చైశ్వం తోకను చుట్టుకుని తోక నల్లగా కనపడేలా చేసాడు . దాంతో వినత ఓడిపోయి కద్రువకు దాసీ అయింది . అల దాస్యం చేస్తూ కొంతకాలం గడపగా వినత రెండో గుడ్డు బద్దలై గరుత్మంతుడు పుట్టాడు . పుట్టడంతోనే పర్వతాలను కదిలిమ్పజేసాడు సముద్రాలను సంక్షోబిమ్పజేసాడు . సూర్య కాంతితో ప్రకాశిస్తూ బాయంకర వేగంతో ఆకాశం లోకి ఎగిరాడు . అతడిని చుసిన దేవతలు అగ్ని దేవుడు అనుకుని అగ్ని దేవుడిని స్తుతించే మంత్రాలతో స్తుతించారు . గరుడుడు వచ్చి తల్లికి నమస్కరించి,సవతి తల్లికి కూడా నమస్కరించాడు . 
తనకు నమస్కరించిన గరుడుడి ఆకారం తేజస్సు చూసి అసూయా చెంది నా పుత్రులు కోరిన పనులు చేస్తూ వారిని వీపున మోస్తూ తిరగమని ఆదేశించింది . గరుత్మంతుడు కూడా వారు చెప్పిన పనులన్నీ చేస్తూ వస్తున్నాడు .
వారికి అడ్డమయిన సేవలు చేస్తూ వారిచేత మాతలుపడుతూ విసుగు చెంది తల్లి దగ్గరకు వెళ్లి దాస్యానికి కారణమేమిటి అని అడిగి తల్లి ద్వారా జరిగిన విషయాన్ని  తెలుసుకుని  పాముల వద్దకు వెళ్లి మాకు దాస్య విముక్తి కలిగించమని దాని కొరకై వారు కోరినది తెచ్చి ఇస్తానని చెభుతాడు . పాములు గరుడుడి బాల ,పరాక్రమాలను పొగిడి అమృతాని తెచ్చి ఇచ్చినట్లయితే దాస్యం నుండి విముక్తి కలిగిస్తామని చేభుతాయి . గరుడుడు తల్లికి నమస్కరించి ,ఇంద్ర లోకానికి ఎగురుతూ వెళ్లి అక్కడ విషసర్పాల పర్యవేక్షణలో బయంకరమయిన అగ్ని జ్వాలల మద్యలో ఉంచిన అమృతాన్ని ఎదిరించిన పరివారాన్ని ఓడించి తీసుకుంటాడు.  ఇంద్రుడు గరుడుడితో యుద్ధం చేసి గరుడుడి పరాక్రమాన్ని గ్రహించి "అమృతాన్ని క్రురులయిన పాములకి ఇస్తే వారి సంఖ్య పెరిగి లోకానికి చేటు వాటిల్లుతుంది "అని చెప్పగా, గరుడుడు "అమృతాని వారికి తెచ్చి ఎయ్యడమే నా ఒప్పందం కనుక నేను వారికి అమృతాన్ని అప్పగిస్తాను నువ్వు దానిని తిరిగి తెచ్చుకో "అని చెబుతాడు . గరుడుడు అమృతాన్ని తీసుకుని తన ఆశ్రమానికి వచ్చి అమృతాన్ని దర్భ గడ్డి మీద పెడతాడు . నాగులు దానిని చూసి పరుగు పరుగున రాగా వారితో గరుడుడు , "నేను మీరు చెప్పినట్టు అమృతాన్ని తెచ్చి ఇచ్చాను ఇంతటితో మా దాస్యం తీరిపోయింది స్నానం చేసి సుచిఅయి అమృతాన్ని సేవించండి " చెబుతాడు . అప్పుడు నాగులందరూ స్నానానికి పరిగెత్తగా అదృశ్య రూపం లో అక్కడే వున్నా ఇంద్రుడు అమృత భాండం తో సహా వెళ్ళిపోతాడు . నాగులు వచ్చి అమృత భాండం లేకపోవడం చూసి దర్భల మీద ఏమయినా కొంచు అమృతం వలికిందేమో అని వాతుని నాలికతో నాకగా పాముల నాలుక రెండుగా చిరిగిపోయింది అప్పటి నుండి నాగులకు రెండు నాలుకలు . అమృత బాన్దాన్ని దర్భ మీద ఉంచారు కావున దర్భ పవిత్రం అయింది . 


ఇతి సమాప్తః 

                                                                                           శశి ,

                                                                                        ఎం. ఎ తెలుగు,తెలుగు పండితులు . 














Tuesday 8 March 2016

సూర్య గ్రహణం

                         సూర్య గ్రహణం 

9-3-2016 వ తేదీన సూర్య గ్రహణం పూర్వాభాద్రా నక్షత్రంలో సంబవిస్తుంది . ఉ . 5. 46 కి గ్రహణం ఆరంభమై ఉ . 9. 08 నిముషాలతో  గ్రహణం ముగుస్తుంది . భారతదేశంలో 6. 50 తరువాత సూర్యుడు మాములుగానే కనిపిస్తాడు . రెండవ వైపు సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడుతుంది . కావున ఆ గ్రహణ ప్రభావం భారతదేశంలో కూడా వుంటుంది . కావున 5 . 46 మొదలుకుని 9 . 08 వరకు మనం గ్రహణ కాలంలో పాటించే నియమాలు తప్పనిసరిగా పాటించాలి . 
5 . 46 కి గ్రహణ పట్టు స్నానం చెయ్యాలి .7 . 27 కి మద్య మద్య స్నానం చెయ్యాలి .  9 . 08 కి విడుపు స్నానం చెయ్యాలి . ఏవేమి ఆచరించని వారు కనీసం విడుపు స్నానాన్ని అయినా చెయ్యాలి . 
మంత్రోపాసన చేసేవారు గ్రహణ సమయంలో ఇ మూడు స్నానాలును ఆచరించి మంత్రోపాసన చేసిన ఫలితాన్ని అత్యధికం గా పొందవచ్చని పెద్దల ,శాస్త్రాల మాట . 
గ్రహణ సమయంలో ఏమి భుజించకూడదు . ఏమి తాగకూడదు . పాలు, పెరుగు ,పచ్చళ్ళు మొదలయిన వాటి మీద దర్భలను వుంచాలీ(దర్భలు ఎందుకు పవిత్రమయినవి అయ్యాయో రేపు తెలుసుకుందాం ) . గ్రహణం నకు ముందు వండిన ఆహార పదార్దాలను భుజించరాదు . గ్రహణం విడుపు అయిన పిదప ఇంటిని కడుక్కుని ,తల స్నానం చేసి అప్పుడు ఆహార పదార్ధాలను వండుకోవాలి . గర్భిణులు గ్రహణ సమయం లో బయటకు రాకూడదు . 

గ్రహణం ఏర్పడడానికి కారణం ; 

దేవతలు, రాక్షసులు కలసి క్షీర సాగరాన్ని అమృతం కోసం నదించాలి అని అనుకుని ,మంధర పర్వతాన్ని కవ్వం గా వాసుకిని తాడుగా చేసుకుని వాసుకు తల వైపు రాక్షసులు ,తోక వైపు దేవతలు పట్టుకుని క్షీరసాగరాన్ని మధించ సాగారు . ఆ సమయంలో మంధర పర్వతం సాగరంలోకి కృంగి పోతుండగా విష్ణు మూర్తి కుర్మావతారాన్ని ఎత్తి మంధర పర్వతం కింద బాసటగా ఉంటాడు . అలా మధించగా ముందు హాలాహలం ఉత్పన్నమవుతుంది . దానిని పరమేశ్వరుడు గొంతులో ఉంచుకుని లోకాలను రక్షించి గరలకంతుడు అయ్యాడు . తరువాత కామధేనువు,కల్పవృక్షం ,లక్ష్మీదేవి,కౌస్తుభమణి ,ఐరావతం ,వుచ్చైశ్వం ఇలా అనేకం వెలువడిన తరువాత ఆఖరులో అమృతం వెలువడుతుంది . దానికోసం దేవతలు రాక్షసులు తగువులు ఆడుకుంటుండగా , రాక్షసులకు అమృతం దొరికితే లోకాలకి శాంతి ఉండదనే ఉద్దేశ్యంతో మహా విష్ణువు జగన్మోహిని రూపంలో వచ్చి వారికి తాను అమృతాన్ని పంచుతానని చెప్పి దేవతలను ఒక వరసలో ,రాక్షసులను మరో వరసలో కూర్చోబెట్టి ,దేవతలకు అమృతాన్ని ,రాక్షసులకు అమృతానికి బదులుగా మరేదో పానీయాన్ని పోస్తువుంటాడు . అనుమానించిన రాహు ,కేతువులు చది చప్పుడు కాకుండా దేవతల వరసలో కూర్చుంటారు . వారికి కూడా విష్ణువు అమృతాన్ని పోయగా పక్కనే వుంది గమనించిన చంద్రుడు విషయం విష్ణువుకు చెబుతాడు సూర్యుడు వత్తాసు పలుకుతాడు . దానితో విష్ణువు నిముషం కుడా ఆలస్యం చెయ్యకుండా తన సుదర్శన చకటం తో వారి శిరస్సుని ఖండించి వేస్తాడు . కాని వారు అప్పటికే అమృతాన్ని తాగడంతో వారు చనిపోకుండా సజీవులుగానే వుంటారు . వారి పరిస్థితికి సూర్య,చంద్రులే కారణమని పగతో దేవతల అనుమతితో సూర్య ,చంద్రులను గ్రహణం సమయంలో  మింగి వేస్తారు , తిరిగి వారిని గ్రహణ సమయం పూర్తి కాగానే వదిలేస్తారు . 





                                                                                                శశి , 

                                                                 ఎం . ఎ తెలుగు ,తెలుగు పండితులు 















Monday 7 March 2016

లింగోద్భవ కాలం

              లింగోద్భవ కాలం 

శివుడు లింగ రూపంలో ఉద్భవించిన కాలాన్ని లింగోద్భావకాలం అంటారు . శంకరుడు శివరాత్రి పర్వదినము రోజున లింగరూపంలో ఉద్భవించాడు . ఇవ్వాల (7-3-16)11గం . 48ని _12గం . 12 ని   లోపు సమయమే లింగోద్భావకాలము . 
అభిషేక ప్రియః శివః   అని పెద్దలు అంటారు . అనగా శివుడు అభిషేక ప్రియుడు అని అర్ధం . 
ఇది వరకే మనం చాలాసార్లు చెప్పుకున్న విధముగా శివుడు బోలా శంకరుడు . తెలిసో,తెలీకో వుద్దరినుడు నీటిని లింగం మీద పోస్తే చాలు ఆ పరమేశ్వరుడు కరిగిపోతాడు . అదే శివుడికి ఇష్టమైన సోమవారం రోజునో లేక ఆయన జన్మ నక్షిత్రం రోజునో అభిషేకం చేయించుకున్నా లేక వారే స్వయం గా ఇంట్లో అభిషేకం చేసుకున్నా ఫలితం అద్వితీయం గా వుంటుంది . అదే లింగోద్భవ కాలంలో కనుక అభిషేకం చేయించుకున్నా,చేసుకున్నా మామూలు రోజులలో చేసే అభిషేకానికి కొన్ని వేల రెట్లు అధికంగా ఫలితము,పుణ్యము లభిస్తాయి అనడంలో మాత్రం ఏమి సందేహం లేదు . 

లింగోద్భవం ;

ఒకానొక సందర్భంలో విష్ణు మూర్తి ,భ్రహ్మ దేవుడి మద్య నేను గొప్ప అంటే నేను గొప్ప అని వివాదం వచ్చినపుడు వారిని వారించడానికి వారి మద్య  అప్పుడే మొదటిసారిగా శివుడు లింగ రూపంలో ప్రత్యక్షం అయ్యాడు . విష్ణు మూర్తి,భ్రహ్మ దేవుళ్ళతో మీలో ఎవరు నా ఆద్యంతాలు కనుగొంటారో వారే గొప్ప అని పరమేశ్వరుడు చెప్పగా ,వెనువెంటనే భ్రహ్మతన హంస వాహనము ఎక్కి పై బాగం వైపు వెళ్ళాడు . విష్ణు మూర్తి గరుడ వాహనము ఎక్కి కింది వైపు వెళ్ళాడు .విష్ణు మూర్తి  ఎంత వెళ్ళినా చివరి బాగం కనపడక విసుగుచెంది తిరిగి వచ్చేసి తాను కోన భాగం కనిపెట్టలేకపోయానని ఒప్పుకుంటాడు . పై కోన భాగాన్ని కనిపెట్టడానికి వెళ్ళిన భ్రహ్మ దేవుడికి దారిలో మొగలిపువ్వు కనిపించగా తను గొప్ప అనిపించుకోవాలనే వుద్దేశ్వంతో తనకు పై కోన భాగం  కనపడిందని అబద్దపు సాక్షం చెప్పమని కోరగా దానికి మొగలిపువ్వు వొప్పుకుని భ్రహ్మ తో పాటు వచ్చి అబద్దపు సాక్షం చేభుతుంది . దానితో కోపించిన ఈశ్వరుడు భ్రహ్మ దేవుడికి భూలోకంలో పూజలు వుండవు గాక అని ,మొగలిపువ్వుని ఇకనుండి నా పూజలో నిన్ను ఉపయోగించరు  గాక అని శపిస్తాడు . తనకు ఎంతో ఇష్టమైన దైవం ఇక నన్ను ధరించడు అని తెలిసిన మొగలిపువ్వు తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా విలపిస్తూ క్షమించమని ప్రార్ధించగా పరమ దయాళువు అయిన పరమేశ్వరుడు కరుణించి "నా పూజలో ఉపయోగించకపోయినా పూజా మందిర అలంకరణలో ,మండప అలంకరణలో ఉపయోగించిన యెడల నేను మిక్కిలి సంతుష్టుడును అవుతాను "అని చెప్పెను . ఆ విధముగా లింగొద్భవము జరిగెను . ఆ సమయము లో భ్రహ్మ దేవుడు ,మొగలి పువ్వు శపించబడెను . అప్పటి నుండి మొగలి పువ్వును శివుడి పూజకు వినియోగించరు . 
అపూర్వమైన ఈ శివరాత్రి లింగోద్భవ కాలాన్ని సార్ధకం చేసుకోవాలని కోరుకుంటూ ,

                                సర్వేజనా సుఖినోభవంతు . 

                                                                                                         శశి ,

                                                                         ఎం . ఎ తెలుగు ,తెలుగు పండితులు . 















Sunday 6 March 2016

శివుడు అపార కరుణా మూర్తి

శివుడు అపార కరుణా మూర్తి 

పరమేశ్వరుడు పరమ దయాళువు . తన భక్తుల యెడ అపార ప్రేమ కలిగిన వాడు . తన భక్తుల కోసం అవసరమయితే గ్రహగతులను కూడా మార్చగలడు . యముడిని సైతం కంటి చూపుతో ఆపగలడు. హర హర అని భక్తి తో పిలిచినా చాలు తన మహత్యం తో కష్టాల కొలువు లోనుండి సునాయాసంగా బయటకు తెస్తాడు . కావునే ఈ దేవాది దేవుడిని భోళా శంకరుడు అంటారు . ఆయన కరుణించి కటాక్షించిన భక్తులు కోకొల్లలు . శివరాత్రి సందర్భంగా మచ్చుకకు కొన్ని తెలుసుకుందాం . 
ముందుగా కాళహస్తి అనే పేరు రావడానికి కారణమయిన శ్రీ (సాలిపురుగు ),కాళ (పాము ),హస్తి  (ఏనుగు ),కన్నప్ప గురించి తెలుసుకుందాం . 
సాలెపురుగు ;కృత యుగానికి చెందినా గాధ  ఇది  . అరణ్యంలో ఓ చెట్టు కింద శివుడు లింగా రూపం లో ఉద్భవించాడు . ఆరుబయట ఉండడంతో శివలింగం కి ఎండా వానల నుండి రక్షణ లేకుండా పోయింది . దగ్గరలో ఉన్న ఒక అర్చకుడు రోజు వచ్చి పూజ కార్యక్రమాలు నిర్వహించి వెళ్తున్నాడు . ఆ అరణ్యం లోనే ఉన్న సాలిపురుగుకి శివుడు అంటే అపార భక్తి . శివ లింగం ఎండకు ఎండుతూ వానకి తడుస్తూ వుండడం చూసి తట్టుకోలేకపోయింది ఎదోవోకటి చెయ్యాలని బలంగా సంకల్పించుకుంది . పాపం ఆ చిన్ని ప్రాణి ఎఅమి చెయ్యగలదు . సాలిగుడు దట్టంగా అల్లి శివలింగానికి రక్షణ కల్పించాలి అనుకుంది . వెంటనే అల్లడం మొదలుపెట్టింది . రోజు అది అలగలిగినంత అల్లేది . తెలారి పొద్దున్నే అర్చకుడు వచ్చి బుజు అనుకుని దానిని తొలగించేసి తన పూజ కార్యక్రమాలు ముగించుకుని వెళ్ళేవాడు . అలానే రోజు జరిగితు వస్తోంది . తన శివుడికి నీడ లేకుండా చేస్తున్నది  ఎవరా అని అలోచించి ,శివుడి ఎదురుగా ఉన్న దీపమే ఇలా చేస్తోందని భావించి దీపాన్ని ఆర్పేయాలని  దీపం   మీదకు దూకడంతో సాలిపురుగు చనిపోతుంది . దాని భక్తి కి మెచ్చిన ఈశ్వరుడు దానిని తనలో ఐక్యం చేసుకున్నాడు . 
పాము ,ఏనుగు ;
ఇది త్రేతా యుగం నాటి కధ . అడవిలోనే వున్నా శివలింగానికి పాము రోజు దివ్య మణులతో అలంకరించి పూజించేది . తరువాత వచ్చిన ఏనుగు వాటిని రాళ్ళు అనుకుని తీసేసిది . తొండంతో నీళ్ళు తెచ్చి లింగానికి అభిషేకం చేసేది . తామర పూలతో పూజించేది . మర్నాడు పొద్దున్నే వచ్చిన పాము తన మణులు ఎవరు తీసారో తెలియక ఏనుగు పెట్టిన పూలను ,ఆకులను ఏరేసి మల్లి మణులను పేర్చేది . ఇలాగే కొన్ని రోజులు జరగగా పాముకి కోపం వచ్చి ఈ పని చేసేది ఎవరో కనిపెట్టాలని తమర పూలలో దాక్కుంది . ఏనుగు వచ్చి రోజు లాగే మణులను తీసివేయ్యబోగా పాము కోపంతో ఏనుగుని చంపాలని ఏనుగు తొండంలో దూరి కటువెయ్యడం ప్రారంభించింది . ఏనుగు భరించలేక తొందాన్ని కొండకు కొట్టుకోవడంతో పాము ,ఏనుగు రెండు చనిపోయాయి . వాటి భక్తికి మెచ్చిన ఈశ్వరుడు వాటిని తనలో ఇక్యం చేసుకున్నాడు . 
భక్త కన్నప్ప ;
అదే అడవికి దగ్గరలో చెంచుల గూడెం ఆ గూడెం లో తిన్నడు అనే భక్తుడు ఉండేవాడు . చెంచు లు జంతువులను చంపి తింటారు . అలాగే తిన్నడు తాను చంపి తెచ్చే జంతువుల మాంసాన్ని దారిలో వుండే శివుడికి నైవేద్యం గా పెట్టేవాడు . శివుడికి అభిషేకం చెయ్యాలని చేతిలో మాంసం ఉండడంతో నోటితో నీటిని తెచ్చి శివుడి మీద పోసి తాను తెచ్చిన మాంసాన్ని నైవేద్యం పెట్టేవాడు . శివుడు కూడా అతని ముగ్ద భక్తికి మెచ్చి అతడిని పరీక్షింప దలిచాడు . తిన్నడు వచ్చే సమయానికి శివుడి కుడి కంటి నుండి రక్తం దారగా కరడంతో తిన్నడుకి ఏంచెయ్యాలో తెలీక శివుడిని అల చూడలేక తన కాంతిని తీసి శివుడికి పెట్టాడు రక్తం ఆగింది  . రెండో కంటికి కూడా రక్తం కారడం మొదలయ్యింది .  రెండో కాంతిని కుడా శివుడికి పెట్టాలనుకుని గుర్తు కోసం తన కాలిని శివుడు రెండో కంటి దగ్గర పెట్టి తన రెండో కాంతిని కూడా పీకి పెట్టాడు . శివుడు అతని అపార భక్తికి ముగ్దుడై తిన్నడికి రెండు కళ్ళు మల్లి వచ్చేలా చేసాడు . కళ్ళు పీకి పెట్టాడు కావున కన్నప్ప అయ్యాడు . 
శ్రీకాలహస్తీశ్వర లింగం వాయు లింగం . కావునే ఎదురుగా వుండే దీపం ఎప్పుడు కదులుతూ వుంటుంది . 
బెజ్జమహదేవి ;
బెజ్జమహా దేవి శివుడి పాదపద్మాలను హృదయంలో నిలుపుకున్న ముగ్ద భక్తురాలు . ఒకరోజు ఆవిడ ఇలా ఆలోచించ సాగింది . "శివుడికి భార్య వుంది . పిల్లలు వున్నారు . భందు జనం అంతా వున్నారు . మరి తల్లి ఎందుకు లేదు . తల్లి లేకుండా వుండదు కదా . బహుశా తల్లి చనిపోయి వుంటుంది . తల్లి లేకపోతేనే ఇంత పెద్దవాడయ్యాడు ,తల్లి వుంటే ఇంకెంత పెద్దవాదయ్యేవడో ?తల్లే వుంటే జుట్టుని అల జడలు కట్టనిచ్చేదా ,గజ చర్మాన్ని ధరించనిచ్చెద , పాములను ధరించనిచ్చెద , హాహలాన్ని తాగానిచ్చెద ,భిక్షాటన చేస్తానంటే ఉరుకునేదా ?అయిన నేనే పరమేస్వ్రుడికి తల్లిని ఎందుకు కాకూడదు . తల్లి దృష్టితో చూసే ఎ స్త్రీ ఆయినా తల్లే కదా "అనుకుంది . పరమేశ్వరుడు కూడా పసిపాపడు రూపం లో ఆవిడ వల్లో ప్రత్యక్షమయ్యాడు . బెజ్జమహదేవి ఎంతో ప్రేమతో ఆయనకు వుపచారాలన్ని చేస్తోంది . ఆయనకూడా చక్కగా గ్రహిస్తున్నాడు . ఆవిడ భక్తికి మెచ్చి ఆవిడను పరిక్షంచ దలిచాడు . పిల్లవాడు తినడం మాని వేసాడు ఉలుకు పలుకు లేకుండా పడివున్నాడు . ఆ తల్లి మనసు తల్లడిల్లిపోయింది . చుట్టుపక్కల వారు అంగిట ముళ్ళు వ్యాధి వచ్చిందని చెప్పడంతో ,కాళ్ళ ముందే కొడుకు చావు చూడలేక తల గోడకు కొట్టుకోనారంభించింది . అప్పుడు పరమేశ్వరుడు నిజ రూపం లో ప్రత్యక్షమై ఎం వరం కావాలో కోరుకోమన్నాడు . తల్లి కి బిడ్డ సంతోషం కన్నా కావలిసింది ఏముంటుంది నువ్వు బాగుండటమే కావలి ఆనుతుంది . పరమేశ్వరుడు మెచ్చి నువ్వు నాకు అమ్మవు కావున ముల్లోకాలకు ముత్తవ్వావు అని వరం ఇచ్చాడు . 
గోడ గూచి ;
ఒకానొక ఊరిలో ఒక శివ భక్తుడు ఉండేవాడు . ఆయన రోజు కుంచెడు పాలను శివుడికి నైవేద్యం గా సమర్పించేవాడు . దానిని ఒక వ్రతం లా ఆచరించే వాడు . ఆయన ఒకరోజు అనుకోకుండా వూరు వెళ్ళవలసి వచ్చి తన వ్రతం భంగం కాకూడదనే ఉద్దేశ్యంతో తన ఆకరు బిడ్డ గోడ గూచిని పిలచి "అమ్మా నేను వూరు వెళ్ళాలి నేను రోజు పరమేశ్వరుడికి పాలు నైవేద్యం పెడతాను కదా , నా బదులు గా నీవు నేను వచ్చేవరకు నైవేద్యం పెడితే నేను వచ్చేటప్పుడు నీకు బోల్డన్ని బొమ్మలు ,మిటాయిలు,కొత్తబట్టలు తెస్తాను "అని చెభుతాడు . సరేనంటుంది గోడ గూచి . తెల్లారి పొద్దున్నే లేచి చక్కగా కుంచుడు పాలను కాచి పల గిన్ని మీద వస్త్రాన్ని మూథ  వేసి శివాలయానికి వెళ్లి శివుడిని వచ్చి పాలు తాగమని పిలుస్తుంది . శివుడు ఎంతకి రాకపోవడంతో తనకు తండ్రి తెచ్చే బొమ్మలు మిటాయిలు ఇస్తానని ఆశ చూపుతుంది . అయిన శివుడు రాకపోవడంతో వస్తావా రావా అని గద్దిస్తుంది . అయిన ప్రయోజనం లేకపోవడంతో ఏడుస్తుంది కింద పది దోల్లుతుంది . ఎన్ని చేసినా శివుడు రాకపోయేసరికి తండ్రి మరీ మరీ చెప్పాడు వచ్చి విషయం తెలిసిందంటే చమ్పెస్తాడని బయపడి తల గడపకు కొట్టుకోవడం మొదలుపెడుతుంది . అప్పుడు శివుడు వచ్చి ఆమెను వారించి పాలు తాగుతాడు . రోజు గోడ గూచి శివుడికి పాలు తెచ్చేది పరమేశ్వరుడు తాగేవాడు . ఒక రోజు తండ్రి తిరిగి వచ్చేసమయానికి గోడ గూచి కాలి పాల పాత్రతో వస్తు కనపడింది . కాలి పాత్రను చుసిన తండ్రి కూతురు శివుడికి నైవేద్యం పెట్టకుండా స్నేహితులతో తగేస్తోందని భావించి కూతురి మాటలు నమ్మక కూతురుని కొత్తనారంభించాడు . శివుడు చూడలేక గోడ గూచి  ని సశరీరంగా తనలో ఐక్యం చేసుకున్నాడు . 
ఇలా చెప్పుకుంటూ పోతే శివ భక్తుల గాధలు అనేకం . శివుడి కరుణ అపారం,అనంతం . 

           సర్వే జనా సుఖినో భవంతు . 



                                                                                                                శశి ,

                                                                              ఎం . ఎ తెలుగు,తెలుగు పండితులు . 










Saturday 5 March 2016

శివరాత్రి మహత్యం

                  శివరాత్రి మహత్యం 


కైలాసాదీసుడు ,పార్వతీ వల్లభుడు ,అయిన పరమేశ్వరుడు  పరమ దయాలుడు ,జ్ఞాన ,మోక్ష ప్రదాత. శివుడిని శంభుడు ,భక్త వల్లబుడు అంటారు . ఆయన కరుణించిన భక్తుల గాధలను మనం అనేకం వింటూనే ఉంటాము . శివాలయం చుట్టూ ప్రదక్షణలు చేస్తే ఎటువంటి దోషాలు వున్నా తొలగిపోతాయి అని మన పురాణాలు నొక్కి వక్కానిస్తున్నాయి . లోకాలను  రక్షించేందుకు హాలాహలాన్ని సైతం గొంతున ధరించి న మరమేశ్వరుడి లీలలు అనేకం ,దయ అనతం . 
మన పెద్దలు జన్మకో శివరాత్రి అన్నారు . అర్ధనారీశ్వరుడు భూమి మీద లింగ రూపంలో పూజింప బడతాడు . ఆ ఆది దేవుడు భూమి మీద లింగ రూపంలో ఆవిద్భవించిన మహోత్తరమయిన రోజే శివరాత్రి .  దేవాది దేవుడు కి అత్యంత ఇష్టమయిన రోజు ఈ శివరాత్రి . మన జన్మ మొత్తం మీద ఒక్క శివరాత్రి రోజయిన నిష్కల్మషంగా ,భక్తి శ్రద్దలతో శివరాత్రి వ్రతాన్ని ఆచరించి ,జాగరణ చేసినట్లయితే చేసిన పాపాలన్నీ పటాపంచలయి మరణానంతరం ఉన్నత లోకాలు లభిస్తాయి అని మన వేదాలు చెబుతున్నాయి . అలా మోక్షం పొందిన వారు అనేకం వున్నారు . 
మన పనులు ,మన తిండి, మన నిద్ర ఎప్పుడు ఉంటూనే వుంటాయి . కనీసం శివరాత్రి ఒక్కరోజయిన మహేశ్వరుడి నందు మన మనసుని లగ్నం చేసి మన జన్మ ను సార్ధకం చేసుకుందాం . 
పార్వతి వల్లభుడు మహేశ్వరుడి అనుగ్రహం అందరికి కలగాలని మనస్పూర్తి గా కోరుకుంటూ ,

                        హర హర మహాదేవ శంభో శంకరా 

                                                                                                       మీ శశి ,

                                                                        ఎం .ఎ తెలుగు ,తెలుగుపండితులు . 













 

Friday 4 March 2016

లక్ష్మీ అనుగ్రహం

                లక్ష్మీ అనుగ్రహం 

మానవులందరికీ లక్ష్మీ దేవి అనుగ్రహం అత్యంత ఆవశ్యకం . తిండి,బట్ట,గూడు ,వైద్యం ,చదువు ,గౌరవం , ఆకరికి చుట్టాలు కుడా డబ్బు తో ముడిపడి ఉన్న ఈ రోజులలో ప్రతి ఒక్కరు ధన దేవత విష్ణు పత్ని అనుగ్రహం కోసం తహ తహ లాడుతున్నారు . 
ఈ ప్రపంచాన్ని మొత్తాన్నీ తన కంటి చూపుతో ఆడించగల ఆ ధన దేవత మనల్ని చల్లగా చూడాలంటే మనం కొన్ని నియమాలను పాటించవలసి వుంటుంది . 

లక్ష్మీ దేవి ఎక్కడ ఉంటుందంటే ?

గురు భక్తి ,దైవ భక్తి ,మాతా పితల పట్ల భక్తి కలిగిన వారిని లక్ష్మీ తన కరుణా వీక్షనాలతో కరుణిస్తుంది . ముగ్గు ,పసుపు,పువ్వులు ,పళ్ళు ,పాలు ,దీప,ధూప,మంగళ ద్రవ్యాలు ఎ ఇంటిలో అయితే కొలువై ఉంటాయో ,ఆ ఇంటి నందు మాధవ వల్లభి తిష్ట వేసుకుని కూర్చుని వుంటుంది . 
మారేడు వృక్షాన్ని శ్రీ వృక్షం అంటారు . మారేడు వృక్షాన్ని పూజించినా ,ప్రదక్షణలు చేసినా లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుంది . జిల్లేడు వృక్షం వద్ద ఆవు నేతితో దీపారాధన చేసిన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది . 

లక్ష్మీ దేవి ఎటువంటి చోట్ల వుండదంటే ?

అతిగా నిద్రించే వారి గృహము నందు లక్ష్మి దేవి క్షణం కూడా వసించదు . ఉదయాన్నే పూజ చేయని వారి గృహం లోను ,అమ్మ నిలవదు . గృహం పరిశుభ్రంగా నిలవకపోయినా ,గడపకు పసుపు రాయకపోయినా ,స్త్రీ కి నిషిద్దమయిన నాలుగు రోజులు పూజా మందిరానికి దూరంగా ఉండకపోయినా క్షీరాభ్ది తనయ వేణు వెంటనే ఆ గృహం నుండి తరలిపోతుంది . 
 

                                               సర్వేజనా సుఖినో భవంతు . 

                                                                                                                   శశి ,

                                                                           ఎం . ఎ తెలుగు ,తెలుగు పండితులు . 



















Thursday 3 March 2016

                          అత్వ సంధి 

సూత్రం  ;అత్తునకు సంధి బహుళముగా నగు . 

అత్తు అనగా హ్రస్వమయిన ఆకారం . హ్రస్వము అనగా దీర్గము లేని ,అని అర్దము . 
ఉదా ; క =క్ +అ (క హ్రస్వమయిన ఆకారం ). 

బహుళము అనగా ; క్వచిత్ ప్రవృత్తి క్వచిద ప్రవృత్తి క్వచిద్ విభాషా ,క్వచిదన్ దేవ విధెర్విధానమ్ బహుదా సమీక్ష్య చతుర్విధం బహుళకం వదన్తి . 

అనగా ప్రవృత్తి ,అప్రవృత్తి ,విభాష ,అన్యకార్యం అనే నాలిగిటిని బహుళకం అంటారు . 

ప్రవృత్తి ;విధింపబడిన కార్యం నిత్యం గా రావడం . అనగా కొన్నిచోట్ల హ్రస్వమయిన ఆకారానికి సంధి నిత్యం గా వస్తుంది . 

ఉదా ; వచ్చుచున్న +ఆడు =వచ్చుచున్నాడు . 

అప్రవృత్తి ;విధింపబడిన కార్యం అసలు రాకపోవడం . 

ఉదా ; వెల +ఆలు       అని వుండగా అత్వసంది ప్రకారం వేలాలు అవ్వాలి కాని, అత్వ సంధి రాక యడాగమం అయి వెలయాలు అవుతుంది . అనగా అత్వ సంధి రాదు . 

విభాష ;విధింపబడిన కార్యం లక్ష్యం లో ఒక్కోసారి రావడం ,మరోసారి రాకపోవడం . 

మేన +అల్లుడు   అని వుండగా 
అత్వసంది వచ్చిన 
మేనల్లుడు        అవుతుంది 
అత్వ సంధి రాకపోయిన 
యడాగమం వచ్చి 
మేనయల్లుడు అవుతుంది . 

అన్యకార్యం ;విధింపబడిన కార్యం కాక వేరొకటి రావడం . 

ఉదా ; తామర +ఆకు 
అని వుండగా అత్వసంది ప్రకారం తామరాకు అవ్వక 'ప 'ఆగమం గా వచ్చి 
తామరపాకు  అవుతుంది . 
అలాగే     బొమ్మ +ఇల్లు    
అని వుండగా అత్వసంది ప్రకారం బొమ్మిల్లు అవ్వక రేఫ ఆగామమయి 
బొమ్మరిల్లు అవుతుంది . 




                                                                                                      శశి ,

                                                                                                    ఎం .ఎ తెలుగు ,తెలుగు పండితులు . 

                                                                                           


























Wednesday 2 March 2016

విసర్గ సంధి

                           విసర్గ సంధి 

1. విసర్గమునకు శ ,ష ,స లు పరమగునపుడు శ ,ష ,స లే  వచ్చును . 

ఉదా ; తపః +సాధనము =తపస్సాధనము 
2. విసర్గమునకు క ,ఖ ,ప,ఫ లు పరమైన విసర్గమే వచ్చును . 

ఉదా ; తపః +ఫలము =తపః ఫలము . 
3. విసర్గమునకు క ,ఖ,ప,ఫ లు కాక మిగిలిన హల్లులు గాని , అకారముగాని పరమైనచో ఓ కారము ఆదేశమగును .
మనః +రధము =మనోరధము 
తపః +బలము +తపోబలము . 
4. విసర్గమునకు చ,ఛ లు పరమగునపుడు శకారమును ,ట ,ట లు పరమైన ష కారము , త ,థ లు పరమైన సకారమును వచ్చును . 
ధనుహ్ +టంకారము =ధనుష్టంకారము . 


                                                                                                                    శశి 
                                                                                              ఎం .ఎ తెలుగు ,తెలుగు పండితులు . 

Tuesday 1 March 2016

ఉపవాసం రోజున ఏమి భుజించాలి ?

ఉపవాసం రోజున ఏమి భుజించాలి ?

వారంలో మన ఇష్ట దైవం కు ఇష్టమయిన వారం రోజునో ,లేక ఏకాదశి రోజునో , లేక పర్వదినం రోజునో సాధారణంగా అందరం ఉపవాసాలు  చేస్తువుంటాము . అయితే ఇలా ఉపవాసం చేసేటప్పుడు ఎటువంటి పదార్దాలను తినాలి ఎటువంటి పదార్దాలను తినకూడదు అనే సందేహం సాధారణంగా అందరికి వస్తు వుంటుంది . 
ఉపవాసం రోజున అన్నం తినకూడదు .' పండ్లు ,నువ్వులు,పాలు ,నీరు,నేయి,పంచగవ్యము,వాయువు'మాత్రమే భుజించాలి . వీటిలో ఒకదానికంటే ఒకటి శ్రేష్టం (గాలిని భుజించడం అన్నిటికన్నా శ్రేష్టం ). పై పదార్దాలు తినవచ్చు అన్నారుకదా అని కడుపునిండా తినకూడదు . మితంగా భుజించాలి . 
వ్రత సంభందిత ఉపవాసాలను వైశ్య , శూద్రులు రెండు రాత్రులకంటే   ఎక్కువ ఆచరించరాదు . ఇతరులను అనుసరించాలని మూడు లేదా ఐదు రాత్ర్లు చేసినప్పటికీ ఫలితం వుండదు . 
స్కాంద పురాణం ప్రకారం స్త్రీలకు భర్త సేవకంటే  యజ్ఞం గాని ఉపవాసం కాని వ్రతం కాని లేవు . భర్త ఆచరించే సకల పుణ్య కార్యాలలో పతివ్రత అయిన భార్యకు సగం ఫలితం లభిస్తుంది . భర్త అనుమతి లేకుండా చేసే వ్రతమయినా ,వుపవాసమయినా ఫలితం వుండదు . 
వుపవాసానికి కుడా సంకల్పం చెప్పుకోవాలి . ఒక రాగి పాత్ర నిండా నీటిని తీసుకుని , తూర్పు దిక్కుకి తిరిగి నిలబడి తాను ఆ ఉపవాసాన్ని ఏది కోరి ఆచరిస్తున్నాడో సంకల్పం చెప్పుకుని ఉపవాస దీక్ష స్వీకరించాలి . 



                                    సర్వేజనా సుఖినో భవంతు . 

                                                                                                                       శశి . 
                                                                              ఎం . ఎ తెలుగు , తెలుగు పండితులు .