Friday 4 March 2016

లక్ష్మీ అనుగ్రహం

                లక్ష్మీ అనుగ్రహం 

మానవులందరికీ లక్ష్మీ దేవి అనుగ్రహం అత్యంత ఆవశ్యకం . తిండి,బట్ట,గూడు ,వైద్యం ,చదువు ,గౌరవం , ఆకరికి చుట్టాలు కుడా డబ్బు తో ముడిపడి ఉన్న ఈ రోజులలో ప్రతి ఒక్కరు ధన దేవత విష్ణు పత్ని అనుగ్రహం కోసం తహ తహ లాడుతున్నారు . 
ఈ ప్రపంచాన్ని మొత్తాన్నీ తన కంటి చూపుతో ఆడించగల ఆ ధన దేవత మనల్ని చల్లగా చూడాలంటే మనం కొన్ని నియమాలను పాటించవలసి వుంటుంది . 

లక్ష్మీ దేవి ఎక్కడ ఉంటుందంటే ?

గురు భక్తి ,దైవ భక్తి ,మాతా పితల పట్ల భక్తి కలిగిన వారిని లక్ష్మీ తన కరుణా వీక్షనాలతో కరుణిస్తుంది . ముగ్గు ,పసుపు,పువ్వులు ,పళ్ళు ,పాలు ,దీప,ధూప,మంగళ ద్రవ్యాలు ఎ ఇంటిలో అయితే కొలువై ఉంటాయో ,ఆ ఇంటి నందు మాధవ వల్లభి తిష్ట వేసుకుని కూర్చుని వుంటుంది . 
మారేడు వృక్షాన్ని శ్రీ వృక్షం అంటారు . మారేడు వృక్షాన్ని పూజించినా ,ప్రదక్షణలు చేసినా లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుంది . జిల్లేడు వృక్షం వద్ద ఆవు నేతితో దీపారాధన చేసిన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది . 

లక్ష్మీ దేవి ఎటువంటి చోట్ల వుండదంటే ?

అతిగా నిద్రించే వారి గృహము నందు లక్ష్మి దేవి క్షణం కూడా వసించదు . ఉదయాన్నే పూజ చేయని వారి గృహం లోను ,అమ్మ నిలవదు . గృహం పరిశుభ్రంగా నిలవకపోయినా ,గడపకు పసుపు రాయకపోయినా ,స్త్రీ కి నిషిద్దమయిన నాలుగు రోజులు పూజా మందిరానికి దూరంగా ఉండకపోయినా క్షీరాభ్ది తనయ వేణు వెంటనే ఆ గృహం నుండి తరలిపోతుంది . 
 

                                               సర్వేజనా సుఖినో భవంతు . 

                                                                                                                   శశి ,

                                                                           ఎం . ఎ తెలుగు ,తెలుగు పండితులు . 



















No comments:

Post a Comment