Wednesday 9 March 2016

దర్భ విశిష్టత

దర్భ విశిష్టత 

దర్భని పిత్రు కార్యక్రమాలలో వాడతారు . యజ్ఞాది కార్యక్రమాలకి ,దైవ పూజాది కార్యక్రమాలలోనూ వాడతారు . అలాగే గ్రహణ సమయములో పాలు పెరుగు మొదలయిన ఆహారపదార్దాలమీద వేస్తారు . దర్భకు ఇంతటి విశిష్టత లభించడం వెనుక ఒక కధ ఉంది . 
కశ్యప ప్రజాపతి కృత యుగం నాటి వాడు . ఆయనకు కద్రువ,వినత అనే ఇద్దారు బార్యలు వుండేవారు . వారు సంతానం కోసం భర్త కశ్యపుని ఆరాధించారు . ఆయన సంతుష్టుడై వరములను కోరుకొమ్మని చెప్పాడు . కద్రువ అగ్ని తేజులు,దీర్గ దేహులు ,మంచి బలవంతులు అయిన వేయి మంది పుత్రులు తనకు కావాలని కోరింది . వినత తన సవతి బిడ్డల కంటే భుజపరాక్రమము కలవారు ,బలాధికులు అయిన ఇద్దరు పుత్రులు కావాలని కోరింది . కశ్యపుడు వారు కోరిన వరాలను ఇచ్చాడు . కొంతకాలానికి వారి గర్భాములనుండి గుడ్లు ఉద్భవించాయి . కొన్ని వందల సంవత్సరముల తరువాత ,కద్రువ గుడ్లు ఒకటొకటిగా బద్దలై శేషుడు ,వాసుకి ,ఐరావతుడు ,తక్షకుడు,కర్కోటకుడు,మహోదరుడు,మొదలయిన వేయి మంది నాగులు జన్మించాయి . 
వినత తనకు ఇంకా పిల్లలు పుట్టలేదు సవతికి పుట్టేసారు అనే ఆత్రం తో ఒక గుడ్డుని బద్దలుకొట్టింది . దానిలోనుండి పై భాగం మాత్రమే తయారై నడుము నుండి కింది భాగం ఏర్పడని పుత్రుడు అనూరుడు జన్మించాడు . తాను వికలాంగునిగా జన్మించడానికి కారణమైన తల్లినితొందరపడి గుడ్డు ని బద్దలు కొట్టావు కాబట్టి సవతికి దాసివి గా ఉండమని  శపించాడు . రెండో గుడ్డు దానతట అది బద్దలయ్యేవరకు దానిని రక్షించమని దానిలో నుండి పుట్టేవాడు మహా భలవంతుడు అయి తల్లికి దాస్య విముక్తి కలిగిస్తాడని చెబుతాడు . అనూరుడు సూర్యుడికి రాధా సారధిగా వెళ్తాడు . పాల సముద్రం నుండి మధన సమయం లో పుట్టిన వుచ్చైశ్వం ఇంద్రుడు స్వీకరించాడు . అది ఒకరోజు క్షీర సముద్రం తీరం లో తిరుగుతువుంది . అదే సమయంలో వినత,కద్రువలు విహారార్దామై సముద్ర తీరానికి వచ్చి వుచ్చైశ్వం తోక లో నలుపు ఉంటుందనికద్రువ  ,ఉండదనివినత  వాదించుకుంటూ పందెం కడతారు ఎవరు గెలిస్తే వారు రెందోవాల్లకు దాస్యం చెయ్యాలని వారి పందెం . వినత దగ్గరకు వెళ్లి చూద్దామని కద్రువతో చెప్పగా, కద్రువ ఇప్పుడు పొద్దుపోయింది . అదీకాక భర్త సేవకు సమయము మించిపోతోంది రేపు వద్దాము అని చెప్పి వినతను తీసుకుని ఇంటికి వచ్చేస్తుంది . 
ఇంటికి వచ్చిన పిదప తన కుమారులయిన నాగులను పిలచి తమ పందెం గురించి చెప్పి , మీరు ఇష్ట రూపదారులు కావున గుర్రం తోకను నల్లగా చేయమని అడుగుతుంది . నాగులందరూ తాము తప్పు చేయమని అభాడ్డం చెప్పమని చెబుతారు . దానితి కద్రువకు కోపం వచ్చి జనమేజయుడు చేసే సర్పయాగం  లో పడి  చస్తారు అని కుమారులను శపించింది . శాపానికి భయపడిన కర్కోటకుడు వుచ్చైశ్వం తోకను చుట్టుకుని తోక నల్లగా కనపడేలా చేసాడు . దాంతో వినత ఓడిపోయి కద్రువకు దాసీ అయింది . అల దాస్యం చేస్తూ కొంతకాలం గడపగా వినత రెండో గుడ్డు బద్దలై గరుత్మంతుడు పుట్టాడు . పుట్టడంతోనే పర్వతాలను కదిలిమ్పజేసాడు సముద్రాలను సంక్షోబిమ్పజేసాడు . సూర్య కాంతితో ప్రకాశిస్తూ బాయంకర వేగంతో ఆకాశం లోకి ఎగిరాడు . అతడిని చుసిన దేవతలు అగ్ని దేవుడు అనుకుని అగ్ని దేవుడిని స్తుతించే మంత్రాలతో స్తుతించారు . గరుడుడు వచ్చి తల్లికి నమస్కరించి,సవతి తల్లికి కూడా నమస్కరించాడు . 
తనకు నమస్కరించిన గరుడుడి ఆకారం తేజస్సు చూసి అసూయా చెంది నా పుత్రులు కోరిన పనులు చేస్తూ వారిని వీపున మోస్తూ తిరగమని ఆదేశించింది . గరుత్మంతుడు కూడా వారు చెప్పిన పనులన్నీ చేస్తూ వస్తున్నాడు .
వారికి అడ్డమయిన సేవలు చేస్తూ వారిచేత మాతలుపడుతూ విసుగు చెంది తల్లి దగ్గరకు వెళ్లి దాస్యానికి కారణమేమిటి అని అడిగి తల్లి ద్వారా జరిగిన విషయాన్ని  తెలుసుకుని  పాముల వద్దకు వెళ్లి మాకు దాస్య విముక్తి కలిగించమని దాని కొరకై వారు కోరినది తెచ్చి ఇస్తానని చెభుతాడు . పాములు గరుడుడి బాల ,పరాక్రమాలను పొగిడి అమృతాని తెచ్చి ఇచ్చినట్లయితే దాస్యం నుండి విముక్తి కలిగిస్తామని చేభుతాయి . గరుడుడు తల్లికి నమస్కరించి ,ఇంద్ర లోకానికి ఎగురుతూ వెళ్లి అక్కడ విషసర్పాల పర్యవేక్షణలో బయంకరమయిన అగ్ని జ్వాలల మద్యలో ఉంచిన అమృతాన్ని ఎదిరించిన పరివారాన్ని ఓడించి తీసుకుంటాడు.  ఇంద్రుడు గరుడుడితో యుద్ధం చేసి గరుడుడి పరాక్రమాన్ని గ్రహించి "అమృతాన్ని క్రురులయిన పాములకి ఇస్తే వారి సంఖ్య పెరిగి లోకానికి చేటు వాటిల్లుతుంది "అని చెప్పగా, గరుడుడు "అమృతాని వారికి తెచ్చి ఎయ్యడమే నా ఒప్పందం కనుక నేను వారికి అమృతాన్ని అప్పగిస్తాను నువ్వు దానిని తిరిగి తెచ్చుకో "అని చెబుతాడు . గరుడుడు అమృతాన్ని తీసుకుని తన ఆశ్రమానికి వచ్చి అమృతాన్ని దర్భ గడ్డి మీద పెడతాడు . నాగులు దానిని చూసి పరుగు పరుగున రాగా వారితో గరుడుడు , "నేను మీరు చెప్పినట్టు అమృతాన్ని తెచ్చి ఇచ్చాను ఇంతటితో మా దాస్యం తీరిపోయింది స్నానం చేసి సుచిఅయి అమృతాన్ని సేవించండి " చెబుతాడు . అప్పుడు నాగులందరూ స్నానానికి పరిగెత్తగా అదృశ్య రూపం లో అక్కడే వున్నా ఇంద్రుడు అమృత భాండం తో సహా వెళ్ళిపోతాడు . నాగులు వచ్చి అమృత భాండం లేకపోవడం చూసి దర్భల మీద ఏమయినా కొంచు అమృతం వలికిందేమో అని వాతుని నాలికతో నాకగా పాముల నాలుక రెండుగా చిరిగిపోయింది అప్పటి నుండి నాగులకు రెండు నాలుకలు . అమృత బాన్దాన్ని దర్భ మీద ఉంచారు కావున దర్భ పవిత్రం అయింది . 


ఇతి సమాప్తః 

                                                                                           శశి ,

                                                                                        ఎం. ఎ తెలుగు,తెలుగు పండితులు . 














No comments:

Post a Comment