Thursday 10 March 2016

ఇత్వ సంధి

                         ఇత్వ సంధి 

1. ఏమ్యదుల ఇత్తుకి సంధి వైకల్పికంగ నగు 
వివరణ ; ఏమ్యాదులు =ఏమి +ఆదులు 
అనగా ఏమి మొదలయినవి . 
ఏమి,మఱి ,కి,అది,అవి,ఇది,ఇవి,ఏది,ఏవి మొదలయినవి ఏమ్యాదులు . 
ఇత్తు అనగా హ్రస్వమయిన ఇకారం (హ్రస్వమనగా దీర్గం లేకపోవడం అనగా కి,గి,ఛి,........ )
ఏమి మొదలయిన వాటి తో హ్రస్వమయిన ఇకారమునకు సంధి వికల్పముగా వచ్చునని సూత్రార్ధం
వికల్పికముగా అని చెప్పబడింది కావున సంధి జరుగుట ,జరగ కుండుట అని రెండు మార్గములు కలవు . 
ఉదా ;ఏమి +అంటిని =ఏమంటిని (సంధి వచ్చిన రూపం )
                              =ఏమియంటిని (సంధి రాని  రూపం )
        హరికిన్ +ఇచ్చె =హరికిచ్చె (సంధి వచ్చిన రూపం )
                               =హరికినిచ్చె (సంధి రాని రూపం )
2.  క్వార్ధంబైన ఇత్తుకి సంధి లేదు . 
వివరణ ;క్వార్దం అనగా భూతకాల అసమాపకక్రియ (క్రియ తో వాక్యం పూర్తికాక ఇంకా మిగిలి వుంటే దానిని అసమాపకక్రియ అన్తారు. )
ఇత్తు అనగా హ్రస్వ మైన ఇకారం 
హ్రస్వమైన ఇకారం అంతమందు గల అసమాపక క్రియనే క్వార్ధం అంటారు . 
ఉదా ; చేసి ,చూచి,తిని,వచ్చి 
ఇట్టి  ఇకారాన్తములయిన అసమాపక క్రియలకు సంధి రాదని సుత్రార్ధం . 
ఉదా ; వచ్చి +ఇచ్చెను =వచ్చియిచ్చెను 
          తెచ్చి +ఇచ్చెను =తెచ్చియిచ్చెను 
3. మాద్యమ పురుష క్రియలయన్దిత్తునకు సంధి యగును. 
మాద్యమ పురుష క్రియల మీది ఇకారమునకు సంధి తప్పక జరుగును అని సూత్రార్ధం. 
ఉదా ; ఎలితివి +అపుడు =ఎలితివపుడు 
4. క్రియా పదంబుల నందు ఇత్తునకు సంధి వైకల్పికంగా నగు 
వివరణ ; క్రియా పదముల చివరనున్న హ్రస్వ ఇకారమునకు సంధి వికల్పముగా వచ్చునని సూత్రార్ధం  . 
ఇచ్చట క్రియ పదములనగా ప్రధమపురుష ,ఉత్తమపురుష క్రియా పదములని గ్రహింపవలెను . 
ఉదా ; వచ్చిరి +అప్పుడు =వచ్చిరప్పుడు (సంధి వచ్చిన రూపం)
                                    =వచ్చిరియప్పుడు (సంధి రాని  రూపం )
         వచ్చితిమి +ఇప్పుడు =వచ్చితిమిప్పుడు (సంధి వచ్చిన రూపం )
                                        =వచ్చితిమియిప్పుడు (సంధి రాని రూపం )
5 . ఇకారాంత తత్సమ పదముల కచ్చు పరమైన సంధి లేదు . 
 ఉదా ; హరి +ఇతడు =హరియితడు 
        కవి +అతడు =కవియతడు 
హరి ,కవి అనునవి ఇకారాన్థములయిన తత్సమ పదములు . వానికి అచ్చు పరముగా వున్నాను సంధి జరుగదు . 
6 . ఇకాదులకు తప్ప ద్రుతప్రక్రుతములకు సంధి లేదు ; 
ఉదా ; ఇకాదులు అనగా ఇక మొదలయినవి . 
ఇకన్ ,ఇగన్,ఎట్టకేలకున్ ,ఎత్తకేనిన్ అనునవి ఇకాదులు .
ద్రుత ప్రక్రుతములు అనగా ద్రుతము(న్ ) అంతముగా కల పదములు .
ఇకన్ ,ఇగన్ ఎట్టకేలకున్ ,ఎట్టకేనిన్ అనునవి ద్రుతప్రక్రుతములు అయినాను అచ్చులు పరమగునపుడు సంధి వికల్పముగా వచ్చును . వీనికే తప్పమిగిలిన  ద్రుతప్రక్రుతములకు సంధి రాదనీ సూ త్రార్ధం  
ఉదా ; వచ్చున్ +ఇపుడు=వచ్చునిపుడు 
           ఉండేడిన్ +అతడు =ఉండెడినితడు 



                                                                                                                శశి , 

                                                                      ఎం . ఎ తెలుగు,తెలుగు పండితులు . 




















No comments:

Post a Comment