ఉత్వ సంధి
1. ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధి అగును .
ఉత్తు అనగా హ్రస్వమైన ఉకారం
హ్రస్వమైన ఉకారమునకు అచ్చు పరమగునపుడు సంధి వచ్చునని సూత్రార్ధం .
ఉదా ;
రాముడు +అతడు =రాముడతడు .
సోముడు +ఇతడు =సోముడితడు
మనము +ఉంటిమి =మనముంటిమి .
2 . ప్రధమేతర విభక్తి శత్రర్ధ చువర్ణంబులందున్నఉ కారమునకు సంధి వైకల్పికముగా అగు .
ప్రధమేతర విభక్తులు అనగా ప్రధమా విభక్తి కాక మిగిలిన విభక్తులు (ద్వితీయ మొదలుకుని సప్తమి వరకు గ విభక్తులు )
శత్రర్ధ చువర్ణంబులు అనగా వర్తమానకాలపుటర్ధమును తెలియజేయు "చున్ "ప్రత్యయములు
ద్వితీయ మొదలగు విభక్తులందు ,చున్ ప్రత్యయము నందు ఉన్న ఉకారమునకు అచ్చు పరమగునపుడు సంధి వికల్పముగా వచ్చునని సూత్రార్ధం .
ఉదా ; నన్నున్ +అడిగె =నన్నడిగే (సంధి వచ్చిన రూపం )
=నన్నునడిగే (సంధి రాని రూపం )
నా కొఱకున్ +ఇచ్చె =నాకొరకిచ్చె (సంధి వచ్చిన రూపం )
=నాకొరకునిచ్చె (సంధి రాని రూపం )
శశి ,
ఎం . ఎ తెలుగు ,తెలుగు పండితులు .
No comments:
Post a Comment