Monday 7 March 2016

లింగోద్భవ కాలం

              లింగోద్భవ కాలం 

శివుడు లింగ రూపంలో ఉద్భవించిన కాలాన్ని లింగోద్భావకాలం అంటారు . శంకరుడు శివరాత్రి పర్వదినము రోజున లింగరూపంలో ఉద్భవించాడు . ఇవ్వాల (7-3-16)11గం . 48ని _12గం . 12 ని   లోపు సమయమే లింగోద్భావకాలము . 
అభిషేక ప్రియః శివః   అని పెద్దలు అంటారు . అనగా శివుడు అభిషేక ప్రియుడు అని అర్ధం . 
ఇది వరకే మనం చాలాసార్లు చెప్పుకున్న విధముగా శివుడు బోలా శంకరుడు . తెలిసో,తెలీకో వుద్దరినుడు నీటిని లింగం మీద పోస్తే చాలు ఆ పరమేశ్వరుడు కరిగిపోతాడు . అదే శివుడికి ఇష్టమైన సోమవారం రోజునో లేక ఆయన జన్మ నక్షిత్రం రోజునో అభిషేకం చేయించుకున్నా లేక వారే స్వయం గా ఇంట్లో అభిషేకం చేసుకున్నా ఫలితం అద్వితీయం గా వుంటుంది . అదే లింగోద్భవ కాలంలో కనుక అభిషేకం చేయించుకున్నా,చేసుకున్నా మామూలు రోజులలో చేసే అభిషేకానికి కొన్ని వేల రెట్లు అధికంగా ఫలితము,పుణ్యము లభిస్తాయి అనడంలో మాత్రం ఏమి సందేహం లేదు . 

లింగోద్భవం ;

ఒకానొక సందర్భంలో విష్ణు మూర్తి ,భ్రహ్మ దేవుడి మద్య నేను గొప్ప అంటే నేను గొప్ప అని వివాదం వచ్చినపుడు వారిని వారించడానికి వారి మద్య  అప్పుడే మొదటిసారిగా శివుడు లింగ రూపంలో ప్రత్యక్షం అయ్యాడు . విష్ణు మూర్తి,భ్రహ్మ దేవుళ్ళతో మీలో ఎవరు నా ఆద్యంతాలు కనుగొంటారో వారే గొప్ప అని పరమేశ్వరుడు చెప్పగా ,వెనువెంటనే భ్రహ్మతన హంస వాహనము ఎక్కి పై బాగం వైపు వెళ్ళాడు . విష్ణు మూర్తి గరుడ వాహనము ఎక్కి కింది వైపు వెళ్ళాడు .విష్ణు మూర్తి  ఎంత వెళ్ళినా చివరి బాగం కనపడక విసుగుచెంది తిరిగి వచ్చేసి తాను కోన భాగం కనిపెట్టలేకపోయానని ఒప్పుకుంటాడు . పై కోన భాగాన్ని కనిపెట్టడానికి వెళ్ళిన భ్రహ్మ దేవుడికి దారిలో మొగలిపువ్వు కనిపించగా తను గొప్ప అనిపించుకోవాలనే వుద్దేశ్వంతో తనకు పై కోన భాగం  కనపడిందని అబద్దపు సాక్షం చెప్పమని కోరగా దానికి మొగలిపువ్వు వొప్పుకుని భ్రహ్మ తో పాటు వచ్చి అబద్దపు సాక్షం చేభుతుంది . దానితో కోపించిన ఈశ్వరుడు భ్రహ్మ దేవుడికి భూలోకంలో పూజలు వుండవు గాక అని ,మొగలిపువ్వుని ఇకనుండి నా పూజలో నిన్ను ఉపయోగించరు  గాక అని శపిస్తాడు . తనకు ఎంతో ఇష్టమైన దైవం ఇక నన్ను ధరించడు అని తెలిసిన మొగలిపువ్వు తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా విలపిస్తూ క్షమించమని ప్రార్ధించగా పరమ దయాళువు అయిన పరమేశ్వరుడు కరుణించి "నా పూజలో ఉపయోగించకపోయినా పూజా మందిర అలంకరణలో ,మండప అలంకరణలో ఉపయోగించిన యెడల నేను మిక్కిలి సంతుష్టుడును అవుతాను "అని చెప్పెను . ఆ విధముగా లింగొద్భవము జరిగెను . ఆ సమయము లో భ్రహ్మ దేవుడు ,మొగలి పువ్వు శపించబడెను . అప్పటి నుండి మొగలి పువ్వును శివుడి పూజకు వినియోగించరు . 
అపూర్వమైన ఈ శివరాత్రి లింగోద్భవ కాలాన్ని సార్ధకం చేసుకోవాలని కోరుకుంటూ ,

                                సర్వేజనా సుఖినోభవంతు . 

                                                                                                         శశి ,

                                                                         ఎం . ఎ తెలుగు ,తెలుగు పండితులు . 















1 comment: