Sunday 6 March 2016

శివుడు అపార కరుణా మూర్తి

శివుడు అపార కరుణా మూర్తి 

పరమేశ్వరుడు పరమ దయాళువు . తన భక్తుల యెడ అపార ప్రేమ కలిగిన వాడు . తన భక్తుల కోసం అవసరమయితే గ్రహగతులను కూడా మార్చగలడు . యముడిని సైతం కంటి చూపుతో ఆపగలడు. హర హర అని భక్తి తో పిలిచినా చాలు తన మహత్యం తో కష్టాల కొలువు లోనుండి సునాయాసంగా బయటకు తెస్తాడు . కావునే ఈ దేవాది దేవుడిని భోళా శంకరుడు అంటారు . ఆయన కరుణించి కటాక్షించిన భక్తులు కోకొల్లలు . శివరాత్రి సందర్భంగా మచ్చుకకు కొన్ని తెలుసుకుందాం . 
ముందుగా కాళహస్తి అనే పేరు రావడానికి కారణమయిన శ్రీ (సాలిపురుగు ),కాళ (పాము ),హస్తి  (ఏనుగు ),కన్నప్ప గురించి తెలుసుకుందాం . 
సాలెపురుగు ;కృత యుగానికి చెందినా గాధ  ఇది  . అరణ్యంలో ఓ చెట్టు కింద శివుడు లింగా రూపం లో ఉద్భవించాడు . ఆరుబయట ఉండడంతో శివలింగం కి ఎండా వానల నుండి రక్షణ లేకుండా పోయింది . దగ్గరలో ఉన్న ఒక అర్చకుడు రోజు వచ్చి పూజ కార్యక్రమాలు నిర్వహించి వెళ్తున్నాడు . ఆ అరణ్యం లోనే ఉన్న సాలిపురుగుకి శివుడు అంటే అపార భక్తి . శివ లింగం ఎండకు ఎండుతూ వానకి తడుస్తూ వుండడం చూసి తట్టుకోలేకపోయింది ఎదోవోకటి చెయ్యాలని బలంగా సంకల్పించుకుంది . పాపం ఆ చిన్ని ప్రాణి ఎఅమి చెయ్యగలదు . సాలిగుడు దట్టంగా అల్లి శివలింగానికి రక్షణ కల్పించాలి అనుకుంది . వెంటనే అల్లడం మొదలుపెట్టింది . రోజు అది అలగలిగినంత అల్లేది . తెలారి పొద్దున్నే అర్చకుడు వచ్చి బుజు అనుకుని దానిని తొలగించేసి తన పూజ కార్యక్రమాలు ముగించుకుని వెళ్ళేవాడు . అలానే రోజు జరిగితు వస్తోంది . తన శివుడికి నీడ లేకుండా చేస్తున్నది  ఎవరా అని అలోచించి ,శివుడి ఎదురుగా ఉన్న దీపమే ఇలా చేస్తోందని భావించి దీపాన్ని ఆర్పేయాలని  దీపం   మీదకు దూకడంతో సాలిపురుగు చనిపోతుంది . దాని భక్తి కి మెచ్చిన ఈశ్వరుడు దానిని తనలో ఐక్యం చేసుకున్నాడు . 
పాము ,ఏనుగు ;
ఇది త్రేతా యుగం నాటి కధ . అడవిలోనే వున్నా శివలింగానికి పాము రోజు దివ్య మణులతో అలంకరించి పూజించేది . తరువాత వచ్చిన ఏనుగు వాటిని రాళ్ళు అనుకుని తీసేసిది . తొండంతో నీళ్ళు తెచ్చి లింగానికి అభిషేకం చేసేది . తామర పూలతో పూజించేది . మర్నాడు పొద్దున్నే వచ్చిన పాము తన మణులు ఎవరు తీసారో తెలియక ఏనుగు పెట్టిన పూలను ,ఆకులను ఏరేసి మల్లి మణులను పేర్చేది . ఇలాగే కొన్ని రోజులు జరగగా పాముకి కోపం వచ్చి ఈ పని చేసేది ఎవరో కనిపెట్టాలని తమర పూలలో దాక్కుంది . ఏనుగు వచ్చి రోజు లాగే మణులను తీసివేయ్యబోగా పాము కోపంతో ఏనుగుని చంపాలని ఏనుగు తొండంలో దూరి కటువెయ్యడం ప్రారంభించింది . ఏనుగు భరించలేక తొందాన్ని కొండకు కొట్టుకోవడంతో పాము ,ఏనుగు రెండు చనిపోయాయి . వాటి భక్తికి మెచ్చిన ఈశ్వరుడు వాటిని తనలో ఇక్యం చేసుకున్నాడు . 
భక్త కన్నప్ప ;
అదే అడవికి దగ్గరలో చెంచుల గూడెం ఆ గూడెం లో తిన్నడు అనే భక్తుడు ఉండేవాడు . చెంచు లు జంతువులను చంపి తింటారు . అలాగే తిన్నడు తాను చంపి తెచ్చే జంతువుల మాంసాన్ని దారిలో వుండే శివుడికి నైవేద్యం గా పెట్టేవాడు . శివుడికి అభిషేకం చెయ్యాలని చేతిలో మాంసం ఉండడంతో నోటితో నీటిని తెచ్చి శివుడి మీద పోసి తాను తెచ్చిన మాంసాన్ని నైవేద్యం పెట్టేవాడు . శివుడు కూడా అతని ముగ్ద భక్తికి మెచ్చి అతడిని పరీక్షింప దలిచాడు . తిన్నడు వచ్చే సమయానికి శివుడి కుడి కంటి నుండి రక్తం దారగా కరడంతో తిన్నడుకి ఏంచెయ్యాలో తెలీక శివుడిని అల చూడలేక తన కాంతిని తీసి శివుడికి పెట్టాడు రక్తం ఆగింది  . రెండో కంటికి కూడా రక్తం కారడం మొదలయ్యింది .  రెండో కాంతిని కుడా శివుడికి పెట్టాలనుకుని గుర్తు కోసం తన కాలిని శివుడు రెండో కంటి దగ్గర పెట్టి తన రెండో కాంతిని కూడా పీకి పెట్టాడు . శివుడు అతని అపార భక్తికి ముగ్దుడై తిన్నడికి రెండు కళ్ళు మల్లి వచ్చేలా చేసాడు . కళ్ళు పీకి పెట్టాడు కావున కన్నప్ప అయ్యాడు . 
శ్రీకాలహస్తీశ్వర లింగం వాయు లింగం . కావునే ఎదురుగా వుండే దీపం ఎప్పుడు కదులుతూ వుంటుంది . 
బెజ్జమహదేవి ;
బెజ్జమహా దేవి శివుడి పాదపద్మాలను హృదయంలో నిలుపుకున్న ముగ్ద భక్తురాలు . ఒకరోజు ఆవిడ ఇలా ఆలోచించ సాగింది . "శివుడికి భార్య వుంది . పిల్లలు వున్నారు . భందు జనం అంతా వున్నారు . మరి తల్లి ఎందుకు లేదు . తల్లి లేకుండా వుండదు కదా . బహుశా తల్లి చనిపోయి వుంటుంది . తల్లి లేకపోతేనే ఇంత పెద్దవాడయ్యాడు ,తల్లి వుంటే ఇంకెంత పెద్దవాదయ్యేవడో ?తల్లే వుంటే జుట్టుని అల జడలు కట్టనిచ్చేదా ,గజ చర్మాన్ని ధరించనిచ్చెద , పాములను ధరించనిచ్చెద , హాహలాన్ని తాగానిచ్చెద ,భిక్షాటన చేస్తానంటే ఉరుకునేదా ?అయిన నేనే పరమేస్వ్రుడికి తల్లిని ఎందుకు కాకూడదు . తల్లి దృష్టితో చూసే ఎ స్త్రీ ఆయినా తల్లే కదా "అనుకుంది . పరమేశ్వరుడు కూడా పసిపాపడు రూపం లో ఆవిడ వల్లో ప్రత్యక్షమయ్యాడు . బెజ్జమహదేవి ఎంతో ప్రేమతో ఆయనకు వుపచారాలన్ని చేస్తోంది . ఆయనకూడా చక్కగా గ్రహిస్తున్నాడు . ఆవిడ భక్తికి మెచ్చి ఆవిడను పరిక్షంచ దలిచాడు . పిల్లవాడు తినడం మాని వేసాడు ఉలుకు పలుకు లేకుండా పడివున్నాడు . ఆ తల్లి మనసు తల్లడిల్లిపోయింది . చుట్టుపక్కల వారు అంగిట ముళ్ళు వ్యాధి వచ్చిందని చెప్పడంతో ,కాళ్ళ ముందే కొడుకు చావు చూడలేక తల గోడకు కొట్టుకోనారంభించింది . అప్పుడు పరమేశ్వరుడు నిజ రూపం లో ప్రత్యక్షమై ఎం వరం కావాలో కోరుకోమన్నాడు . తల్లి కి బిడ్డ సంతోషం కన్నా కావలిసింది ఏముంటుంది నువ్వు బాగుండటమే కావలి ఆనుతుంది . పరమేశ్వరుడు మెచ్చి నువ్వు నాకు అమ్మవు కావున ముల్లోకాలకు ముత్తవ్వావు అని వరం ఇచ్చాడు . 
గోడ గూచి ;
ఒకానొక ఊరిలో ఒక శివ భక్తుడు ఉండేవాడు . ఆయన రోజు కుంచెడు పాలను శివుడికి నైవేద్యం గా సమర్పించేవాడు . దానిని ఒక వ్రతం లా ఆచరించే వాడు . ఆయన ఒకరోజు అనుకోకుండా వూరు వెళ్ళవలసి వచ్చి తన వ్రతం భంగం కాకూడదనే ఉద్దేశ్యంతో తన ఆకరు బిడ్డ గోడ గూచిని పిలచి "అమ్మా నేను వూరు వెళ్ళాలి నేను రోజు పరమేశ్వరుడికి పాలు నైవేద్యం పెడతాను కదా , నా బదులు గా నీవు నేను వచ్చేవరకు నైవేద్యం పెడితే నేను వచ్చేటప్పుడు నీకు బోల్డన్ని బొమ్మలు ,మిటాయిలు,కొత్తబట్టలు తెస్తాను "అని చెభుతాడు . సరేనంటుంది గోడ గూచి . తెల్లారి పొద్దున్నే లేచి చక్కగా కుంచుడు పాలను కాచి పల గిన్ని మీద వస్త్రాన్ని మూథ  వేసి శివాలయానికి వెళ్లి శివుడిని వచ్చి పాలు తాగమని పిలుస్తుంది . శివుడు ఎంతకి రాకపోవడంతో తనకు తండ్రి తెచ్చే బొమ్మలు మిటాయిలు ఇస్తానని ఆశ చూపుతుంది . అయిన శివుడు రాకపోవడంతో వస్తావా రావా అని గద్దిస్తుంది . అయిన ప్రయోజనం లేకపోవడంతో ఏడుస్తుంది కింద పది దోల్లుతుంది . ఎన్ని చేసినా శివుడు రాకపోయేసరికి తండ్రి మరీ మరీ చెప్పాడు వచ్చి విషయం తెలిసిందంటే చమ్పెస్తాడని బయపడి తల గడపకు కొట్టుకోవడం మొదలుపెడుతుంది . అప్పుడు శివుడు వచ్చి ఆమెను వారించి పాలు తాగుతాడు . రోజు గోడ గూచి శివుడికి పాలు తెచ్చేది పరమేశ్వరుడు తాగేవాడు . ఒక రోజు తండ్రి తిరిగి వచ్చేసమయానికి గోడ గూచి కాలి పాల పాత్రతో వస్తు కనపడింది . కాలి పాత్రను చుసిన తండ్రి కూతురు శివుడికి నైవేద్యం పెట్టకుండా స్నేహితులతో తగేస్తోందని భావించి కూతురి మాటలు నమ్మక కూతురుని కొత్తనారంభించాడు . శివుడు చూడలేక గోడ గూచి  ని సశరీరంగా తనలో ఐక్యం చేసుకున్నాడు . 
ఇలా చెప్పుకుంటూ పోతే శివ భక్తుల గాధలు అనేకం . శివుడి కరుణ అపారం,అనంతం . 

           సర్వే జనా సుఖినో భవంతు . 



                                                                                                                శశి ,

                                                                              ఎం . ఎ తెలుగు,తెలుగు పండితులు . 










No comments:

Post a Comment