Thursday 17 March 2016

దైవ దర్శనం

                       దైవ దర్శనం 

అందరం సాదారణంగా గుడి కి  వెళ్తూ ఉంటాము . సోమవారం రోజున శివాలయాలయమునకు ,మంగళవారము ఆంజనేయస్వామి గుడికి ,గురువారము సాయిబాబా గుడికి ,శుక్రవారము అమ్మవారి గుడికి ,శని వారము వెంకటేశ్వరా స్వామి  గుడికి ,లేదా దగ్గరలో ఉన్న గుడికి రోజునో వెళ్తూ ఉంటాము . అయితే ఏ దేవాలయమునకు ఏ  సమయములో వెళ్తే మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాము . 

ఉదయాన్నే శ్రీ మహా విష్ణువు ఆలయానికి వెళ్తే మంచిది . విష్ణువు స్థితి కారకుడు కావున ఆయన మన జీవన పోరాటంలో నిత్యం వచ్చే సమస్యలను తొలగించి మనల్ని సుఖం గా ఉండేలా చేస్తాడు . 
సాయం సమయంలో ఈశ్వరుడిని దేవాలయాన్ని దర్శిస్తే చాలా మంచిది . రోజు పూర్తి అవుతున్న సమయములో శివుడిని దర్శిస్తే రెట్టింపు ఫలితాన్ని అందించి మనల్ని సుఖ సంతోషాలతో ఉండేలా చేస్తాడు ఆ అపార దయాముర్తి . 



ఏ దేవాలయానికి ఏ సమయములో వెళ్ళినా తొందరపడకూడదు . ప్రశాంతముగా నెమ్మిదిగా భగవంతుణ్ణి దర్శించుకోవాలి . దేవాలయములో ఉన్న కాసేపయినా కోప ద్వేషాలను వదిలి ఏ ఆలోచనలు లేకుండా భగవంతుడి మీదనే పూర్తి ద్యాసను పెట్టి భగవంతుడిని దర్శించుకోవాలి . 
దర్శనము ,,షడగోప్యము ,తీర్ద ,ప్రసాదాలు అయ్యాక కొంచుం సేపయిన కూర్చుని వెళ్ళాలి . అలా కూర్చోవడం వల్ల ప్రశాంతత ,ఫుణ్యము లభిస్తాయి . అలా కూర్చోకుండా వచ్చేస్తే దైవ దర్శన ఫలం కూడా లభించదు . కేవలం కూర్చోవడమే కాకుండా ఓ రెండు నిముషాలు కనులు మూసుకొని ధ్యానం చేస్తే మరింత శుభం కలుగుతుంది . 

                                           సర్వే జనా సుఖినో భవంతు . 


                                                                                     శశి ,

                                                                     ఎం . ఎ తెలుగు ,తెలుగు పండితులు . 









No comments:

Post a Comment