Tuesday 8 March 2016

సూర్య గ్రహణం

                         సూర్య గ్రహణం 

9-3-2016 వ తేదీన సూర్య గ్రహణం పూర్వాభాద్రా నక్షత్రంలో సంబవిస్తుంది . ఉ . 5. 46 కి గ్రహణం ఆరంభమై ఉ . 9. 08 నిముషాలతో  గ్రహణం ముగుస్తుంది . భారతదేశంలో 6. 50 తరువాత సూర్యుడు మాములుగానే కనిపిస్తాడు . రెండవ వైపు సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడుతుంది . కావున ఆ గ్రహణ ప్రభావం భారతదేశంలో కూడా వుంటుంది . కావున 5 . 46 మొదలుకుని 9 . 08 వరకు మనం గ్రహణ కాలంలో పాటించే నియమాలు తప్పనిసరిగా పాటించాలి . 
5 . 46 కి గ్రహణ పట్టు స్నానం చెయ్యాలి .7 . 27 కి మద్య మద్య స్నానం చెయ్యాలి .  9 . 08 కి విడుపు స్నానం చెయ్యాలి . ఏవేమి ఆచరించని వారు కనీసం విడుపు స్నానాన్ని అయినా చెయ్యాలి . 
మంత్రోపాసన చేసేవారు గ్రహణ సమయంలో ఇ మూడు స్నానాలును ఆచరించి మంత్రోపాసన చేసిన ఫలితాన్ని అత్యధికం గా పొందవచ్చని పెద్దల ,శాస్త్రాల మాట . 
గ్రహణ సమయంలో ఏమి భుజించకూడదు . ఏమి తాగకూడదు . పాలు, పెరుగు ,పచ్చళ్ళు మొదలయిన వాటి మీద దర్భలను వుంచాలీ(దర్భలు ఎందుకు పవిత్రమయినవి అయ్యాయో రేపు తెలుసుకుందాం ) . గ్రహణం నకు ముందు వండిన ఆహార పదార్దాలను భుజించరాదు . గ్రహణం విడుపు అయిన పిదప ఇంటిని కడుక్కుని ,తల స్నానం చేసి అప్పుడు ఆహార పదార్ధాలను వండుకోవాలి . గర్భిణులు గ్రహణ సమయం లో బయటకు రాకూడదు . 

గ్రహణం ఏర్పడడానికి కారణం ; 

దేవతలు, రాక్షసులు కలసి క్షీర సాగరాన్ని అమృతం కోసం నదించాలి అని అనుకుని ,మంధర పర్వతాన్ని కవ్వం గా వాసుకిని తాడుగా చేసుకుని వాసుకు తల వైపు రాక్షసులు ,తోక వైపు దేవతలు పట్టుకుని క్షీరసాగరాన్ని మధించ సాగారు . ఆ సమయంలో మంధర పర్వతం సాగరంలోకి కృంగి పోతుండగా విష్ణు మూర్తి కుర్మావతారాన్ని ఎత్తి మంధర పర్వతం కింద బాసటగా ఉంటాడు . అలా మధించగా ముందు హాలాహలం ఉత్పన్నమవుతుంది . దానిని పరమేశ్వరుడు గొంతులో ఉంచుకుని లోకాలను రక్షించి గరలకంతుడు అయ్యాడు . తరువాత కామధేనువు,కల్పవృక్షం ,లక్ష్మీదేవి,కౌస్తుభమణి ,ఐరావతం ,వుచ్చైశ్వం ఇలా అనేకం వెలువడిన తరువాత ఆఖరులో అమృతం వెలువడుతుంది . దానికోసం దేవతలు రాక్షసులు తగువులు ఆడుకుంటుండగా , రాక్షసులకు అమృతం దొరికితే లోకాలకి శాంతి ఉండదనే ఉద్దేశ్యంతో మహా విష్ణువు జగన్మోహిని రూపంలో వచ్చి వారికి తాను అమృతాన్ని పంచుతానని చెప్పి దేవతలను ఒక వరసలో ,రాక్షసులను మరో వరసలో కూర్చోబెట్టి ,దేవతలకు అమృతాన్ని ,రాక్షసులకు అమృతానికి బదులుగా మరేదో పానీయాన్ని పోస్తువుంటాడు . అనుమానించిన రాహు ,కేతువులు చది చప్పుడు కాకుండా దేవతల వరసలో కూర్చుంటారు . వారికి కూడా విష్ణువు అమృతాన్ని పోయగా పక్కనే వుంది గమనించిన చంద్రుడు విషయం విష్ణువుకు చెబుతాడు సూర్యుడు వత్తాసు పలుకుతాడు . దానితో విష్ణువు నిముషం కుడా ఆలస్యం చెయ్యకుండా తన సుదర్శన చకటం తో వారి శిరస్సుని ఖండించి వేస్తాడు . కాని వారు అప్పటికే అమృతాన్ని తాగడంతో వారు చనిపోకుండా సజీవులుగానే వుంటారు . వారి పరిస్థితికి సూర్య,చంద్రులే కారణమని పగతో దేవతల అనుమతితో సూర్య ,చంద్రులను గ్రహణం సమయంలో  మింగి వేస్తారు , తిరిగి వారిని గ్రహణ సమయం పూర్తి కాగానే వదిలేస్తారు . 





                                                                                                శశి , 

                                                                 ఎం . ఎ తెలుగు ,తెలుగు పండితులు 















No comments:

Post a Comment