Saturday 5 March 2016

శివరాత్రి మహత్యం

                  శివరాత్రి మహత్యం 


కైలాసాదీసుడు ,పార్వతీ వల్లభుడు ,అయిన పరమేశ్వరుడు  పరమ దయాలుడు ,జ్ఞాన ,మోక్ష ప్రదాత. శివుడిని శంభుడు ,భక్త వల్లబుడు అంటారు . ఆయన కరుణించిన భక్తుల గాధలను మనం అనేకం వింటూనే ఉంటాము . శివాలయం చుట్టూ ప్రదక్షణలు చేస్తే ఎటువంటి దోషాలు వున్నా తొలగిపోతాయి అని మన పురాణాలు నొక్కి వక్కానిస్తున్నాయి . లోకాలను  రక్షించేందుకు హాలాహలాన్ని సైతం గొంతున ధరించి న మరమేశ్వరుడి లీలలు అనేకం ,దయ అనతం . 
మన పెద్దలు జన్మకో శివరాత్రి అన్నారు . అర్ధనారీశ్వరుడు భూమి మీద లింగ రూపంలో పూజింప బడతాడు . ఆ ఆది దేవుడు భూమి మీద లింగ రూపంలో ఆవిద్భవించిన మహోత్తరమయిన రోజే శివరాత్రి .  దేవాది దేవుడు కి అత్యంత ఇష్టమయిన రోజు ఈ శివరాత్రి . మన జన్మ మొత్తం మీద ఒక్క శివరాత్రి రోజయిన నిష్కల్మషంగా ,భక్తి శ్రద్దలతో శివరాత్రి వ్రతాన్ని ఆచరించి ,జాగరణ చేసినట్లయితే చేసిన పాపాలన్నీ పటాపంచలయి మరణానంతరం ఉన్నత లోకాలు లభిస్తాయి అని మన వేదాలు చెబుతున్నాయి . అలా మోక్షం పొందిన వారు అనేకం వున్నారు . 
మన పనులు ,మన తిండి, మన నిద్ర ఎప్పుడు ఉంటూనే వుంటాయి . కనీసం శివరాత్రి ఒక్కరోజయిన మహేశ్వరుడి నందు మన మనసుని లగ్నం చేసి మన జన్మ ను సార్ధకం చేసుకుందాం . 
పార్వతి వల్లభుడు మహేశ్వరుడి అనుగ్రహం అందరికి కలగాలని మనస్పూర్తి గా కోరుకుంటూ ,

                        హర హర మహాదేవ శంభో శంకరా 

                                                                                                       మీ శశి ,

                                                                        ఎం .ఎ తెలుగు ,తెలుగుపండితులు . 













 

No comments:

Post a Comment