Tuesday 15 March 2016

శ్రీ శైలక్షేత్రం

                      శ్రీ శైలక్షేత్రం 


ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో,అష్టాదశ శక్తీ పీతాలలో ఒకటయిన శ్రీ శైల క్షేత్రంలో ఆది దేవుడు పరమేశ్వరుడు మల్లికార్జునుడిగా ,లోకైక మాత పార్వతీ దేవి భారమరామ్బికా దేవిగా కొలువై భక్తుల మొరలను వింటూ పూజలు అందుకుంటున్నారు  . 
ఈ క్షేత్రం ఆంద్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ,ఆత్మకూరు తాలుకాలోని నల్లమల అడవి లో కలదు . ఈ మహా క్షేత్రం వేదాలకు ఆలవాలమై ,సకల సంపదలకు పుట్టినిల్లై ,పరాశర ,భరద్వాజాది మహర్షుల తపో వనాలతో ,అనేక లింగాలతో ,అనంతమైన ఓషదులతో విరాజిల్లుతూ అక్కడికి వచ్చిన భక్త కోటికి మల్లికార్జునుడి కరుణా కటాక్షనాలతో పాటు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తోంది . 

శ్రీ శైల దర్శన ఫలం ; 

కురుక్షేత్రంలో లక్షల కొలది దానం ఇచ్చినా ,రెండు వేల సార్లు గంగా స్నానం చేసినా ,నర్మదా నదీ తీరంలో ఎక్కువకాలం తపస్సు ఆచరించినా ,కాశీ క్షేత్రం లో లక్షల సంవత్సరాలు నివశించినా ఎంత పుణ్యం లభిస్తుందో అంతటి గొప్ప పుణ్యం శ్రీ శైల మల్లికార్జున స్వామిని ఒక్కసారి దర్శించినంత మాత్రం చేతనే కలుగుతుందని స్కాందపురాణం చెబుతోంది . శిఖర దర్శన మాత్రం చేత అనంతమైన పుణ్య సంప్రాప్తమై మోక్షం కలుగుతుంది . పుణ్య మాసాలలో దర్శించే వారికి వాజపేయ అతిరాత మొదలైన మహాయజ్ఞాలు ఆచరించినందువల్ల కలిగే ఫలాన్ని ,కన్యాదానం ,గోదానం మొదలైన మహా దానాలు చేసినందువల్ల కలిగే ఫలాన్ని అనాయాసంగా పొందుతారని సాక్షాత్ మహేశ్వరుడే ,పార్వతీ దేవికి చెప్పినట్లు స్కాంద పురాణం చెబుతోంది . సాక్షి గణపతిని దర్శించి మన గోత్ర నామాలు చెప్పుకున్న ఎడల గణపతి మనము వచ్చినట్టు సాక్షం చెబుతాడు . కనుకనే ఆయన చేతిలో కలము, పుస్తకము వుంటాయి . 

క్షేత్ర ప్రాముఖ్యం ; 

శ్రీ శైల మహా క్షేత్రం  భూమండలానికి నాభి స్థానమని పురాణాలు చెబుతున్నాయి . ప్రపంచంలోని ఎ ప్రాంతం లో ఎ పూజ చేసినా ఎ వ్రతం ఆచరించినా సంకల్పంలో శ్రీ శైలాన్ని స్మరిస్తూ శ్రీ శైల ఈశాన్య ప్రదేశే ,ఉత్తర దిగ్భాగే అని తాము శ్రీ శైల క్షేత్రానికి ఎ దిక్కున వున్నామో వివరంగా చెబుతారు . 
యుగ యుగాలుగా ప్రసిద్ది చెందినా ఈ శైవ క్షేత్రం కృత యుగంలో హిరణ్య కశిపునికి పూజా మందిరం కాగా ,ఆహోభిల క్షేత్రం సభా మండపమని ప్రతీతి  . త్రేతా యుగంలో శ్రీ రామచంద్రుడు అరణ్య వాస సమయంలో సతీ సమేతుడై శ్రీ శైల నాధుని సేవించి సహస్ర లింగాన్ని ప్రతిష్టించాడని ,పాండవులు తమ వన వాస సమయంలో ద్రౌపది సమేతులై ఈ క్షేత్రంలో కొంతకాలం వుండి ,లింగాలను ప్రతిష్టించారని చెప్పబడుతోంది . ఇందుకు నిదర్సనం గా సీత ప్రతిష్టిత సహస్ర లింగం ,పాండవులచే ప్రతిష్టించబడిన సద్యోజాత మొదలయిన 5 లింగాలు ఇప్పటికి భాక్తులచేత పూజలను అందుకుంటున్నాయి . 


పురాణ గాధలు ;

1. కుమారా స్వామిగాధ ;

గణపతి ,కుమారస్వాములు ఆధిపత్యం కోసం  పోటి రాగా ,పార్వతి పరమేశ్వరులు ఎవరు ముందు భూ ప్రదక్షణం చేసి వస్తారో వారికే గణాధిపత్యము అని చెప్పగా కుమారస్వామి వెంటనే తన వాహన మైన నెమలిని ఎక్కి వాయు వేగంతో భూ ప్రదక్షనకై వెళ్ళగా తన మూషిక వాహనము పై ,తన ఆకారంతో భూ ప్రదక్షణ వీలు కాదని తలచిన గణేశుడు తల్లి ,తండ్రుల పాద పద్మములకు భక్తి పూర్వకముగా పూజ చేసి వారికి మూడు సార్లు ప్రదక్షణ చేసెను . గణపతి యుక్తిని మెచ్చిన పార్వతిపరమేశ్వరులు అతడికి ఆధిపత్యమును ఒసగగా ,భు ప్రదక్షణ చేసి వచ్చిన కుమారా స్వామి అదంతా చూసి అలిగి క్రౌంచ పర్వతము మీదకు వెళ్లి కుర్చున్నాడుట  . బతిమాలి తీసుకు రమ్మని పార్వతి పరమేశ్వరులు నారదుడిని పంపినా ప్రయోజనం లేకపోవడంతో పార్వతి పరమేశ్వరులే స్వయముగా వచ్చి కుమారుడి కోసం శ్రీ శైల క్షేత్రము నందే నిలిచిపోయారు . 

వృద్ధ మాల్లికార్జనుని గాధ ; 

పూర్వం  ఒక రాకుమార్తె సివుడునే తన భర్తగా బావించి ఆరాధించడం మొదలుపెట్టగా దానికి ఆమె తల్లి తండ్రులు అంగీకరించరు .  ఒక   రోజు కలలో శివుడు కనిపించి ఒక తుమ్మెదను చూపించి అది వాలిన చోట తన కోసం ఎదురు చూడమని తానే వచ్చి వివాహం చేసుకుంటానని  చెబుతాడు . కళ్ళు తెరచి చూడగా బ్రమరం (తుమ్మెద )కనిపిస్తుంది . దానిని అనుసరిస్తూ ఆ రాకుమారి శ్రీ శైల ప్రాంతం లోని ఒక పొద దగ్గర తుమ్మెద వాలగా అక్కడే శివుడిని ద్యనిస్తూ వుంటుంది . ఆ అడవిలోని చెంచులు ఆమెకు పాలు పళ్ళు ఆహారం గా ఇస్తువుంటారు . ఇలా కొన్ని రోజులు గడవగా పార్వతి పరమేశ్వరులు విహారానికి ఆ ప్రదేశానికి వచ్చారు . అప్పుడు శివుడు పార్వతికి జరిగినది చెప్పి ఆమెను వివాహం చేసుకుంటానని చెబుతాడు . అప్పుడు పార్వతి హేళన చేయగా శివుడు వృద్దుడి వేషంలో ఆమె వద్దకు వచ్చి నీకోసం వెతికి వెతికి ముసలివాడిని అయిపోయాను నన్ను వివాహం చేసుకో అని అడుగుతాడు . చెంచులు వద్దన్నా వినకుండా ఆమె ఆయనను వివాహం చేసుకుంటుంది . అప్పుడు చెంచులు శివుడిని తమ అల్లుడుగా భావించి కొత్త అల్లుడుకి మద్య మాంసాలతో కూడిన విందుని ఏర్పాటు చేయగా ,శివుడు ఆ విందుని నిరాకరించి వెల్లిపోతుంటాడు . రాకుమార్తె చెప్పినా వినపదినట్టు వేల్లిపోతుంటాడు . అప్పుడు ఆమె మల్లయ్యా .... చెవిటి మల్లయ్యా నిలబడు అని గట్టిగా అరిచింది . అయినా శివుడు వినపడనట్టే వేల్లిపోతుంటాడు . దానితో కోపించిన రాకుమారి "లింగ రూపదారివై అక్కడే నిలిచిపో "అని శపిస్తుంది . ఈ విషయం తెలిసిన పార్వతి దేవి "బ్రమరం ను వెంబడించి వచ్చావు కావున నువ్వు బ్రమరము అయిపో "అని శపించింది . ఈ ప్రకారంగా ఎప్పటికి వృద్ద మల్లికార్జున స్వామిని చెవిటి మల్లన్న ,వృద్ద మల్లన్న అని పిలుస్తారు. 

భ్రమరాంబాదేవి ;

ఒకప్పుడు అరుణాసురుడు అనే రాక్షసుడు భ్రహ్మను గురించి తపస్సు చేసి రెండు కాళ్ళ జీవులనుండి గాని,నాలుగు కాళ్ళ జీవులనుండి గాని మరణం లేకుండా వరాన్ని పొందాడు . వర గర్వంతో సర్వ లోకాలను భాదించే అరుణాసురుడిని  చంపే వారే లేక దేవతలు మునులు అందరు ఆది పరాశక్తిని శరణు వేడగా అప్పుడు ఆమె ఆ రక్కసుడితో యుద్దానికి తలపడి వేలాది బ్రమరాలను (తుమ్మెదలను )అరుణాసురుడి మీదకు పురిగొల్పింది . ఆరు కాళ్ళ జీవులైన తుమ్మెదలు అరుణాసురుడిని కుట్టి కుట్టి చంపుతాయి . దేవతల కోరికపై అమ్మ భ్రమరాంబా దేవిగా అక్కడే వెలిసింది ఇందుకు గుర్తుగా అమ్మవారి ఆలయం వెనక గోడల నుండి బ్రమర ఝుంకారం ఇప్పటికి వినిపిస్తూ వుంటుంది . 

ఇంకా దర్శనీయ స్థలాలు ; 

ఆలయ ప్రాకారం ,గుడి గోపురాలు ,మల్లికార్జునస్వామి ,బ్రమరాంభా దేవి ,శనగల బసవన్న ,సప్త మాతృకలు ,మనోహరగుండం ,భ్రహ్మ గుండం ,విష్ణు గుండం ,నవ భ్రహ్మాలయాలు ,అక్క మహాదేవి ,ఉమా మహేశ్వరుడు ,అద్దాలమందపం ,అర్ధనారీశ్వరుడు ,పాండవ ప్రతిశిత లింగాలు ,వీరభద్ర స్వామీ ,మల్లికా గుండం ,బలిపీటం ,వృద్ద మల్లికార్జనుడు ,రామ ప్రతిష్టిత సహస్ర లింగం ,త్రి ఫలవృక్షం ,సీతా ప్రతిష్టిత సహస్ర లింగం ,లోపా ముద్ర ,శిల్ప మండపం,రుదిరగుండం ,యాగశాల ,నిత్య కళ్యాణ మండపం ,అన్నపూర్ణా మందిరం ,శంకర మటం ,ఆరామ వీరేశ్వరాలయం ,గంగాధర మండపం,శృంగేరి శారదా మటం ,నందుల మఠం ,గిరిజా శంకరుడు ,వరాహ తీర్దం ,పశుపతి నాద లింగం ,గోగర్భం ,బయలు వీరభద్రుడు ,గంగా భావాన్ని స్నాన గట్టాలు ,శివాజీ స్ఫూర్తి కేంద్రం ,చంద్ర కుండం ,అన్కాలమ్మగుడి ,ప్రసంనంజనేయస్వామి ,పాతాలేశ్వరుడు ,విటలేస్వరాలయం ,పాతాల గంగా ,సిద్ది రామప్ప కొలను,సాక్షి గణపతి ,హటకేశ్వరం పాలధార,పంచదార ,శిఖరేశ్వరం ,భీముని కొలను ,నాగలూటి వీరభద్రుడు ,అక్క మహాదేవి గుహలు ,ఇష్ట కామేశ్వరి ,కధలీవనం ,దత్తాత్రేయ పాదుకలు
ఇవే కాక ,
ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం తూర్పు ద్వారం గాను ,కడప జిల్లా లోని సిద్ధవటం దక్షిణ ద్వారం గాను ,మహభూబ్ నగర్ జిల్లాలోని అలంపురం పశ్చిమ ద్వారం గాను,ఉమా మహేశ్వరం ఉత్తర ద్వారం గాను వున్నాయని పురాణాలు చెబుతున్నాయి . 



                                                                                              శశి ,

                                                                                     ఎం . ఎ తెలుగు తెలుగు పండితులు 














No comments:

Post a Comment