Wednesday 27 February 2019

రామాయణము కిష్కిందకాండ -నలుబదియవసర్గ

                            రామాయణము 

                            కిష్కిందకాండ -నలుబదియవసర్గ 

సుగ్రీవుడు శ్రీరామునితో "రామా !కొన్ని వేలకోట్ల వానరవీరులు ఇచటికి వచ్చినారు . వీరందరూ మహా బలశాలురు . ఇక వీరందరూ నీ సేన . నీవు ఎలా చెబితే వారు ఆలా చేస్తారు . యుద్ధము కూడా వేరు సిద్దము . వారి తో పాటు నేను కూడా నీ వెంటే వుంటాను . "అని పలికెను . 
సుగ్రీవుడి మాటలు విని మిక్కిలి సంతృప్తుడైన రాముడు సుగ్రీవుని కౌగలించుకుని "సుగ్రీవా !నాకు లక్ష్మణుని తదుపరి  నీవే ప్రాణప్రదుడవు . నీవంటి స్నేహితుడు ఉన్నట్లయితే మనుష్యులు సాధించలేనిది ఏమి ఉండదు . ముందు మనము సీతాదేవి ప్రాణములతో వున్నదో లేదో తెలుసుకొనవలెను . రావణుని పేరు తప్ప అతడు వుండు ప్రదేశము కానీ అతని శక్తి సామర్ధ్యములు కానీ మనకు తెలియవు . కావున మనము ముందు వాటిని తెలుసుకొనవలెను . ఓ వీరా !సీతాన్వేషణ కార్యమును సాధించు విధానము నీకే బాగుగా తెలియును . ఇందులో సందేహము లేదు . కనుక నీవే తగు విధముగా నిర్ణయించి నీ అనుచరులను ఆజ్ఞాపించుము . "అని పలికెను . 

ఆ మాటలు విన్న సుగ్రీవుడు వెంటనే తన సేనానాయకుడు ఐన వినతుని పిలిపించెను . 

పర్వతము వలె మహాకాయుడు ,మేఘము వలే గర్జించువాడు అయిన వినతుడిని సుగ్రీవుడు రామలక్ష్మణుల సన్నిధిలో ఇలా ఆజ్ఞాపించెను . చురుకైన వేలకొలదిగా కల వానరులను వెంటపెట్టుకుని కొండలు కోణాలు ,అరణ్యములతో కూడిన తూర్పు దిక్కుకు వెళ్లి అచట ఆణువణువూ సీతాదేవి కొరకు రావణుని స్థావరం కొరకు అన్వేషించుము . 
గంగ ,సరయు ,కౌశికి ,యమునా మున్నగు నదులను ,యాము నాగరిని సరస్వతి ,సింధు మణుల వలె స్వచ్ఛమైన జలములు కల ,శోణ ,మహి పర్వతముల నుండి వనముల మధ్యగా పరవహించెడి కాల మహి మున్నగు నాయీ తీరములలో వెతుకుము . 
భ్రహ్మమాల విదేహ ,మాళవ ,కాశి ,కోశాల ,సుగద మొదలగు మహాగ్రామములను పుండ్ర ,అంగదేశముల యందలి జనపదములను ,కోశాకారుల పట్టణములను వెండి గనులు గల   భూములు మున్నగు ప్రదేశములను అన్నిటిని వెతుకుము . 
సముద్రములో గల పర్వతములను వాటి మధ్య కల ద్వీపముల అందలి నగరములను మందరాచల శిఖరము మీద కల గ్రామాలలో నివశించుచున్న జనులను విచారింపుడు . వారిలో కొందరు వంశాభివృద్ధి కలవారు ,కొందరు బలశాలురు ,వారిలో కొందరికి చెవులుండవు . కొందరికి పెదవులు చెవులు వరకు వ్యాపించి ఉంటాయి . కొందరి ముఖములు అయోమయములై భీతిని కలిగిస్తాయి . వారు ఒకే ఒక పాదము కలవారి వేగముగా తిరుగుతుంటారు . కొందరు సురభక్షకులు ,కొందరు కిరాతులు , కొందరు కప్పివుండే కేశములు కలవారు కొందరు బంగారు వన్నె కలిగి అందముగా వుంటారు ,కొందరు కిరాతులు ద్వీపములలో నివశించుచు పచ్చి చేపలను తిందురు . కొందరు జలములలో సంచరించుచుందురు . వారు భంయంకరులు నరవ్యాఘ్రములుగా ప్రసిద్దికెక్కినవారు . వీరందరి నివాస స్థానములకు వెళ్ళి ,వానరులందరూ సీతాదేవి ఆచూకీని వెదకవలెను . 
ఇలా కొంత దూరము వెళ్లిన తర్వాత యవద్వీపము కనపడును . అది రత్నముల రాశిగా పేరుపొందినది . ఏడూ ఖండములుగా ఏర్పడి వున్నది . దాని చుట్టు సముద్రము కొండలు ఆవరించి వున్నాయి . నావలా ద్వారా కానీ ఎగిరి కానీ అచటికి వెళ్లవలెను . పిమ్మట సువర్ణ ద్వీపమును రూప్యకా ద్వీపము చేరతారు . అవి బంగారు వెండి ఘనులకు నెలవైనవి . యవద్వీపమును దాటిన పిమ్మట శిశిరం అను పర్వతము కనపడును దాని శిఖరములు ఆకాశమును తాకును . దేవతలు దానవులు అచట విహరిస్తారు . ఆ ప్రదేశం అంతా వెతుకుము . 
పిమ్మట సముద్రమును దాటి అవతల తీరము కల శోణానాదమునకు చేరవలెను . అది మిక్కిలి లోతయినది . ఎర్రని జలములతో వేగముగా ప్రవహించునది . ఆ ప్రదేశమున సిద్దులు చారణులు విహరిస్తారు . అక్కడ చిత్రవిచిత్రములు వుండే రమ్యమైన వనములు కలవు . అక్కడ వెతుకుము . 
ముందుకు వెళ్తే ఇక్షు సముద్రము వచ్చును . అది పెనుగాలులకు ఉవ్వెత్తుగా ఎగసిపడు తరంగములతో తీవ్ర ఘోషలతో ఉంటుంది . ఆ సముద్రములో వెదికినా తర్వాత భయంకరములైన ద్వీపములను గాలించండి . దానిని దాటినా పిదప లోహితము అను మధు సముద్రము తీరమునకు చేరెదరు . అక్కడ బూరుగు వృక్షములు అధిక సంఖ్యలో కలవు . అందువల్ల దానికి శాల్మలీ ద్వీపము అని పేరు . వినతా పుత్రుడైన గరుత్మంతుడి భవనము అక్కడ వుంది . అక్కడ మందేహులు అను రాక్షసులు ఉందురు . 
అచటి నుండి ముందుకు వెళ్తే క్షీరోదము అను సముద్రము కనిపిస్తుంది . ఆ సముద్ర మధ్యములో ఋషభము అను పేరు కల తెల్లని మహా పర్వతము ఉండును . అక్కడ అన్ని వైపులా వృక్షమలు వ్యాపించి ఉండును . ఆ అక్కడి నుండి ముందుకు వెళ్లిన తర్వాత స్వచ్ఛమైన మధుర జలము కల మహా సముద్రము కలదు . ఆ సముద్రములో ఔర్యుడు అను పేరుకల మహాముని తేజస్సు ప్రవేశించెను . ఆ బడబాగ్నికే హయాముఖం అని పేరు అక్కడికి 13 యోజనాల దూరములో "జాతరూపశిలము "అనే పేరు కల బంగారు పర్వతము కలదు ఆ గిరి శిఖరమున సర్పాకృతి అనంతుడు అనుపేరుతో ఆదిశేషుడు ఆసీనుడై ఉండును . 
అది దాటినా తర్వాత :ఉదయాద్రి "కనిపించును . పూర్వము శ్రీమహా విష్ణువు వామనావతార సమయమున త్రివిక్రముడై ఒక పాదమును సౌమనస శిఖరము మీదను ,రెండవ పాదమును మీరు పర్వతము పైన ఉంచెను . సూర్యుడు జంబూద్వీపమునకు ఉత్తర భాగమున ప్రభవించి మిక్కిలి ఉన్నతమైన సౌమనస శిఖరమును  చేరిన పిమ్మట మేరుగిరికి దక్షిణ భాగమున వున్నా వారికి స్పష్టముగా గోచరించును 
ఉదయాద్రికి ముందు భాగమున సుదర్శన ద్వీపము కలదు సూర్యుడు ఉదయగిరిపై కల సౌమనస శిఖరము మీదికి చేరినంతనే ఆ స్వామి యొక్క కిరణ ప్రశముతో సుదర్శన ద్వీప నివాసులలో చైతన్యము వెల్లివిరియును . అందువలననే దీనికి సుదర్శనద్వీపము అను పేరు ఏర్పడినట్లు ప్రతీతి . ఆ ఉదయాచలము యొక్క పరిసర ప్రాంతములలో రావణునికి ,సీతాదేవికి అంతటా వెతుకుము . 
దానిని దాటినా తర్వాత ఆప్రాంతము అంతా అగమ్యము (వెళ్లలేనిది ),అది దేవతలకు నివాసము అక్కడ సూర్యచంద్ర కిరణము పడవు కాబట్టి అది అంధకారము గా ఉంటుంది ,అదృశ్యము . ఓ వానరులారా !ఉదయాద్రి వరకే వానరులు వెళ్ళగలరు దాని తర్వాతి ప్రదేశములు అన్నీ చిమ్మచీకట్లతో నిండి ఉంటాయి . అవి నిర్జన ప్రదేశములు . వాటిని గురించి నాకు తెలియదు . 
నేను చెప్పినట్లుగా ఉదయ గిరి వరకు కల సంస్థ ప్రదేశమును ఆణువణువూ జాగ్రత్తగా సీతాదేవి జాడకొరకు అన్వేషించండి . ఒక నెలలోపు మీరు తిరిగి రావాలి . ఆ నెల్ గడువు దాటినచో నా చేతిలో మీకు చావు తప్పదు . సీతాదేవికి అన్వేషించి కృతార్థులై తిరిగి రండి . ఓ వానరులారా తూర్పు డిక్కీ అంటా వనములు ఎక్కువగా ఉంటాయి . ఆ దిక్కు దేవేంద్రుని అధీనములో వుంది . ఆ ప్రదేశమును నేర్పుగా వెతకండి . శ్రీరాముని ధర్మపత్ని ఐన సీతాదేవి జాడను తెలుసుకుని హాయిగా తిరిగి రండి మీకు క్షేమము అగుగాక "అని పలికెను . 

రామాయణము కిష్కిందకాండ నలుబదియవసర్గ సమాప్తము . 

                               శశి ,

ఎం . ఏ ,ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









No comments:

Post a Comment