Thursday 28 February 2019

రామాయణము కిష్కిందకాండ -నలుబది రెండవసర్గ

                                   రామాయణము 

                             కిష్కిందకాండ -నలుబది రెండవసర్గ 

అంగదాది వానరులను దక్షిణ దిశ కు పంపిన పిమ్మట సుగ్రీవుడు తార యొక్క తండ్రి తనకు మామ అయిన సుషేణుడి వద్దకు వెళ్లి నమస్కరించెను ఆయుధ పాటి అగు ఆ సుషేణుడు మిక్కిలి పరాక్రమ శాలి నీల వర్ణము వాడు మిగుల పరాక్రమ శాలి . 
 

                                                                                                                                                                              సుషేణుడి వెనుక మారీచాది మహా వీరులు అనేక మంది ఉండిరి వారందరిని సీతాన్వేషణకు పశ్చిమ దిశకు వెళ్ళవలసినదిగా వారందరిని సుగ్రీవుడు ఆదేశిస్తూ "ఓ వానర ప్రముఖులారా సులహీనుడి నాయకత్వములో మీ రందరు రెండు లక్షలమంది వానర వీరులతో కలిసి సీత దేవి జాడను తెలుసు కొనుటకు వెళ్ళండి ముందుగా సౌరాష్ట్ర ప్రాంతములను బాహ్యక దేశములను, సూరా భీమా ప్రదేశములను ,వేశాలములై మనోహరంగా ఉండే జన పదములను, మహా నగరములను, పున్నాగ వృక్షములతో ,వకుళ వృక్షములతో ఉద్దాలక వృక్షాలు మొగలి పొదలు 
తో కూడిన మధ్య ప్రదేశమును సీతాదేవికి గాలించుము . 
పవిత్రమైన చల్లని జలములతో పశ్చిమ దిశకు ప్రవహించెడి నదీ తీరములలో ,మునీశ్వరులు వుండే వనములలో ,దట్టమైన అడవులలో కొండలపైన సీతాదేవికొరకు వెతకండి . తర్వాత పశ్చిమ దిశలో మరుభూముల వంటి మెత్త నేలలను నిటారుగా వున్న శిలా ప్రాంతములను ,కొండలతో ఆవరించబడి వున్న భయమకరమైన ప్రదేశములను బాగా వెతకండి . ఓ వానరులారా !తర్వాత ఇంకా పడమర దిశగా సాగినచో సముద్రతీరమునకు వెళ్తారు . 
అక్కడి నీళ్లలో తిమింగలములు ,ముసళ్ల ఉంటాయి . ఆ సముద్రజలములు ప్రశాంతముగా ఉంటాయి . ఆ స్లోగర తీరములో కల మొగలి మొదలలో కానుగ తోపులలో ,కొబ్బరితోటలలో మీ వానరులందరూ బాగా వెతకండి . ఆ తీరమునే వున్న పర్వతములలో ,వనములలో రావణుని నివాసము ,సీతాదేవి ఆచూకీ కొరకు బాగా తీవ్రముగా వెతకండి . 
తర్వాత మురచీ పట్టణమును రమ్యమైన జటీ పురమును ,అవంతిని ,ఆంగలోపావారిని ,అలక్షితావనమును ఇంకా విశాలములైన ప్రదేశములు ,పట్టణములు వెతకండి . సిందూ నది సముద్రములో కలిసే ప్రదేశములో హేమ గిరి అను ఒక పర్వతము కలదు . బాగా విశాలమైన ఎక్కువ శిఖరములు కల ఆ పర్వతమును ఆసాంతము జాగ్రత్తగా వెతుకుము . ఆ శిఖరములపై గంధర్వులు నివసిస్తుంటారు . ఆ శిఖరము పై కల ఫలములను ,కందమూలాదులను ఎవ్వరు తినరాదు . అవి గంధర్వులు ఆహారములు . అవి తిన్నచో వారికి కోపము వచ్చును . అది చాలా ప్రమాదకరం . అయినా అక్కడ కూడా సీతా దేవి కొరకు బాగా వెతకండి . అక్కడికి సమీపములో వజ్రగిరి అను ఒక పర్వతము కలదు . అది నూరు యోజనాల దూరము వ్యాపించి వున్నది . ఆ పర్వతముపై గుహలలో ఆ తల్లి కొరకు వెతకండి . 
అక్కడికి సమీపములోనే చక్రవంతము అనే పేరు కల మహా పర్వతము కలదు . అది సముద్రములో నాలుగవ వంతు ఉండును . దానిపై విశ్వకర్మ వేయి అంచులు కల ఒక చక్రమును నిర్మించెను . పురుషోత్తముడైన శ్రీమహా విష్ణువు ఈ పర్వతము లో నివసిస్తున్న పాంచజనుడు ,హయగ్రీవుడు అను దానవులను చంపి వారి నుండి పాంచజన్యము అను శంఖమును ,సుదర్శనం అను సహస్రారచక్రమును తీసుకొని వచ్చెను . చిత్రములైన ఆ పర్వతములో బాగుగా వెతకండి . అక్కడి నుండి అరవై యోజనముల దూరములో అగాధమైన సముద్రములో వరాహగిరి కలదు . ఆ గిరిపై ప్రాగ్జోతిషపురము అనే నగరమును ఏర్పరుచుకుని నరకుడు అనే రాక్షసుడు పరిపాలన సాగిస్తున్నాడు . అక్కడ కూడా బాగా వెతకండి . 
అది దాటినా తర్వాత సర్వసౌవర్ణ పర్వతము వచ్చును . అక్కడ కూడా బాగుగా వెతకండి . ముందుకు వెళ్తే మేఘవంతము అను పర్వతము వచ్చును . అక్కడే ఇంద్రుని దేవతలు పట్టాభిషిక్తుడిని చేశారు . అక్కడి నుండి ముందుకు వెళ్లిన పిమ్మట 60,000 బంగారుకొండలు మీకు కనపడును . వాటి మధ్యలో దేదీప్యమానంగా వెలుగుతున్న మేరుగిరి కనిపించును ఆ ప్రాంతములన్ని జాగ్రత్తగా వెతకండి . అక్కడ 'మేరుసావర్ణి 'అను మహర్షి కలడు . అతడిని సీతాదేవి జాడ కొరకు అభ్యర్ధించండి . ఓ వీరులారా !పశ్చిమ దిక్కున మీరు ఇంతవరకే వెళ్ళగలరు . కావున ఇప్పటివరకు నేను చెప్పిన ప్రదేశము అన్ని జాగ్రత్తగా వెతికి తిరిగి రెండు . మీకు కూడా నెల రోజులే సమయము గడువులోపు రాణి వాడికి నా చేతిలో చావు తప్పదు "అని ఆజ్ఞాపించెను . 
రామాయణము కిష్కింద కాండ నలుబది రెండవసర్గ సమాప్తము . 

శశి ,

 ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 










No comments:

Post a Comment