Friday 19 July 2019

రామాయణము యుద్ధకాండ -ఇరువదిఆరవసర్గ

                                  రామాయణము 

                                 యుద్ధకాండ -ఇరువదిఆరవసర్గ 

శుక సారణులు ఇద్దరూ ఆ విధముగా నిర్భయముగా పలికిన పిమ్మట రావణుడు వారిని మందలించుచు "దేవతలు గంధర్వులు దానవులు కలిసి ఒక్కుమ్ముడిగా నాపై యుద్ధమునకు వచ్చినను ,లోకములన్ని నన్ను భయపెట్టినను సీతను మాత్రము ఇవ్వను . సారణా !నీవు సౌమ్యుడవు . వానరులధాటికి తట్టుకొనలేక మిక్కిలి భయపడి ,శ్రీరామునకు సీతను అప్పగించటం మంచిదని తలంచుచున్నావు . యుద్ధ రంగమున నన్ను ఎదిరించి నిలవగల శత్రువు ఎవ్వడు ?"అని పలికి శుక సారణులతో కలిసి తన భవన ప్రాసాదము మీదికి ఎక్కెను . 
భవనము పైకి ఎక్కిన రావణుడు సముద్రాభిముఖముగా తిరిగి ,అక్కడ ఉన్న మైదానములలో ,పర్వతములలో ,వనములలో అపారంగా వ్యాపించిన వానర సైన్యమును చూసేను . పిమ్మట అతడు ఆ సైన్య విశేషములు తెలుసుకొనగోరి ,సారుణితో "ఓ సారణా !ఈ సైన్యములో ప్రముఖులెవ్వరు ?మహా శూరులెవ్వరు ?బలవంతులెవ్వరు?సుగ్రీవుడు ఎవరి మాటను వింటాడు . నాకు వివరముగా తెలుపండి "అని అడిగెను . 
అప్పుడు సారుణుడు అపారంగా ఉన్న ఆ సైన్యములో నీలుడిని ,అంగదుడిని ,నలుడిని ,రంభుడిని ,శరభుడిని ,పసనుడు ,వినతుడిని ,క్రోధనుడిని ,గవయుడిని ,చూపించెను . 

రామాయణము యుద్ధకాండ ఇరువదిఆరవసర్గ సమాప్తము . 

                           శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

No comments:

Post a Comment