Thursday 25 July 2019

రామాయణము యుద్ధకాండ -ముప్పదిమూడవసర్గ

                                రామాయణము 

                          యుద్ధకాండ -ముప్పదిమూడవసర్గ 

అప్పుడు శ్రీరాముడు మరణించాడు అన్న భ్రమలో వున్న సీతాదేవి వద్దకు సరమ (విభీషణుడి భార్య )అను రాక్షసి వచ్చినది . ఆమె సీతాదేవి హితము కోరునట్టిది . ఆమె సితాదేవి వద్దకు వచ్చి ఆమెను పరిపరి విధములుగా ఓదార్చెను . ఆమె సీతామాతతో "ఓ మైథిలీ !నేను నిర్జన ప్రదేశమున దాక్కుని ఇంతకూ ముందు రావణుడు ఇక్కడికి వచ్చి పలికిన పలుకులన్నీ విన్నాను . ఆ రాక్షసరాజు హడావిడిగా ఇక్కడ నుండి వెళ్ళినాడు కదా !నేను కూడా అతడికి కనపడకుండా అతడి వెనకే వెళ్లి వారి మాటలన్నీ విన్నాను . 
శ్రీరాముడు క్షేమముగానే వున్నాడు . రావణుడు క్రూరుడు ,మాయలమారి ,అతని ఆలోచనలు ,పనులు అన్నీ దుష్టములే . అతడు తన మాటలను నీపై ప్రయిగించాడు . అమ్మా !నీవు బాధపడవలసిన అవసరము లేదు . నీ బాధలన్నీ తీరిపోబోతున్నాయి . అతిత్వరలోనే నీవు నీ భర్తను చేరబోతున్నావు . శ్రీరాముడు వానర సైన్యముతో సహా సముద్రమును దాటినాడు . లంకా సమీపమునే వున్నాడు . ఆయనను ,లక్ష్మణుని నేను స్వయముగా చూసితిని. శ్రీరాముడు సైన్యముతో సహా వచ్చిన సంగతి తెలిసిన రావణుడు తన మంత్రులతో కార్యాలోచన చేయుచున్నాడు . "అని పలికెను . 
సరమసీతాదేవితో ఈ విధముగా పలుకుతూ ఉండగా యుద్దనగారాలు ,ఢంకా నాదములు వినిపించినవి . అప్పుడు సరమ మళ్లీ సీతాదేవితో "సీతా !ఆ ధ్వనులు విన్నావా ?సైనికుల సందడి వినిపించుచున్నదా ?సైనికులు యుద్ధమునకు సిద్ధమవుతున్నారు . దేవీ !త్వరలోనే నీకీ చెర తొలగిపోయి నీవు కోరుకున్నట్టుగానే నీ భర్తను చేరి హాయిగా ఉంటావు . నా మాటలు నమ్ము ఆ సూర్యభగవానుడిని ప్రార్ధించు "అని పలికెను . 

రామాయణము యుద్ధకాండ ముప్పదిమూడవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







No comments:

Post a Comment